For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పసుపు పాలతో..పొట్ట కొవ్వుకరగడంతో పాటు ఎన్నో ప్రయోజనాలు!

ప‌సుపు ఇది ఉంటే చాలు మనం ఏ వ్యాధినైనా ఇట్టే ఎదుర్కొవొచ్చు. వంటింట్లో మ‌నం నిత్యం ఉప‌యోగించే ప‌దార్థం ప‌సుపు. దీంట్లో అనేక ర‌కాల ఔష‌ధ గుణాలు ఉన్నాయి. ప‌సుపును నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల...

By Bharath Reddy
|

ప‌సుపు ఇది ఉంటే చాలు మనం ఏ వ్యాధినైనా ఇట్టే ఎదుర్కొవొచ్చు. వంటింట్లో మ‌నం నిత్యం ఉప‌యోగించే ప‌దార్థం ప‌సుపు. దీంట్లో అనేక ర‌కాల ఔష‌ధ గుణాలు ఉన్నాయి. ప‌సుపును నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎంతో ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. పసపు చేసే మేలు అంతా ఇంతకాదు. బరువు తగ్గాలన్నా పసుపు అవసరమే.

స్థూల‌కాయ‌ం, శ‌రీరంలో అధికంగా పేరుకుపోయే కొవ్వు తో నేడు చాలా మంది స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. అయితే పసుపు ద్వారా ఆ సమస్య నుంచి బయటపడొచ్చు.

<strong>కొబ్బరిపాలు, పసుపు మిశ్రమంతో అమేజింగ్ హెల్త్ బెన్ఫిట్స్..!</strong>కొబ్బరిపాలు, పసుపు మిశ్రమంతో అమేజింగ్ హెల్త్ బెన్ఫిట్స్..!

రోజూ తినే ఆహారంలో వీలైనంత వరకు పసుపు వాడితే గుండెకు మంచిది. 'లో డెన్సిటీ లిపొప్రొటైన్ (ఎల్.డి.ఎల్)' అనే చెడు కొలెస్ట్రాల్ ను పసుపు త‌గ్గిస్తుంది. ఇది కొవ్వును క‌రిగించేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. దీంతోపాటు రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే సమస్యను తొలగించి, గుండెపోటు రాకుండా కాపాడుతుంది.

పాలలో పసుపు కలుపుకుని తాగితే చాలా ప్రయోజనాలున్నాయి. సాధారణంగా అందరికీ పసుపు, పాల కాంబినేషన్ గురించి అందరికీ తెలిసి ఉంటుంది. అలాగే పసుపు పాలతో పాటు నల్ల మిరియాలు, దాల్చిన చెక్క, ఏలకులు, తేనె, నిమ్మరసం తదితర కాంబినేషన్స్ లలో కలుపుకుని తాగితే ఇంకా చాలా ప్రయోజనాలుంటాయి. ప‌సుపును ఇతర పదార్థాల కాంబినేషన్ ద్వారా త‌యారు చేసే ఈ మిశ్ర‌మాలను రోజూ తాగడం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో లాభాలుంటాయి. ఆ మిశ్ర‌మాలను ఎలా త‌యారు చేయాలో చూద్దామా. వీటి బ‌రువే కాదు, పొట్ట ద‌గ్గ‌ర పేరుకుపోయిన కొవ్వు కూడా క‌రుగుతుంది. అలాగే ఇతర వ్యాధుల నివారణకు కూడా పసుపు కాంబినేషన్ మిశ్రమాలు ఎంతో దోహదం చేస్తాయి.

