For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

15 రోజులు.. 12 సింపుల్ టిప్స్..! బరువు తగ్గే అమేజింగ్ డైట్ ప్లాన్.. !

By Swathi
|

ఒకప్పుడు మీరు చాలా ఇష్టపడిన డ్రెస్ ఇప్పుడు మీకు పట్టడం లేదా ? ప్యాంట్స్ బాగా టైట్ అయిపోయాయా ? టాప్స్ అన్నీ.. ఏమాత్రం మీ సైజుకి సరిపోవడం లేదా ? మీరు విపరీతంగా పెరిగిన బరువును చూసుకుని చిరాకుపడుతున్నారా ? డోంట్ వర్రీ.. మీ కోసం కేవలం 15 రోజుల్లో బరువు తగ్గే.. 12 సింపుల్ డైటింగ్ టిప్స్ అందుబాటులో ఉన్నాయి.

చాలా సందర్భాల్లో మన బరువు, బాడీ షేప్ చూసుకుని.. చాలా నిరుత్సాహానికి లోనవుతూ ఉంటారు. బరువు తగ్గి.. మునపటి స్లిమ్ లుక్ కోసం చాలా ఆరాటపడుతుంటారు. ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఫలితం లభించకపోవడంతో.. కొంతమంది డైట్ ఫాలో అవడమే మానేస్తారు. ఇంకొందరు రకరకాల మార్గాల కోసం అన్వేషిస్తూ ఉంటారు.

పొట్ట మాత్రమే కాదు, టోటల్ బాడీ ఫ్యాట్ కరిగించే టాప్ ఫుడ్స్ అండ్ డ్రింక్స్

బరువు పెరగడానికి రకరకాల కారణాలుంటాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అన్ హెల్తీ డైట్, వ్యాయామం లేకపోవడం, వంశపారంపర్యం ఇలా ఏదో ఒక రీజన్ మీరు బరువు పెరగడానికి కారణమవవచ్చు. అధిక బరువు, ఒబేసిటీతో ఉండటం ఆరోగ్యకరం కాదు. అలాగే మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. కాబట్టి.. 15 రోజులు చాలు.. 12 సింపుల్ టిప్స్ క్రమం తప్పకుండా ఫాలో అయితే.. మీ కోరుకున్న స్లిమ్ ఫిట్ మీ సొంతమవుతుంది. మరి ఆ టిప్స్ ఏంటో చూసేద్దామా..

వాటర్

వాటర్

రోజంతా నీళ్లు తాగుతూ ఉండండి. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల.. పొట్టనిండిన ఫీలింగ్ కలుగుతుంది. అలాగే హైడ్రేటెడ్ గా ఉంటారు. ఆకలిని చాలా తగ్గిస్తాయి మంచినీళ్లు.

హై క్యాలరీ ఫుడ్

హై క్యాలరీ ఫుడ్

జంక్ ఫుడ్, హై క్యాలరీ ఫుడ్ ఇంట్లో, ఫ్రిడ్జ్ లో ఉంటే.. వెంటనే వాటిని పడేయండి. వాటికి బదులు హెల్తీ ఫుడ్స్ చేర్చుకోండి. అలా చేయడం వల్ల.. మీకు ఆకలిగా అనిపించినప్పుడు హెల్తీ ఫుడ్ మాత్రమే తీసుకుంటారు.

పంచదారకు దూరంగా

పంచదారకు దూరంగా

షుగర్ ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండండి. స్వీట్స్, పేస్ట్రీలు, వైట్ బ్రెడ్, రైస్ వంటివి డైట్ లో నుంచి తీసేయడం వల్ల.. వేగంగా బరువు తగ్గవచ్చు.

ప్రొటీన్ రిచ్ ఫుడ్

ప్రొటీన్ రిచ్ ఫుడ్

డైలీ డైట్ లో ప్రొటీన్ రిచ్ ఫుడ్ ని ప్రధానంగా చేర్చుకోండి. ప్రొటీన్స్ ఆరోగ్యవంతమైన కండరాలు ఏర్పడటానికి సహాయపడతాయి. కాబట్టి మాంసం, ఎగ్స్, పాలను డైట్ లో చేర్చుకోవచ్చు.

