For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ రెగ్యులర్ డైట్ లో ఖచ్చితంగా ఉండాల్సిన హెల్తీ ప్రోటీన్ ఫుడ్స్..!

|

మీ రెగ్యులర్ డైట్ లో ఖచ్చితంగా ఉండాల్సిన హెల్తీ ప్రోటీన్ ఫుడ్స్..!
మీ రెగ్యులర్ డైట్ లో ఈ హెల్తీ ప్రోటీన్ ఫుడ్స్ ఉన్నాయా...? చెక్ చేసుకోండి...!

శరీరానికి ప్రొటీన్స్ చాలా కీలకం. ప్రొటీన్స్ ఉండే ఎమినో యాసిడ్స్ శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. ప్రొటీన్స్ ముఖ్యమైన మెటబాలిక్ ఫంక్షన్స్ ని కంట్రోల్ చేస్తాయి. ప్రతి ఒక్కరూ హెల్తీగా ఉండాలంటే.. ప్రొటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవడం చాలా అవసరం. కండరాలు, ఎముకలు, టిష్యూస్ పెరుగుదల, డెవలప్ మెంట్ కి.. ప్రొటీన్స్ చాలా అవసరం.

ఇమ్యునిటీ తగ్గినప్పుడు ఇన్ఫెక్షన్స్ తో పోరాడటానికి ప్రొటీన్స్ సహాయపడతాయి. అలాగే జీర్ణశక్తి, మెటబాలిజం, సర్క్యులేషన్ సజావుగా సాగడానికి కావాల్సిన శక్తిని ప్రొటీన్స్ అందిస్తాయి. శరీరానికి ఎంజైమ్స్, హార్మోన్స్, ఇతర శరీర కెమికల్స్ ఉత్పత్తి చేయడానికి మైక్రోన్యూట్రియంట్స్ చాలా అవసరమవుతాయి. శరీరంలో ప్రొటీన్స్ తగ్గిపోతే.. కండరాల టీష్యూస్ తగ్గుతాయి, హార్ట్ వీక్ గా అవుతుంది, ఇమ్యునిటీ బలహీనమవుతుంది. చాలా అరుదుగా.. మరణానికి కూడా కారణమవుతాయి.

మరి శరీరానికి ఎంతో అవసరమైన ప్రొటీన్ రిచ్ ఫుడ్ ని ఖచ్చితంగా డైట్ లో చేర్చుకోవాల్సిందే కదూ. మరి హెల్తీగా ఉండటానికి సహాయపడే ప్రొటీన్ రిచ్ ఫుడ్స్ ఏంటో మీరేచూడండి..

గుడ్డు:

గుడ్డు:

శాస్త్రీయ పరిశోధనల ప్రకారం, రెగ్యులర్ డైట్ లో ఒక గుడ్డు చేర్చుకుంటే 6 గ్రాముల ప్రోటీన్ పొందుతారని సూచిస్తున్నారు. గుడ్డులో అమినోయాసిడ్స్, గ్లూటమిక్ యాసిడ్స్, బ్రాంచ్ చెయిన్ అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి, వ్యాయామం తర్వాత ఇది మజిల్స్ రికవర్ అవ్వడానికి సహాయపడుతుంది.

బీన్స్:

బీన్స్:

బీన్స్ వెజిటేరియన్ ప్రోటీన్ ఫుడ్. దీన్ని ప్రతి రోజూ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. రెగ్యులర్ డైట్ లో బ్లాక్ బీన్స్, సోయా బీన్స్, కిడ్నీ బీన్స్, ఏరకమైన బీన్స్ అయినా ఎంపిక చేసుకోవచ్చు. ఒక కప్పు బీన్స్ తో 15 నుండి 25 గ్రాముల ప్రోటీన్స్ ను పొందుతారు.

ధాన్యాలు:

ధాన్యాలు:

పప్పు ధాన్యాలలో వివిధ రకాలున్నాయి. అయితే ప్రతి ఒక్కపప్పు దాన్యం బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . సర్వ్ చేసే ఒక కప్పు దాల్లో 4-9గ్రాలముల ప్రోటీనులు ఉంటాయి. కాబట్టి, వీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు. వెజిటేరియన్ డైట్ లో త్రుణధాన్యాలను తప్పనిసరిగా చేర్చుకోవచ్చు . మీ రెగ్యులర్ డైట్ లో ప్రోటీన్ ఫుడ్స్ ను ఎంపిక చేసుకోవాలంటే, లెంటిల్ బెస్ట్ .

పెరుగు:

పెరుగు:

లోక్యాలరీ డైట్ ఫుడ్ ఇది. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ప్రోటీన్స్ అధికంగా ఉన్నాయి . ఒక కప్పు పెరుగులో 20 గ్రాముల ప్రోటీన్స్ ఉన్నాయి. ప్లెయిన్ పెరుగులో కూడా అంతే మొత్తంలో ఉన్నాయి.

పీనట్ బట్టర్:

పీనట్ బట్టర్:

హెల్తీ ప్రోటీన్ ఫుడ్స్ లో పీనట్ బట్టర్ ఒకటిగా సూచిస్తారు. దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది, ప్రోటీన్ సప్లిమెంట్ కంటే ఇటువంటి హెల్తీ ఫుడ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిది.

చికెన్:

చికెన్:

లీన్ ప్రోటీన్ ఫుడ్స్ లో చికెన్ ఒకటి. ఇందులో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. చికెన్ బ్రెస్ట్ లో 26గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. . ప్రతి రోజూ దీన్ని పరిమితంగా తీసుకోవడం మంచిది. హెల్తీ ప్రోటీన్ పొందడానికి ఫర్ఫెక్ట్ ఫుడ్ ఇది .

నట్స్ :

నట్స్ :

నట్స్ బాదాం, పిస్తా, ఆక్రోట్ వంటి నట్స్ ని రెగ్యులర్ గా తీసుకోవాలి. అయితే లిమిట్ గా తీసుకోవడం మంచిది. వీటిని సలాడ్లు, ఉడికించిన కూరగాయలతో కలిపి తీసుకుంటే.. టేస్ట్ తో పాటు, కావాల్సిన ప్రొటీన్స్ అందుతాయి.

English summary

Healthy Protein Foods To Have Everyday..!

When it comes to protein foods, the easiest options are eggs, chicken, fish, etc. Milk is a super food which contains all vitamins and minerals and obviously, protein. People who need an intake of protein supplement after workout, can simply have a glass of milk. Proteins are made up of amino acids which are needed by the human body.
Story first published: Monday, August 29, 2016, 18:05 [IST]
Desktop Bottom Promotion