For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గడానికి ఇంతకంటే పవర్ ఫుల్ డ్రింక్ ఉండదంతే..!!

దాల్చిన చెక్క వాటర్, యాపిల్, నిమ్మ డ్రింక్.. మీ టాస్క్ ని చాలా తేలికగా మార్చేస్తుంది. మరి ఈ పవర్ ఫుల్ రెమెడీ ఎలా తయారు చేసుకోవాలి, ఎలా బెన్ఫిట్స్ పొందాలో చూద్దాం..

By Swathi
|

దాల్చిన చెక్క వాటర్ అనవసర ప్యాట్ కరిగించడానికి ఎక్సలెంట్ రెమిడీ. దీన్ని హెల్తీ డైట్ తో కలిపి తీసుకుంటే.. అద్భుత ప్రయోజనాలు పొందవచ్చు.

దాల్చిన చెక్క వాటర్, యాపిల్, నిమ్మ అన్నింటి మిశ్రమాన్ని కేవలం 20నిమిషాలలోపే తయారు చేసుకోవచ్చు. ఇది.. ఆరోగ్యాన్ని చాలా వేగంగా మెరుగుపరుస్తుంది. ఒకవేళ గతంలో ఎప్పుడూ మీరు ఇలాంటి డ్రింక్ ట్రై చేయకపోయి ఉంటే.. ఇవాళే దీన్ని ప్రయత్నించండి. అంతకు ముందు బెన్ఫిట్స్ తెలుసుకోండి.

Cinnamon Water with Apple and Lemon for Weight Loss

అందరికీ తెలిసిన విషయం ఏంటంటే.. ఈ న్యాచురల్ రెమిడీస్ మాత్రమే సరైన ఫలితాలను ఇవ్వలేవు. డెటాక్స్ డైట్స్.. ఈ మధ్య ఫ్యాషన్ గా మారినప్పటికీ.. అందులో ఉండే బెన్ఫిట్స్ ని గుర్తించాలి. సరైన విధంగా ప్రయత్నించాలి.

బరువు తగ్గాలనుకుంటున్నారా ? ఐతే బనానా డైట్ ఫాలో అవండిబరువు తగ్గాలనుకుంటున్నారా ? ఐతే బనానా డైట్ ఫాలో అవండి

ఈ న్యాచురల్ ట్రీట్మెంట్స్ ఫాలో అయ్యేటప్పుడు.. హెల్తీ లైఫ్ స్టైల్ కూడా ఫాలో అవ్వాలి. కాబట్టి.. ఈ డ్రింక్ తాగాలి అని నిర్ణయించుకున్న తర్వాత.. సరైన డైట్ ఫాలో అవ్వాలి. కొన్ని అలవాట్లకు దూరంగా ఉండాలి, కొన్ని అలవాట్లు అలవరుచుకోవాలి.

ఎక్సర్ సైజ్ చేస్తున్నా బెల్లీ ఫ్యాట్ తగ్గడం లేదా ? ఎందుకు ?ఎక్సర్ సైజ్ చేస్తున్నా బెల్లీ ఫ్యాట్ తగ్గడం లేదా ? ఎందుకు ?

అందరిలోనూ మెటబాలిజం ఒకే విధంగా ఉండదని గుర్తించండి. బరువు తగ్గడం అనేది కొంతమందికి చాలా తేలిక, కొంతమందికి చాలా కష్టమైన పని. అయితే.. దాల్చిన చెక్క వాటర్, యాపిల్, నిమ్మ డ్రింక్.. మీ టాస్క్ ని చాలా తేలికగా మార్చేస్తుంది. మరి ఈ పవర్ ఫుల్ రెమెడీ ఎలా తయారు చేసుకోవాలి, ఎలా బెన్ఫిట్స్ పొందాలో చూద్దాం..

