For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెయిట్ లాస్ కి ప్రయత్నించే వారికి డాక్టర్లు ఇస్తున్న ఏడు ముఖ్యమైన సలహాలు

వెయిట్ లాస్ కి ప్రయత్నించే వారికి డాక్టర్లు ఇస్తున్న ఏడు ముఖ్యమైన సలహాలు

|

శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును తగ్గించుకోవాలని అనుకుంటున్నారా? వెయిట్ ని లూజ్ చేసుకుని మరింత ఆరోగ్యకరంగా ఉండాలనుకుంటున్నారా? మీ సమాధానం అవునని వస్తే మీరు వెయిట్ లాస్ మెకానిజానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వాస్తవాలను అర్థం చేసుకోవాలి.

ఊబకాయం లేదా ఓవర్ వెయిట్ సమస్య అనేక ఆరోగ్య స్థితుల వలన ఎదురవుతుంది. అవి శారీరకమైనవి కావచ్చు లేదా మానసికమైనవి కావచ్చు.

శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వు వలన అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. జాయింట్ పెయిన్, జీర్ణక్రియ సమస్యలు, డయాబెటిస్, హై కొలెస్ట్రాల్, హై బ్లడ్ ప్రెషర్, గుండె జబ్బులు, లివర్ వ్యాధులు, మరిన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.

7 Important Things Doctors Want You To Know About Losing Weight

అంతేకాక, ఊబకాయం లేదా అదనపు బరువు వలన మానసిక సమస్యలు కూడా తలెత్తుతాయి. అఫియరెన్స్ సరిగ్గా లేదని పదే పదే అనిపించడం వలన రాను రాను డిప్రెషన్ మరియు యాంగ్జైటీ సమస్యలు ఎదురవుతాయి.

కాబట్టి, పైన వెల్లడించిన ఆరోగ్య సమస్యలను వీలైనంత వరకు అరికట్టడానికి బరువు తగ్గేందుకు ప్రయత్నించాలి. లేదంటే ఆరోగ్యం చేయి దాటిపోతుంది.

వెయిట్ లాస్ ని ఆరోగ్యకరమైన పద్దతిలో పాటించాలి. అప్పుడే, ఇతర హెల్త్ కాంప్లికేషన్స్ ను అరికట్టవచ్చు. హెల్తీ వెయిట్ లాస్ కై పాటించవలసిన చిట్కాలను డాక్టర్లు ఇక్కడ పొందుబరిచారు. వాటిని పాటిస్తే వెయిట్ లాస్ మిస్టేక్స్ ను అరికట్టుకోగలుగుతారు.

ఇక్కడ వెయిట్ లాస్ కై ఉపయోగపడే కొన్ని చిట్కాలను డాక్టర్లు షేర్ చేశారు. వీటిని తెలుసుకుని హెల్తీ వెయిట్ లాస్ దిశగా అడుగులేయండి మరి.

1. ఆరోగ్యకరమైన ఫుడ్స్ వలన కూడా బరువు పెరగవచ్చు:

1. ఆరోగ్యకరమైన ఫుడ్స్ వలన కూడా బరువు పెరగవచ్చు:

ఈ మధ్యకాలంలో చాలా మంది ఫ్రూట్, వెజిటబుల్స్, బ్రౌన్ రైస్ వంటి ఆరోగ్యకరమైన ఫుడ్స్ ను వెయిట్ లాస్ డైట్ లో భాగంగా చేసుకుంటున్నారు. వీటి వలన వెయిట్ లాస్ ప్రక్రియ సజావుగా సాగుతుందని నమ్ముతున్నారు.

ఇది నిజమే అయినా, వీటిలో కూడా కొంత కేలరీలు లభిస్తాయి. కాబట్టి, వీటిని అతిగా తీసుకోకూడదు. వీటిని మితిమీరి తీసుకుంటే వెయిట్ లాస్ ని అరికట్టే బదులు వెయిట్ ని మరింత పెంచుతాయి. వెయిట్ లాస్ కై ప్రయత్నించే వారు తాము తీసుకునే కేలరీలు అలాగే ఖర్చు చేసే కేలరీలను బేరీజు వేసుకోవాలి. ఆ విధంగా డైట్ ను మెయింటెయిన్ చేయాలి.

కాబట్టి, రోజువారీ కేలరీ ఇంటేక్ లిమిట్స్ ను గమనించుకోవాలి వైద్యులు సూచిస్తున్నారు.

2. సమయానికి ఆహారాన్ని తీసుకోవాలి:

2. సమయానికి ఆహారాన్ని తీసుకోవాలి:

వెయిట్ ను తగ్గడానికి ప్రయత్నించే వారు చాలా మంది జంక్ ఫుడ్ ను అవాయిడ్ చేయడానికి, తక్కువ కేలరీలను తీసుకోవడానికి, వ్యాయామానికి అధిక ప్రాధాన్యతను ఇస్తారన్న సంగతి తెలిసిందే. అయితే, వారు సమయానికి ఆహారాన్ని తీసుకోవడానికి ప్రాధాన్యతనివ్వరు. ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ప్రతి రోజూ మీల్ షెడ్యూల్ ని పాటించరు.

