For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేగంగా బరువు తగ్గించే హెల్తీ అండ్ లోక్యాలరీ ఫుడ్స్

|

బరువు తగ్గించుకోవడమనేది మంచి ఆహారం మరియు రెగ్యులర్ వ్యాయామంతోనే సాధ్యం అవుతుంది. మీరు వేగంగా బరువు తగ్గించుకోవాలనుకుంటున్నట్లైతే, మీరు వెంటనే చేయాల్సిన కొన్ని పనులను సూచించడం జరిగింది: ఫుడ్ టైమ్ టేబుల్ ను మార్చుకోవాలి. రెగ్యులర్ గా తీసుకొనే ఆహారంలో క్యాలరీలను కౌంట్ చేసుకోవాలి మరియు బరువు తగ్గించే ఆహారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.

బరువు తగ్గించే ఆహారాల్లో చాలా వరకూ హెల్తీ ఫుడ్సే ఉన్నాయి . వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఫ్యాట్ త్వరగా బర్న్ చేయడంతో పాటు కండర వ్రుద్దిని మెరుగుపరుస్తుంది. ఉదాహరణకు: మొదట మీరు చేయాల్సింది కాఫీకి ప్రత్యామ్నాయంగా గ్రీన్ టీ తీసుకోవాలి, షుగర్ కు ప్రత్యామ్నాయంగా తేనె తీసుకోవాలి. వైట్ రైస్ కు బదులు బ్రౌన్ రైస్ కు ప్రాధాన్యత ఇవ్వాలి . బరువు తగ్గించుకోవాలనుకొనే వారికి రోజులో ఈ మూడు విషయాలు అత్యంత ముఖ్యమైన అవసరం అయినవి . ఈ హెల్తీ ఆప్షన్ తో ప్రస్తుతం అనుసరిస్తున్న డైట్ ను మార్చుకోండి.

READ MORE: వేగంగా బరువు తగ్గించుకోవడానికి పది సీక్రెట్స్ ..!

ఈ హెల్తీ మార్పుల వల్ల శరీరానికి తక్కువ క్యాలరీలు, మరియు ఎక్కువ ఎనర్జి పొందుతారు. దాంతో బరువును వేగంగా తగ్గించుకోవచ్చు . ఈ ఆహారాల్లో ప్రోటీనులు, విటమిన్స్ మరియు ఇతర ఎలిమెంట్స్ కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి, ఇటు బరువు తగ్గించడంతో పాటు, ఆరోగ్యానికి మేలు చేస్తాయి . మరి ఇంకెందుకు ఆలస్యం? బరువు తగ్గించే హెల్తీ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం...

పంచదారకు బదులు తేనె:

పంచదారకు బదులు తేనె:

ఒక కప్పు టీ లేదా ఒక బౌల్ సలాడ్స్ లో పంచదారకు బదులుగా తేనె జోడించుకోవాలి. ఈ హెల్తీ ఫుడ్ వల్ల చాలా తక్కువ క్యాలరీ శరీరానికి అందడం వల్ల బరువును తగ్గించుకోవచ్చు . హార్ట్ కూడా చాలా మంచిది.

క్రీమ్ కు ప్రత్యామ్నాయంగా పెరుగు:

క్రీమ్ కు ప్రత్యామ్నాయంగా పెరుగు:

ఉప్పు లేకుండా ఆహారాన్ని ఎలా తీసుకుంటామో, క్రీమ్ లేకుండా సలాడ్స్ అలా తీసుకోవాలి. సలాడ్స్ చూడటానికి నోరూరిస్తుంటాయి. క్రీమ్ లకు పత్యామ్నాయంగా పెరుగును ఉపయోగించుకోవచ్చు . పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ శరీరంలో హానికరమైన క్రిములను నాశనం చేస్తుంది.

సలాడ్ డ్రెస్సింగ్ లకు బదులుగా నిమ్మరసంతో డ్రెస్సింగ్:

సలాడ్ డ్రెస్సింగ్ లకు బదులుగా నిమ్మరసంతో డ్రెస్సింగ్:

నిమ్మరసం బరువు తగ్గించడంలో చాలా గొప్పగా సహాయపడుతుంది . ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. సలాడ్స్ లో డ్రెస్సింగ్ కొరకు నిమ్మరసం ఉపయోగించుకోవాలి.

ఎనర్జీ డ్రింక్స్ బదులు కొబ్బరి బోండాం:

ఎనర్జీ డ్రింక్స్ బదులు కొబ్బరి బోండాం:

ఎనర్జీ లెవల్స్ పెంచుకోవాలంటే? ఎనర్జీ డ్రింక్స్ కు ప్రత్యామ్నాయంగా కోకనట్ వాటర్ త్రాగాలి.కొబ్బరి నీళ్ళు ఎనర్జీని అందివ్వడంతో పాటు, రోజంతా యాక్టివ్ గా ఉంచుతుంది.

