For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గాలనుకునేవాళ్లు నెయ్యి ఖచ్చితంగా తినాలి.. ! ఎందుకు ?

By Swathi
|

నెయ్యి అంటే అందరికీ ఇష్టమే. కమ్మని సువాసన, ఆహారంలో మధురమైన రుచి అందిస్తుంది నెయ్యి. సాధారణంగా స్వీట్స్ లో ఎక్కువగా నెయ్యి ఉపయోగిస్తారు. అలాగే.. పాయసం, పప్పు, పచ్చళ్లతో అన్నం తినేటప్పుడు నెయ్యి రుచి కమ్మదనాన్ని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అయితే బరువు తగ్గాలనుకునేవాళ్లు నెయ్యికి దూరంగా ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ ?

ఆవు నెయ్యితో అమోఘమైన ఆరోగ్య ప్రయోజనాలు

నెయ్యి అంటే చాలా ఫ్యాట్ ఉంటుందని.. ఇది బరువు పెరగడానికి కారణమవుతుందని చాలామంది భావిస్తారు. కానీ.. అది వాస్తవం కాదు. బరువు తగ్గాలనుకునేవాళ్లు ఖచ్చితంగా డైట్ లో నెయ్యి చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో ఉన్నవాళ్లు డైట్ లో నెయ్యి చేర్చుకుంటే.. మీ టార్గెట్ మరింత తేలికగా రీచ్ అవుతారని సూచిస్తున్నారు. అయితే దేశీ గీ తీసుకుంటే.. ఎక్కువ ఫలితాలు పొందుతారట. మరి బరువు తగ్గాలనుకునేవాళ్లు నెయ్యి ఎందుకు తినాలో తెలుసుకుందామా..

దేశీ ఘీ

దేశీ ఘీ

బరువు తగ్గాలనుకునేవాళ్లు తమ డైట్ లో దేశీ ఘీనే ఉపయోగించాలి. ఎందుకంటే ఇలాంటి నెయ్యిలో శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. సాధారణంగా ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి హెల్తీ కాదని భావిస్తారు. కానీ.. మోతాదుకి మించి నెయ్యి తీసుకుంటే అనారోగ్యమే. కాబట్టి ఆ విషయంలో కేర్ తీసుకోవాలి.

ఎంత మోతాదు

ఎంత మోతాదు

నిపుణుల ప్రకారం రోజుకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకోవచ్చు. అది దాదాపు 15 గ్రాములు ఉంటుంది. ఇంత మోతాదులో తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదు.

శ్యాచురేటెడ్ ఫ్యాట్స్

శ్యాచురేటెడ్ ఫ్యాట్స్

శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్ పెంచుతాయని భావిస్తారు. కానీ దీనిపై ఎలాంటి ఎవిడెన్స్ లేదు. అలాగే శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ కి, హార్ట్ డిసీజ్ లకు ఎలాంటి లింక్ లేదని చెబుతున్నాయి.

విటమిన్స్

విటమిన్స్

నెయ్యిలో విటమిన్ ఏ, డి, ఈ, కె ఉంటాయి. ఇవి కొవ్వులో కరిగే అంటే ఫ్యాట్ సొల్యుబుల్ విటమిన్స్. కాబట్టి ఇవి ఇమ్యున్ సిస్టమ్ కి మంచిది. విటమిన్ ఏ, ఈలో యాంటీ ఆక్సిడెంట్స్, డి ఎముకల ఆరోగ్యానికి, బలానికి, కండరాల నొప్పులు, వాపు నివారించడానికి ఉపయోగపడతాయి. విటమిన్ కె బ్లడ్ క్లాటింగ్ కి సహాయపడుతుంది. చిన్న గాయమైనా ఎక్కువ రక్తస్రావం అయిందంటే.. విటమిన్ కె డెఫిసియన్సీగా గుర్తించాలి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవాళ్ల డైట్ లో నెయ్యి చేర్చుకోవడం చాలా అవసరం.

బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్

బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్

శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెంచుతాయని చాలా కాలం నుంచి నమ్ముతూ వస్తున్నారు. అయితే తాజా అధ్యయనాలు మాత్రం.. దీనికి వ్యతిరేకంగా వెల్లడించాయి. ఎక్కువ మొత్తంలో శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకుంటే.. బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుందని చెబుతున్నారు. ఇవి మాత్ర హార్ట్ డిసీజ్ పెంచే రిస్క్ ఉంటుంది.

ఇమ్యునిటీ

ఇమ్యునిటీ

రోజు ఒక్క స్పూన్ అయినా.. నెయ్యి తీసుకోవాలని మన పెద్దవాళ్లు చెప్పేవాళ్లు. ఎందుకంటే.. నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఇమ్యునిటీ పవర్ పెంచుతాయి. సీజనల్ ఎలర్జీలను నివారిస్తాయి. రెగ్యులర్ గా నెయ్యి తీసుకుంటే.. ఏకాగ్రత కూడా పెరుగుతుంది.

సెమన్ క్వాలిటీ

సెమన్ క్వాలిటీ

డైట్ లో ప్రొటీన్స్, ఫ్యాట్స్ బ్యాలెన్డ్స్ గా ఉండాలి. హెల్తీ శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ కి అద్భుతమైన, ఆరోగ్యకరమైన హోంమేడ్ ఫుడ్. దీన్ని డైట్ లో చేర్చుకోవడం వల్ల వీర్యం క్వాలిటీ డెవలప్ అవుతుంది.

జీర్ణశక్తి

జీర్ణశక్తి

చాలా రకాల ఆయిల్స్ శరీరంలో డైజెస్టివ్ ప్రాసెస్ ని స్లో చేస్తాయి. కానీ.. నెయ్యిలో ఉండే ఫ్యాట్స్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. అలాగే డైజెషన్ సజావుగా జరగడానికి, న్యూట్రీషన్ అందడానికి సహాయపడతాయి.

సూచన

సూచన

అయితే గుండె సంబంధిత వ్యాధులు, ఒబేసిటీతో బాధపడేవాళ్లు.. నెయ్యికి దూరంగా ఉండటం మంచిది. వ్యాయామం, సరైన ఆహారపు అలవాట్లు, సరైన మోతాదులో నెయ్యి తీసుకుంటే.. బరువు తగ్గాలనే లక్ష్యాన్ని నెరవేర్చుకుంటారు.

Story first published:Thursday, May 19, 2016, 15:41 [IST]
Desktop Bottom Promotion