For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవి సీజన్ లో బరువు పెరగడం నియంత్రించడం ఎలా

|

వేసవి సీజన్ లో మనకు తెలియకుండానే కాస్త బరువు పెరుగుతామన్న విషయం చాలా మందికి తెలియదు. వేసవిలో కాస్త యాక్టివ్ గా ఉంటూనే హైకింగ్, బైకింగ్, మరియు స్విమ్మింగ్ వంటివి చేస్తుంటాము. అయినప్పటికీ, మనం బరువు ఎందుకు పెరుగుతాము?

వేసవిలో కొంచెం ఎక్కువ బరువు పెరగడానికి కొన్ని కారణాలున్నాయి . వేసవి సీజన్ లో మీరు తీసుకొనే ఆహారం మోతాదు క్రమంగా మీకు తెలియకుండానే పెంచేస్తారు . అప్పుడు ఖచ్చితంగా మన శరీరంలోని అదనపు క్యాలరీలు వచ్చి చేరుతాయి.

మరో కారణం, వాతావరణ ఉష్ణోగ్రత కూడా బరువు పెరగడానికి కారణం అవుతుంది. వేసవిలో మన శరీరం వెచ్చగా ఉండటం వల్ల జీవక్రియలు ఎక్కువ ఎనర్జీని గ్రహిస్తాయి. వాతావరణం అప్పటికే వేడిగా ఉండి, తిరిగి శరీరంలో వేడిని గ్రహించడం వల్ల పనులకు బద్దకస్తులవుతారు. కాబట్టి, వేసవిలో బరువు పెరుగడానికి ఇది కూడా ఒక కారణం కావవచ్చు .

మరి వేసవిలో ఇలా అదనపు బరువు పెరగకుండా ఉండటానికి కొన్ని మార్గాలు క్రింది విధంగా..

ఆహారపు అలవాట్లు:

ఆహారపు అలవాట్లు:

వేసవిలో మీకు దాహం వేసినప్పుడు నీరు ఎక్కువగా త్రాగాలి . నీటికి బదులుగా వేరే ఇతర పానీయాలు తీసుకొన్నా మీ శరీరానికి అదనపు క్యాలరీలు చేరుతాయి . ఎందుకంటే కార్బోనేటెడ్ డ్రింక్ మరియు జ్యూసుల్లో ఉండే షుగర్స్ శరీరం యొక్క బరువు పెంచుతుంది. కాబట్టి, వేసవిలో నీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి.

సమ్మర్ యాక్టివిటీస్:

సమ్మర్ యాక్టివిటీస్:

వేసవి సీజన్ రాబోతుందనగానే, ముందు నుండే స్విమ్మింగ్, జిమ్, ఏరోబిక్స్, యోగ వంటి వాటికి ప్లాన్ చేసుకోవాలి . ఇవి వేసవిలో బరువు పెరగకుండా నివారించడానికి చక్కటి మార్గాలు.

 వ్యాయామాలు తప్పించకూడదు:

వ్యాయామాలు తప్పించకూడదు:

రెగ్యులర్ వ్యాయామాలు మిస్ చేయకూడదు. ఇక వేళ వాతావరణం వేడిగా ఉన్నప్పుడు సాధ్యం కాకపోతే, సాయంత్రం సమయాల్లో వ్యాయామాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల సమ్మర్ వెయిట్ గెయిన్ నివారించుకోవచ్చు.

ఆహారాలు:

ఆహారాలు:

వేసవిలో తీసుకొనే ఆహారాలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలి . వేసవిలో మీ జీవక్రియలను వేగవంతం చేసే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి . నిపుణుల ప్రకారం, శీతాకాలంలో మెటబాలిజం రేటు ఎక్కువగా ఉంటుంది మరియు వేసవిలో కొద్దిగా నిధానంగా ఉండటం వల్ల క్రమంగా బరువు పెరుగుతుంటారు . కాబట్టి, ఖచ్చితంగా మీ డైట్ మరియు యాక్టివిటీలు స్థాయిలు క్రమబద్దంగా ఉంచుకోవాలి.

క్రమశిక్షణగా ఉండాలి:

క్రమశిక్షణగా ఉండాలి:

వేసవి కాలంలో బద్దకించడం ఎక్కువ, హాలీడేస్ అని లేట్ గా నిద్రలేచేవారు ఎక్కువ. అంతే కాదు, రోజంతా బద్దకించి కూర్చోవడం, ఏపనులు చేయకపోవడం వల్ల శరీరం క్రమంగా బరువెక్కుతుంది . కాబట్టి, మీ దినచర్యలో బిజీగా ఉండటానికి ప్రయత్నించండి.

English summary

Tips To Avoid Weight Gain This Summer

Most of us are not aware of the fact that there would be slight weight gain in summer. Actually, we generally spend our summer days active by hiking, biking and swimming. Then why would we still tend to gain weight?
Story first published: Saturday, May 2, 2015, 17:31 [IST]
Desktop Bottom Promotion