For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బెల్లీ ఫ్యాట్ ను కరిగించే హెల్తీ అండ్ పవర్ ఫుల్ డ్రింక్స్..!!

|

బెల్లీ ఫ్యాట్ చాలా మెండి ఫ్యాట్ మరియు దీన్నితగ్గించుకోవడం అంత సులభం కాదు . ఈ బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి డైట్ ఫాలో అయ్యే ఓపిక, మరియు వ్యాయామం చేసే లక్షణాలు మీలో లేనట్లైతే , కొన్ని సింపుల్ రెమెడీస్ ఉన్నాయి. పొట్టఉదరంలో ఉండే ఫ్యాట్ కరిగించుకోవడం చాలా కష్టం, అంత సులభంగా కరగదు మరియు పొట్ట ఉదరంలో ఉండే ఫ్యాట్ కరిగించుకోవడానికి చాలా ఎఫోర్ట్ పెట్టాల్సి వస్తుంది. అయితే ఒక మంచి ఉపాయం ఉంది, బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడానికి కొన్ని రకాల జ్యూసులున్నాయి. ఈ జ్యూసులతో బెల్లీ ఫ్యాట్ ను త్వరగా కరిగించుకోవడానికి అవకాశం ఉన్నది.బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడానికి, బెల్లీఫ్యాట్ కరిగించే జ్యూసులు త్రాగడంతో పాటు, మంచి ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ను కూడా మెయింటైన్ చేస్తే మరింత మంచిది . రెగ్యులర్ డైట్ నుండి ఆయిల్ మరియు జంక్ ఫుడ్స్ ను నివారించాలి. ఫైబర్ అధికంగా ఉండే ఓట్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ వంటివి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

వీటితో పాటు, ఒక గంట పాటు బ్రిస్క్ వాక్ , శారీరక వ్యాయామాలు చేయడం వల్ల క్యాలరీలు అధికంగా కరిగించుకోవచ్చు . ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడానికి ఇలాంటివి ఒక మంచి మార్గం. బెల్లీ ఫ్యాట్ డయాబెటిస్, హైబ్లడ్ ప్రెజర్ వంటి అనేక వ్యాధులకు కారణం అవుతుంది.

బెల్లీ మెల్టింగ్ డ్రింక్స్ ను మీకోసం కొన్నింటిని పరిచయం చేస్తున్నాము. వీటిని ప్రతి రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడానికి 1గంట ముందు తీసుకోవడం ద్వారా మీ బెల్లీ ఇట్టే కరిగిపోతుంది.

నీళ్ళు:

నీళ్ళు:

నీళ్ళు తాగడం వల్ల జీవక్రియలు ఉత్తేజమవుతాయి. శరీరం తేమగా ఉంటుంది. బాడీ ఫంక్షన్స్ చురుకుగా పనిచేస్తాయి. తరచూ నీళ్ళు తాగుతుంటే ఆకలి కంట్రోల్లో ఉంటుంది.

పెప్పర్ మింట్ టీ:

పెప్పర్ మింట్ టీ:

పెప్పర్ మింట్ టీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపుబ్బరం తగ్గిస్తుంది. ఫ్యాట్ బర్నింగ్ ప్రొసెస్ ను క్రమబద్దం చేస్తుంది. అంతే కాదు టేస్ట్ గా కూడా ఉంటుంది.

గ్రీన్ టీ :

గ్రీన్ టీ :

గ్రీన్ టీలో ఉండే క్యాటచిన్స్ కొవ్వు కరిగించడంలో చాలా వేగంగా పనిచేస్తుంది. రోజుకు ఒక్క సారి గ్రీన్ టీ తీసుకోవడం వల్ల వివిధ రకాలుగా సహాయపడుతుంది.

వాటర్ మెలోన్ స్మూతీ:

వాటర్ మెలోన్ స్మూతీ:

వాటర్ మెలోన్ స్మూతీ లో అనేక ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా ఇది శరీరానికి తగినంత హైడ్రేషన్ ను అందిస్తుంది. అంతే కాదు బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. షుగర్ జోడించకుండా వాటర్ మెలోన్ స్మూతీని ఎంజాయ్ చేయండి.

లెమన్ జ్యూస్ :

లెమన్ జ్యూస్ :

రోజూ రెగ్యులర్ గా ఒక కప్పు లెమన్ వాటర్ తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుంది. ఇందులో కొద్దిగా తేనె మిక్స్ చేస్తే ఫలితం మరింత ఎఫెక్టివ్ గా ఉంటుంది.

పైనాపిల్ జ్యూస్ :

పైనాపిల్ జ్యూస్ :

పైనాపిల్ జ్యూస్ లో ఎంజైమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు ఫ్యాట్ ను త్వరగా కరిగిస్తుంది.

డార్క్ చాక్లెట్ షేక్:

డార్క్ చాక్లెట్ షేక్:

డార్క్ చాక్లెట్ షేక్ ను పరిమితంగా తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు ఆకలిని తగ్గిస్తుంది. అయితే దీనికి పూర్తిగా అడిక్ట్ అవ్వకండి.

English summary

Drinks That Cut Belly Fat

Drinks That Cut Belly Fat,Getting rid of belly fat is really tough. But sometimes, you can speed up the process by working out and eating right. Some foods help burn fat fast.
Story first published: Friday, August 19, 2016, 17:49 [IST]
Desktop Bottom Promotion