For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెయిట్ లాస్ కి తోడ్పడే 5 గ్రీన్ జ్యూస్ రెసిపీస్

వెయిట్ లాస్ కి తోడ్పడే 5 గ్రీన్ జ్యూస్ రెసిపీస్

|

వెయిట్ ని అదుపులోఉంచుకోకపొతే అనేక ఆరోగ్యసమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఆరోగ్యకరమైన బరువును మెయింటెయిన్ చేయడం వలన ఫిట్ గా అలాగే హెల్దీగా ఉండవచ్చు. బరువు తగ్గమని మీకు వైద్యుడి నుండి సలహా అందిందా? అయితే, మీరా ప్రయత్నంలో ఉండటం ముఖ్యం. హెల్దీగా వెయిట్ ను తగ్గించుకునే క్రమంలో మీరు ఎన్నో రకాల రెసిపీస్ గురించి తెలుసుకునే ఉండుంటారు. మీ డైట్ చార్ట్ లో తగినన్ని మార్పులూ చేర్పులూ చేసుకుని ఉండుంటారు. వాటితో పాటు కొన్ని జ్యూస్ లు ముఖ్యంగా గ్రీన్ జ్యూస్ లు వెయిట్ లాస్ కి ఉపయోగపడతాయి.

పండ్లు మరియు కూరగాయల జ్యూస్ లు గ్రీన్ జ్యూస్ ల కోవలోకి వస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి మీ శరీరాన్ని క్లీన్స్ చేయడానికి తోడ్పడతాయి. తద్వారా, వెయిట్ లాస్ కు తోడ్పడతాయి. అంతేకాక, ఇవి మెటాబాలిజాన్ని పెంపొందించి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

5 Green Juice Recipes For Weight Loss

అలాగే, వెయిట్ లాస్ కై జ్యూస్ లను కూడా డైట్ లో భాగంగా చేసుకోవడమనేది ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడే గొప్ప విషయం. ఈ జ్యూస్ లలో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి.

వెయిట్ లాస్ కి తోడ్పడే బెస్ట్ గ్రీన్ జ్యూస్ రెసిపీస్ గురించి ఇక్కడ చర్చించడం జరిగింది. ఈ గ్రీన్ జ్యూస్ లు డైయూరేటిక్ ప్రాపర్టీస్ కలిగినవి అలాగే ఫ్యాట్ బర్నింగ్ పదార్థాలు కలిగినవి. ఇవన్నీ ఫ్లూయిడ్ రిటెన్షన్ ను తగ్గించేందుకు తోడ్పడతాయి. వీటిని పరిశీలించండి మరి.

1. పైనాపిల్, కుకుంబర్ మరియు స్పినాచ్ జ్యూస్ రెసిపీ

1. పైనాపిల్, కుకుంబర్ మరియు స్పినాచ్ జ్యూస్ రెసిపీ

అవును, స్పినాచ్ జ్యూస్ లో విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి. అలాగే కేలరీలు తక్కువగా లభిస్తాయి. ఇది వెయిట్ లాస్ కి తోడ్పడే గొప్ప జ్యూస్. ఈ గ్రీన్ లీఫీ వెజిటబుల్ లో విటమిన్ ఏ, విటమిన్ సి, ఫోలేట్, మెగ్నీషియం మరియు ఇతర విటమిన్స్ పుష్కలంగా లభిస్తాయి.

పైనాపిల్ మరియు కుకుంబర్ లో యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు డైజెస్టివ్ ఎంజైమ్స్ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి అదనపు ఫ్యాట్ ను కరిగిస్తాయి. అలాగే ఫ్లూయిడ్ రిటెన్షన్ ను తగ్గిస్తాయి.

ఇంఫ్లేమేషన్ పై పోరాటం, మెటబాలిజంను పెంపొందించడం అలాగే వెయిట్ మేనేజ్మెంట్ అనేవి ఈ జ్యూస్ వలన లభించే ఇతర ప్రయోజనాలు.

ఎలా తయారుచేయాలి:

రెండు పైనాపిల్ స్లైసెస్ ని చాప్ చేయండి. సగం దోసకాయను, నాలుగు స్పినాచ్ ఆకులను, సగం ఆపిల్ (టేస్ట్ ను పెంపొందించడం కోసం) ను అలాగే ఒక కప్పుడు నీటిని జోడించి జ్యూసర్ లో బ్లెండ్ చేయండి. వడగట్టకుండా సర్వ్ చేయండి.

ఎలా తీసుకోవాలి: ఈ జ్యూస్ ను ఖాళీ కడుపులో తీసుకుని అరగంట తరువాత బ్రేక్ ఫాస్ట్ చేయాలి. దీన్ని వారానికి మూడు సార్లు తీసుకుంటే మెరుగైన ఫలితాన్ని గమనించగలుగుతారు.

2. కివీ, లెట్యూస్ మరియు స్పినాచ్ జ్యూస్ రెసిపీ

2. కివీ, లెట్యూస్ మరియు స్పినాచ్ జ్యూస్ రెసిపీ

కివీ, స్పినాచ్ మరియు లెట్యూస్ ని కలిపి తీసుకోవడం వలన శరీరానికి కావలసినంత ఫైబర్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. ఇవి వెయిట్ లాస్ ను ప్రమోట్ చేస్తాయి. కివీలో విటమిన్ సి, విటమిన్ కే మరియు ఇతర ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. వీటిలో కేలరీలు తక్కువగా లభిస్తాయి. అలాగే శక్తి త్వరగా అందుతుంది. లెట్యూస్ మరియు స్పినాచ్ లో కూడా కేలరీస్ తక్కువగా ఉంటాయి.

