For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒకే ఒక్క నెల‌లో బెల్లీ ఫ్యాట్ క‌రిగించే.. సింపుల్ అండ్ ఈజీ టిప్స్

By Swathi
|

బెల్లీ ఫ్యాట్ ని ఫ్లాట్ గా మార్చుకోవాల‌ని ర‌కర‌కాలుగా ప్ర‌య‌త్నించి వి\సిగిపోయారా ? ఎక్స‌ర్ సైజ్ చేసినా, డైట్ ఫాలో అయినా ఫ‌లితం లేక డీలాప‌డిపోతున్నారా ? అయితే ఒక నెల‌లో వ్యాయామం లేకుండానే బ‌రువు త‌గ్గే సింపుల్ అండ్ ఈజీ టిప్స్ మీ చేతుల్లో ఉన్నాయి. వెంట‌నే ఈ టిప్స్ ఫాలో అయిపోండి..

బెల్లీ ఫ్యాట్ ఉంటే ఎలాంటి డ్రెస్ వేసుకున్నా.. అది హైలైట్ అయి.. న‌లుగురిలో అస‌హ్యంగా క‌నిపిస్తుంది. కొంత‌మందిలో ఇది ఆత్మ గౌర‌వాన్ని కోల్పేయేలా చేస్తుంది. అలాంట‌ప్పుడే ర‌క‌ర‌కాలుగా బెల్లీ ఫ్యాట్ క‌రిగించే ప్ర‌యత్నం చేస్తుంటారు. చాలా సంద‌ర్భాల్లో అధిక బ‌రువు ఉన్నా.. పొట్ట మ‌రీ పెద్ద‌గా ఉంటే.. అది మొత్తం ఆక‌ర్ష‌ణ‌పైనే ప్ర‌భావం చూపుతుంది. అధిక బ‌రువు ఉన్న అమ్మాయిల్లో అయినా, అబ్బాయిల్లో అయినా.. ఫ్యాట్ ఎక్కువ‌గా బెల్లీలో ఫ్యాట్ చేరుకుంటుంది.

ప్రెగ్న‌న్సీ త‌ర్వాత బ‌రువు పెర‌గ‌డం, హార్మోన‌ల్ డిజార్డ‌ర్స్, డెస్క్ బాండ్ జాబ్స్, త‌ర‌చుగా అజీర్ణం, అన్ హెల్తీ డైట్, ఎక్కువ‌గా ఆల్క‌హాల్ తాగ‌డం వంటి కార‌ణాల వల్ల బెల్లీ ఫ్యాట్ చేరుకుంటుంది. బిగ్ బెల్లీ ఫ్యాట్ కి కార‌ణ‌మేదైనా.. దీనివ‌ల్ల అనేక ర‌కాల ఆరోగ్య స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. కొలెస్ట్రాల్, హైప‌ర్ టెన్ష‌న్, బ్యాక్ పెయిన్, మోకాళ్ల నొప్పి, గుండె సంబంధిత వ్యాధుల రిస్క్ ఉంటుంది.

ఒక‌వేళ బెల్లీ ఫ్యాట్ తో బాధ‌ప‌డేవాళ్లు.. వ్యాయామం చేసే స‌మ‌యం లేక‌పోతే.. కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అవ‌డం వ‌ల్ల బెల్లీ ఫ్యాట్ ని ఎఫెక్టివ్ గా నివారించ‌వ‌చ్చు.

ఉప్పు త‌గ్గించ‌డం

ఉప్పు త‌గ్గించ‌డం

మీ డైట్ లో సాల్ట్ తీసుకోవ‌డాన్ని త‌గ్గించాలి. సాల్ట్ తీసుకోవ‌డం త‌గ్గించ‌డం వ‌ల్ల‌.. పొట్ట భాగంలో ఎక్కువ ఫ్లూయిడ్స్ చేరుకుని.. బెల్లీ పెద్ద‌గా క‌నిపిస్తుంది.

