For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇలా చేస్తే జిమ్ కు వెళ్లకుండానే బరువు తగ్గొచ్చు

బరువు తగ్గడానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. కొందరు వ్యాయామమే ఉత్తమ మార్గం అనుకుంటారు. మరికొందరు డైట్ పాటిస్తే చాలనుకుంటారు. ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో రూట్. అయితే బరువు తగ్గాలనుకున్నవారు అస్

By Y. Bharath Kumar Reddy
|

బరువు తగ్గడానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. కొందరు వ్యాయామమే ఉత్తమ మార్గం అనుకుంటారు. మరికొందరు డైట్ పాటిస్తే చాలనుకుంటారు. ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో రూట్.

 how to lose weight without going to gym

అయితే బరువు తగ్గాలనుకున్నవారు అస్సలు జిమ్ కే వెళ్లాల్సిన అవసరం లేదు. కొన్ని రకాల సూచనలు పాటిస్తే ఈజీగా బరువు తగ్గొచ్చు. అధిక బ‌రువుతో నానా అవ‌స్థ‌లు ప‌డుతున్న వారు వీటిని ఒక్కసారి పాటించి చూడండి. దీంతో ఈజీగా బరువు తగ్గితారు. మ‌రి ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. త్వరగా నిద్రపోండి

1. త్వరగా నిద్రపోండి

సరైన సమయానికి సరిగ్గా నిద్రపోతే ఎలాంటి అనారోగ్యాలు రావు అనే విషయం మనకందిరికీ తెలిసిందే. అయితే కొందరు నిద్ర విషయంలో కాస్త నిర్లక్ష్యంగా ఉంటారు. కరెక్ట్ సమయానికి నిద్రకు ఉపక్రమిస్తే మీ బాడీలో ఎలాంటి ఫ్యాట్ ఏర్పడదు. అలాగే మీరు ఎక్కువ సేపు నిద్రపోకుండా మేల్కొని ఉంటే మీరు అనారోగ్యానికి గురువుతారు. వీలో క్యాలోరీలు పెరిగిపోతాయి. అందువల్ల సరైన సమయానికి త్వరగా నిద్రపోతే మీరు ఈజీగా బరువు తగ్గే అవకాశం ఉంది.

2. బ్లాక్ కాఫీ తాగండి

2. బ్లాక్ కాఫీ తాగండి

బ్లాక్ కాఫీని రెగ్యులర్ గా తీసుకుంటే మీరు త్వరగా బరువు తగ్గొచ్చు. దీని వల్ల మీరు ఒక వారంలో 500 కేలరీలు కోల్పొతారు. అలాగే మీలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మధుమేహంతోనూ ఇది పోరాడుతుంది. అలాగే ఇతర జీర్ణ సమస్యలను కూడా దీని ద్వారా ఎదుర్కొవొచ్చు.

3. వాటర్ బాటిల్ తీసుకుని వెళ్తూ ఉండండి

3. వాటర్ బాటిల్ తీసుకుని వెళ్తూ ఉండండి

మనం ఎక్కడికి వెళ్లినా మన వెంట ఒక వాటర్ బాటిల్ ఉండాలి. దీంతో మనకు దాహం వేసిన వెంటనే నీళ్లు తాగడానికి అవకాశం ఉంటుంది. చాలామంది తాగాల్సిన సమంయలో నీరు తాగరు. తినాల్సిన టైమ్ లో తిండి తినరు. దీంతో చాలా సమస్యలను ఎదుర్కొవాల్సిన వస్తుంది. అందువల్ల మీరు ఎక్కడికి వెళ్లినా మీతో పాటు వాటర్ బాటిల్ తీసుకుని వెళ్తూ ఉండండి. సమయానికి నీరు తాగండి. దీంతో మీరు అధిక బరువు బారిన పడరు. స్లిమ్ గా తయారవుతారు.

4. ఆలివ్ నూనె ఉపయోగించండి

4. ఆలివ్ నూనె ఉపయోగించండి

మీ ఇంట్లో వంటకాలకు ఎక్కువగా ఆలివ్ నూనె ఉపయోగించండి. ఆలివ్ నూనెతో చేసిన వంటలు తినడం వల్ల కాస్త ఆకలి తగ్గుతుంది. దీంతో మీరు ఈజీగా బరువు తగ్గొచ్చు.

 5. ఫ్యాట్ ఫ్రీ అవసరం లేదు

5. ఫ్యాట్ ఫ్రీ అవసరం లేదు

ఫ్యాట్ ఫ్రీ ఆహారం తీసుకోవాలని నిర్ణయం తీసుకోకండి. కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకున్నా కూడా త్వరగా వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ లున్నాయి. ఎక్కువగా పాల ఉత్పత్తులకు సంబంధించిన పదార్థాలు తిన్న వారు కూడా ఆ తర్వాత ఈజీగా బరువు తగ్గారని కొన్ని పరిశోధనల్లో తేలింది. అందువల్ల డోంట్ గో ఫ్యాటీ ఫ్రీ.

