For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డైటింగ్ చేసేప్పుడు ఆకలి కంట్రోల్ చేయడానికి చిట్కాలు

|

ప్రస్తుత రోజుల్లో చాలా మందికి ఆరోగ్యం మీద శ్రద్ద ఎక్కువ కావడంతో బరువు తగ్గాలనే కోరిక చాలా మందిలో పెరిగిపోతోంది. అయితే కొంత మందిలో బరువు తగ్గాలనే స్థిర నిశ్చయం ఉన్నా, ఆకలి కోరికలు అనుచుకొనే శక్తి సామర్థ్యాలు ఉండవు. డైటింగ్ అని గట్టిగా నిర్ణయించుకొన్నప్పటికీ, ఏవైనా టెఫ్ట్ చేసే, వారికి ఇష్టమైన ఆహారాలను చూసినప్పుడు, వెంటనే తినేయాలనే కోరిక మనస్సులో పుడుతుంది. ఇలా కోరికలను నేచురల్ గా ఆకలిని కోరికలను కంట్రోల్ చేసుకొన్నప్పుడె మన శరీరంలో ఇతర ఆరోగ్య సమస్యలు ప్రారంభం అవుతాయి కడుపు ఉబ్బరి మరియు ఎసిడిటి వంటి సమస్యలకు కారణం అవుతుంది. కాబట్టి బరువు పెరగడం కంటే, బరువు తగ్గించుకోవడం అంత సులభం కాదని తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ఆకలిని అణచివేసి, బరువు తగ్గించే అత్యుత్తమ ఆహారాలు: క్లిక్ చేయండి

కాబట్టి, డైటింగ్ చేసే వారిలో ఆ కోరికలను కంట్రోల్ చేసుకోవడానికి విల్ పవర్ మరియు హెల్తీ డైట్ టిప్స్ ను తెలుసుకోవడం చాలా అవసరం. మొదట మీరు బరువు తగ్గడానికి మీఅంత మీరు ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి. అప్పుడే మీరు మీ లక్ష్యాన్ని పూర్తి చేయగలరు. కాబట్టి, మీరు బరువు తగ్గడానికి డైటింట్ చేసే సమయంలో ఆకలిని కంట్రోల్ చేసుకోవడానికి మీరు అనుసరించాల్సిన కొన్ని విషయాలు:

పండ్లుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి:

పండ్లుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి:

మీ ఆకలి కోరికలను కంట్రోల్ చేయడానికి రెండు రకాల ఫ్రూట్ ప్రధానంగా సహాయపడుతాయి మరియు పొట్ట పెరగకుండా కంట్రోల్ చేస్తుంది . గ్రేఫ్ ఫ్రూట్స్ మరియు ఆరెంజెస్ లో నేచురల్ షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల ఇవి ఆకలిని కంట్రోల్ చేస్తుంది.

తక్కువ మోతాదలో ఆహారం:

తక్కువ మోతాదలో ఆహారం:

ఒక్కసారిగా ఎక్కువ మోతాదులో ఆహారాన్ని తీసుకోకూడదు. సాధ్యమైనంత వరకూ తక్కువ క్వాంటిటీతో మద్యమద్యలో కొంత సమయం గ్యాప్ ఇచ్చి ఆహారం తీసుకోవడం వల్ల మీ టమ్మీ ఫుల్ గా ఉన్నఅనుభూతిని పొందుతారు.

వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి:

వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి:

బరువు తగ్గాలనుకొనే వారు డైటింగ్ చేసే సమయంలో ఆకలిని కంట్రోల్ చేయడానికి హెల్తీ మరియు గ్రీన్ వెజిటేబుల్స్ తీసుకోవాలి. ఆకుకూరలు మరియు బ్రొకోలీ వంటి ఫైబర్ అధికంగా ఉండే గ్రీన్ వెజిటేబుల్స్ తీసుకుంటే ఆకలిని కంట్రోల్ చేయవచ్చు.

తృణధాన్యాలు:

తృణధాన్యాలు:

మైదా కంటే ఓట్స్, బ్రెడ్ మరియ గోధుమలతో తయారుచేసిన ఆహారాలను తీసుకోవడం మంచిది. వీటిలో ఫైబర్ అధికంగా ఉండే పొట్ట ఫుల్ గా ఉన్న అనుభూతిని కలిగించేలా చేస్తాయి.

మీ దవడలకు పనిపెట్టండి:

మీ దవడలకు పనిపెట్టండి:

షుగర్ లెస్ చూయింగ్ గమ్ నమలడం వల్ల ఆకలికోరికలను కంట్రోల్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీ నోరు బిజీగా ఉంటుందో, ఆప్పుడు మీ ఆలోచనలు ఆహారం మీద వెళ్ళవు.