చూయింగ్ గ‌మ్ కి దూరంగా

చూయింగ్ గ‌మ్ కి దూరంగా

రెగ్యుల‌ర్ గా చూయింగ్ గ‌మ్ తీసుకునే అల‌వాటు ఉంటే.. ఎక్కువ గాలి చేరుతాయి. అలాగే చూయింగ్ గ‌మ్ లో ఉప‌యోగించే స్వీట‌న‌ర్స్ బెల్లీ ఫ్యాట్ కి కార‌ణ‌మ‌వుతాయి.

ఎక్కువ ప్రొబ‌యోటిక్స్ తీసుకోవాలి

ఎక్కువ ప్రొబ‌యోటిక్స్ తీసుకోవాలి

ఎక్కువ పెరుగు, స్వీటెన్ ఉండే యోగ‌ర్ట్ వంటి వాటిల్లో ప్రొబ‌యోటిక్ కంటెంట్ ఎక్కువ‌గా ఉంటుంది. వీటిని ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల‌.. జీర్ణ‌క్రియ మెరుగై.. బెల్లీ ఫ్యాట్ క‌రిగిస్తాయి.

బీర్ తాగ‌కూడ‌దు

బీర్ తాగ‌కూడ‌దు

చాలా ర‌కాల ఆల్క‌హాల్స్ బ‌రువు పెర‌గ‌డానికి కార‌ణ‌మ‌వుతాయి. కాబ‌ట్టి మ‌రీ ఎక్కువ‌గా వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల పొట్ట‌కు మంచిది కాదు. వీటిల్లో ఉండే క్యాల‌రీలు, స్టార్చ్ కంటెంట్ ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల‌.. బెల్లీ ఫ్యాట్ కి కార‌ణ‌మ‌వుతుంది.

కొన్నిర‌కాల వెజిట‌బుల్స్ కి దూరం

కొన్నిర‌కాల వెజిట‌బుల్స్ కి దూరం

బ్రొకోలి, క్యాబేజ్, పొటాటో, క్యాలి ఫ్ల‌వ‌ర్ వంటి వెజిట‌బుల్స్ బెల్లీలో గ్యాస్ ఏర్ప‌డ‌టానికి కార‌ణ‌మ‌వుతుంది. దీనివ‌ల్ల బ్లోటింగ్ స‌మ‌స్య ఏర్ప‌డి.. బెల్లీ ఫ్యాట్ కి కార‌ణ‌మ‌వుతుంది.

ఫ్రూట్స్ తీసుకోవ‌డం

ఫ్రూట్స్ తీసుకోవ‌డం

ఎక్కువ‌గా ఫ్రూట్స్ తీసుకోవాలి. క‌నీసం రోజుకి 1 నుంచి 2 క‌ప్పులు విట‌మిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఫ్రూట్స్ తీసుకోవాలి. దీనివ‌ల్ల ఎఫెక్టివ్ గా బెల్లీ ఫ్యాట్ క‌రిగిపోతుంది.

స్మోకింగ్ మానేయ‌డం

స్మోకింగ్ మానేయ‌డం

స్మోకింగ్ ఎక్కువ‌గా చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అలాగే ఎక్కువ‌గా ట‌మ్మీ ఫ్యాట్ పెర‌గ‌డానికి కార‌ణ‌మ‌వుతుంది. కాబ‌ట్టి.. ఫ్లాట్ బెల్లీ కావాలంటే.. వెంట‌నే స్మోకింగ్ మానేయాలి.

English summary

Easy Tips To Lose Belly Fat In A Month, Without Any Exercise!

Easy Tips To Lose Belly Fat In A Month, Without Any Exercise! Do you think twice before you wear a figure-hugging dress or a fitted shirt? Is the reason behind your hesitation your big tummy?
Story first published:Friday, July 15, 2016, 13:58 [IST]
Desktop Bottom Promotion