For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు ఎంత ప్రయత్నించినా, బరువు తగ్గకపోవడానికి 10 ఆశ్చర్యం కలిగించే కారణాలు

By Mallikarjuna
|

బరువు తగ్గించుకోవాలని కోరుకునే వారిలో మీరు కూడా ఒక్కరా? ఎంత ప్రయత్నించినా బరువు తగ్గడంలో ఎలాంటి మార్పు కనబడలేదా? ఎన్ని రకాలుగా ప్రయత్నించినా బరువు తగ్గకపోవడం వల్ల అసహనం, ఫ్రస్టేషన్ కదా?

ఇప్పటికైనా మీకు తెలిసింది బరువు తగ్గడం ఎంత కష్టమో, ఫిట్ నెస్ స్పెషలిస్టులైనా, న్యూట్రీషినిట్స్ అయినా సరే బరువు తగ్గడం చాలా కష్టం

బరువు తగ్గడానికి సెల్ఫ్ కంట్రోల్ తో పాటు, డిసిప్లెయిన్ కూడా ఉండాలి. డైట్ మరియు వ్యాయామం విషయంలో సీరియస్ నెస్ గా లేకుండా బరువు తగ్గడం సాధ్యం కాదు .

ఓవర్ వెయిట్ లేదా ఊబకాయం స్థితికి చేరుకున్నట్లైతే అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, జాయింట్ పెయిన్, అజీర్తి, డిప్రెషన్ వంటి అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.

10 Surprising Reasons Why You Are Not Losing Weight Fast

కాబట్టి, బరువు తగ్గడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొంచెం శ్రమ, శక్తిని, ఏకాగ్రతను పెడితే తప్పకుండా మీ బరువు తగ్గాలనే లక్ష్యాన్ని చేరుకుంటారు.

బరువు తగ్గడానికి మీరు చేయని ప్రయత్నమంటూ ఉండదు, స్ట్రిట్ డైట్ మరియు వ్యాయామం వంటి ఇదివరికే చేసి ఉంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గలేకపోతున్నారు.

బరువు తగ్గకపోవడానికి కొన్ని ఆశ్చర్యకరమైన కారణాలున్నాయి. అవేంటో మీరు కూడా ఒకసారి తెలుసుకోండి.

1. మీరు తీసుకునే ఆహారం ఎలాంటిదో తెలుసుకోకపోవడం:

1. మీరు తీసుకునే ఆహారం ఎలాంటిదో తెలుసుకోకపోవడం:

బరువు తగ్గడానికి డైట్ ను అనుసరించి ఉంటారు కానీ, ఎలాంటివి తినాలి, ఏ ఆహారాలు తినకూడదని మాత్రం తెలియదు. మన డైటరీ హ్యాబిట్స్ ను తెలుసుకుని ఉండాలి. మనం తినే హారం బరువు తగ్గడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదని తెలుసుకోవాలి. అప్పుడే మీరు క్వాలిటి ఫుడ్ తో బరువు తగ్గడం సులభం అవుతుంది.

2. ప్రోటీన్ డైట్

2. ప్రోటీన్ డైట్

కొంత మంది మజిల్ మాస్ పెంచుకోవడానికి ప్రోటీన్స్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకుంటారు, కదా? అయితే, చాలా మంది బరువు తగ్గాలనే క్రమంలో ప్రోటీన్ ఫుడ్ ను పూర్తిగా నివారిస్తుంటారు. లోక్యాలరీ డైట్ తీసుకుంటారు. ప్రోటీన్స్ తక్కువగా తీసుకోవడం వల్ల శరీయం యొక్క జీవక్రియలు ఆలస్యం అవ్వడంతో బరువు త్వరగా తగ్గకపోవచ్చు. లీన్ మీట్, చెన్నా, పల్స్, ఆకుకూరలు మొదలగు హైప్రోటీన్ ఫుడ్స్ తీసుకోవాలి.

3. లో క్వాలిటీ ఫుడ్

3. లో క్వాలిటీ ఫుడ్

మీరు స్ట్రిట్ గా డైట్ మరియు వ్యాయామం అనుసరిస్తున్నా , బరువు తగ్గడం లేదంటే , మీరు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారో తప్పనిసరిగా తెలుసుకోవాలి. హోల్ వీట్, హోల్ గ్రెయిన్స్, ప్రొసెస్ చేసిన ఆహారాలు తినడం వల్ల శరీరం యొక్క మెటబాలిజం రేటు తగ్గి, బరువు తగ్గడం ఆలస్యం చేస్తుంది.