క్యాలరీలను తెలుసుకోవాలి:

క్యాలరీలను తెలుసుకోవాలి:

మీరు ప్రతి రోజూ తీసుకొనే ఆహారంలో ఎన్నిక్యాలరీలను తీసుకుంటున్నారన్న విషయం తెలుసుకోవాలి. ఇలా తెలుసుకోవడం వల్ల మీ విల్ పవర్ మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మీరు డైటింగ్ చేసేప్పుడు మీ ఆకలిని కంట్రోల్ చేస్తుంది.

రిమైండర్:

రిమైండర్:

మీరు బరువు తగ్గాలని మీ అంతట మీరు గుర్తు చేసుకుంటుండాలి. ఇలా మెంటల్ గా మనస్సులో ఫిక్స్ చేసుకొననప్పుడు, డైటింగ్ సమయంలో మీ ఆకలి కోరికలను కంట్రోల్ చేసుకోవచ్చు.

ఎక్కువ సమయంలో స్థిరంగా కూర్చోకండి:

ఎక్కువ సమయంలో స్థిరంగా కూర్చోకండి:

ఎంత ఎక్కువ సమయం మీరు కూర్చొంటే, మీ చుట్టుప్రక్కల ఎవరైన తింటున్నట్లు మీరు గమనించవచ్చు. దాంతో మీకు కూడా ఆకలి వేయవచ్చు. కాబట్టి, ఆఫీలో మద్యమద్యలో చిన్న చిన్న విరామాలు తీసుకోవాలి.

మీ డైట్ ను ఎంపిక చేసుకోవాలి:

మీ డైట్ ను ఎంపిక చేసుకోవాలి:

మీరు తీసుకొనే ఆహారం పూర్తిపోషకాలున్నటువంటి వాటిని ఎంపిక చేసుకోవాలి. మరియు నీళ్ళు ఎక్కువగా ఉన్న ఆహారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.

మీ మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి:

మీ మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి:

మీకు ఆకలిగా ఉన్నప్పుడు, మీ మనస్సును ఆహారాల మీద కాకుండా ఇతర విషయాలను ఆలోచించండి డైటింగ్ ఉన్నవారికి ఇది ఒక సులభమైన మార్గం.

ఆహారంను నిల్వ చేయకండి:

ఆహారంను నిల్వ చేయకండి:

మీరు సంపూర్ణ భోజనం, విందుకోలాహాలను ఇష్టపడితే, వాటికి దూరంగా ఉండటం, హైక్యాలరీ ఆహారాలను నిల్వ చేయకపోవడం వల్ల మీ బరువును తగ్గించుకోవడానికి ఇది ఒక ఉత్తమ మార్గం.

బ్రేక్ ఫాస్ట్ మిస్ చేయకూడదు:

బ్రేక్ ఫాస్ట్ మిస్ చేయకూడదు:

8గంటల నిద్ర తర్వాత మన శరీరంలో అవయవాలు తిరిగి యథావిధిగా పనిచేయడానికి మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ చాలా అవసరం. మీకు ఆ సమయంలో ఆకలిగా లేకున్నా తప్పనిసరిగా ఉదయం అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తో మీ దినచర్యను ప్రారంభించండి.అప్పుడే మీ ఆకలిని కంట్రోల్ చేయగలరు.

ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలి:

ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలి:

సాధ్యమైనంత వరకూ ఎక్కువ ద్రవాలు, నీరు తీసుకోవాలి. ఇవి మీ శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచడమే కాకుండా డైటింగ్ సమయంలో మీ ఆకలిని కంట్రోల చేస్తుంది. మరియు శరీరంలోని మలినాలు(టాక్సిన్స్ )ను బయటకు నెట్టివేయడానికి సహాయపడుతుంది.

చాలా నిధానంగా తినాలి:

చాలా నిధానంగా తినాలి:

ఆహారం తినేటప్పుడు నిధానంగా నమిలి తినాలి. మీరు ఎంత పరిమాణంలో ఆహారం తీసుకొన్నానమిలి తినడం వల్ల డైటింగ్ చేసే సమయంలో ఆకలి కంట్రోల్లో ఉంటుంది.

టైమ్ కు నిద్రపోవాలి:

టైమ్ కు నిద్రపోవాలి:

ప్రతి రోజూ రెగ్యులర్ గా ఒకే టైమ్ కు నిద్రపోవడాన్ని అలవాటు చేసుకోవడం ద్వారా ఆ నిద్రించే సమయంలో ఆహారం జీర్ణం అవ్వడానికి తగినంత సమయం దొరుకుతుంది. మరియు మీరు నిద్రించే సమయంలో మీకు అంత ఆకలి అనిపించదు. కాబట్టి, డైటింగ్ సమయంలో ఆకలిని కంట్రోల్ చేయడానికి ఇదొక ఉత్తమ మార్గం.

English summary

15 Ways To Control Hunger While Dieting

Today, there are a lot of people who want to lose weight, but they do not have the will power to fight the hunger pangs. There are simple ways on how to control hunger while dieting. Controlling your hunger naturally will put to rest some of the health problems such as stomach bloating and acid reflux. But it is important to know that losing weight is not that easy compared to gaining weight.
Desktop Bottom Promotion