For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గించే ఈ ఆహారాలను తక్కువగా అంచనా వేయకండి...

|

సాధారణంగా బరువు తగ్గించుకోవడానికి, డైటింగ్, వ్యాయామం, వాటర్ డైట్, ఫ్రూట్ డైట్ ఇలా ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటాము. కానీ, మన బరువును వేగంగా తగ్గించే కొన్ని ఆహారాలను చాలా సార్లు మిస్ చేస్తుంటాము . ఈ ఆహారాల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి మరియు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వెయిట్ లాస్ ఫుడ్స్ పొట్ట నిండుగా ఉన్న ఫీలింగ్ ను కలిగిస్తుంది. మరియు అనారోగ్యకరమైన జంక్ ఫుడ్స్ జోలికెళ్లకుండా చేస్తుంది .

బరువు తగ్గాలనుకుంటున్నారా ? ఐతే బనానా డైట్ ఫాలో అవండి

ఈ ఆహారాలు మెటబాలిజం రేటును పెంచుతాయి మరియు వేగంగా క్యాలరీలను తగ్గిస్తాయి. దాంతో మన శరీరంలో ఫ్యాట్ నిల్వ ఉండదు. అలాంటి వండర్ ఫుల్ , వెయిట్ లాస్ ఫుడ్స్ చాలా చౌకగా మరియు ఈజీగా అందుబాటులో ఉన్నాయి . వీటి గురించి తెలుసుకొని, వెంటనే ఈ ఆహారాలను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

పెళ్లి తర్వాత బరువు తగ్గించి..బొజ్జ కరిగించే సూపర్ ఫుడ్స్

ఈ ఆహారాలు బరువు తగ్గించడం మాత్రమే కాదు, ఈ ఆహారాల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో విటమిన్స్ మరియు మినిరల్స్ ను ఎక్కువగా అందిస్తాయి . ఇవి మనస్సును ప్రశాంతపరుస్తాయి. శరీరాన్ని హెల్తీగా మరియు ఎనర్జిటిక్ గా ఉంచుతాయి. ఈ ఆహారాలు రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ద్వారా మీ చర్మం మరింత ప్రకాశవంతంగా మరియు జుట్టు స్ట్రాంగ్ అండ్ ప్రకాశవంతంగా మార్చుతాయి . మరి అలాంటి ఆహారాలేంటో చూద్దాం...

బేరిపండ్లు:

బేరిపండ్లు:

బరువు తగ్గించుకోవడానికి బేరిపండ్లు? ఇందులో 6గ్రాముల సోలబుల్ ఫైబర్ ఉండటం వల్ల ఇది కొలెస్ట్రాల్ వెల్స్ తగ్గిస్తుంది మరియు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బేరిపండ్లలో 100క్యాలరీలుంటాయి. ఇంత శాతం క్యాలరీలు మరే పండ్లలోనూ ఉండవు.

బ్రౌసెల్ స్ప్రాట్స్ :

బ్రౌసెల్ స్ప్రాట్స్ :

వీటిలో ప్రోటీన్స్ అధికంగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి . ఫైడర్ అధికంగా ఉంటుంది. ఒక సర్వింగ్ కు 65శాతం మాత్రమే క్యాలరీలుంటాయి. అదేవిధంగా బరువు తగ్గించుకోవడానికి ఎక్కువగా ఆలోచించాల్సిన ఆహారం ఇది.

లోఫ్యాట్ పెరుగు:

లోఫ్యాట్ పెరుగు:

లోఫ్యాట్ పెరుగు మరియు పాలు బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి మరియు కానీ ఈ ఆహారాలను మనం సాధారణంగా నిర్లక్ష్యం చేస్తుంటాము . పెరుగులో ఉండే బ్యాక్టీరియలో త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతాయి . పెరుగులో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. మెటబాలిజం రేటు పెంచుతాయి మరియు క్యాలరీలను వేగంగా బర్న్ చేస్తాయి.

బ్రౌన్ రైస్ మరియు త్రుణ ధాన్యాలు:

బ్రౌన్ రైస్ మరియు త్రుణ ధాన్యాలు:

బ్రౌన్ రైస్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కార్బోహైడ్రేట్స్ తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. త్రుణధాన్యాలలో ఉండే ఫైబర్ పొట్టను ఫుల్ గా నింపుతుంది. కానీ ఎక్కువగా తినడకుండా మితంగా తీసుకోవాలి. అప్పుడే బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది.

గుమ్మడి:

గుమ్మడి:

క్యాలరీలు తక్కువ మరియు న్యూట్రీషియన్ అధికంగా ఉంటాయి. గుమ్మడిలో ఫైబర్ అధికంగా ఉంటుంది . పొట్టనింపుతుంది . బీటాకెరోటిన్ అధికంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

ఆపిల్స్ :

ఆపిల్స్ :

బరువు తగ్గడానికి ఆఫిల్స్ ఒక బెస్ట్ ఫుడ్. మీరు ఫుల్ గా ఫీలవ్వడమే కాకుండా ఆకలి కానివ్వదు . అంతే కాదు ఆపిల్ మెటబాలిజం రేటు పెంచుతుంది మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది . ఇందులో ఉండే ఫైబర్ మరియు విటమిన్స్ బరువు తగ్గడానికి సహాయపడుతాయి.

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క

వంటలకు సువాసన అందివ్వడం మాత్రమే కాదు ఇది బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. దాల్చిన చెక్కపౌడర్ ను టీలో లేదా తేనె కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీన్ని రెగ్యులర్ గా తీసుకుంటే బరువు తగ్గుతారు.

English summary

Foods For Weight Loss That Are Overlooked

We usually go from a pillar to post to lose weight, but many a times ignore some wonderful foods that help us in losing weight fast. These foods are low in calories, and rich in fibres. These weight loss foods keep our tummy full, hence making us crave less for unhealthy foods.
Desktop Bottom Promotion