For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ దాంపత్య జీవితంలో లైంగిక శక్తిని పెంపొంధించే డైట్ టిప్స్...!

|

భార్య భర్తల మధ్య దృఢమైన దాంపత్య బంధానికి తోడ్పడేది ఏది? నమ్మకం, ప్రేమ, స్నేహం.. ఇవన్నీ. పెళ్ళైన వారిలో చాలా మంది వ్యక్తులు(ఆడ, మగ ఎవరైనా సరే)తమ జీవితం విజయవంతంగా నడవాలని కోరుకుంటారు. అయితే కొందరిలో అది అసంపూర్తిగా మిగిలిపోతుంది. ఒక జంట జీవితం ఎటువంటి ఒడుదుడుకులూ లేకుండా సాఫీగా సాగాలంటే జీవితకాలానికి భార్య సగభాగమైతే భర్త సగభాగం అవ్వాలి. అప్పుడే వారి జీవితంలో ఎటువంటి అపార్థాలు, సమస్యలు ఉండవు.

భార్య భర్తల మధ్య దృఢమైన దాంపత్య బంధానికి తోడ్పడేది నమ్మకం, ప్రేమ, స్నేహం.. మాత్రమే కాదు, వీటన్నింటితో పాటు, వీటన్నింటి కంటే వరుసలో ముందు వచ్చేది శృంగారం. ఇదే దాంపత్య బంధాన్ని రోజు రోజుకూ బలంగా తయారు చేస్తుంది. సంతృప్తికరమైన శృంగార జీవితాన్ని అనుభవించే వారి దాంపత్యంలో అడుగడుగునా ఆనందం వెల్లివిరుస్తుంది. పరస్పరం తోడుగా ఉన్నామనే నమ్మకం కలుగుతుంది. ప్రతస్తుత ఆధునిక జీవనశైలిలో భాగమైన పని ఒత్తిడి, అలసట, ఆందోళన మొదలైన వాటి ప్రభావం శృంగార జీవితం పై పడకుండా జాగ్రత్త పడాలి. అందుకు ఆహారనియమాలు, వ్యాయామాలు చాలా అవసరం.

శృంగారంలో ఆసక్తిని పెంచడంలో ఆహారం కూడా ప్రాముఖ్యత వహిస్తుంది. ఒకప్పుడు మాంసాహరం సెక్స్ కోరికలను పెంచుతుందని నమ్మేవారు. పెళ్లయిన కొత్త దంపతులతో నేతితో చేసిన మినప సున్నండలు తినిపించేవారు. వాటిలోని పోషక విలువలు లైంగిక పటుత్వాన్ని పెంచుతాయని నమ్మేవారు. అంతే కాదు, హెల్తీ డైట్ తీసుకొనే వారు శృంగారంలో పాల్గొనడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మిమ్మల్ని ఫిట్ ఉంచడంతో పాటు, రోగనిరోధక శక్తిని పెంపొదిస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అన్ని జీవక్రియలు చురుగ్గా పనిచేసేలా చేస్తాయి.

కాబట్టి హెల్తీ డైట్ తీసుకోవడం వల్ల మిమ్మల్ని శారీరకంగా ఫిట్ గా ఉంచడమే కాదు, సెక్సువల్ గానూ ఫిట్ గా ఉంచుతుంది. అందుకు ఉపయోగపడే సెక్స్ డైట్ ను ఖచ్చితంగా ఫాలో అయితే మంచి ఫలితం ఉంటుంది. అందుకు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు కొన్ని యోగాసనాలు మీ సెక్స్ లైఫ్ ను పెంపొందిస్తుంది మరియు యాక్టివ్ గా ఉండేలా చేస్తుంది.!మరి మీ శృంగారభరితమైన జీవితాన్నిపెంపొందించుకోవడంలో ఉపయోగపడే కొన్ని ఆహారాలను క్రింద ఇస్తున్నాం. చూసి తప్పక మీ డైట్ లిస్ట్ లో చేర్చుకొని హాపీగా లైఫ్ ను ఎంజాయ్ చేయండి...

లైంగిక శక్తిని పెంపొంధించే డైట్ టిప్స్...!

స్ట్రాబెర్రీ: స్ట్రాబెర్రీ గుండె ఆరోగ్యానికి మాత్రమే కాదు, శృంగార జీవితానికి మేలు చేస్తుంది. మరి మీరూ సెక్స్ డైట్ ఫాలో అవ్వాలనుకుంటే ఈ స్ట్రాబెర్రీలను తప్పనిసరిగా మీ డైట్ లిస్ట్ లో చేర్చేసుకోండి.

లైంగిక శక్తిని పెంపొంధించే డైట్ టిప్స్...!

