For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గడానికి రోజూ ఉదయం పరగడపు తీసుకోవల్సిన 7 రకాల జ్యూసులు..!

|

బరువు పెరగడం చాలా తేలిక, అయితే బరువు తగ్గించుకోవడం చాలా కష్టం. ఎంత కఠినంగా డైట్ ను ఫాలో అయినా..బరువు తగ్గకపోవడం, లావుగా ఉన్నవారందరిని కలవరపెట్టే సమస్య. అయితే డైట్...వ్యాయమాలతో అధిక బరువు తగ్గించుకోలేకపోతుంటే..జ్యూస్ లు చాలా హెల్ఫ్ అవుతాయి. ఫ్రెష్ గా ఉండే పండ్లను, పండ్ల రసాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల హెల్తీ అండ్ టీస్టీ కూడా.

హెల్తీగా మరియు టేస్టీగా ఉండే ఫ్రూట్స్ తినడంతో వెజిటేబుల్ జ్యూస్ లను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల అధిక బరువును ఎఫెక్టివ్ మరియు త్వరగా తగ్గించుకోవచ్చు . బరువు తగ్గించుకోవడానికి సహాయపడే 7 సింపుల్ రిసిపిలు ఈ క్రింది విధంగా..

. కీరదోస, టమోటో , సెలరీ జ్యూస్ :

. కీరదోస, టమోటో , సెలరీ జ్యూస్ :

కావల్సినవి: కీరదోస: 2 మీడియం

టమోటోలు 6 పెద్దవి

సెలరీ: 1కట్ట

కేయాన్ పెప్పర్ : 1 చిటికెడు,

బ్లాక్ పెప్పర్ పౌడర్ : 1/2tsp

ఉప్పు: 1/2tsp

తయారుచేసే పద్దతి:

కీరదోస, టమోటోలు, సెలరీను ముక్కలుగా కట్ చేయాలి.ఇప్పుడు వీటన్నింటిని మిక్సీజార్ లో వేసి పేస్ట్ చేయాలి . సరిపడా నీరు మిక్స్ చేసి రోజూ ఉదయం పరగడపున తీసుకోవాలి.

వాటర్ క్రెస్, టమోటో, క్యారెట్, మరియు స్పినాచ్ జ్యూస్

వాటర్ క్రెస్, టమోటో, క్యారెట్, మరియు స్పినాచ్ జ్యూస్

కావల్సినవి:

వాటర్ క్రెష్ 2 కట్టలు

టమోటోలు: 2 పెద్దవి

క్యారెట్ : 2మీడియం సైస్

ఆకుకూర : 1చిన్న కట్ట

బ్లాక్ పెప్పర్ పౌడర్: 1 tsp

ఉప్పు: 1 tsp

తయారుచేయు పద్దతి:

క్యారెట్ మరియు టమోటోలను చిన్న ముక్కలుగా కట్ చేయాలి. మరియు వాటర్ క్రస్ మరియు ఆకుకూరను కూడా సన్నగా కట్ చేసుకోవాలి. మొత్తం మిక్సీలో వేసి సరిపడా నీళ్ళు పోసి జ్యూస్ చేసుకోవాలి.

బీట్ రూట్, స్పినాచ్, సెలరీ మరియు సిలాంటరో జ్యూస్

బీట్ రూట్, స్పినాచ్, సెలరీ మరియు సిలాంటరో జ్యూస్

కావాల్సినవి:

బీట్ రూట్ :1 మీడియం సైజ్

ఆకుకూర: 1 కట్ట

సెలరీ: 5 to 6 stalks

కొత్తిమరీ: కొద్దిగా

ఉప్పు: 1 tsp

తయారీ:

బీట్ రూట్ ను, ఆకుకూర, కొత్తిమీర, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత సరిపడా నీళ్ళు పోసి జ్యూస్ ను రోజు పరగడపున తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. రక్తహీనత తగ్గిస్తుంది. బరువు పెరుగుతంది.

ఆపిల్, నిమ్మరసం, లెట్యూస్ మరియు స్పినాచ్ జ్యూస్

ఆపిల్, నిమ్మరసం, లెట్యూస్ మరియు స్పినాచ్ జ్యూస్

కావల్సినవి:

ఆపిల్: 2 పెద్దవి

నిమ్మకాయ: 1

రెడ్ లీఫ్ లెట్యూస్:1 పెద్దది

ఆకుకూరలు: 1cup

కేయాన్ పెప్పర్: (1/2) tsp

ఉప్పు: 1 tsp

తయారుచేయు పద్దతి:

ఆపిల్ ను కట్ చేసి, నిమ్మరసం పిండి, ఆకుకూర, రెడ్ లెట్యూస్ ముక్కలు మిక్సీలో వేసి, మెత్తగా పేస్ట్ చేసి సరిపడా నీళ్ళు సోసి జ్యూస్ చేసి తీసుకోవాలి.

క్యారెట్, బీట్, ఎల్లో పెప్పెర్, కివి మరియు గ్రేప్ ఫ్రూట్ ..

క్యారెట్, బీట్, ఎల్లో పెప్పెర్, కివి మరియు గ్రేప్ ఫ్రూట్ ..

కావల్సినవి:

క్యారెట్: 2 పెద్దవి

బీట్ రూట్ : 1 small

ఎల్లో పెప్పర్ : మీడియం సైజ్

కివి ఫ్రూట్: 1

గ్రేప్ ఫ్రూట్ : 1 పెద్దది

అల్లం: చిన్న ముక్క

తయారుచేయు విధానం

వాటర్ మెలోన్, లెమన్, మింట్ జ్యూస్

వాటర్ మెలోన్, లెమన్, మింట్ జ్యూస్

కావల్సినవి:

వాటర్ మెలోన్ : 1 ఒక కప్పు

నిమ్మకాయ: 1

పుదీనా 1/ 2 కప్పు

తయారుచేయు విధానం:

వాటర్ మెలోన్ చిన్న ముక్కలుగా కట్ చేసి, నిమ్మరసం మిక్స్ చేసి, అందులో సన్నగా తరిగిన పుదీనా ముక్కలు వేసి , మిక్స్ లో వేసి మొత్తగా పేస్ట్ చేయాలి. సరిపడా నీరు మిక్స్ చేసుకుని రెగ్యులర్ గా తాగడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు.

 ఆపిల్ , నిమ్మ, మరియు కేల జ్యూస్

ఆపిల్ , నిమ్మ, మరియు కేల జ్యూస్

పదార్థాలు:

ఆపిల్ : 2పెద్దవి

నిమ్మకాయ: 1

కేల: 1/2 కప్పు

ఉప్పు:1 tsp

తయారుచేయు విధానం:

ఆపిల్ ను ముక్కలుగా కట్ చేసి, కేలా కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత వీటిని మిక్సీ జార్ లో వేసి నిమ్మరసం పిండి, మెత్తగా పేస్ట్ చేయాలి. తర్వాత సరిపడా నీళ్ళు పోసి రెగ్యులర్ గా తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

English summary

7 Simple Fruit and Vegetable Juice Recipes for Fast Weight Loss

Consuming the healthy and tasty fruit as well as vegetable juices regularly can help you get rid of unwanted weight effectively and quickly. Here are 7 simple recipes for you:
Desktop Bottom Promotion