బెన్ఫిట్స్

బెన్ఫిట్స్

కొన్ని దాల్చిన చెక్క స్టిక్స్, ఒక గ్రీన్ యాపిల్, ఒక నిమ్మకాయలోని రసంతో ఈ డ్రింక్ తయారు చేస్తాం. ఇందులో ఉపయోగించే ప్రతి పదార్థం ఆరోగ్యకరమైనది. వీటన్నింటినీ కలిపితే.. మరింత ఎక్కువ బెన్ఫిట్స్ పొందవచ్చు.

యాంటీ ఆక్సిడెంట్స్

యాంటీ ఆక్సిడెంట్స్

నిమ్మ, గ్రీన్ యాపిల్, దాల్చిన చెక్క ఫ్రీరాడికల్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఇందులో ఉండే పాలిఫెనాల్స్.. గుండె ఆరోగ్యానికి మంచిది.

బ్లడ్ షుగర్ లెవెల్స్

బ్లడ్ షుగర్ లెవెల్స్

ఈ డ్రింక్ శరీరానికి చాలా బెన్ఫిట్స్ అందిస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. దాల్చిన చెక్క అన్ని రకాల డయాబెటిస్ ని నివారిస్తుంది. అదనపు షుగర్స్ ని రెగ్యులేట్ చేస్తుంది. దాల్చిన చెక్కతోపాటు యాపిల్ కలిపి తీసుకోవడం వల్ల.. మరింత ఎక్కువ ఫలితాలు పొందవచ్చు.

ఫ్యాట్

ఫ్యాట్

ఈ డ్రింక్ మాత్రమే బరువు తగ్గడానికి సహాయపడదు. ఇది మెటబాలిజంను మెరుగుపరుస్తుంది. ఇది ఫ్యాట్ ని చాలా తేలికగా కరిగించుకోవాలంటే.. హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి.

జీర్ణక్రియ

జీర్ణక్రియ

ఈ డ్రింక్ తాగడం వల్ల శరీరాన్ని డెటాక్స్ చేస్తుంది. ఇందులో డ్యూరెటిక్ ఉండటం వల్ల.. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మీ గుండెను కాపాడుతుంది.

15నుంచి20 రోజులు

15నుంచి20 రోజులు

ఈ డ్రింక్ ని క్రమం తప్పకుండా.. 15 నుంచి 20 రోజులు తీసుకోవడం వల్ల.. బలమైన ఫలితాలు పొందవచ్చు. ఈ హెల్తీ డైట్ ఫాలో అయితే.. మెరుగైన ఫలితాలు చాలా త్వరగా చూడవచ్చు.

కావాల్సిన పదార్థాలు

కావాల్సిన పదార్థాలు

1 లీటరు నీళ్లు, 2 గ్రీన్ యాపిల్స్, 1 నుంచి 2 దాల్చిన చెక్కలు (10గ్రా), ఒక నిమ్మకాయ జ్యూస్ తీసుకోవాలి.

తయారు చేసేవిధానం

తయారు చేసేవిధానం

రెండు గ్రీన్ యాపిల్స్ తీసుకోవాలి. బాగా శుభ్రం చేసి.. కట్ చేసుసుకుని పక్కన పెట్టుకోవాలి. నిమ్మరసం తీసి.. లీటరు నీటిలో కలపాలి. ఇప్పుడు యాపిల్ ముక్కలు, దాల్చిన చెక్క కలపాలి. ఈ డ్రింక్ ని రెండు గంటలు ఫ్రిడ్జ్ లో పెట్టాలి. కావాలనుకుంటే రాత్రంతా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. తర్వాత రోజు ఉదయం నుంచి.. ఈ డ్రింక్ ప్రతిసారి ఆహారం తీసుకోవడానికి ముందు తాగాలి. అంతే..

English summary

Cinnamon Water with Apple and Lemon for Weight Loss

Cinnamon Water with Apple and Lemon for Weight Loss. Amazing Health Benefits of Cinnamon water with apple and lemon. To know more read this.
Story first published: Friday, October 28, 2016, 14:29 [IST]
Desktop Bottom Promotion