ఈ గ్రీన్ జ్యూస్ లో డైయూరేటిక్ మరియు క్లీన్సింగ్ ప్రాపర్టీస్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి టాక్సిన్స్ ను తొలగించి ఫ్లూయిడ్స్ ను రిటెయిన్ చేయడానికి తోడ్పడతాయి.

ఎలా తయారుచేయాలి :

ఒక కివీను చాప్ చేయండి. దీంతో పాటు అయిదు స్పినాచ్ ఆకులను, మూడు లెట్యూస్ ఆకులతో పాటు ఒక కప్పుడు నీటిని బ్లెండర్ లో జోడించండి. ఈ డ్రింక్ ను వడగట్టకుండా సెర్వ్ చేయండి.

ఎలా తీసుకోవాలి:

ఈ జ్యూస్ ను ఖాళీ కడుపుతో వారానికి మూడుసార్లు తీసుకోండి.

3. దోసకాయ, సెలెరీ మరియు గ్రీన్ ఆపిల్ జ్యూస్ రెసిపీ

3. దోసకాయ, సెలెరీ మరియు గ్రీన్ ఆపిల్ జ్యూస్ రెసిపీ

ఈ గ్రీన్ జ్యూస్ లో కేలరీస్ అతి తక్కువగా లభిస్తాయి. ఇందులో, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ మరియు మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. ఒక కప్పుడు కుకుంబర్ లో 16 కేలరీలు లభిస్తాయి. అలాగే, విటమిన్ కే, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియంతో పాటు మరికొన్ని ఎసెన్షియల్ న్యూట్రియెంట్స్ లభిస్తాయి. గ్రీన్ ఆపిల్స్ లో నాన్ డైజెస్టబుల్ పదార్థాలు ఉంటాయి. ఇవి గట్ లోని ఆరోగ్యకరమైన బాక్టీరియా వృద్ధిని పెంపొందిస్తాయి. తద్వారా, వెయిట్ లాస్ ని మెరుగుపరుస్తాయి.

అలాగే, ఈ గ్రీన్ జ్యూస్ అనేది ప్రేగుల ద్వారా కొవ్వు శోషణను తగ్గించి మెటాబాలిజాన్ని బూస్ట్ చేస్తుంది. అందువలన, వెయిట్ లాస్ అనేది వేగవంతంగా మారుతుంది.

ఎలా తయారుచేయాలి:

సగం దోసకాయను చాప్ చేయండి. దీంతో పాటు 3 సెలెరీ కట్టలను, ఒక గ్రీన్ ఆపిల్ ను అలాగే ఒక కప్పుడు ఆకులను బ్లెండర్ లో వేయండి.

ఎలా తీసుకోవాలి: ఆపిల్, కుకుంబర్ మరియు సెలెరీ జ్యూస్ ను ఖాళీ కడుపుతో తీసుకోండి. లేదా మధ్యాహ్నం పూట ఈ జ్యూస్ ను తీసుకోండి. వారానికి రెండు లేదా మూడు సార్లు ఈ డ్రింక్ ను తీసుకోండి.

4. నిమ్మ, పార్స్లీ మరియు స్పినాచ్ జ్యూస్ రెసిపీ :

4. నిమ్మ, పార్స్లీ మరియు స్పినాచ్ జ్యూస్ రెసిపీ :

ఈ జ్యూస్ తయారీలో వాడే పదార్థాలు డైయూరేటిక్ నేచర్ కలిగినవి. అలాగే, క్లీన్సింగ్ మరియు యాంటీ ఇంఫ్లేమేటరీ ప్రాపర్టీస్ కలిగినవి. అందువలన, ఇవి వెయిట్ లాస్ కు తోడ్పడతాయి. నిమ్మ అనేది కేలరీలను కరిగించేందుకు తోడ్పడుతుంది. వెయిట్ లాస్ ను ప్రేరేపిస్తుంది. పార్స్లీ కూడా ఇటువంటి గుణాలనే కలిగి ఉంది. అందువలన, మెటబాలిజం మెరుగవుతుంది. ఈ మూడు పదార్థాలు రోగనిరోధకశక్తిని పెంపొందిస్తాయి కూడా.

ఎలా తయారుచేయాలి :

అయిదు పార్స్లీ కొమ్మలను తీసుకోండి. అలాగే, 6 స్పినాచ్ ఆకులను, ఒక సెలరీ కట్టను, సగం దోసకాయను, ఒక టీస్పూన్ తురిమిన అల్లాన్ని (టేస్ట్ ను పెంపొందించడం కోసం) మరియు ఒక నిమ్మకాయ నుంచి సేకరించిన రసాన్ని బ్లెండర్ లో వేయండి. ఒక కప్పుడు నీటిని కూడా బ్లెండర్ లో జోడించండి.

ఎలా తీసుకోవాలి : ఈ జ్యూస్ ను ఖాళీ కడుపుతో వారానికి మూడు సార్లు తీసుకోవాలి.

మరి వెయిట్ లాస్ కు తోడ్పడే ఈ జ్యూస్ లను మీ డైట్ లో భాగంగా చేసుకుంటారు కదా? మీరీ జ్యూస్ ల ద్వారా ఇప్పటికే ప్రయోజనాలు పొంది ఉంటే కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాలను తెలియచేయండి.

English summary

4 Green Juice Recipes For Weight Loss

Green juices contain fruits and vegetables with massive antioxidants which will not only cleanse your body but also help in losing weight too. Pineapple, cucumber and spinach juice; kiwi, lettuce and spinach juice; cucumber, celery and apple juice; carrot, lettuce and broccoli juice; and lemon, parsley and spinach juice are some of the green juices for weight loss.
Story first published:Wednesday, July 25, 2018, 13:05 [IST]
Desktop Bottom Promotion