For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉల్లిపాయలను ఉపయోగించి శరీర బరువును తగ్గించగల 5 ఉత్తమమైన మార్గాలు

శరీర బరువు యొక్క నష్టాన్ని ప్రోత్సహించడంలో ఉల్లిపాయలు అత్యంత ప్రభావవంతమైనవి. ఇందులో "క్వెర్సిటిన్" చాలా పుష్కలంగా ఉంటుంది, మరియు శరీరంలో కొవ్వు వృద్ధిని నిరోధిస్తుంది మరియు జీవక్రియను పెంచే ఒక ఫ్లేవాన

|

శరీర బరువు యొక్క నష్టాన్ని ప్రోత్సహించడంలో ఉల్లిపాయలు అత్యంత ప్రభావవంతమైనవి. ఇందులో "క్వెర్సిటిన్" చాలా పుష్కలంగా ఉంటుంది, మరియు శరీరంలో కొవ్వు వృద్ధిని నిరోధిస్తుంది మరియు జీవక్రియను పెంచే ఒక ఫ్లేవానోయిడ్ ఇందులో ఉంది.

అందువల్ల, బరువు కోల్పోవడం గురించి మీరు గనుక తీవ్రమైన ఆలోచనలు కలిగి ఉంటే, మీ రోజువారీ ఆహారంలో ఉల్లిపాయను వినియోగించండి, కానీ ఇది మీ బరువును తగ్గించడానికి ఎలా ఉపయోగించాలో కూడా మీరు తెలుసుకోవాలి.

ఈ వ్యాసంలో, మీరు బరువు తగ్గించుకోవడానికి 3 మార్గాల ద్వారా ఉల్లిపాయలను ఉపయోగించటం వల్ల కలిగే ప్రయోజనాలను, మరియు ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే ప్రభావాలను ఎలా అధిగమించాలో కూడా తెలుసుకుందాం. ప్రారంభిద్దామా మరి.

ఉల్లిపాయలతో 3 ఉత్తమమైన మార్గాల ద్వారా మీ శరీర బరువును తగ్గించుకోవచ్చు.

1. ఉల్లిపాయ రసం :

1. ఉల్లిపాయ రసం :

శరీర బరువును తగ్గించుకోడానికి ఉల్లిపాయ రసమును త్రాగటం ఉత్తమమైన మార్గం. ఉల్లిపాయను ఫ్రై చెయ్యటం వల్ల అందులో దాగివున్న పోషక విలువలను నాశనం కాగలవు, అందుకే ఉల్లిపాయ వల్ల కలిగే పూర్తి ఆరోగ్య ప్రయోజనాలను పొందడం కోసం, ఉల్లిపాయ రసాన్ని త్రాగాలి. ఇక్కడ శరీర బరువును తగ్గించుకోడానికి ఉల్లిపాయ రసమును ఎలా తయారుచేసుకోవాలో ఈ దిగువన చూపించబడినది.

కావలసిన పదార్థాలు :

1 గుండ్రని తెలుపు ఉల్లిపాయ (తాజాది)

3 కప్పుల నీరు

తయారీ విధానం :

ఉల్లిపాయ యొక్క తొక్కను తీసివేసి, దాన్ని ముక్కలు చేయండి.

ఒక కప్పుకు నీరును పాన్ లో పోసి, బాగా మరిగించాలి.

4 నిముషాల తరువాత, మంట నుండి దానిని దించి, బ్లెండర్కు బదిలీ చేశాక, దానిని బాగా మిక్స్ చేసి, దానికి మరో రెండు కప్పుల నీటిని కలపాలి.

ఇలా తయారయిన ఉల్లి రసాన్ని ఒక గాజులోకి పోయాలి మరియు అది త్రాగడానికి చాలా మంచిది.

2. ఉల్లిపాయ సూప్ :

2. ఉల్లిపాయ సూప్ :

శరీర బరువును తగ్గించే విషయంలో మీకు సహాయపడేదిగా, సూప్ చాలా అద్భుతమైన లక్షణాలను కలిగి ఉంది. అందులో ఉన్న పోషకాలు మీ శరీరంలోకి పూర్తిగా నింపబడతాయి. దీనిని మీరు మధ్యాహ్నం భోజనంలో గానీ (లేదా) రాత్రి భోజనంలో గాని తీసుకోవచ్చు. ఇప్పుడు, ఇక్కడ మీ బరువును కోల్పోవడంలో మీకు సహాయపడేందుకు, అద్భుతమైన రుచిని కలిగి ఉండే ఉల్లిపాయ సూప్ను తయారుచేసే విధానం ఈ దిగువన వివరించబడినది.

