For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజంతా కేలరీలను బర్న్ చేసి సులభంగా బరువు తగ్గడానికి కొన్నిసాధారణ చిట్కాలు!

By Ashwini Pappireddy
|

మీరు బరువు తగ్గాలనుకుంటున్నవాళ్లలో ఒకరా! అయితే, మీరు ప్రతిసారి తినేటప్పుడు మీరు కేలరీలను లెక్కించాల్సి ఉంటుంది. మీ అవసరాలకు అనుగుణమైన ఒక వ్యాయామాన్ని రోజూ చేయాలనే నియమంగా పెట్టుకోవాలి, మరియు స్వీయ-నియంత్రణ వంటి తదితర విషయాలను మీరు ప్రయత్నిస్తారా?

వేగంగా 200 కాలరీల కొవ్వు కరిగించే 20 చిట్కాలు!వేగంగా 200 కాలరీల కొవ్వు కరిగించే 20 చిట్కాలు!

అయితే, చాలా సందర్భాల్లో, కొంతమంది అన్నీ సరైన పనులు,వ్యాయామాలని అనుసరిస్తున్నప్పటికీ వారు బరువు ని తగ్గడంతో విఫలమవుతుంటారు, ఎందుకంటే సమస్య వారి జీవక్రియ చర్యలో ఉండవచ్చు లేదా వారు బరువు తగ్గకపోవడం వెనుక ఇతర ఆరోగ్య పరిస్థితులు వీటితో ముడిపడి ఉండవచ్చు.

అనేక సార్లు ఇది చాలా నిరాశకు దారితీయవచ్చు మరియు ప్రజలు ఎక్కువ కాలం వారిలో ఎలాంటి వ్యత్యాసాన్ని చూడనప్పుడు,ఒక్కొక్కసారి విసుగు చెంది బరువు తగ్గాలనుకునే ప్రయత్నాన్ని కూడా విరమించుకోవచ్చు.

కానీ, బరువు తగ్గాలనుకునే పట్టుదలని వదలకుండా నిరంతరం ఎదో ఒకదానిని

ప్రయత్నిస్తూ,మన బరువు తగ్గడానికి ఇది ఒకటి ఉపయోగపడిందని తెలుసుకునేంతవరకు

tips to lose weight

ప్రయత్నిస్తూ ఉండాలి!

శరీరం లో అధిక బరువు చేరడం వలన ఒక వ్యక్తి చూడటానికి అన్ ఫిట్ గా అనిపించడం మాత్రమే కాదు ఇది (అతని / ఆమె) వారి లోని ఆత్మ విశ్వాసం స్థాయిలను కూడా తగ్గిస్తుంది, అంతేకాదు ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కూడా దారితీస్తుంది.

అధిక బరువు చివరకు ఊబకాయం, కీళ్ళ నొప్పి, జీర్ణ లోపాలు, గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్త పోటు, నిరాశ, మొదలైనవి వంటి అనారోగాలకు దారితీస్తుంది.

ఈరోజుల్లో, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, క్రియారహిత జీవన విధానం, హార్మోన్ల అసమతుల్యత, వంశపారంపర్యత, నెమ్మదిగా వున్న జీవక్రియ, కొన్ని ఔషధాల సైడ్ ఎఫక్ట్స్ మొదలైనవి, శరీరంలో అదనపు బరువు పెరగడానికి కారణాలుగా ఉండవచ్చు.

మీరు బరువును తగ్గించాలనే ఆలోచనా మార్గంలోకి వెళ్ళడానికి ముందు, మీ బరువు పెరగడానికి గల మూల లేదా ముఖ్యమైన కారణాన్ని గుర్తించడం కూడా చాలా ముఖ్యం.

ఉదాహరణకు, మీరు బరువు పెరగటానికి అనారోగ్యకరమైన లైఫ్ స్టైల్ మరియు స్లో మెటబాలిజం మే కారణమైతే, దీనిని మీ స్వంత ప్రయత్నాల ద్వారా కూడా పరిష్కరించుకోవచ్చు.

స్లో మెటబాలిక్ రేటు కలిగి ఉండటం మీ శరీరంలో అధిక కొవ్వు వృద్ధి చెందుతుంది, ఎందుకంటే ఇది మీ శరీరంలోని కేలరీల ను నెమ్మదిగా బర్న్ చేయవచ్చు.

సో, మీ జీవక్రియ రేటును పెంచుకోవడానికి సహాయపడే కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి, దీని వలన రోజంతా కేలరీలను బర్న్ చేయవచ్చు! అవేంటో చూద్దమా మరి....

tips to lose weight

వారానికి మూడు రోజులు వెయిట్ లిఫ్టింగ్ ని ప్రాక్టీస్ చేయాలి

ఈ అంశంపై నిర్వహించిన అనేక అధ్యయనాల ప్రకారం, వెయిట్ లిఫ్టింగ్ అనేది మీ మెటబాలిక్ రేటుని పెంచడానికి సహాయపడే వ్యాయామాల లో ఉత్తమమైనది గా చెప్పబడింది. మరియు ఇది రోజంతా కేలరీలను బర్న్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. పురుషులు మరియు మహిళలు ఇద్దరూ వెయిట్ లిఫ్టింగ్ ని ప్రాక్టీస్ చేయవచ్చు మరియు అది సమర్థవంతంగా ఉండటానికి, కనీసం మీరు వారానికి 3 రోజులు తప్పనిసరిగా దీనిని ఆచరించాలి.

బాడీ ఫ్యాట్ ను ఇట్టే కరిగించేసే 12 నేచురల్ రెమెడీస్...బాడీ ఫ్యాట్ ను ఇట్టే కరిగించేసే 12 నేచురల్ రెమెడీస్...

tips to lose weight

ప్రోటీన్స్ కలిగివున్న ఫుడ్స్ తినండి

మీరు మీ బరువుని తగ్గించుకోవడం ద్వారా మీ జీవక్రియ రేటును ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలి అనుకుంటే, పాలు, చిక్పీస్, కోడి, అరటి, బచ్చలికూర, గుడ్లు, జున్ను మొదలైన ప్రోటీన్స్ అధికంగా ఉండే ఆహార పదార్ధాలు తినడం చాలా ముఖ్యమైనది. ఇవి మీ జీవక్రియ రేటు ని పెంచడంలో సహాయపడతాయి.

tips to lose weight

మీ ఒత్తిడి స్థాయిలను చెక్ చేసుకోండి

ఒత్తిడి కూడా మీ మెటబాలిక్ రేటును తగ్గిస్తుంది మరియు తద్వారా ఇది మీ శరీరంలోని కేలరీలను బర్న్ చేసే వేగం రేటు ని నిరోధించవచ్చు. కాబట్టి, మీ ఒత్తిడి స్థాయిలను ఎప్పటికి అప్పుడు చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం.

English summary

Natural ways to lose weight

Here are a few easy ways to have a healthy metabolic rate, so that you can lose weight effectively.
Story first published:Friday, October 20, 2017, 12:50 [IST]
Desktop Bottom Promotion