For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ పవర్ ఫుడ్స్ తింటే కోరికలు గుర్రాలై పరుగులు తీస్తాయి..?

|

ప్రస్తుత ఆధునిక కాలంలో సహజంగా ప్రకతి సిద్దంగా లభించే ఆహారాలకు స్వస్తి పలుకుతున్నారు. రసాయనాలతో పండించి ఆహారాలే మార్కెట్లో ఎక్కువగా లభ్యం అవుతున్నాయి. అవి తింటూనే జీవనం సాగిస్తున్నారు ప్రజలు. ఇలా రసాయనాలతో పండించిన ఆహారాలు ప్రస్తుతానికి ఎటువంటి ప్రభావం చూపెట్టకపోయినా ముందు ముందు ఆరోగ్యం మీద చెడు ప్రభావాన్ని చూపెడుతాయి.

కొన్ని ఆసక్తి కరమైన పండ్లు అన్యదేశపు కూరగాయలు సెక్స్ లైఫ్ కు చాలా సహాయపడుతాయి. అటువంటి కొన్ని రకాలా ఆహారాల పట్టికను మీకు అందిస్తున్నాం. ఇవి కనుక మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకొన్నట్లైతే రక్త సరఫ, కండరపుష్టికి, మంచి లైంగిక వాంఛ మరియు లైంగిక శక్తిని పెంచడానికి మార్గాన్ని సుగమం చేయడానికి సహాయపడుతాయి.

సామర్థ్యం తగ్గకుండా ఉండాలంటే: కొన్ని ముఖ్యమైన ఇండియన్ ఆహారాలు సెక్స్ డ్రైవ్ ను నేచురల్ గా పెంపొందించుకోవచ్చు. మంచి ఆహారపు అలవాట్లు అలవరచుకోవాలి. సెక్స్ హార్మోన్లను పెంపొంధించుకోవడానికి పాలు, తేనెను పురాతన కాలం నుండినే ఉపయోగిస్తున్నారు.

ఇవే కాక బాదం, ఖర్జూరం, మొలకెత్తిన విత్తనాలు, గ్రుడ్లు, తాజా ఆకుకూరలు తీసుకోవాలి. కీర దోసకాయ, క్యారెట్, బీట్‌రూట్‌తో తయారుచేసిన జ్యూస్‌ను రోజు ఉదయం ఒక గ్లాసు తీసుకోవాలి. యాపిల్, జామ, దానిమ్మ, ద్రాక్ష, నేరేడు వంటి తాజా పండ్లు తీసుకోవాలి. వీటితో పాటు మరికొన్నిఫుడ్స్ ఉన్నాయి. ఇవి సెక్స్ పవర్ ను పెంచుతాయి. కోరికలను నెరవేర్చుకొనేందుకు ఈ పవర్ ఫుల్ ఫుడ్స్ ను గ్రేట్ గా సహాయపడుతాయి. ఇంకెందుకు ఆలస్యం ఆ పవర్ ఫుడ్స్ ఏంటో తెలుసుకోండి....

అరటి పండు:

అరటి పండు:

అరటి పండులో ఉండే బ్రొమెలైన్(bromelain)అనే ఎంజైమ్ లిబిడోను పెంపొందిస్తుంది మరియు పురుషుల్లో లైంగిక సమస్యలను తగ్గిస్తుంది. అంటిపండులో ఉండే పొటాషియం మరియు విటమిన్ బి శరీరానికి కావల్సినంత శక్తిని అంధిస్తుంది.

గుడ్లు:

గుడ్లు:

గుడ్లు: గుడ్లలో విటమిన్ బి6 మరియు విటమిన్ బి5 పుష్కలంగా ఉంటాయి. ఇవి హార్మోనుల లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తాయి. ఒత్తిడితో పోరాడుతాయి. అధిక లైంగిక వాంఛను కలిగిస్తాయి. ముఖ్యంగా గుడ్లను ఫెర్టిలిటికి సంకేతంగా సూచిస్తారు.

