For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

త్వరగా బరువు తగ్గించే వంటగది వస్తువులు..

|

ప్రస్తుత రోజుల్లో, బిజీ బిజీ లైఫ్ స్టైల్లో జిమ్ కు, వ్యాయామాలకు వెళ్ళే సమయం లేకపోవచ్చు. కానీ,ఉదర భాగంలో పొట్ట, గడ్డం మరియు, తొడల వద్ద కొవ్వు కరిగించుకోవడానికి అనేక మార్గాలున్నాయి. ముఖ్యంగా మహిళల్లో ఈ మూడు ప్రాంతాల్లో కొవ్వు కణాలు చాలా త్వరగా అభివృద్ధి చెందుతాయి. ముఖ్యంగా ఉద్యోగిణిలు బరువు తగ్గించుకోవడానికి జిమ్ములకు, లేదా బయట పార్కులకు వెళ్ళి బరువు తగ్గించుకొనే సమయం ఉండదు. అందువల్ల , కొన్ని వంటగది వస్తువులు బరువు తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతాయి. ఇవి బరువు తగ్గించడం మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి.

కొన్ని ప్రత్యేకమైన వంటగది వస్తువులు చాలా త్వరగా బరువు తగ్గిస్తాయి. ఈ వంటగది వస్తువులను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఒక అందమైన ఆకారంను పొందవచ్చు. దాంతో మీరు మీకు నచ్చని దుస్తులను ఆనందంగా ధరించి అందరిని ఆశ్చర్యపచవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ నేచురల్ వస్తువులు మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మీరు త్వరగా బరువు తగ్గడం మాత్రమే కాదు, మీ బరువును అమాంతం పెంచే ఆహారాల మీద ఇష్టాన్ని తగ్గిస్తాయి.

మీరు త్వరగా బరువు తగ్గాలని కోరుకుంటున్నట్లైతే, ఈ వంటగది వస్తువులను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకొని వేగంగా బరువు తగ్గిచుకొనేందుకు ప్రయత్నించండి..

చిప్స్ నుండి పండ్లకు మారండి:

చిప్స్ నుండి పండ్లకు మారండి:

మీకు ఎక్కువ ఆకలిగా ఉన్నప్పుడు, ఆరోగ్యకరమైన పండ్లు, అవికూడా అత్యధిక నీటిశాతం కలిగి పండ్లను తీసుకోవడం ఉత్తమం. పండ్లలో వాటర్ మెలోన్, మరియు గ్రేప్స్ వంటివి చాలా సులభంగా మీ పొట్టను నింపుతుంది. ఇవి బరువు తగ్గాలనుకొనే వారికి ఉత్తమం మరియు బరువు తగ్గడానికి సురక్షితం.

సలాడ్స్:

సలాడ్స్:

సలాడ్స్ ను తయారుచేసి మూత గట్టిగా ఉన్నడబ్బాల్లో నిల్వ చేసి, మీకు ఆకలి అనిపించినప్పుడు సలాడ్స్ ను తీసుకోవడం వల్ల చాలా త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

స్పూన్స్ :

స్పూన్స్ :

మీరు క్యాలరీలను తగ్గించుకోవాలంటే, మీరు మీ స్పూన్ కొలతలను చూడటం మంచిది. చిన్న స్పూన్లను ఎంపిక చేసుకోవడం వల్ల మీరు తక్కువగా తినడానికి సహాయపడుతాయి. మరియు మిమ్మల్ని ఫిట్ గా ఉండేందుకు సహాయపడుతాయి. మీరు ఆహారం తీసుకొనేటప్పుడు, పెద్ద ప్లేట్స్ మరియు పెద్ద స్పూన్ల కంటే, చిన్న వాటిని ఎంపిక చేసుకోవడం వల్ల బరువు సులభంగా తగ్గడానికి మనకు తెలయకుండానే ఇవి సహాయపడుతాయి.