<strong>పసుపు పాలలోని అద్భుతమైన బ్యూటీ&హెల్త్ బెనిఫిట్స్</strong>పసుపు పాలలోని అద్భుతమైన బ్యూటీ&హెల్త్ బెనిఫిట్స్

బరువు తగ్గాలంటే

బరువు తగ్గాలంటే

ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మపండు రసాన్ని, 1/4 టీస్పూన్ పసుపును మిక్స్ చేయాలి. రెండూ మిక్స్ చేసిన తర్వాత కావాల‌నుకుంటే అందులో కొద్దిగా తేనె క‌ల‌ప‌వ‌చ్చు. అలా మూడింటినీ క‌లిపిన ఆ నీటిని గోరువెచ్చ‌గా ఉండ‌గానే ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తాగాలి. రోజుకు రెండు సార్లు ఈ మిశ్ర‌మం తాగితే వారం రోజుల్లోనే ఫ‌లితం క‌నిపిస్తుంది. బ‌రువు త‌గ్గేవ‌ర‌కు లేదంటే పొట్ట ద‌గ్గర కొవ్వు క‌రిగే వ‌ర‌కు ఈ మిశ్ర‌మాన్ని తాగ‌వ‌చ్చు. అలాగే ఒక నిమ్మ‌కాయను పూర్తిగా పిండి అందులో నుంచి ర‌సాన్ని తీయాలి. దానికి అర టీస్పూన్ ప‌సుపు, 1/4 టీస్పూన్ న‌ల్ల మిరియాల పొడి, 1/4 టీస్పూన్ ఆలివ్ ఆయిల్‌ను క‌ల‌పాలి. బాగా క‌లిపాక వ‌చ్చే మిశ్ర‌మాన్ని 1 లేదా 2 టీస్పూన్ల మోతాదులో రోజుకు 3 పూట‌లా భోజ‌నం చేశాక తీసుకోవాలి. దీంతో కొవ్వు వేగంగా క‌రుగుతుంది. పొట్ట కూడా త‌గ్గుతుంది.

కొవ్వు కరిగిపోతుంది

కొవ్వు కరిగిపోతుంది

స‌న్న‌ని మంట మీద ఒక కప్పు పాలను బాగా వేడి చేయాలి. తర్వాత అందులో అరటీస్పూన్ నిమ్మరసం, అరటీస్పూన్ తేనె మిక్స్ చేయాలి. దీంతోపాటు వెనీలా ఎక్స్ ట్రాక్ట్ ను కూడా క‌ల‌పాలి. అనంత‌రం ఆ మిశ్ర‌మంలో అరటీస్పూన్ పసుపు కూడా మిక్స్ చేసి, తక్కువ మంట మీద వేడి చేయాలి. తర్వాత కిందికి దింపుకుని వడగట్టి గోరువెచ్చగా తాగాలి. ఈ డ్రింక్‌ను వారం పాటు తాగితే ఫ‌లితం మీకే తెలుస్తుంది. దీన్ని భోజనానికి ముందు లేదా భోజనం తర్వాత తీసుకోవచ్చు. అధిక బ‌రువును త‌గ్గించుకోవాల‌న్నా, శరీరంలో కొవ్వును కరిగించుకోవాల‌న్నా పసుపు, నిమ్మరసంను త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఈ రెండింటినీ స‌లాడ్స్‌లో కూడా క‌లిపి తీసుకోవ‌చ్చు. దీంతో అధిక బ‌రువు త‌గ్గుతారు. పొట్ట దగ్గర ఉన్న కొవ్వు క‌రిగిపోతుంది. అయితే గౌట్, కిడ్నీ స్టోన్స్ లేదా గాల్ బ్లాడర్ స్టోన్స్ తో బాధపడే వారు ఈ మిశ్ర‌మాల‌ను తీసుకోకూడ‌దు. సర్జరీ చేయించుకున్నవారు కూడా తీసుకోకూడదు. డాక్టర్ ను సంప్రదించి తీసుకోవచ్చు. అలాగే పాలిచ్చే త‌ల్లులు, గ‌ర్భంతో ఉన్న మహిళలు కూడా ఈ మిశ్ర‌మాల‌ను తీసుకోక‌పోవ‌డ‌మే మంచిది.