అశ్వగంధ:

అశ్వగంధ:

సెక్స్ డ్రైవ్ పెంచడానికి అద్భుతంగా సహాయడే ఔషధం అశ్వగంధ. ఎల్లప్పుడూ సెక్స్ లైఫ్ ను పెంచడానికి భారతీయ ఆయుర్వేద వైద్యంలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఒక చిటికెడు పల్లేరుకాయల చూర్ణాన్ని, ఒక టీస్పూన్ అశ్వగంధ చూర్ణాన్ని ఒక కప్పు పాలకు కలిపి మరిగించి, వడపోసుకొని పడుకునే సమయంలో తాగితే మగవాళ్లలో లైంగిక బలహీనత తగ్గుతుంది. ఇలాగ కనీసం పది పదిహేను రోజులు వాడాల్సి ఉంటుంది.

డార్క్ చాక్లెట్:

డార్క్ చాక్లెట్:

డార్క్ చాక్లెట్ లిబిడో బూస్టర్ గా బాగా ప్రసిద్ధి చెందింది. చాక్లెట్ లో మీకు సెక్స్ లైఫ్ అనుభూతిని కలిగించి ఒక రసాయనం phenylethylamine ఇందులో ఉంటుంది. డార్క్ చాక్లెట్ తినడానికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. డార్క్ చాక్లెట్ లో ఉండే ఫోనోఫినాయిల్స్ మెదడులోని ఎండోర్ఫిన్ ఉత్పత్తికి బాగా సహాయపడుతుంది. అంతే కాదు లైంగిక జీవితానికి కూడా బాగా సహాపడుతుంది.

అంజూర:

అంజూర:

ఇది పురాతనకాలం నుండి వినియోగిస్తున్నారు. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరచడం మాత్రమే కాదు..సెక్స్ లైఫ్ కు సహాయపడటంతో పాటు పురుషుల్లో సంతానోత్పత్తిని పెంపొందిస్తుంది. వీర్యకణాల పెరుగుదలకు సహాయపడుతుంది. డ్రై ఫ్రూట్ ఫిగ్ లిబిడోను సహజంగా పెంపొంధిస్తుంది. సెక్స్ లైఫ్ ను సహజగా పెంచడంలో ఇదొక ఇండియన్ ఫుడ్ గా సూచిస్తారు.

యాలకులు:

యాలకులు:

ఇండియన్ మసాలా దినుసుల్లో ఒకటిగా చెప్పుకొనే యాలకులు మానసిక స్థితి పెంచడం ద్వారా లిబిడో పునరుద్ధరించవచ్చు. ఏలకుల ఆయిల్ మసాజ్ చాలా రొమాంటిక్ మరియు నపుంసకత్వంను తగ్గించి, లైంగిక స్పందన పెంచే cineole కలిగి ఉంది.

పుచ్చకాయ:

పుచ్చకాయ:

పుచ్చకాయను సెక్స్ బూస్టర్ అంటారు. ఎర్రగా ఉండే వాటర్ మెలోన్ లో అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రిలాక్స్ పొందడానికి రక్త ప్రసరణకు బాగా సహాయపడుతాయి. సెక్స్యువల్ ఆర్గాన్స్ కు రక్తప్రసరణను అందిస్తుంది.

దానిమ్మ జ్యూస్:

దానిమ్మ జ్యూస్:

దానిమ్మలో అనేక పోషకాంశాలతో పాటు.. పుష్కలమైన యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఫీరాడికల్స్ ను తొలగించడంతో పాటు, శరీరంలో రక్త ప్రసరణ బాగా మెరుగుపరుస్తుంది.

అవొకాడో:

అవొకాడో:

ఇది బట్టర్ ఫ్రూట్జ. అవొకాడోలో మోనో సాచురేటెడ్ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఫ్యాట్స్ మగవారిలో టెస్టోస్టిరాన్ ఉత్పత్తికి బాగా సహాయడుతాయి. మరియు ఇవి లైంగిక జీవితానికి కావల్సిన ఎనర్జీలెవల్స్ ను పుష్కలంగా అంధిస్తాయి.

