For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

త్వరగా, తేలికగా బరువు తగ్గడానికి ఎఫెక్టివ్ రెమిడీ.. వైట్ టీ

ఈ రోజుల్లో గరం గరం ఛాయ్ అంటే ఇష్టపడనివారుండరంటే అతిశయోక్తి కాదు. చల్లటి చలిలో పొగలు కక్కే టీకప్పుని చేతిలోకి తీసుకుని ఒక్కో గుటక మింగుతుంటే ఆ మజాయే వేరు. టెన్షన్‌లను తప్పించి మైండ్‌ను పొజిషన్‌కి తీసుక

|

ఈ రోజుల్లో గరం గరం ఛాయ్ అంటే ఇష్టపడనివారుండరంటే అతిశయోక్తి కాదు. చల్లటి చలిలో పొగలు కక్కే టీకప్పుని చేతిలోకి తీసుకుని ఒక్కో గుటక మింగుతుంటే ఆ మజాయే వేరు. టెన్షన్‌లను తప్పించి మైండ్‌ను పొజిషన్‌కి తీసుకొచ్చే టీలో చాలా రకాలున్నాయి. బ్లాక్ టీ, గ్రీన్ టీ... ఎప్పుడూ వినేవే. మరి వైట్ 'టీ' గురించి విన్నారా?!

బ్లాక్ టీ, గ్రీన్ టీలో మెడిసినల్ వాల్యూస్ అధికంగా ఉన్నాయి. అందుకే ఇవి పురాతన కాలం నుండి బాగా ప్రాచుర్యం పొందాయి. బ్లాక్ టీ, గ్రీన్ టీలో ఉన్న అద్భుతమైన ప్రయోజనాల గురించి మనకు తెలిసిందే..అయితే మీరు ఎప్పుడైనా వైట్ టీని ట్రై చేశారా? వైట్ టీ రుచి చూశారా? ఇతర టీల కంటే వైట్ టీ మరింత హెల్తీ డ్రింక్. గ్రీన్ టీ, బ్లాక్ టీ, వైట్ టీ మూడు ఒక మొక్కకు సంబంధించినవే అయినా, వాటిని పండించే ప్రదేశం, పండించే విధానంను బట్టి ఉంటుంది. వైట్ టీని' పండించడానికి కొద్దిగా ఎక్కువ సమయం తీసుకుంటుంది, కాబట్టి, వైట్ టీలో న్యూట్రీషియన్ విలువలు ఎక్కువగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్స్ కూడా హైలెవల్లో ఉంటాయి.

వైట్ టీని ఆకులు చిగురించగానే...ఆకులు చిన్నగా ఉన్నప్పుడే తొలచేసి, స్టీమ్ చేసి, డ్రైచేసి అమ్ముతుంటారు.. అందుకే ఇందులో బ్లాక్ టీ, గ్రీన్ టీలలో కంటే ఎక్కువ న్యూట్రీసియన్స్ ఉంటాయి. అందుకే వైట్ టీ' యొక్క ఖరీదు కూడా ఎక్కువే. వైట్ టీ' ఎక్కువగా ఎందుకు వాడుతారంటే? కాఫీ, టీలోని కెఫిన్ ఇతర పదార్థాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి కాబట్టి, వైట్ టీని ఎంపిక చేసుకుంటారు. వైట్ టీలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఇమ్యూన్ సిస్టమ్ ను స్ట్రాంగ్ గా మార్చుతుంది, ఏజింగ్ ప్రొసెస్ ను నివారిస్తుంది, క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడి, క్యాన్సర్ నుండి రక్షణ కల్పిస్తుంది. అంతే కాదండోయ్...''వైట్ టీ''బరువు తగ్గించడంలో గ్రేట్ డ్రింక్. వైట్ టీలో ఉండే గ్రేట్ రిమార్కబుల్ బెనిఫిట్స్ వల్ల బరువు తగ్గడం చాలా సులభం. బరువు తగ్గడానికి వైట్ టీ ఏవిధంగా సహాయపడుతుందో తెలుసుకుందాం...!!

కొత్తగా కొవ్వు కణాలు ఏర్పడకుండా నిరోధిస్తుంది:

కొత్తగా కొవ్వు కణాలు ఏర్పడకుండా నిరోధిస్తుంది:

రెగ్యులర్ గా వైట్ టీ తాగడం వల్ల శరీరంలో కొత్తగా కొవ్వు కణాలు(అడిపోసిస్ట్స్) ఏర్పడకుండా నిరోధిస్తుంది. కొత్తగా ఫ్యాట్ సెల్స్ ఏర్పడకుండా నిరోధించడం వల్ల బరువు పెరగకుండా క్రమంగా తగ్గుతారు.

