For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్రెష్ అండ్ హెల్తీ ఫ్రూట్స్ తో అధిక బరువు కు చెక్ !

|

ప్రస్తుత రోజుల్లో చాలా మంది ప్రజలు వారి ఆరోగ్యం గురించి చాలా ఎక్కువగా జాగ్రత్త తీసుకుంటున్నారు. ముఖ్యంగా బరువు విషయంలో. బరువు తగ్గడం అనేది దినచర్యలో ఒక భాగం అయిపోయింది. అయితే బరువు తగ్గాలనే భావన మనస్సులో ఉండటంతో ప్రతి రోజూ క్రాస్ డైటింగ్, వ్యాయామాలు చేయకపోవడం వంటివి మరిన్ని అదనపు కిలోల బరువును పెంచుకుంటారు. కానీ బరువు తగ్గాలనే పట్టుదల మీలో ఉన్నట్లైతే అందుకు చాలా కఠినమైన డైట్ మరియు హెల్తీ డైట్ ను ఫాలో చేయడం వల్ల హెల్తీగా బరువు తగ్గవచ్చు .

బరువు తగ్గించడంలో ఫ్రూట్ డైట్ కంటే మరొకటి పనిచేయదంటే ఆశ్చర్యం కలగకతప్పదు. మనం రోజూ అవసరమైన పండ్లను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచి జరగడంతో పాటు, బరువు కూడా సులభంగా తగ్గించుకోవచ్చు. పండ్లలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఫ్యాట్ కు బదులు వీటిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అన్ని పండ్లలోనూ విటమిన్స్, మినిరల్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి, జబ్బుల బారీన పడకుండా మనల్ని కాపాడటానికి ప్రధాన పాత్రపోషిస్తాయి.

READ MORE: వేగంగా బరువు తగ్గించే టాప్ 25 ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్

బరువు తగ్గడం కోసం మనం తీసుకొనే ఆహారం సరైన క్వాంటిటీ ఉండేలా చూసుకోవాలి. అదే విధంగా మనం ప్రతి రోజూ తీసుకొనే ఆహారంలో లోక్యాలరీ ఫుడ్ తీసుకోవడం ముఖ్యం. కాబట్టి, ఈ విషయంలో(లోక్యాలరీ విషయంలో)పండ్లు చాలా ముఖ్యమైన, ప్రభావవంతమైన పాత్రను పోషిస్తాయి. చాలా వరకూ పండ్లు అన్ని లోక్యాలరీలను కలిగి ఉండి బరువును పెరగనియ్యకుండా సహాయపడుతాయి. మరి బరువు తగ్గించేందుకు ప్రభావంతంగా పనిచేసే లోక్యాలరీ ఫ్రూట్స్ గురించి తెలుసుకుందాం...

యాపిల్స్:

యాపిల్స్:

పిల్స్ లో కేలరీలు తక్కువ. పీచు అధికం. తిన్నది బాగా జీర్ణం చేస్తుంది. దీనిలోని పెక్టిన్ మీకు కడుపు నిండినట్లు భావించేలా చేస్తుంది. ప్రతిరోజు ఓ ఆపిల్ తింటే వైద్యునితో అవసరం ఉండదని చెబుతుంటారు. అది ముమ్మాటికి నిజమే. ఎందుకంటే ఆ పండులో ఉండే పోషక విలువలు అలాంటివి మరి. శరీరానికి ఇది ఒక గొప్ప సహజ యాంటీఆక్సిడెంట్‌ (వ్యాధినిరోధక కారకం)గా పని చేస్తుంది. 100 గ్రాముల ఆపిల్ తింటే దాదాపు 1,500 మిల్లీగ్రాముల "విటమిన్ సి" ద్వారా పొందే యాంటీఆక్సిడెంట్‌ ప్రభావంతో సమానం. యాపిల్స్ లో లోఫాట్ కొలెస్ట్రాల్ ఉండటం వల్ల శరీరాన్ని నాజూగ్గా ఉండేలా చేస్తుంది. ప్రతి రోజు ఆపిల్ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

