For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గాలంటే పుదీనా ఎలా ఉపయోగించాలి, పుదీనాతో ఇతర ప్రయోజనాలేంటి?

|

జంక్ ఫుడ్, ఆహారంలో మార్పులు కారణంగా బరువు పెరగడం.. పొట్ట పెరగడం జరుగుతుంది. పొట్ట పెరగడం అందానికే కాదు ఆరోగ్యానికీ చేటు కలిగిస్తుంది. శరీరంలో మిగతా భాగాల్లోని కొవ్వు కన్నా పొట్ట మీద పేరుకునే కొవ్వు చాలా ప్రమాదకరమైంది. దీంతో ఇది గుండె జబ్బులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్లు రావటానికీ దోహదం చేస్తుంది.

కడుపుని పట్టుకున్నప్పుడు చర్మం కింద చేతికి తగిలే కొవ్వు కన్నా.. లోపల అవయవాల చుట్టూ పేరుకునే కొవ్వు ఇంకా ప్రమాదకరం. అందుకే పొట్ట తగ్గించుకోవాలంటే.. ప్రతిరోజూ ఉదయాన్నే పుదీనా ఆకుల రసాన్ని తాగితే సరిపోతుంది. దీనివల్ల మెటబాలిజం పెరిగి, ఒంట్లోని క్యాలరీలు కరిగిపోతాయి.

ఆకుకూరల్లో పుదీనాకు ప్రత్యేక స్థానం ఉంది. పుదీనాలో అనేక ఔషధ గుణాలున్నాయి. ఈ ఆరోమాటిక్ పుదీనా ఆకులను వివిధ రకాల వంటలకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా మసాలా వంటలకు దీని వాడకం ఎక్కువ. వంటల్లో పుదీనాను వాడటం కేవలం రుచి, వాసనకు మాత్రమే కాదు. ఇందులో అనేక ఔషధ గుణాలు దాగున్నాయి.

అందుకు పురాతన కాలం నుండే పుదీనాను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వివిధ రకాల ఆయుర్వేదిక మందులను తయారుచేయడంలో పుదీనా వినియోగస్తున్నారు. ఇది తినడానికి కాస్త చేదుగా అనిపించినా, తినగ..తినగా అలవాటుగా మారితే అలా ఫీలవ్వరు. పుదీనా తినడానికి ఇష్టపడుతారు.

పుదీనా ఆకుల్లో క్యాలరీలు తక్కువ. అంతే కాదు, ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ వల్ల జీర్ణ సమస్యలను తగ్గించుకోవచ్చు. కొలెస్ట్రాల్ లెవల్స్ పెంచుకోవచ్చు. బరువు పెరగకుండా, ఓబేసిటి సమస్యలను తగ్గించుకోవచ్చు. పుదీనాలో జీర్ణవ్యవస్థకు సహాయపడే ఎజైమ్స్ అధికంగా ఉండటం వల్ల, ఇవి ఫ్యాట్ ను కరిగించడానికి అవసరమయ్యే శక్తిగా మారుతుంది. అందుకే పుదీనా బరువు తగ్గించడంలో ఏవిధంగా సహాయపడుతుందో త్వరగా తెలుసుకుందాం.

మన రెగ్యులర్ వంటకాల్లో పుదీనాను ఎందుకు చేర్చుకోవాలి

ఆ రోజుల్లో పుదీనాను కేవలం వంటలకు మాత్రమే కాకుండా, పుదీనాతో క్యాండీస్, మౌత్ ఫ్రెషన్ నర్స్, మరియు చూయింగ్ గమ్స్ తయారుచేస్తున్నారు. అంతే కాదు మనం రోజూ వినియోగించే పుదీనా ఫ్లేవర్ కలిగిన పేస్ట్ ను వాడుతున్నాము.

పుదీనా బరువు తగ్గించడంతో పాటు, జీర్ణశక్తిని పెంచుతుంది, వికారం తగ్గిస్తుంది. శ్వాస సంబంధిత సమస్యలను, డిప్రెషన్ , అలసటను, నోటి దుర్వాసనను, చెడు శ్వాసని నివారిస్తుంది.
పుదీనా జీర్ణశక్తిని మెరుగుపరచడంతో పాటు, స్టిమ్ ను క్లీన్ చేస్తుంది. దాంతో బరువు తగ్గడం సులభం అవుతుంది. పుదీనాతో ఎఫెక్టివ్ గా బరువు తగ్గించుకోవడం ఎలాగో తెలుసుకుందాం...

1. పుదీనా జ్యూస్

1. పుదీనా జ్యూస్

ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర తీసుకుని, ఆకులు విడిపించి, నీటితో శుభ్రంగా కడగాలి.

ఈ రెండు పదార్థాలతో పాటు, ఒక గ్లాసు నీళ్లు మిక్సీ జార్ లో వేసి చిటికెడు బ్లాక్ సాల్ట్ మరియు పెప్పర్ కూడా వేసి గ్రైండ్ చేయాలి.

తర్వాత ఈ జ్యూస్ ను ఒక గ్లాసులోనికి తీసుకుని, దీనికి కొద్దిగా నిమ్మరసం చేర్చి ప్రతి రోజూ ఉదయం పరగడపున తాగాలి.

రోజూ అప్పటికప్పుడు ఫ్రెష్ గా తయారుచేసిన రసాన్ని మాత్రమే తాగాలి.ఇలా చేస్తే తప్పకుండా, ఎఫెక్టివ్ గా బరువు తగ్గుతారు.

సమ్మర్ లో ఉదయాన్నే పుదిన వాటర్ తాగడం వల్ల పొందే హెల్త్ బెన్ఫిట్స్

2. పుదీనా టీ :

2. పుదీనా టీ :

దీని కోసం ఎండిన పుదీనా లేదా ఫ్రెష్ పుదీనా ఆకులు తీసుకోవచ్చు. ఫ్రెష్ గా ఉన్న పుదీనా ఆకులను తీసుకుని, వేడి నీళ్ళలో వేసి ఉడికించాలి. కొద్ది సేపు ఉడికించి తర్వాత, స్టౌ ఆఫ్ చేసి, వడగట్టి, గోరువెచ్చగా తాగాలి. ఎఫెక్టివ్ గా బరువు తగ్గాలంటే రోజుకు రెండు మూడు కప్పులు పుదీనా టీ తాగాలి.

పెప్పర్ మింట్ టీ లో గొప్ప ఆరోగ్యప్రయోజనాలు

3. ఆహారాల్లో పుదీనా చేర్చడం:

3. ఆహారాల్లో పుదీనా చేర్చడం:

కొన్ని ఫ్రెష్ గా ఉండే పుదీనా ఆకులను తీసుకుని, సలాడ్స్, స్మూతీస్, ఇతర జ్యూస్ లలో మిక్స్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పొట్టకు ఉపశమనం కలుగుతుంది. పొట్ట ఉబ్బరం తగ్గుతుంది. ఎఫెక్టివ్ గా బరువు తగ్గుతారు. పుదీనా రెగ్యులర్ డైట్ లో చేర్చుకున్నప్పుడు ఫ్యాట్ ఫుడ్స్, క్యాలరీలు అధికంగా ఉండే ఆయిల్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. వీటితో పాటు రోజూ వ్యాయామం, అరగంట బ్రిస్క్ వాక్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

English summary

How To Use Pudina (Mint) Leaves For Weight Loss

Pudina or mint helps one to lose weight effectively. Know how to use pudina leaves for weight loss on Boldsky.