ఫ్యాట్ కణాలను మొబలైజ్ చేస్తుంది:

ఫ్యాట్ కణాలను మొబలైజ్ చేస్తుంది:

కొత్త ఫ్యాట్ కణాల నుండి ఎక్సెస్ కొవ్వు ఏర్పడకుండా నివారిస్తుంది. దీన్నే‘‘ యాంటీఓబేసిటి ఎఫెక్ట్స్'' అని పరిశోధకలు పిలుస్తుంటారు.ఇది శరీరంలో ఫ్యాట్ కణాలు స్టోర్ కాకుండా చేస్తుంది.

కొవ్వు విచ్ఛిన్నం చేయడానికి ఉద్దీపన కలిగిస్తుంది:

కొవ్వు విచ్ఛిన్నం చేయడానికి ఉద్దీపన కలిగిస్తుంది:

వైట్ టీ కొవ్వును ఏర్పడకుండా , శరీరంలో నిల్వచేరకుండా చేయడం మాత్రమే కాదు, శరీరంలో ఆల్రెడీ ఉన్న కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేసి, బర్న్ చేయడానికి సహాయపడుతుంది. శరీరంలో ఉండే ఎక్సెస్ ఫ్యాట్ ఎఫెక్టివ్ గా బర్న్ చేయడం వల్ల ఎక్స్ ట్రా వెయిట్ ను సులభంగా తగ్గించుకోగలుగుతారు.

కెఫిన్ కంటెంట్:

కెఫిన్ కంటెంట్:

పైన తెలిపిన విధంగా వైట్ టీ కెఫిన్ ఎక్కువగా ఉండదు. తక్కువ మోతాదులో ఉన్న కెఫిన్ కూడా అది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

మెటబాలిజం రేటును క్రమబద్దం చేస్తుంది:

మెటబాలిజం రేటును క్రమబద్దం చేస్తుంది:

వైట్ టీ లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇది బాడీ మెటబాలిజం రేటును పెంచుతుంది. బాడీ మెటబాలిజం మెరుగుపడితే ,ఆటోమాటిక్ గా బరువు తగ్గుతారు.

డైటరీ ఫైబర్ గ్రహించడానికి నియంత్రిస్తుంది:

డైటరీ ఫైబర్ గ్రహించడానికి నియంత్రిస్తుంది:

వైట్ టీని రెగ్యులర్ గా తాగడం వల్ల శరీరంలో డైటరీ ఫ్యాట్ శోషణను నియంత్రిస్తుంది. వైట్ టీ తాగడం వల్ల శరీరంలో ఫ్యాట్ నిల్వకుండా చేయడం వల్ల పరోక్షంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

రుచికరంగా ఉంటుంది:

రుచికరంగా ఉంటుంది:

వైట్ టీ రుచి అద్భుతంగా, స్మూత్ గా ఉంటుంది. ఈ వైట్ టీకి పాలు, పంచదార, లేదా ఇతర క్రీమ్స్ జోడించకుండా తయారుచేస్తారు. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పాలు, పంచదార జోడించకపోవడం వల్ల అదనపు క్యాలరీలు శరీరానికి అందవు.

ఆకలి తగ్గిస్తుంది:

ఆకలి తగ్గిస్తుంది:

వైట్ టీని రెగ్యులర్ గా తాగడం వల్ల ఆకలి తగ్గుతుంది. వైట్ టీ తయారు చేసి, బాగా షేక్ చేసి తాగడం వల్ల బరువు కంట్రోల్లో ఉంటుంది.

వైట్ టీ తయారుచేయు విధానం:

వైట్ టీ తయారుచేయు విధానం:

కావలసినవి:

వైట్ టీ పొడి - 2 టీ స్పూన్లు (ఒక కప్పుకి);

పంచదార - తగినంత (ఇష్టం లేనివాళ్లు పంచదార లేకుండా కూడా తాగచ్చు)లేదా తేనె మిక్స్ చేసుకోవచ్చు.

తయారీ:

నీళ్లను బాగా మరిగించాలి

ఒక్కో కప్పులో 2 టీ స్పూన్ల టీ పొడి వేయాలి

వేడి నీళ్లు పోసి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉంచాక, మూత తీసి తాగాలి

(అవసరమనుకుంటే మధ్యలో ఒకసారి కలపాలి. అప్పుడు టీ ఆకులలోని సారం బాగా దిగుతుంది. మూత పెట్టి ఉండటం వలన వేడి కూడా తగ్గదు).

English summary

9 Effective Benefits Of White Tea For Weight Loss

Generally, white tea is used to enhance the effects of caffeine and other stimulants. Its anti-oxidant properties make our immune system strong, prevent aging, protects against cancers etc. But is white tea good for weight loss? Yes, the most remarkable benefit of this tea is that it aids weight loss.
Story first published: Thursday, October 27, 2016, 17:16 [IST]
Desktop Bottom Promotion