బెరీ పండ్లు

బెరీ పండ్లు

సంవత్సరంలో ఒక్క సీజన్ లో మాత్రమే కనిపించే ఈ బేరికాయ లోక్యాలరీస్ కలిగి, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఆ సీజన్ లో ప్రతి రోజూ భోజనానికి ముందు ఒకటి తీసుకోవడం వల్ల బరువును అతి

సులభంగా తగ్గించుకోవచ్చు.

అరటిపండ్లు:

అరటిపండ్లు:

నీటి శాతం అధికం. పీచు ఉంటుంది. కడుపు నింపుతాయి. మలబద్ధకాన్ని నివారిస్తాయి. మూడ్ మంచిగా ఉండేలా చేస్తాయి. గ్రీన్ గా ఉండే బనానాలో స్ట్రాంచ్ అధికంగా ఉండే ఫ్యాట్ బర్నింగ్ ప్రొసెస్ ను వేగవంతం చేస్తుంది. అరటిపండ్లు కడుపు నిండుగా ఉండేట్లు చేస్తుంది. బనానా తిని అప్పుడప్పుడూ నీళ్ళు తాగడం వల్ల రోజంతా కడుపు నిండుగా ఉండేట్లు చేస్తుంది.

బ్లూబెర్రీస్:

బ్లూబెర్రీస్:

బ్లూ బెర్రీస్ లో ఆంటీయాక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ మరియు హార్ట్ డిసీజ్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి . మరియు బరువు తగ్గించడంలో గొప్ప ప్రయోజనకారిని. వందగ్రాముల బ్లూబెర్రీస్ తింటే చాలు టమ్మీ ఫ్యాట్ ను తగ్గించుకోవచ్చు.

స్ట్రాబెర్రీస్:

స్ట్రాబెర్రీస్:

బెర్రీస్ ఎల్లప్పుడూ ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్ అనే చెప్పొచ్చు. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ మరియు ఇతర బెర్రీ పండ్లన్నీ ఎక్కువ యాంటిఆక్సిడెంట్స్, ఫైబర్ కలిగి ఉంటాయి. ఇవి ఆకలిని తగ్గించి స్వేచ్చా రాశులుగా పోరాడుతుంది. స్ట్రాబెర్రీ శరీర బరువును తగ్గిస్తుంది. శరీరానికి కావల్సిన శక్తిని ఇచ్చి, ఎక్కువ సేపు ఆకలికాకుండా సహాయపడుతుంది. కొవ్వును కరిస్తుంది.

కివి ఫ్రూట్స్:

కివి ఫ్రూట్స్:

కడుపు నింపుతాయి. పీచు అధికం. కేలరీలు తక్కువ, గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువ. విటమిన్ సి - కివి పండులో విటమిన్ సి అధికం. ఆరెంజస్ లో కంటే కివి పండులో విటమిన్ సి రెండు రెట్లు వుంటుంది. రోజులో తినవలసిన పోషకాలకు ఒక కివి పండు తింటే చాలని స్టడీ తెలుపుతోంది. రీసెర్చి మేరకు ఈ పండులో పీచు కూడా అధికంగా వుండి, జీర్ణ వ్యవస్ధను శుభ్ర పరచి మలబద్ధకం లేకుండా చేస్తుంది. కొల్లెస్టరాల్ తగ్గిస్తుంది గుండె జబ్బులు, కొన్ని రకాల కేన్సర్ రాకుండా రక్షిస్తుంది. రక్తంలో షుగర్ స్ధాయిలను తగ్గించి డయాబెటీస్ రాకుండా చేస్తుంది. కివిపండు కడుపు నింపుతుంది. బరువు కూడా తగ్గిస్తుంది.