కూరగాయలు

కూరగాయలు

మీరు బరువు తగ్గాలి అనుకుంటే.. ఎక్కువ కూరగాయలను మీ డైట్ లో చేర్చుకోవాలి. కూరగాయల్లో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల.. మీకు శక్తినిస్తాయి. అలాగే వాటిలో తక్కువ క్యాలరీలు, తక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. ఇవి ఆకలిని కూడా తగ్గిస్తాయి.

క్యాలరీలు

క్యాలరీలు

మీరు ఏం తింటున్నారు, రోజుకి ఎన్ని క్యాలరీలు తింటున్నారు అనేది నోట్ చేసుకోవాలి. ఈ అలవాటు మీ బరువులో మార్పు తీసుకురావడానికి సహాయపడుతుంది.

భోజనం మానేయద్దు

భోజనం మానేయద్దు

భోజనం మానేయడం వల్ల.. మీరు బరువు తగ్గే ప్రక్రియ స్లోగా మారుతుంది. అలాగే ఇది చాలా అనారోగ్యకరం కూడా. భోజనం మానేయం వల్ల.. మీకు ఆకలి ఎక్కువగా అనిపించి, చిరుపదార్థాలు ఎక్కువగా తించారు. అలాగే తర్వాతి భోజనంలో ఎక్కువ ఆహారం తీసుకుంటారు. దీనివల్ల బరువు పెరగుతారు.

ఫాస్ట్ ఫుడ్ కి నో

ఫాస్ట్ ఫుడ్ కి నో

ఫాస్ట్ ఫుడ్ కి దూరంగా ఉండటం చాలా అవసరం. డ్రింక్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ లో హై క్యాలరీలు ఉంటాయి. ఇవి ఆరోగ్యకరం కాదు. కాబట్టి.. ఇవి బరువు పెరగడానికి కారణమవుతాయి.

డైట్ ప్లాన్

డైట్ ప్లాన్

ఎక్కువ డైట్ ప్లాన్స్ ఫాలో అవడం కంటే.. ఒకే రకమైన డైట్ ప్లాన్ ఫాలో అయితే.. మంచి ఫలితాలు పొందవచ్చు. ఎలాంటి డైట్ ప్లాన్ మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుందో తెలుసుకుని.. దాన్ని ఫాలో అయితే.. వేగంగా బరువు తగ్గవచ్చు.

అద్దం ముందు తినడం

అద్దం ముందు తినడం

అద్దం ముందు తింటే బరువు తగ్గుతారనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు. అయితే అద్దం ముందు తినడం వల్ల చాలా ఫాస్ట్ గా బరువు తగ్గుతారని స్టడీస్ చెబుతున్నాయి. వాళ్లను వాళ్లు అద్దంలో చూసుకోవడం వల్ల.. ఆహారం తినేటప్పుడు ఎక్కువ మోతాదులో తినకుండా జాగ్రత్త పడతారు.

భోజనానికి ముందు నడక

భోజనానికి ముందు నడక

భోజనానికి ముందు నడవడం వల్ల ఆకలి తగ్గి.. తక్కువగా ఆహారం తీసుకుంటారని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే క్యాలరీలు కరిగిపోవడానికి సహాయపడుతుంది.

మోతాదు తగ్గించడం

మోతాదు తగ్గించడం

భోజనం తీసుకునేటప్పుడు పరిమాణం తగ్గించడం వల్ల.. బరువు తగ్గే లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం తేలికవుతుంది. 3 రోటీలు తినేవాళ్లు.. 2 రోటీలు తినడం వల్ల బరువు తగ్గవచ్చు.

English summary

12 Simple Dieting Tips To Reduce Weight In 15 Days

12 Simple Dieting Tips To Reduce Weight In 15 Days. Have you ever longing looked at that pretty dress you wore to a friend's wedding just a few months ago, that doesn't fit you now?
Story first published:Thursday, April 21, 2016, 16:41 [IST]
Desktop Bottom Promotion