కావలసిన పదార్ధాలు :

4-5 పెద్ద ఎర్రని ఉల్లిపాయలు (ముక్కలు)

1 కప్పు తరిగిన టమోటా ముక్కలు

1 కప్పు తురిమిన క్యాబేజీ

3 కప్పుల కూరగాయలు (లేదా) చికెన్

3 లవంగాలతో కలిసి ఉన్న వెల్లుల్లి ముక్కలు

½ అంగుళము గల తురిమిన అల్లం రూట్

¼ టీస్పూన్ నల్ల మిరియాలు

1 టీస్పూన్ ఆలివ్ నూనె

ఉప్పు (కాస్త రుచి కోసం)

కొత్తిమీర (అలంకరణ కోసం)

తయారీ విధానం :

ఒక పాత్రలో ఆలివ్ నూనెను జోడించండి.

అల్లం మరియు వెల్లుల్లి వేసి, 2 నిమిషాల పాటు మితముగా వేయించాలి.

ఉల్లిపాయలను మరియు కూరగాయలను జోడించి, వాటిని బాగా కలిపి 30 సెకన్లు పాటు ఉడికించాలి.

ఇప్పుడు, కూరగాయలను (లేదా) చికెన్ను గాని జోడించండి.

పై మిశ్రమానికి నల్ల మిరియాలను మరియు ఉప్పును బాగా కలిపి, దానిని 10-15 నిమిషాలు ఉడికించాలి.

ఇలా తయారైన సూప్ను గిన్నెలోకి తీసుకొని, కొత్తిమీరతో అలంకరించుకొని త్రాగండి.

3. ముడి ఉల్లిపాయలు :

3. ముడి ఉల్లిపాయలు :

ఉడకబెట్టిన ఉల్లిపాయలు చాలా ఆరోగ్యకరమైనవి అయితే, ముడి ఉల్లిపాయలు కూడా చాలా ఉత్తమమైనవని అనటంలో ఆశ్చర్యం లేదు. ఉల్లిపాయలోని ఫైటో ట్యూయురెంట్స్, ఉష్ణ-ప్రేరిత అధోకరణమును చెందవు. అందువల్ల, మీరు ఉల్లిపాయలో ఉండే ఉత్తమమైన పోషకాలను పూర్తిస్థాయిలో పొందగలుగుతారు, ఇవి మీ బరువును తగ్గించటంలో మీకు సహాయపడతాయి. ఇక్కడ బరువు తగ్గడానికి మీరు ముడి ఉల్లిపాయను తినమని సిఫారస్సు చేస్తున్నాం.

బరువు తగ్గడానికి ముడి ఉల్లిపాయలను తినడం ఎలా?

కావలసిన పదార్ధాలు :

1 - మధ్యరకంలో ఉన్న ఉల్లిపాయ (ముక్కలుగా)

1 - నిమ్మకాయ (చిన్నముక్క)

హిమాలయన్ ఉప్పు (చిటికెడు)

తయారీ విధానం :

ఒక గిన్నెలోకి ముడి ఉల్లిపాయ ముక్కలను తీసుకోండి.

ఉల్లిపాయ ముక్కలపై నిమ్మ రసమును పిండి వేయాలి.

కొద్దిగా గులాబీ హిమాలయన్ ఉప్పును చల్లుకోవాలి.

భోజనం (లేదా) విందులో దీనిని ఒక భాగంగా చేసుకొని తినండి.

కాబట్టి, ఉల్లిపాయలను ఈ మూడు ఉత్తమ మైన మార్గాలలో తీసుకోవటం వలన శరీర బరువును కోల్పోవచ్చు. ఇప్పుడు, మీ బరువును తగ్గించే మరికొన్ని ఉల్లిపాయ వంటకాలను మీరు ఒకసారి చూడండి.

4. దానిమ్మ మరియు ఉల్లిపాయలు :

4. దానిమ్మ మరియు ఉల్లిపాయలు :

దానిమ్మ మరియు ఉల్లిపాయలు రుచికరమైనదిగా ఉంటూ, శాఖాహారులు మరియు మాంసాహారుల చేత ఈ ఈ ఆహారం ఆస్వాదించేది గా వుంటుంది. ఇందులో ఉన్న పదార్థాలు మీ బరువును తగ్గించేదిగా ఉంటుంది మరియు ఈ వంటకాన్ని చాలా సులభంగా తయారుచేయవచ్చు. తయారుచేసే విధానం ఈ క్రింద విధంగా ఉన్నది.