గ్రేప్ ఫ్రూట్:

గ్రేప్ ఫ్రూట్:

గ్రేఫ్ ప్రూట్ లో విటమిన్స్ మరియు మంచి సాచురేటెడ్ ఫ్యాట్స్ కలిగి ఉంటాయి. ఒక వారంలో బరువు తగ్గేలా చేస్తుంది. గ్రేప్ ఫ్రూట్ మీ చర్మానికి కూడా చాలా మంచిది. ఇది చర్మం మెరిసేలా చేస్తుంది.

టమోటోలు:

టమోటోలు:

టమోటో లో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలం. ఇది ఆరోగ్యం మాత్రమే కాదు, న్యూట్రీషియన్స్ కూడా పుష్కలమే. టమోటోలో ఉన్నలైకోపిన్ మొత్త ఆరోగ్యానికే మేలు చేస్తుంది. వారంలో మీరు బరువు తగ్గాలంటే టమోటో డైట్ జ్యూస్ మొదలుపెట్టాల్సింది. మూడు టమోటోలను ఉడికించి, గ్రైండ్ చేసి, అందులో బ్రౌన్ షుగర్ జోడించి రోజుకు మూడు సార్లు, వారం మొత్తం తాగితే మంచి ఫలితం ఉంటుంది.

 లెమన్ జ్యూస్:

లెమన్ జ్యూస్:

దీనిలో విటమిన్ సి అధికం. మీ జీవప్రక్రియ పెంచుతుంది. స్లిమ్ గా ఉంచుతుంది. ఎసిడిటీ తగ్గించి మొండి రోగాలను దూరం చేస్తుంది. భోజనం చేసిన తర్వాత నిమ్మరసం, నిమ్మజ్యూస్ తాగడం వల్ల శరీరానికి చాలా మంచిది. శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇందులోని సిట్రస్ ఆమ్లం బరువు పెరగనీయకుండా అడ్డుకుంటుంది. నిమ్మ మరియు తేనె మిశ్రమం మహిళల బరువు తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తాయి. నిమ్మరసంలో కొవ్వు కణాలతో పోరాడగలిగే శక్తిని కలిగి ఉన్నాయి. ఆకలిని తగ్గించి జీర్ణశక్తిని పెంచుతుంది.

అవొకాడో:

అవొకాడో:

అవొకాడో తింటుంటే వయసు మీద పడుతున్నా యవ్వనంగానే కనిపిస్తారు. ఇందులో ఫ్యాట్‌ ఎక్కువని చాలా మంది అపోహపడుతుంటారు కాని, అవొకాడోలో ఉండే ఫ్యాట్‌లో ఎక్కువ భాగం మోనో అన్‌సాచురేటెడ్‌ ఫ్యాట్‌. దీనిని ఆరోగ్యకరమైన ఫ్యాట్‌గా పరిగణిస్తారు. కాబట్టి నిరభ్యంతరంగా తినవచ్చు. ఇందులోని ఒమెగా -3 ఫ్యాటీ యాసిడ్లు చర్మం పొడిబారడాన్ని నివారించి నిత్యయవ్వనంగా ఉంచుతాయి. అవొకాడోలో ఉండే 'సి', 'ఇ' విటమిన్లు యాంటి ఏజింగ్‌ ఎలిమెంట్స్‌గా పనిచేసి వార్ధక్యాన్ని దూరం చేస్తాయి.

English summary

Fat-Burning Fruits For Weight Loss: Health Benefits in Telugu

Fat-Burning Fruits For Weight Loss: Health Benefits in Telugu, Fat-Burning Fruits For Weight Loss: Health Benefits in Telugu, Moreover, most fruits are considered to be fat-burning foods since they naturally burn the fat present in the body. The water content present in fat-burning fruits are healthy for the immune system. The water boosts the metabolism rate, increases
Story first published: Saturday, November 7, 2015, 15:03 [IST]