For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టమ్మీ ఫ్యాట్ ను ఎఫెక్టివ్ గా...ఫాస్ట్ గా..కరిగించే 9 సూపర్ ఫుడ్స్

|

టమ్మీ ఫ్యాట్ తో చింతిస్తున్నారా? ఎంత డైటింగ్ చేసినా...వ్యాయామలు..జిమ్ లు చేసినా ప్రయోజనం లేదా..? మరి వేగంగా టమ్మీ ఫ్యాట్ ను తగ్గించుకోవాలని కోరుకుంటున్నారా? మరి మీకోసం ఒక మంచి పరిష్కార మార్గం ఉన్నది. నడుము చుట్టు పేరుకొన్న ఫ్యాట్ ను కరగించుకోవడానికి కొన్ని సింపుల్ మార్గాలు, ఎఫెక్టివ్ చిట్కాలున్నాయి.

భుజాలు మరియు నడుము వంటి ప్రాంతాల్లో చేరిన అదనపు కొవ్వును కరిగించుకోవడానికి జిమ్ కు వెళితే సరిపోదు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి . సరైనా ఆహారం తీసుకుంటూనే రెగ్యులర్ గా మీ బరువును తెలుసుకుంటుండాలి. అందువల్ల మీరు మంచి ఆహారా నియమాలను పాటించాలి. ముఖ్యంగా మీరు రెగ్యులర్ గా తీసుకొనే ఆహారాల్లో ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.

READ MORE: లోయర్ బెల్లీ ఫ్యాట్ కరిగించే 15 టిప్స్ అండ్ ట్రిక్స్ .!

మీ రెగ్యులర్ డైట్ లో ఎక్కువగా ఫ్రెష్ గా ఉండే వెజిటేబుల్స్ మరియు పండ్లను చేర్చడం వల్ల శరీరంలో చేరిన అదనపు ఫ్యాట్ ను కరిగించుకోవచ్చు. అలాగే మీరు తీసుకొనే ఆహారంతో పాటు ప్రతి రోజూ కనీసం 8గ్లాసుల నీళ్ళు త్రాగాలి మరియు సాధ్యమైనంత వరకూ పంచదారను తగ్గించేయాలి.

మరి శరీరంలో చేరిన అదనపు కొవ్వును వేగంగా కరిగించుకోవడానికి కొన్ని ఉత్తమ ఆహారాలు ఈ క్రింది స్లైడ్ ద్వారా మీకోసం పరిచయం చేస్తున్నాము...

 వాటర్ మెలోన్:

వాటర్ మెలోన్:

వాటర్ మెలోన్ లో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. అలాగే విటమిన్ ఎ, సి మరియు అమినో యాసిడ్స్ కూడా అధికంగా ఉంటాయి . కాబట్టి, రెగ్యులర్ డైట్ లో పుచ్చకాయను చేర్చడ వల్ల నడుము వద్ద చేరిన అదనపు ఫ్యాట్ ను చాలా ఎఫెక్టివ్ గా కరిగించుకోవచ్చు.

బొప్పాయి:

బొప్పాయి:

బరువు తగ్గించడంలో ఒక బెస్ట్ ఫుడ్ బొప్పాయి. ఎందుకంటే బొప్పాయిలో ఫ్యాట్ కంటెంట్ అధికంగా ఉంటుంది . కాబట్టి, దీన్ని మీ రెగ్యురల్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఫ్యాట్ ను చాలా వేగంగా తగ్గిస్తుంది.

టమోటో:

టమోటో:

టమోటో ఫ్యాట్ పైటింగ్ ఫుడ్స్ లో ఒకటి. రెగ్యులర్ గా టమోటోలను సాలాడ్స్ రూపంలో తీసుకోవడం వల్ల శరీరంలోని ఎక్సెస్ సోడియం, వాటర్ మరియు కడుపు ఉబ్బరంకు కారణం అయ్యే నీరు మరియు ఆమ్లాలను నివారించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

మష్రుమ్:

మష్రుమ్:

ఫ్లాట్ టమ్మీ పొందడానికి మష్రుమ్స్ చాలా గ్రేట్ ఫుడ్స్ . మష్రుమ్ తీసుకొన్నప్పుడు కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. ఆకలి కోరికలను తగ్గిస్తుంది. బౌల్ మూమెంట్ ను సరిచేస్తుంది. టమ్మీ ఫ్యాట్ కరిగించడానికి సహాయపడుతుంది.

బాదం:

బాదం:

బాదంను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల పొట్టను ఫ్లాట్ గా మార్చుతుంది. బాదంలో ఉండే విటమిన్ ఇ కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది.

ఓట్స్ :

ఓట్స్ :

బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవాలనే లక్ష్యంతో ఉన్న వారు, రెగ్యులర్ డైట్ లో ఓట్స్ ను చేర్చుకోవడం వల్ల చాలా ఎఫెక్టివ్ గా శరీరంలో చేరిన అదనపు ఫ్యాట్ ను కరిగించుకోవచ్చు . ఓట్స్ ను ప్రతి రోజూ ఉదయం అల్పాహారంతో తీసుకోవడం వల్ల ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది మరియు ఆకలి కోరికను తగ్గిస్తుంది.

అరటిపండ్లు:

అరటిపండ్లు:

అరటి పండ్లలో ఉండే ఎంజైమ్స్ జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది . మరియు బరువు తగ్గిస్తుంది . డైలీ డైట్ లో అరటిపండ్లను చేర్చుకోవడం ద్వారా ఫ్యాట్ బర్నింగ్ ప్రొసెస్ ను పెంచుతుంది.

 ఆపిల్స్:

ఆపిల్స్:

ఫైబర్ కు మంచి మూలం ఆపిల్స్. వీటిని తినడం వల్ల ఆకలికోరికలను తగ్గిస్తుంది . ఆపిల్ బరువు తగ్గించడానికి సహాయపడుతుంది . ప్రతి రోజూ ఆపిల్ తినడం వల్ల అదనపు కొవ్వును కరిగిస్తుంది. పొట్ట ఉదరం కరుగుతుంది.

 ద్రాక్ష:

ద్రాక్ష:

ఫ్రెష్ గా ఉన్న ద్రాక్షతినడం వల్ల కూడా జీర్ణక్రియను ఆలస్యం చేస్తుంది . ద్రాక్ష రసం త్రాగడం వల్ల శరీరంలో చేరిన అదనపు ఫ్యాట్ ను కరిగించుకోవడానికి సహాయపడుతుంది . గ్రేప్ జ్యూస్ డైట్ వల్ల 10 రోజుల్లో 10 పౌండ్ల బరువును తగ్గించుకోవచ్చు.

English summary

Nine Super Foods To Burn Tummy Fat: Diet Tips in Telugu

9 Super Foods To Burn Tummy Fat: Diet Tips in Telugu. Is your tummy fat bothering you? Do you want to reduce your tummy fat rapidly? Well, we have a solution for you. Now, you can burn the fat accumulated around the waist by following these simple yet effective measures.
Story first published: Tuesday, September 22, 2015, 16:45 [IST]
Desktop Bottom Promotion