తయారీ సమయం - 15 నిమిషాలు;

వంటకు పట్టే సమయం - 10 నిమిషాలు;

వడ్డనకు - 6 నిమిషాలు

కావలసిన పదార్థాలు :

4 ఎర్రని ఉల్లిపాయలు (ముక్కలుగా)

4 టేబుల్ స్పూన్స్ దానిమ్మ పిప్పి

1 టేబుల్ స్పూన్ తహిణి (tahini)

2 టేబుల్ స్పూన్స్ ఆలివ్ నూనె

4 టేబుల్ స్పూన్స్ దానిమ్మ రసం

తాజాగా ఉన్న నల్ల మిరియాలు (చిటికెడు)

రుచి కోసం ఉప్పు

1 టేబుల్ స్పూన్ పార్స్లీ (తరిగినది)

తయారీ విధానం :

ఆలివ్ నూనెలో ఉల్లిపాయలు బాగా మగ్గేలా ఉంచాలి

వాటిని గ్రిల్సర్ మీద ఉంచండి.

ఒక గిన్నెలో దానిమ్మ గింజలు, దానిమ్మపండు రసం, నల్ల మిరియాలు, ఉప్పు (చిటికెడు), తహిణి వంటి ఈ మిశ్రమాలన్నింటిని కలపాలి.

గుచ్చిన దాని నుండి ఉల్లిపాయలు తొలగించండి మరియు దానిమ్మపండు పిప్పిని దానిపై కొద్దికొద్దిగా చల్లండి.

పార్స్లీ తో అలంకరించండి.

5. కాల్చిన ఉల్లిపాయ, చిలగడదుంప, సాసేజ్, మరియు బెల్ పెప్పర్ (మిరియాలు) :

5. కాల్చిన ఉల్లిపాయ, చిలగడదుంప, సాసేజ్, మరియు బెల్ పెప్పర్ (మిరియాలు) :

మీరు బరువును తగ్గించుకునే ఆచరణలో ఉంటే, మీరు ఏమి తింటున్నారో అనే విషయాలపై అవగాహనను కలిగి ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి మరియు ప్రతి కూరగాయల యొక్క అన్ని మంచి గుణాలను పొందడానికి సరైన పద్ధతి ప్రకారం ఉడికించాలి. బరువును తగ్గించుకోవటం కోసం కాల్చిన ఉల్లిపాయలతో కూరగాయల తయారీ విధానం ఈ క్రిందన చూపబడినది.

కాల్చిన ఉల్లిపాయ, చిలగడదుంప, సాసేజ్, మరియు బెల్ పెప్పర్స్ తో తయారీ విధానం :

కావలసిన పదార్ధాలు :

½ కప్పు సాసేజ్ (ముక్కలు)

1 కప్పు ఉల్లిపాయ (ముక్కలు)

½ కప్పు చిలగడదుంప (ముక్కలు)

½ కప్పు బెల్ పెప్పర్ (మిరియాలు)

4 టేబుల్ స్పూన్లు ఆలివ్ నూనె

4 టేబుల్ స్పూన్లు వైట్ వైన్

¼ కప్ చికెన్

½ టీ స్పూన్ ఎండిన రోజ్మేరీ

½ టీ స్పూన్ నల్ల మిరియాలు

రుచి కోసం ఉప్పు

తయారీ విధానం :

400 డిగ్రీల ఫారెన్ హీట్ వరకు పొయ్యిని వేడి చేయండి.

వేడి చేసిన 2 టీస్పూన్లు ఆలివ్ నూనెను ఒక స్కిలెట్లో ఉంచి, సాసేజ్లను గోధుమ రంగులోకి మారే వరకు ఉడికించాలి.

ఇప్పుడు, అన్ని వేగీస్ (veggies) ను మోత పెట్టి బాగా సెగతో కాల్చినట్లుగా ఉంచి, దానిపై కావలసినంత ఆలివ్ నూనె జల్లండి.

చికెన్ కు తగినంత ఉప్పు, మిరియాలు మరియు రోజ్మేరీలను జోడించి వాటిని బాగా ఎండబెట్టండి.

వండిన సాసేజ్ను దీనితో బాగా కలిపి 25-30 నిముషాలపాటు కాల్చండి.

English summary

5 Effective Ways To Use Onion For Weight Loss

Onions are highly effective in promoting weight loss. They are rich in quercetin, a flavonoid that prevents fat accumulation and also boosts metabolism. So, if you are serious about losing weight, include onion in your daily diet, But you should also know how to use it for weight loss. In this article, you will learn 3 best ways to use onion for weight loss, benefits of onions, and how to tackle the after effects of eating onions. Let’s begin.
Desktop Bottom Promotion