పొట్ట చుట్టు ఉన్న ఫ్యాట్ తగ్గిపోతుంది

పొట్ట చుట్టు ఉన్న ఫ్యాట్ తగ్గిపోతుంది

పసుపులో ఉండే కుర్కుమిన్ అనే పవర్ ఫుల్ కంటెంట్ పొట్టచుట్టూ, కాలేయం చుట్టూ కొవ్వు పేరుకోకుండా నివారిస్తుంది . అయితే పసుపు-నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీళ్ళు లేదా పాలలో సగం నిమ్మపండు రసాన్ని, 1/4 టీస్పూన్ పసుపును మిక్స్ చేయాలి. రెండూ మిక్స్ చేసిన తర్వాత స్వీట్నెస్ కోరుకునే వారు కొద్దిగా తేనె మిక్స్ చేసి మరో మారు మూడు బాగా కలగలిసేలా మిక్స్ చేసి తాగాలి. గోరువెచ్చగా ఉండగానే తాగాలి. ఉదయం అల్పాహారానికి ముందు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

పసుపు పాలతో అనేక ప్రయోజనాలు

పసుపు పాలతో అనేక ప్రయోజనాలు

పసుపు పాలతో తయారు చేసిన మిశ్రమంతో బరువు తగ్గడమేకాకుండా అనేక ప్రయోజనాలున్నాయి. దగ్గు, జలుబు ఉపశమనానికి, తలనొప్పి తగ్గడానికి, కంటి నిండా నిద్ర కోసం, రుతుక్రమం సమస్యల పరిష్కానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. దీన్ని ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఒక గ్లాసు పాలలో టీ స్పూన్ చక్కెర, చిటికెడు పసుపు కలిపి 10 - 15 నిమిషాల పాటు మరిగించాలి. కొంత సేపటి తర్వాత పాలు గోరు వెచ్చగా అయ్యాక తాగాలి. పసుపు పాల ఫలితం సంపూర్తిగా పొందాలంటే ప్రతి రోజూ క్రమం తప్పక తాగాలి. పాలు వేడిచేసి వాటిలో చిటికెడు పసుపు, మిరియాల పొడి కలిపి రాత్రి పడుకునే ముందు తాగితే దగ్గు తగ్గుతుంది.

చక్కెర కలిపిన పాలను వేడిచేసి, పసుపువేసుకుని సేవిస్తే జలుబుకు ఉపశమనంగా ఉంటుంది.

దగ్గు, జలుబుకు ఉపశమనం

దగ్గు, జలుబుకు ఉపశమనం

నిరంతరాయంగా వేధించే దగ్గు, జలుబు, గొంతు నొప్పులకు పసుపు పాలు చక్కని ఉపశమనాన్ని అందిస్తాయి. పసుపులో యాంటీసెప్టిక్, యాస్ట్రింజెంట్ గుణాలుంటాయి. ఇవి శ్వాస కోశ సమస్యల నుంచి తక్షణ ఉపశమనాన్ని కలిగిస్తాయి. దగ్గుతో కందిపోయిన గొంతుకు మలామ్‌లా పని చేసే పాలతో పసుపు కలిపి తీసుకుంటే ఊపిరితిత్తుల్లోని కఫం కరగటంతోపాటు ఊపిరి తీసుకోవటం సులువవుతుంది.

తలనొప్పి మాయం

తలనొప్పి మాయం

యాంటీఆక్సిడెంట్లు, అత్యవసరమైన పోషకాలు పుష్కలంగా ఉండే పసుపు యాస్ర్పిన్‌లా తలనొప్పి, ఇతర నొప్పులను తగ్గించేస్తుంది. ముక్క దిబ్బడతో తలపట్టేస్తే వేడి పాలలో ఒక టీస్పూన్‌ పసుపు కలుపుకుని తాగి చూడండి. క్షణాల్లో తల నొప్పితోపాటు ముక్కు దిబ్బడ కూడా వదులుతుంది.

