For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేగంగా రెండు నెలల్లో బరువు తగ్గించే యమ్మీ క్యాబేజ్ సూప్..!

సూప్ ను తాగడం వల్ల బరువును కంట్రోల్లో ఉంచుకోవచ్చు. సూప్స్ వివిధ రకాలుగా తయారు చేసుకోవచ్చు. అయితే అందులో క్యాబేజ్ సూప్ ఒకటి. క్యాబేజ్ సూప్ బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుందన్న విషయం మీకు తెలుసా..

|

సూప్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఉపయోగకరమైనది. భోజనంతో పాటు తీసుకోవచ్చు. లేదా ఈవెనింగ్ టైమ్ లో ఈ సూప్ ను తీసుకోవచ్చు. సీజన్ బట్టి సూప్ లను తయారు చేసుకోవచ్చు. సూప్ ను తాగడం వల్ల బరువును కంట్రోల్లో ఉంచుకోవచ్చు. సూప్స్ వివిధ రకాలుగా తయారు చేసుకోవచ్చు. అయితే అందులో క్యాబేజ్ సూప్ ఒకటి. క్యాబేజ్ సూప్ బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుందన్న విషయం మీకు తెలుసా..? ఈ సూప్ చాలా సులభం మరియు టేస్టీ, హెల్తీ కూడా..

ఫ్రెష్ క్యాబేజ్ లోని టాప్ 20 హెల్త్ బెనిఫిట్స్

దీన్ని చాలా సులభంగా తయారుచేసి వేడి వేడిగా సర్వ్ చేస్తే, జలుబు దగ్గు నుండి తక్షణ ఉపశమనం పొందడంతో పాటు, బరువును కూడా తగ్గించుకోవచ్చు. క్యాబేజ్ శరీరానికి వేడి పుట్టిస్తుంది. కాబట్టి, అదనపు క్యాలరీలను క్రమంగా తగ్గించుకోవచ్చు. అధిక బరువుతో బాధపడే వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు . వివిధ అనారోగ్య సమస్యలతో పాటు, నడవలేని, పరిస్థితి ఏర్పడుతుంది. ఓవర్ వెయిట్ వల్ల జాయిల్ పెయిన్స్ . కాబట్టి హెల్తీ వెయిట్ ను మెయింటైన్ చేయడం మంచిది.

ఓవర్ వెయిట్ పెరగడానికి వివిధ రకాల కారణాలుంటాయి. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామ లేమి, హార్మోనుల అసమతుల్యత, హెరిడిటి, సట్రెస్ . కారణమేదైనా మరి మీరు బరువు తగ్గించుకొనే ప్రయత్నం చేస్తుంటే క్యాబేజ్ డైట్ సూప్ ను ప్రయత్నించండి..

కావల్సినపదార్థాలు:

కావల్సినపదార్థాలు:

క్యాబేజ్: 1cup (సన్నగా తరిగిపెట్టుకోవాలి)

ఉల్లిపాయలు: 3-4(సన్నగా తరిగి పెట్టుకోవాలి)

బ్లాక్ పెప్పర్: 1tsp(పౌడర్)

ఉప్పు: రుచికి సరిపడా

బట్టర్: 1tsp

తయారుచేయు విధానం:

తయారుచేయు విధానం:

1. ముందుగా వెజిటేబుల్స్ ముక్కలన్నీ నీటిలో వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

2. తర్వాత ప్రెజర్ కుక్కర్ స్టౌ మీద పెట్టి నీళ్ళు పోసి మరిగించాలి.

3. తర్వాత అందులో సన్నగా తరిగి పెట్టుకొన్న వెజిటుబుల్ క్యాబేజ్, ఉల్లిపాయ ముక్కలు వేయాలి.

తయారుచేయు విధానం:

తయారుచేయు విధానం:

4. అన్ని బాగా మిక్స్ చేసి, మూత పెట్టి రెండు లేదా మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించి పెట్టుకోవాలి. ఆవిరి మొత్తం తగ్గిన తర్వాత మూత తీయాలి.

5. ఇప్పుడు ఫ్రైయింగ్ పాన్ లోబటర్ వేసి అందులో కూరగాయ ముక్కలతో సహా సూప్(కూరలు ఉడికిన నీరు)కూడా అందులో పోయాలి.

6. ఇప్పుడు అందులో బ్లాక్ పెప్పర్ మరియు సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చాలి.

తయారుచేయు విధానం:

తయారుచేయు విధానం:

7. సూప్ చిక్కగా రావాలంటే కొద్దిగా కార్న్ ఫ్లోర్ కలిపి ఉండలు కట్టకుండా మిక్స్ చేయాలి. అంతే పెప్పర్ అండ్ క్యాబేజ్ సూప్ రెడీ. వేడి వేడిగా సర్వ్ చేయాలి. ఇది దగ్గు జలుబును నివారిస్తుంది శరీరంలో వేడి పుట్టించి కొవ్వును కరిగిస్తుంది. బ్లాక్ పెప్పర్ శరీరంలో వేడి కలిగించడం ద్వారా కొవ్వు కరిగి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

తయారుచేయు విధానం:

తయారుచేయు విధానం:

8. క్యాబేజ్ లో ఉండే పొటాషియం కంటెంట్ మెటబాలిజం రేటును పెంచుతుంది. దాంతో ఫ్యాట్ సెల్స్ ఫాస్ట్ గా కరగడానికి సహాయపడుతుంది. ఇంకా క్యాబేజ్ లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

తయారుచేయు విధానం:

తయారుచేయు విధానం:

9. ఉల్లిపాయ, పెప్పర్ లో ఉండే యాంంటీయాక్సిడెంట్స్ మరియు ఎంజైమ్స్ శరీరంలో మెటబాలిజం రేటును పెంచి ఫ్యాట్ సెల్స్ ను కరిగిస్తుంది. ఈ క్యాబేజ్ సూప్ ను బ్రేక్ పాస్ట్ లో రెండు నెలలు క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్ లో ఈ సూప్ తాగిన తర్వాత మరే ఇతర ఆహారాలు తీసుకోకూడదు.

English summary

Try This Cabbage Soup Remedy For A Quick Weight Loss!

We know that vegetables are extremely nutritious and come with many health benefits. Did you also know that cabbage is a vegetable that can actually help you reduce weight quickly?
Story first published: Thursday, February 9, 2017, 10:10 [IST]
Desktop Bottom Promotion