4. వెయిట్ ట్రైనింగ్ నిర్లక్ష్యం చేయడం లేదా మానేయడం

4. వెయిట్ ట్రైనింగ్ నిర్లక్ష్యం చేయడం లేదా మానేయడం

చాలా వరకూ బరువు తగ్గాలని కోరుకునే వారికి రెగ్యులర్ వ్యాయామం వల్ల ఎక్కువ క్యాలరీలు బర్న్ అవుతాయి. అయితే రన్నింగ్, జాయింగ్ వంటి కార్డియో వ్యాస్కులర్ వ్యాయామాలు బరువు తగ్గడానికి ఉపయోగపడకపోవచ్చు. ఇంకా వెయిట్ ట్రైనింగ్, వెయిట్ లిఫ్టింగ్ వంటి జిమ్ వ్యాయామాలు కూడా చేస్తే శరీరంలో జీవక్రియలు వేగంగా పనిచేసి, త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతాయి

5. ఎప్పుడూ తింటుండడం

5. ఎప్పుడూ తింటుండడం

డైట్ ఫాలో అయ్యే వారికి, ముఖ్యంగా బరువు తగ్గడానికి డైట్ ను ఫాలో అయ్యే ప్రారంభ దశలో ఎక్కువ ఆకలిగా ఉంటుంది.ఒక్క సారిగా డైట్ ను తగ్గించడం వల్ల ఆకలి పెరిగి ఏదోఒకటి తినాలి అనిపించడంతో , అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు బరువు తగ్గకుండా చేస్తాయి. జంక్ ఫుడ్స్ తినడం వల్ల బరువు తగ్గడం ఆలస్యం అవుతుంది.

6. స్వీట్స్, పంచదార ఎక్కువగా తీసుకోవడం

6. స్వీట్స్, పంచదార ఎక్కువగా తీసుకోవడం

మీరు వేగంగా, త్వరగా బరువు తగ్గాలని కోరుకుంటున్నట్లైతే, మీ రోజువారి అలవాట్లలో చిన్న పాటి మార్పులు తప్పనిసరి, పంచదారను జోడించడం మానేయాలి. ఒకస్పూన్ షుగర్ వేసుకోవడం వల్ల ఏ సమస్య ఉండదని అనుకుంటారు, కానీ వైట్ షుగర్ ను ఒక స్పూన్ వాడిన మెటబాలిజం రేటు తగ్గిపోయి, బరువు తగ్గడం ఆలస్యం అవుతుంది.

7. డీహైడ్రేషన్

7. డీహైడ్రేషన్

చాలా పరిశోధనలు, రీసెర్చ్ ల ప్రకారం చాలా మంది, స్ట్రిట్ గా డైట్ ను ఫాలో అయ్యే వారు రోజుకు సరిపడా నీళ్ళు తాగకపోవడం వల్ల డీహైడ్రేషన్ కు కారణం అవుతుంది. డీహైడ్రేషన్ మెటబాలిక్ రేటును ఆలస్యం చేసి బరువు తగ్గడాన్ని నివాస్తుంది. కాబట్టి, రోజుకు రెండు లీటర్లు నీళ్ళు తాగడం తప్పనిసరి.

8. మెడికల్ కండీషన్స్

8. మెడికల్ కండీషన్స్

బరువు తగ్గడంలో మీకు సమస్య ఉన్నట్లైతే డైట్ , వ్యాయామం చేయడం అన్ని కరెక్ట్ గా ఉన్న బరువు తగ్గడం లేదంటే హార్మోనుల అసమతుల్యత, థైరాయిడ్, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ వంటి వైద్యపరమైన పరిస్థితుల వల్ల బరువు తగ్గకపోవచ్చు. కాబట్టి, పరిస్థితిని తెలుసుకుని, బరువు తగ్గడానికి ప్లాన్ చేసుకోండి.

9. భోజనం మానేయడం

9. భోజనం మానేయడం

చాలా మంది బరువు తగ్గాలనే క్రమంలో భోజనం చేయకుండా మానేస్తుంటారు, భోజనం మానేయడం వల్ల మెటబాలిక్ రేటు తగ్గుతుంది. బరుతు తగ్గడం ఆలస్యం అవుతుంది. భోజనం మానేయడం వల్ల పోషకాహా లోపాలు ఏర్పడవచ్చు.

10. స్మోకింగ్

10. స్మోకింగ్

ధూమపానం , రోజూ స్మోక్ చేయడం వల్ల అత్యంత ప్రమాదకరం. స్మోకింగ్ వల్ల బరువు మీద ప్రభావం చూపుతుంది. సిగరెట్స్ లో ఉండే నికోటిన్ కంటెంట్, శరీరంలో ఫ్యాట్ సెల్స్ ను నిల్వ చేసి, బరువు తగ్గడం ఆలస్యం చేస్తుంది.

English summary

10 Surprising Reasons Why You Are Not Losing Weight Fast

10 Surprising Reasons Why You Are Not Losing Weight Fast,Here are a few surprising reasons on why you may not be losing weight fast, even though you are sticking to a diet and exercise regime.
Story first published:Wednesday, January 24, 2018, 11:43 [IST]
Desktop Bottom Promotion