స్నాక్ పాక్స్:

స్నాక్ పాక్స్:

మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీ ఆహారంలో చేర్చుకోవల్సిన ఆరోగ్యరమై కార్బోహైడ్రేట్ ఆహారాలు చాలా ఉన్నాయి. స్నాక్ ప్యాక్స్ అంటే ఒక బాక్స్ నట్స్ మరియు న్యూట్రీషియన్ బార్స్ డార్క్ చాక్లెట్స్ వంటివి మిమ్మల్ని బరువు తగ్గించడంలో అద్బుతంగా సహాయపడుతాయి.

చిన్న ప్లేట్స్:

చిన్న ప్లేట్స్:

మీరు బరువు తగ్గాలని ఖచ్చితంగా నిర్ణయించుకొన్నప్పడు మీ ఇంట్లో పెద్ద ప్లేట్స్ ను తీసేసి, చిన్న ప్లేట్స్ ను జోడించాలి. చిన్న ప్లేట్స్ లో తక్కువ ఆహారం తీసుకోవడానికి సహాయపడుతుంది. బరువు తగ్గడానికి ఇది ఒక ముఖ్యమైన వంటగది వస్తువు.

జంక్ ఫుడ్స్ ను అవాయిడ్ చేయండి:

జంక్ ఫుడ్స్ ను అవాయిడ్ చేయండి:

బరువు తగ్గాలనుకొనేవారు ఖచ్చితంగా జంక్ ఫుడ్స్ ను నివారించాలి . బరువు తగ్గాలనుకొనేవారు జంక్ ఫుడ్స్ ను నివారించి, ఇంట్లో తయారుచేసే హెల్తీ ఫుడ్స్ కు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల తేలికగా బరువు తగ్గవచ్చు.

ఫ్రీజర్ ను ఉపయోగించండి :

ఫ్రీజర్ ను ఉపయోగించండి :

హెల్తీ ఫుడ్స్ ను ఫ్రీజర్ లో నిల్వచేసుకోండి. ఆరోగ్యకరమైన ఆహారాలు ఇంట్లో నిల్వచేసుకొని, అవసరమైనప్పుడు తినడం వల్ల ఆరోగ్యకరమైన జీవన శైలిని పొందవచ్చు.

ఆరోగ్యకరమైన ఆహారాలు ఎక్కువగా తీసుకోండి:

ఆరోగ్యకరమైన ఆహారాలు ఎక్కువగా తీసుకోండి:

మీరు హెల్తీ డైట్ ను అనుసరిస్తున్నట్లైతే, మీ డైట్ ను మూడు సార్లకు ప్లాన్ చేసుకోవాలి. ఏ ఆహరాన్నైనా ఒకే సారి తినడం కంటే, కొద్దికొద్దిగా మద్యలో విరామం ఇస్తూ తినడం వల్ల రోజంత ఎనర్జీగా ఉండటంతో పాటు, జీర్ణక్రియ తేలిక పడి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

కొన్ని ఆహారాలకు దూరంగా ఉండండి:

కొన్ని ఆహారాలకు దూరంగా ఉండండి:

మీరు ఒంటరిగా జీవిస్తున్నట్లైతే, అధిక కార్భోమైడ్రేట్ మరియు ఫ్యాట్ కలిగి ఆహారాలను దూరంగా ఉంచడం చాలా తేలికవుతుంది. కానీ, కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు కష్టం అవుతుంది. కాబట్టి, వాటికి మీరు దూరంగా ఉండండి.

మెజ్యురింగ్ స్కేల్:

మెజ్యురింగ్ స్కేల్:

బరువు తగ్గాలనుకొనే వారు, మీరు తీసుకొనే ఆహారాలను ఒక నియమిత పరిమాణంలో తీసుకోవడం చాలా ఉపయోగపడుతుంది. అందుకు మెజ్యురింగ్ స్కేల్ బాగా ఉపయోపడుతుంది.

English summary

Kitchen Ingredients To Loose Weight Quicker

Today, you many not have time to hit the gym because of your heavy laden work schedule. But, there are other ways in which you can pay heed to if you are longing to loose that extra fat around your tummy, chin and thighs.
Story first published: Tuesday, December 17, 2013, 15:18 [IST]
Desktop Bottom Promotion