హాయిగా నిద్రపోవొచ్చు

హాయిగా నిద్రపోవొచ్చు

పాలలో సెరటోనిన్ అనే బ్రెయిన్ కెమికల్, మెలటోనిన్‌లు ఉంటాయి. ఇవి పసుపులో ఉండే వైటల్ న్యూట్రియంట్స్‌తో కలిసి ఒత్తిడిని తొలగించటానికి తోడ్పడతాయి. దీంతో మానసిక స్వాంతన చేకూరి హాయిగా నిద్ర పడుతుంది.

రుతుక్రమ సమస్యల నివారణకు

రుతుక్రమ సమస్యల నివారణకు

రుతుక్రమం గాడి తప్పినప్పుడు స్రావం సమయంలో బాధలు అధికమవుతాయి. ఆ సమయంలో శరీరంలో విడుదలయ్యే హార్మోన్ల ప్రభావం ఫలితంగా పొత్తి కడుపు, ఇతర ఒంటి నొప్పులు బాధిస్తాయి. ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే పసుపు పాలు సేవించాలి. రుతుశూల నొప్పుల్ని హరించే ఏజెంట్లున్న పసుపును ప్రతి రోజూ క్రమం తప్పకుండా పాలలో కలిపి తీసుకోగలిగితే కొంత కాలంలోనే ఈ సమస్య పరిష్కారమవుతుంది.

డయాబెటిస్ వారికి ఎంతో మేలు

డయాబెటిస్ వారికి ఎంతో మేలు

ప‌సుపు, నిమ్మ‌ర‌సాలను ఉప‌యోగించి త‌యారు చేసే మిశ్ర‌మాన్ని తాగడం వ‌ల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి. దాన్ని ఈ విధంగా తయారు చేసుకోవాలి. 1/4 టీస్పూన్ ప‌సుపు, 1 క‌ప్పు గోరు వెచ్చ‌ని నీరు, కొద్దిగా నిమ్మ‌ర‌సం, 1/8 టీస్పూన్ తేనె, చిటికెడు దాల్చిన చెక్క పొడిల‌ను తీసుకోవాలి. గోరు వెచ్చ‌ని నీటిలో ఆ ప‌దార్థాల‌న్నింటినీ వేసి బాగా కలియ‌బెడుతూ తాగాలి. అయితే ఈ మిశ్ర‌మాన్ని ఉద‌యం ప‌ర‌గ‌డుపున తీసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని తాగ‌డం వ‌ల్ల ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిలు అదుపులోకి వ‌స్తాయి. డ‌యాబెటిస్ ఉన్న వారికి ఇది ఎంత‌గానో మేలు చేస్తుంది. శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వు క‌రిగిపోతుంది. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి ఈ మిశ్ర‌మం బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. శ‌రీరంలోని విష ప‌దార్థాలు కూడా బ‌య‌టికి పోతాయి. వృద్ధాప్యం కార‌ణంగా ముఖంపై వ‌చ్చే ముడ‌త‌లు త‌గ్గుతాయి. నొప్పులు, వాపులు త‌గ్గిపోతాయి. మ‌ల‌బ‌ద్ద‌కం తొల‌గిపోతుంది. శ‌క్తి బాగా వ‌స్తుంది. లివ‌ర్ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. జీర్ణ క్రియ బాగా జ‌రుగుతుంది. శ‌రీర రోగ నిరోధక వ్య‌వ‌స్థ బ‌ల‌ప‌డుతుంది. ద‌గ్గు, జ‌లుబు వంటి శ్వాసకోశ స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి.

