For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెళ్ళి తర్వత బరువు పెరుగకుండా ఎలాంటి నియమాలు పాటించాలి ?

|

సహజంగా చాలా మంది అమ్మాయిలు పెళ్ళి తర్వాత బరువు పెరుగుతుంటారు. అందుకు వివిధ రకాల కారణాలు ఉంటాయి. పెళ్ళి తర్వాత భార్యభర్తలిద్దరూ లేదా కుటుంబ సభ్యులంతా కలిసి ఇతర పార్టీలకు హాజరవ్వడం, బందువలు ఇళ్లకు వెళ్లడం, వారాంతాల్లో బయట తినడం, వ్యాయామానికి తగిన సమయం కేటాయించకపోవడం...ఇలా బరువు పెరగడానికి కారణాలేవైనా, వారి జీవన శైలిలో మార్పులు రావడం వల్ల బరువు పెరగడం మనం గమనిస్తూనే ఉంటాం.

పెళ్ళికి ముందుగా సన్నాగా నాజుగ్గా ఉన్న అమ్మాయి పెళ్ళి తర్వాత కొన్ని మార్పుల చోటుచేసుకోవడం ద్వారా అటు శారీరకంగాను..ఇటు మానసికంగాను ద్రుడత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. మరి ఇలా జరగకుండా ఉండాలంటే పెళ్లి తర్వాత ఫిట్ నెస్ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది...మరి అవేంటో తెలుసుకుందాం...పెళ్ళి తర్వాత అమ్మాయిల్లో జరిగే మార్పులు మరియు అనుభవాలు

స్ట్రెస్ తగ్గించుకోవాలి:

స్ట్రెస్ తగ్గించుకోవాలి:

కొత్తగా పెళ్లయిన దంపతుల మద్య అప్పుడప్పుడూ అపార్థాలు చోటుచేసుకోవడం సర్వసాధారణం. అలాగే కొత్తగా పెళ్లయిన అమ్మాయికి రకరకాల భయాలు కూడా ఉంటాయి. అయితే ఇలాంటి విషయాలు మరీ లోతుగా ఆలోచిస్తే మానసిక ఆందోళన, ఒత్తిడి మరింత పెరుగుతాయి. బరువు పెరగడానికి ఒక రకంగా ఇవి కూడా కారణం కావచ్చు.

చాక్లెట్స్ ఫ్యాట్ ఫుడ్స్:

చాక్లెట్స్ ఫ్యాట్ ఫుడ్స్:

ఎక్కువ స్ట్రెస్ తో ఉన్నప్పుడు స్ట్రెస్ ను తగ్గించుకోవడానికి చాక్లెట్స్, ఫ్యాట్ అధికంగా ఉండే పదార్థాలు ఎక్కువగా తీసుకొనే అవకాశం ఉంటుంది. ఇవి శరీరంలో అనవసరంగా కొవ్వు చేరేలా చేస్తాయి. అందువల్ల మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ఇలాంటి పదార్థాలు తినడం కంటే ఇద్దరూ కలిసి మాట్లాడుకుని గొడవలు రాకుండా చూసుకోవడం మంచిది. దాంతో ఒత్తిడి తగ్గించుకొని, బరువు పెరగకుండా కంట్రోల్ చేసుకోవచ్చు.

ఆహారం:

ఆహారం:

పెళ్ళి ముందుకంటే పెళ్ళి తర్వాత బయటి ఆహారాలకు ఎక్కువగా అలవాటు పడుతారు. ఇంటిపనులు, ఆఫీసు పనులు ఒత్తిడితో ఆహారం తయారుచేసుకొని సమయం లేక, ఎక్కువగా బయటి ఆహారాలకు అలవాటు పడుతుంటారు. ఇలా ఎప్పుడో ఒకసారి చేస్తే పర్వాలేదు, తరచూ అలాగే తింటుంటే అదనపు క్యాలరీలతో అధిక బరువు పెరుగుతారు. కాబట్టి బయటి ఫుడ్స్ కు చెక్ పెట్టి ఇంటి ఫుడ్స్ కు ప్రాధాన్యత ఇవ్వండి..

వ్యాయామం:

వ్యాయామం:

బరువు పెరగకుండా కాపాడుటతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే మరో అతి ముఖ్యమైన అలవాటు. ఇది ప్రతి ఒక్కరికి చాలా అవసరం కూడా! కాబట్టి ఉదయం లేదా సాయంత్రం ఇద్దరూ కలిసి కాసేపు నడక, వ్యాయామం, యోగా చేయవచ్చు. లేదా ఇద్దరూ కలిసి ఓ జిమ్ సెంటర్లో చేరొచ్చు. తద్వారా శరీరానికి చక్కటి వ్యాయామం అంది బరువు పెరగకుండా జాగ్రత్తపడవచ్చు.

