For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెనోపాజ్ త‌ర్వాత ఈజీగా బ‌రువు త‌గ్గే.. సింపుల్ అండ్ అమేజింగ్ ఐడియాస్..!!

By Swathi
|

40 ఏళ్ల‌కు ద‌గ్గ‌ర‌లో ఉన్న మ‌హిళా మీరు ? శ‌రీరంలో జ‌రుగుతున్న శారీర‌క మార్పుల గురించి ఆందోళ‌న ప‌డుతున్నారా ? 45 నుంచి 55 ఏళ్ల వ‌య‌సు మ‌హిళ‌లంతా.. మెనోపాజ్ లో ఉంటారు. శ‌రీరంలో జ‌రిగే మార్పులు.. కాస్త ఆశ్చ‌ర్యానికి గురిచేస్తాయి. ఈ మెనోపాజ్ ద‌శలో ఆడ‌వాళ్ల శ‌రీరంలో ర‌క‌ర‌కాల మార్పులు ఆందోళ‌న‌కు గురిచేస్తాయి.

మ‌హిళ‌ల‌ల రీప్రొడ‌క్టివ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ‌కుండా.. రుతుక్ర‌మం కూడా తగ్గిపోతుంది. మెనోపాజ్ ద‌శలో అనేక హార్మోనల్ చేంజెస్ క‌నిపిస్తాయి. శారీర‌క‌, మాన‌సిక మార్పులు మెనోపాజ్ ద‌శ‌లో క‌నిపిస్తాయి. మెనోపాజ్ ద‌శ‌లో శ‌రీరం ఈస్ట్రోజ‌న్ ఉత్ప‌త్తి త‌గ్గిపోతాయి. అలాగే ఆండ్రోజెన్స్, టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరుగుతాయి.

మెనోపాజ్ ద‌శ‌లో శ‌రీరంలో కొన్ని ల‌క్ష‌ణాలు కనిపిస్తాయి. బ‌రువు పెర‌గ‌డానికి, శ‌రీరంపై అవాంఛిత రోమాలు, బ్లాడ‌ల్ కంట్రోల్ త‌గ్గ‌డం, వాజిన‌ల్ డ్రైనెస్, డిప్రెష‌న్, మూడ్ స్వింగ్స్, హాట్ ఫ్ల‌షెస్.. వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. అయితే మెనోపాజ్ స‌మ‌యంలో.. బ‌రువు పెర‌గ‌డం విభిన్నంగా ఉంటుంది. కాబ‌ట్టి మెనోపాజ్ ద‌శ‌లో బ‌రువు త‌గ్గడానికి కొన్ని టిప్స్ ఫాలో అయితే..చాలు.

డైట్ లో ఫిష్

డైట్ లో ఫిష్

ఫిష్ లేదా ఫిష్ ఆయిల్ క్యాప్సుల్స్ ని వ‌య‌సు అయిన మ‌హిళ‌లు వాడ‌టం వ‌ల్ల‌.. హెల్తీ వెయిట్ మెంటెయిన్ చేయ‌వ‌చ్చు. ఫిష్ లో ఉండే విట‌మిన్ ఈ ఎక్కువ ఫ్యాట్ ని క‌రిగించి.. హార్మోన్స్ ని రెగ్యులేట్ చేస్తుంది.

అప్పుడ‌ప్పుడు న‌డ‌వ‌డం

అప్పుడ‌ప్పుడు న‌డ‌వ‌డం

ఎంత వీలైతే అంత న‌డ‌వ‌డం మంచిది. లిఫ్ట్ ల‌కు బదులు స్టెప్స్ ఉప‌యోగించ‌డం మంచిది. స‌రుకుల కోసం వెళ్లిన‌ప్పుడు న‌డ‌వ‌డం అల‌వాటు చేసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు కంట్రోల్ లో ఉంటుంది. ఈ అల‌వాటు మెట‌బాలిజంను స‌జావుగా ఉంచ‌డ‌మే కాకుండా.. బ‌రువు త‌గ్గ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది.

వ్యాయామంలో మార్పులు

వ్యాయామంలో మార్పులు

యుక్త‌వ‌య‌సులో ఉన్న‌ప్పుడు చేసే వ్యాయామాల‌నే వ‌య‌సు పెరిగిన త‌ర్వాత కూడా చేయ‌డం మంచి అల‌వాటు కాదు. మెనోపాజ్ త‌ర్వాత‌.. ప్ర‌త్యేక‌మైన వ్యాయామాలు అవ‌స‌రం. కాబ‌ట్టి.. నిపుణుల స‌ల‌హా ప్ర‌కారం వ్యాయామం చేయ‌డం అవ‌స‌రం.

ఆల్క‌హాల్ మానేయ‌డం

ఆల్క‌హాల్ మానేయ‌డం

30 ఏళ్ల‌లో శ‌రీరం ఎలా ఉంటుందో.. మెనోపాజ్ లో కూడా అలానే ఉండ‌దు. కాబ‌ట్టి.. ఆల్క‌హాల్ ని త‌గ్గించాలి. ఎక్కువ‌గా ఆల్క‌హాల్ తీసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు పెర‌గ‌డానికి అవ‌కాశాలు ఉంటాయి. ఇవి.. అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు కార‌ణ‌మ‌వుతాయి.

ఒత్తిడి

ఒత్తిడి

చాలామంది మ‌హిళ‌లు మెనోపాజ్ లో ఒత్తిడి, డిప్రెష‌న్‌ని ఫేస్ చేస్తారు. దీనివ‌ల్ల ఎక్కువ‌గా తింటారు. కాబ‌ట్టి.. నిపుణుల స‌ల‌హాతో.. ఒత్తిడి త‌గ్గించుకునే ప్ర‌య‌త్నం చేయాలి.

డైట్ ప్లాన్

డైట్ ప్లాన్

డైటీషియ‌న్ ని సంప్ర‌దించి.. స‌రైన డైట్ ఫాలో అవ‌డం మంచిది. కాబ‌ట్టి హెల్తీ, సేఫ్ డైట్ ఫాలో అవ్వాలి.

English summary

7 Best Ways To Lose Weight After Menopause!

7 Best Ways To Lose Weight After Menopause! Are you a woman who is nearing your late 40s? Do you often worry about the undesirable physical changes that occur when you have to go through your menopause?
Story first published:Wednesday, July 27, 2016, 10:31 [IST]
Desktop Bottom Promotion