కామెర్ల సమస్య ఉండదు

కామెర్ల సమస్య ఉండదు

పసుపులో ఉండే కర్‌క్యుమిన్‌ అనే కాంపౌండ్‌ శరీరంలో వైరస్‌ వృద్ధిని అరికడుతుంది. నీటి ద్వారా శరీరంలోకి చేరుకున్న వైరస్‌ త్వరితగతిన రెట్టింపు అవకుండా పసుపు నియంత్రిస్తుంది. పసుపు సహజసిద్ధమైన కాలేయ డిటాక్సిఫైయర్‌. అంటే కాలేయంలో చేరే విషకారకాలను హరిస్తుంది. పసుపు పాలు వైరల్‌ దాడి నుంచి కాలేయాన్ని రక్షించటంతోపాటు రోగ నిరోధకశక్తిని పెంచుతాయి. కాబట్టి కాలేయ సంబంధ పచ్చ కామెర్ల లాంటి వ్యాధులు రావు.

ఆర్థ్రరైటిస్‌కు దూరం కావొచ్చు

ఆర్థ్రరైటిస్‌కు దూరం కావొచ్చు

పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలుంటాయి. వీటి ఫలితంగా కీళ్లు బలపడతాయి. కీళ్ల వాపులు, నొప్పులు తగ్గాలంటే పసుపు పాలను క్రమం తప్పకుండా తాగాలి. ఈ పాలు తాగటం వల్ల కీళ్ల కదలికలు, కండరాల పటుత్వం పెరుగుతాయి. మీరు రెగ్యులర్ గా పసుపు, పాలను తీసుకుంటేనే ఈ ప్రయోజనం మీకు కనపడుతుంది.

రక్త శుద్ధి భేష్

రక్త శుద్ధి భేష్

ఆయుర్వేద వైద్యంలో పసుపును రక్తశుద్ధికి ఉపయోగిస్తారు. పసుపు పాలలో ఉండే పోషకాలు రక్త ప్రసరణను మెరుగుపరిచి లింఫాటిక్‌ సిస్టమ్‌ను కూడా శుద్ధిచేస్తాయి.

మీ శరీరంలోని రక్తం శుద్ధి అవుతుంది. దీంతోపాటు ముఖంపైనున్న మొటిమలు తొలగిపోతాయి.

కడుపు ఉబ్బరం మటాష్

కడుపు ఉబ్బరం మటాష్

మనం కొన్నిసార్లు రాత్రిపూట కొంచెం ఎక్కువగా తినడం వలన కడుపు ఉబ్బరంగా ఉంది ఇబ్బందిగా అనిపిస్తుంది. దీని వలన జీర్ణ శక్తి మందగించి, గుండె మంట వాటి సమస్యలు తలెత్తుతాయి. అయితే ఈ సమస్యకు స్పైస్ డ్ పసుపు పాలు ఎంతో మేలు చేస్తాయి. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. రెండు కప్పుల కొబ్బరి పాలు, ఒక టీ స్పూన్ పసుపు పొడి, ఒక టీ స్పూన్ తేనె, పావు టీ స్పూన్ మిరియాలు సిద్దం చేసుకోండి. తర్వాత తేనె తప్ప మిగిలిన పదార్దాలన్నీ ఒక పాత్రలో కలిపి మిశ్రమాన్ని తయారుచేసుకోండి. ఆ తరువాత సన్నని మంట మీద 5 నిమిషాలు వేడి చేయండి. చల్లబరిచిన తరువాత తేనెను కలపండి. ఈ మిశ్రమాన్ని పడుకోవడానికి గంట ముందు తీసుకుంటే మీ జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి కడుపులో మంట రాకుండా చేస్తుంది. అలాగే జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. కాలేయాన్ని ఉత్తేజపరుస్తుంది. క్యాన్సర్ ను తగ్గిస్తుంది. జ్వరాన్ని,నొప్పులను తగ్గిస్తుంది. అల్సర్లను తగ్గిస్తుంది. రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది.

English summary

Spiced Turmeric Milk For Cutting Belly Fat & More

The main ingredient of turmeric is curcumin. There is also a supplement you can take that contains mainly curcumin if you prefer to ingest it that way. Turmeric can also be used to make tea and is used in Indian curries.No matter how you prefer to add turmeric to your diet, you'll reap the rewards of many positive effects.Here's a list of a few of turmeric's health benefits:
Desktop Bottom Promotion