6. మీ బ్యాగ్ లో స్నాక్స్ పెట్టుకోండి

6. మీ బ్యాగ్ లో స్నాక్స్ పెట్టుకోండి

మీరు బాగా ఆకలితో ఉన్నప్పుడు వెంటనే తినేయాలి. చాలామందికి రన్నింగ్ వెళ్లినప్పుడు లేదంటే ఉదయాన్నే జాగింగ్, వాకింగ్ కి వెళ్లినప్పుడు బాగా ఆకలి అవుతుంది. అయితే అప్పుడు వారు ఎలాంటి ఆహారాలు తీసుకోరు. దీంతో వారు మరింత ఎక్కువగా తినేస్తారు. బరువు ఈజీగా పెరిగిపోతారు. అలాకాకుండా బ్యాగ్ లో ఎప్పుడూ స్నాక్స్ పెట్టుకుని వెళ్తే ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తినొచ్చు. ఇది చాలా మంచిది.

7. కూరగాయాల ముక్కల్ని మీతో ఉంచుకోండి

7. కూరగాయాల ముక్కల్ని మీతో ఉంచుకోండి

మీరు బయటకు వెళ్లేటప్పుడు కొన్ని తినగలిగిన కూరగాయాల ముక్కల్ని కూడా మీతో పాటు తీసుకెళ్లండి. క్యారెట్ లాంటి వాటిని మీ బ్యాగ్ లో వేసుకుని వెళ్లండి. కొన్ని కూరగాయాల్లో అధిక ఫైబర్ ఉంటుంది. వీటిని వీలున్నప్పుడల్లా తింటూ ఉండండి. అధిక ఫైబర్ ఉన్న ఆహారాలు బరువు తగ్గేందుకు బాగా ఉపయోగపడతాయి.

8. శాఖాహారానికి ప్రాధాన్యం ఇవ్వండి

8. శాఖాహారానికి ప్రాధాన్యం ఇవ్వండి

మాంసం తినేవారి కంటే వారి శాఖాహారం తినేవారు 12% తక్కువ కేలరీలు పొందుతారని పలు పరిశోధనల్లో వెల్లడైంది. అందువల్ల వీలైనంత వరకు శాఖాహారానికి ప్రాధాన్యం ఇవ్వండి. దీంతో బరువు పెరగకుండా ఉంటారు.

9. ఆరోగ్యకరమైన ఆహారాలన్నీ ఫ్రిజ్ లో ఉంచుకోండి

9. ఆరోగ్యకరమైన ఆహారాలన్నీ ఫ్రిజ్ లో ఉంచుకోండి

మీరు ఇంట్లోని ఫ్రిజ్ లో పండ్లు, ప్రోటీన్ తో కూడిన పదార్థాలు, పలు ఆరోగ్యకరమైన పదార్థాలను ఉంచుకోండి. దీంతో మీరు ఎప్పుడు ఆకలి వేసిన వాటిని తినొచ్చు. దీంతో మీరు అన్ హెల్తీ ఫుడ్స్ తినాల్సిన అవసరం ఏర్పడదు.

10. చక్కెర ఉండే పానీయాలు తాగొద్దు

10. చక్కెర ఉండే పానీయాలు తాగొద్దు

క్యాలరీలను తగ్గించుకోవాలంటే మీరు చక్కెర ఉండే పానీయాలను తాగడం తగ్గించుకోవాలి. వీటిలో ఎలాంటి పోషకాలుండవు. దాంతో పాటు ఇవి ఎక్కువగా ఆకలిని కలిగిస్తాయి. అందువల్ల వీటిని ఎక్కువగా తాగొద్దు.

11. లంచ్ మీ ఇంట్లోనే తయారు చేయించుకోండి

11. లంచ్ మీ ఇంట్లోనే తయారు చేయించుకోండి

చాలామంది లంచ్ బయట చేస్తుంటారు. దీంతో అధిక బరువు పెరిగిపోయే అవకాశం ఉంది. అందువల్ల ఇంట్లోనే లంచ్ తయారు చేయించుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మీ ఇంట్లో తయారు చేయించుకునే ఆరోగ్యకరమైన ఆహారం ద్వారా మీరు ఎక్కువ బరువు పెరగరు.

12. భోజన సమయంలో పని గురించి ఆలోచించకండి

12. భోజన సమయంలో పని గురించి ఆలోచించకండి

ఆఫీసులలో చాలామంది మధ్యాహ్న భోజన సమయంలో తిండి గురించి ఆలోచించకుండా పని చేసుకుంటూ కూర్చొంటారు. మరికొందరు వారు చేసే పనిపైనే ధ్యాస అంతా ఉంచి తింటూ ఉంటారు. ఇది మంచి పద్దతి కాదు. మీరు కరెక్ట్ సమయానికి మధ్యాహ్నం భోజనం చేయడం చాలా మంచిది. ఆ టైమ్ లో ఎలాంటి ఆలోచనలు పెట్టకోకూడదు. దీనివల్ల మీలో ఫ్యాట్ పెరగదు.