సెలరీ

సెలరీ

సెలరీ దీన్ని ఆరోగ్యకరమైన మరియు వెరైటీ ఫుడ్ గా ముఖ్యంగా మహిళల్లో కామోచ్ఛను పెంచే ఆహారంగా మార్కెట్లో కనుగొనబడింది. ఇందులో కామోచ్ఛను పెంచడానికి సహాయపడే ఆడ్రోస్ట్రిరోన్ కలిగి ఉండి సెక్స్ లైఫ్ కు బాగా సహాయపడుతుంది.

స్ట్రాబెర్రీ:

స్ట్రాబెర్రీ:

కలర్ ఫుల్ స్ట్రాబెర్రీస్ లో విటిమన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చూడటానికి మాత్రమే కాదు, రుచి, వాసన కూడా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ సెక్స్ లైఫ్ కు అద్భుతంగా సహాయపడుతాయి.

వెల్లుల్లి

వెల్లుల్లి

వెల్లుల్లిని గతంలో ధారాళంగా ఉపయోగించి లైంగిక జీవితాలను మెరుగుపరచేవారు. వెల్లుల్లి తింటే పురుషులైనా, స్త్రీలైనా ఉద్రేకాలకు లోనవుతారు. వెల్లుల్లిలో వుండే ఎల్లిసిన్ అనే రసాయనం జననాంగాలకు రక్తప్రసరణ అధికం చేస్తుంది. జననేంద్రియాలకు కావలసినంత రక్తం వెళ్ళటం వలన ఖచ్చితంగా అంగస్తంభన సంబంధించిన ఏ సమస్య ఉండదు. వెల్లుల్లి అంగస్తంభన నిర్వర్తించే నైట్రిక్ ఆక్సైడ్ సింథేస్ ఉత్పత్తిని ప్రేరేపించగలదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక మనిషి యొక్క గుండె మార్గం తన కడుపు ద్వారా అని పేర్కొన్నారు. కాబట్టి మీరు ఆహారంలో వెల్లుల్లిని ఒక అదనపు మోతాదులో ఉంచండి.

తులసి

తులసి

ఇటలీలో ఈ తీపి స్మెలింగ్ మూలికను 'నికోలస్ ముద్దు' అని అంటారు. తులసి సెక్స్ డ్రైవ్ మరియు సారాన్ని పెంచుతుందని నమ్ముతారు. తులసిలో ఇనుము,విటమిన్ ఎ,సి మరియు K,మెగ్నీషియం ఉంటాయి. ఇది రక్త నాళాల సడలింపు మరియు ధమనులలో గడ్డకట్టడాన్ని నిరోదించుట వలన రక్త ప్రసరణ పెరుగుతుంది. తులసి అన్ని రకాల 'తలనొప్పి' లనుండి స్వస్థత చేకూర్చడంలో ప్రసిద్ధి చెందింది. కాబట్టి మీకు అవసరం వచ్చినప్పుడు తులసిని ఉపయోగించండి.

సెక్స్ వల్ల ప్రయోజనాలు

సెక్స్ వల్ల ప్రయోజనాలు

1. సంతోషాన్ని పెరుగుతుంది 2. సెల్ఫ్ ఇమేజ్ లో మెరుగుదల కనిపిస్తుంది. 3. జీవిత భాగస్వామితో వైవాహిక జీవితం బలపడటంలో మెరుగుదల ఉంటుంది. 4. జీవిత భాగస్వామితో సంతోషంగా గడపడానికి సహాయపడుతుంది. 5. శరీరంలో హార్మోనులును మరియు జీవక్రియలను బ్యాలెన్స్ చేస్తుంది.

English summary

14 Power Foods that can boost your libido naturally

Testosterone is a male hormone which plays a vital role in a man's health and sexuality. Its production is dependent on zinc and vitamin B and although it is not found directly in the food we eat, certain foods can lead the body to produce more of it.
Desktop Bottom Promotion