కాఫీకి బదులుగా గ్రీన్ టీ:

కాఫీకి బదులుగా గ్రీన్ టీ:

వేగంగా బరువు తగ్గించుకోవాలంటే, కాఫీకి బదులుగా గ్రీన్ టీ త్రాగాలి. బరువు తగ్గించుకోవడంలో ఇది ఒక ఉత్తమ ఎంపిక . గోరువెచ్చని గ్రీన్ టీ త్రాగడం వల్ల బరువు తగ్గించుకోవడానికి సహాయపడుతుంది.

బంగాళదుంపకు ప్రత్యామయంగా స్వీట్ పొటాటో:

బంగాళదుంపకు ప్రత్యామయంగా స్వీట్ పొటాటో:

స్వీట్ పొటాటో బరువు తగ్గించడం మాత్రమే కాదు. ఇది లివర్ కు చాలా మంచిది . హెల్తీగా బరువు తగ్గించుకోవడానికి రెగ్యులర్ పొటాటోలకు ప్రత్యామ్నాయంగా స్వీట్ పొటాటోలను చేర్చుకోవాలి.

వైట్ బ్రెడ్ కు బదులుగా బ్రౌన్ బ్రెడ్:

వైట్ బ్రెడ్ కు బదులుగా బ్రౌన్ బ్రెడ్:

ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను శరీరానికి అందివ్వాలి. బరువు తగ్గించడంలో బ్రౌన్ బ్రెడ్ ఫస్ట్ ఆప్షన్ . వైట్ బ్రెడ్ కు ప్రత్యామ్నాయంగా బ్రౌన్ బ్రెడ్ కు ప్రాధాన్యత ఇవ్వండి.

.ఫ్రూట్ జ్యూస్ లకు బదులుగా ఫ్రూట్ వాటర్:

.ఫ్రూట్ జ్యూస్ లకు బదులుగా ఫ్రూట్ వాటర్:

కండర పుష్టికి, వాటర్ అత్యంత శక్తిని పొందేలా చేస్తుంది. ఫ్రూట్ జ్యూసులు త్రాగడానికి బదులుగా వాటర్ ఫ్రూట్స్ ను రెగ్యురల్ డైట్ లో చేర్చుకోవడం ఉత్తమం.

మోయోనైజ్ కు బదులుగా అవొకాడో:

మోయోనైజ్ కు బదులుగా అవొకాడో:

ఫ్రైస్ వండిన ప్రతిసారి వాటిని మోయోనైజ్ లో డిప్ చేసి అధిక క్యాలరీను బాడీకి చేరవేయడం కంటే అవొకాడోను మిక్స్ చేసి తీసుకుంటే ఆరోగ్యానికి మంచి చేయడంతో పాటు, బరువు కూడా వేగంగా తగ్గిస్తుంది. అవొకాడోలో ఉండే మోనోసాచ్యురేటెడ్ ఫ్యాట్స్ అందుకుగ్రేట్ గా సహాయపడుతాయి.

వైట్ రైస్ కు బదులుగా బ్రౌన్ రైస్:

వైట్ రైస్ కు బదులుగా బ్రౌన్ రైస్:

భోజనంలో వైట్ రైస్ కు బదులుగా బ్రౌన్ రైస్ ను చేర్చుకోవాలి . వైట్ రైస్ లో కంటే బ్రౌన్ రైస్ లో ప్రోటీనులు అధికంగా ఉంటాయి.

డిజర్ట్స్ బదులు ఫ్రూట్ సలాడ్స్:

డిజర్ట్స్ బదులు ఫ్రూట్ సలాడ్స్:

తీపి తినాలనిపించినప్పుడు, స్వీట్స్ కు ప్రత్యామ్నాయంగా ఫ్రూట్ సలాడ్స్ వంటి హెల్తీ ఫుడ్స్ ను తీసుకోవాలి . ఇవి ఫ్యాట్ ను బర్న్ చేస్తాయి.

 వెజిటేబుల్ ఆయిల్ కు బదులుగా ఆలివ్ ఆయిల్:

వెజిటేబుల్ ఆయిల్ కు బదులుగా ఆలివ్ ఆయిల్:

వంటలకు వెజిటేబుల్ ఆయిల్ కు ప్రత్యామ్నాయంగా ఆలివ్ ఆయిల్ ను చేర్చుకోవాలి. బరువు తగ్గించడంలో ఆలివ్ ఆయిల్ గ్రేట్ గా సహాయపడుతుంది.

English summary

12 Healthy Food Swaps For Weight Loss: Health Tips in Telugu

Weight loss starts with the right diet and exercise. If you want to lose weight fast, here is what you need to do immediately: set a food time table, count each calorie you intake and most importantly make the right food swap.
Story first published: Wednesday, November 11, 2015, 13:24 [IST]
Desktop Bottom Promotion