ఆకుకూరలు: ఆకుకూరలు తరచూ తీసుకోవడం వల్ల మీ శృంగార జీవితాన్ని పెంపొందిస్తుంది. ఆకు కూరలను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇందులో ఉండే మినిరల్స్, ప్రోటీనులు, విటమిన్లు మీశరీరంలోని చేరి మిమ్మల్ని ఆరోగ్యంగా.. ఫిట్ గా ఉంచుతాయి.

లైంగిక శక్తిని పెంపొంధించే డైట్ టిప్స్...!

ఆస్పరాగస్: మీరు సెక్స్ డైట్ ఫాలో అవుతుంటే కనుక, వీర్యవృద్దిని పెంపొందించే ఈ ఆస్పరాగస్ ను మీరెగ్యులర్ డైట్ లో చేర్చుకొని, మీ శృంగార జీవితాన్నిసాఫీగా సాగించండి. వీటిని ఉడికించి లేదా ఆవిరి పట్టించి చీజ్ తో తినవచ్చు.

లైంగిక శక్తిని పెంపొంధించే డైట్ టిప్స్...!

ఓట్ మీల్: ఆరోగ్యానికి అద్భుతప్రయోజనాలను చేకూర్చే ఆహారాల్లో ఓట్ మీల్ ఒకటి. ఇది ఒక్క ఆరోగ్యానికి మాత్రమే కాదు, సెక్స్ సామర్ధ్యాన్ని కూడా పెంపొందిస్తుంది. ఓట్ మీల్స్ శరీరంలోని టెస్టోస్టెరాన్ లెవల్స్ ను పెంపొందిస్తుంది. అది శృంగార జీవితానికి బాగా సహాయపడుతుంది.

లైంగిక శక్తిని పెంపొంధించే డైట్ టిప్స్...!

ఓయిస్ట్రెస్: స్త్రీలో అనేక ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. పురుషుల్లో టెస్టోస్టిరాన్ ఉత్పత్తికి కావల్సి జింక్ ను ఇది అందిస్తుంది.

లైంగిక శక్తిని పెంపొంధించే డైట్ టిప్స్...!

రెడ్ వైన్: దాపత్యంలో రొమాంటిక్ డేట్ కి రెడ్ వైన్ మరియు చీజ్ అద్భుతమైన ఆహారాలు. సెక్స్ లైఫ్ లో వీర్య వృద్దిని పెంపొందిస్తుంది.

లైంగిక శక్తిని పెంపొంధించే డైట్ టిప్స్...!

డార్క్ చాక్లెట్: మీ సంతోషకరమైన జీవితంలో డార్క్ చాక్లెట్ బాగా సహాయపడుతుంది. తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇంకా శరీరంలో ఎండోర్ఫియన్ ఉత్పత్తిని పెంపొందిస్తుంది.

లైంగిక శక్తిని పెంపొంధించే డైట్ టిప్స్...!

ముందుకు వంగే యోగాసనం: ఇది ఒక బెస్ట్ యోగాసనం. సెక్స్ డైట్ లో తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాల్సిన భంగిమ. ఇది మిమ్మల్ని చురుగ్గా ఉంచడమే కాకుండా మీలో సంతానోత్పత్తికి ప్రేరేపిస్తుంది.

లైంగిక శక్తిని పెంపొంధించే డైట్ టిప్స్...!

లోటస్ భంగిమ: ఇది ఒక మంచి యోగఆసనం. మీరు ఖచ్చితంగా పాటించాల్సిన భంగిమ. ఇది పొత్తికడుపు, వెన్నెముక, పొట్ట మీద బాగా ప్రభావం చూపెడుతుంది. అంతే కాదు రుతు రుగ్మతలను మెరుగుపరుస్తుంది మరియు గర్భం పొందడానికి ఈ ఆసనం బాగా సహాయపడుతుంది. ఈ యోగా ఆసన వల్ల మహిళలకు అధిక ప్రయోజనం.

లైంగిక శక్తిని పెంపొంధించే డైట్ టిప్స్...!

లైంగిక క్రియ: దాంపజీవితంలో లైంగిక క్రియలో ఎక్కువ పాల్గొనడం వల్ల లైంగిక సామర్ధ్యం మరింత పెరుగుతుంది.

English summary

Sex Diet For Better Performance | లైంగిక శక్తిని పెంపొంధించే డైట్ టిప్స్...!

Sex diet is a lifestyle habit that encourages active sex life. This diet talks on the benefits of having sex. While sex is a practice or rather an exercise that keeps you fit, boosts immunity, releases stress, promotes cardiac health and helps have a healthy & good functioning reproductive system.
Desktop Bottom Promotion