13. ఒత్తిడికి గురికావొద్దండి

13. ఒత్తిడికి గురికావొద్దండి

మీరు ఎప్పుడూ కూడా ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండండి. ఒత్తిడికి గురైనప్పుడు విడులయ్యే కార్టిసాల్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది శరీరంపై ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా ఫ్యాట్ ఏర్పడడానికి ఇది కారణం అవుతుంది. అందువల్ల ఎక్కువగా ఒత్తిడికి గురికావొద్దండి.

14. మీ డెస్క్ పై ఎలాంటి ఫుడ్స్ పెట్టుకోవొద్దు

14. మీ డెస్క్ పై ఎలాంటి ఫుడ్స్ పెట్టుకోవొద్దు

మీ ఆఫీసులో మీ డెస్క్ పై ఎలాంటి పరిస్థితుల్లో జంక్ ఫుడ్స్ పెట్టుకోవొద్దు. వాటిని చూసినప్పుడల్లా మీకు తినాలని అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఎక్కువ సేపు మనం ఉండేది కూడా ఆఫీసులోనే . అలాంటి ప్రాంతంలో ఏవేవో ఫుడ్స్ పెట్టుకుని ఉంటే వాటిని తింటూ ఈజీగా లావైపోతారు. అందువల్ల వీలైనంత వరకు మీరు మీ డెస్క్ పై ఎలాంటి ఫుడ్స్ పెట్టుకోవొద్దు.

15. ఫ్రై ఫుడ్స్ తినొద్దు

15. ఫ్రై ఫుడ్స్ తినొద్దు

చాలామందికి ఫ్రై ఫుడ్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. అయితే వాటిని తినకుండా ఉంటే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మీ బాడీకి రోజుకు 150 కేలరీలు అందవు.

16. సెల్ఫ్ సర్వీస్ ఈజ్ బెస్ట్

16. సెల్ఫ్ సర్వీస్ ఈజ్ బెస్ట్

సెల్ఫ్ సర్వీస్ వల్ల ఎక్కువగా అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకునే ఛాన్స్ ఉండదు. దీంతో మీరు ఆరోగ్యకరమైన ఆహారాలను మాత్రమే తింటారు. ఫలితంతగా ఎక్కువగా బరువు పెరగరు.

17. డైట్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి

17. డైట్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి

డైట్ ఫుడ్స్ ను అస్సలు తీసుకోకండి. వీటిని ఆర్టిఫిషెల్ చక్కెర్ల ద్వారా తయారు చేస్తారు. సుక్రోసాస్, అస్పర్టమే వంటి వాటి ద్వారా ఇవి తయారవుతాయి. అందువల్ల ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండండి.

18. ప్రోటిన్లను తక్కువగా తీసుకోండి

18. ప్రోటిన్లను తక్కువగా తీసుకోండి

ప్రోటిన్లను తక్కువగా తీసుకోవడం చాలా మంచిది. దీంతో మీరు ప్రతి రోజు 100 కేలరీలకు దూరంగా ఉండొచ్చు. అందువల్ల మీరు ప్రోటిన్లను ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది.

19. అలా బయటకు వెళ్లండి

19. అలా బయటకు వెళ్లండి

జిమ్ లో గంటల తరబడి వ్యాయామం చేయడం కంటే రన్నింగ్ లేదా జాగింగ్, వాకింగ్ చేయడం మేలు. దీంతో అలా బయటకు వెళ్లినట్లు ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది. నేచర్ ను ఎంజాయ్ చేసినట్లు ఉంటుంది.

20. డిన్నర్లను తగ్గించుకోండి

20. డిన్నర్లను తగ్గించుకోండి

చాలామంది ఫ్రెండ్స్ తో లేదంటే ఏదైనా ఫంక్షన్లకు సంబంధించిన డిన్నర్లకు రోజూ అంటెండ్ అవుతూ ఉంటారు. అయితే వీటిలో ఇంట్లో తినేదానికంటే ఎక్కువగా తింటారని పరిశోధనల్లో వెల్లడైంది. అందువల్ల ఎక్కువగా సోషల్ డిన్నర్లకు వెళ్లకండి. వీటన్నంటినీ పాటిస్తే మీరు జిమ్ వెళ్లే అవసరం లేకుండానే హ్యాపీగా కొద్దిరోజుల్లోనే బరువు తగ్గొచ్చు.

English summary

real ways to reduce weight without going to gym

In this article, we have listed some of the real ways on how to reduce weight without hitting the gym.
Story first published:Tuesday, November 21, 2017, 17:06 [IST]
Desktop Bottom Promotion