ఫ్రెష్ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్స్:

ఫ్రెష్ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్స్:

బరువు అదుపులో ఉంచుకోవడానికి తాజా పండ్లు మరియు కూరగాయలును రెగ్యులర్ డైట్ లో తీసుకోవాలి . కాబట్టి, క్రమం తప్పకుండా ఇలా తినడం అలవాటు చేసుకోవాలి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ మరియు సాయంత్రం స్నాక్స్ గాను వీటిని తీసుకోవచ్చు.

 ఫ్రెష్ జ్యూసులు:

ఫ్రెష్ జ్యూసులు:

అలాగే తాజా వెజిటేబుల్స్ మరియు తాజా ఫ్రూట్స్ తో తయారుచేసే రసాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి మేలుచేయడంతో పాటు బరువు పెరగకుండా కాపడుతాయి.

యోగా:

యోగా:

ఇద్దరూ కలిసి యోగా వంటి వ్యాయామాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.

ఇద్దరూ కలిసి హెల్తీ మీల్స్ తయారుచేయాలి:

ఇద్దరూ కలిసి హెల్తీ మీల్స్ తయారుచేయాలి:

ఇద్దరూ కలిసి కనీసం వారానికొక సారి హెల్తీ మీల్స్ తయారుచేయాలి. కొత్త వంటలను ప్రయత్నించాలి. లోక్యాలరీ ఫుడ్స్ ను తయారుచేయాలి . ఒకరికోసం ఒకరు సమయం కేటాయించాలి

ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించాలి:

ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించాలి:

ఒక గ్లాసు వైన్ తీసుకోవడం వల్ల మనస్సు మరియు శారీరక స్థితి హెల్తీగా మరియు రిలాక్సింగ్ గా ఉంటుంది. చాలా మంది కపుల్స్ ఇద్దరూ కలిసి షేర్స్ చేసుకోవడానికి ఇష్టపడుతుంటారు అయితే అలాంటి జంటలు మితంగా తీసుకోవడం మంచిది.

ఈవెనింగ్ ఈటింగ్ స్టఫ్ ను తినడం నివారించాలి:

ఈవెనింగ్ ఈటింగ్ స్టఫ్ ను తినడం నివారించాలి:

రోజంత పనిచేసి ఇంటికి చేరుకోగానే, సాయంత్రంలో టీవీ చూస్తూ అనవసరమైన, ఫ్యాట్ ఫుడ్స్ తీసుకుంటుంటారు. దీన్ని ముందుగానే గ్రహించి వాటికి దూరంగా ఉండటం వల్ల అదనపు క్యాలరీలను పొందకుండా ఉంటారు.

రతి క్రీడ:

రతి క్రీడ:

రెగ్యులర్ గా రతి క్రీడ అనేది మానసిక ఉల్లాసం మాత్రమే కాదు, ఇద్దరిలో బరువు తగ్గించడంలో మరియు ఇతర అనేక ఆరోగ్యప్రయోజనాలను అందించే వ్యాయామ క్రీడ ఇది.

బరువు తగ్గించుకోవడానికి కొత్తగా ఏమైనా చేయాలి:

బరువు తగ్గించుకోవడానికి కొత్తగా ఏమైనా చేయాలి:

కొత్తగా పెళ్ళైనవారు, వారంతంలో ఇంటికి పరిమితంగా కాకుండా, ఇద్దరు కలిసిచేసేటటువంటి పనులు ట్రెక్కింగ్, సైక్లింగ్, విండ్ సర్ఫింగ్, స్వింగ్ డ్యాస్, వంటి కొత్త పనులు చేయడం వల్ల మీకు ఉల్లాసంగా ఉండటం మాత్రమే కాదు, బరువు ను కంట్రోల్ చేసుకోవచ్చు...

English summary

How to get rid of Weight Gain After Marriage

Marriage is supposed to be all love and bliss, but it may not be so great for your waistline or health. Studies show that people who get married are twice as likely to become obese as those who are merely dating! So even though you've found your soul mate and said "I do," it's no reason to let yourself go. Here are tips to help you keep the pounds off after your wedding, and live fit and healthy ever after.
Story first published: Tuesday, June 16, 2015, 13:42 [IST]
Desktop Bottom Promotion