ఆహారాన్ని షెడ్యూల్ ప్రకారం తీసుకోవడం వలన మెటబాలిక్ రేట్ అనేది మెరుగవుతుంది. ఆకలితో ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవటం తగ్గుముఖం పడుతుంది. అందువలన, వెయిట్ లాస్ ప్రక్రియ సజావుగా ముందుకు సాగుతుంది.

3. మెడికేషన్స్ పై దృష్టిపెట్టండి:

3. మెడికేషన్స్ పై దృష్టిపెట్టండి:

చాలా సార్లు, వెయిట్ ని తగ్గనేదుకు ప్రయత్నించే వారు కొన్ని ఇతర ఆరోగ్య స్థితులకు అంటే డిప్రెషన్, డయాబెటిస్, హార్మోనల్ డిజార్డర్స్, కాంట్రాసెప్షన్ కి సంబంధించిన మెడికేషన్స్ ను వాడుతూ ఉండుంటారు.

ఈ మెడికేషన్స్ అనేవి కొన్ని హార్మోనల్ చేంజెస్ ను కలిగిస్తాయి. అందువలన, మరింత బరువు పెరుగుతారు. హెల్తీ డైట్ ను పాటిస్తే వ్యాయామం చేస్తున్నా కూడా శరీర బరువులో మార్పులు చోటు చేసుకుంటాయి. ఇది వెయిట్ లాస్ ప్రాసెస్ కి అడ్డంకిగా మారుతుంది. కాబట్టి, మెడికేషన్స్ వలన ఎదురయ్యే సైడ్ ఎఫెక్ట్స్ ని దృష్టిలో పెట్టుకుని వైద్యున్ని సంప్రదించండి. వైద్య సలహాలను పాటించండి.

4. హార్మోనల్ చేంజెస్:

4. హార్మోనల్ చేంజెస్:

కొన్ని రకాల మెడికేషన్స్ వెయిట్ లాస్ కి అవాంతరంగా మారతాయి. అదే విధంగా కొన్ని రకాల వ్యాధులు వెయిట్ లాస్ ప్రాసెస్ ను మందగించేలా చేస్తాయి. హెల్తీ లైఫ్ స్టైల్ రొటీన్ ని పాటించినా కూడా కొన్ని ఆరోగ్యస్థితులు వెయిట్ లాస్ పై దుష్ప్రభావం చూపుతాయి. థైరాయిడ్, పీసిఓఎస్, స్ట్రెస్ డిజార్డర్, డయాబెటిస్ వంటి కొన్ని వ్యాధులు వెయిట్ లాస్ ప్రాసెస్ కి అడ్డంకిగా మారతాయి.

ముందు ఈ వ్యాధులకు ట్రీట్మెంట్ ను తీసుకుంటూ ఉండాలి. అప్పుడు, వెయిట్ లాస్ పై దృష్టిపెట్టాలి.

5. వెయిట్ లాస్ ని అరికట్టే ఆల్కహాల్ :

5. వెయిట్ లాస్ ని అరికట్టే ఆల్కహాల్ :

ఆల్కహాల్ వలన అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ విషయంపై చాలా మందికి అవగాహన ఉంది. క్యాన్సర్ తో పాటు అడిక్షన్ సమస్యలు తలెత్తుతాయి. అయితే, కొన్ని గ్లాసుల బీర్ తో పాటు కొన్ని రకాల ఆల్కహాల్ ని అప్పుడప్పుడు తీసుకోవడం వలన సమస్యలు ఉండకపోవచ్చని కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

మరోవైపు, వెయిట్ ను తగ్గాలనుకునే వారు ఆల్కహాల్ కి దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇందులో ఎంప్టీ కేలరీలతో పాటు ఇంసోల్యుబుల్ కార్బన్ లభిస్తాయని, ఇవి మెటాబాలిజాన్ని తగ్గిస్తాయని చెప్తున్నారు.

6. డైట్ కే ప్రాధాన్యత:

6. డైట్ కే ప్రాధాన్యత:

వెయిట్ ని తగ్గాలనుకునే వారు కొన్ని రకాల హెల్తీ డైట్స్ ను పాటిస్తూ ఉంటారు. అయితే, కొంతకాలం వరకే ఈ డైట్స్ ను పాటిస్తూ తిరిగి మాములు డైట్ లోకి వచ్చేస్తారు. ఓల్డ్ లైఫ్ స్టైల్ కి మారిపోయి అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ప్రారంభిస్తారు. దీని వలన బరువు పెరగవచ్చు.

కాబట్టి, హెల్తీ డైట్ ను ప్రారంభిస్తే మీరు దాన్ని మీ లైఫ్ స్టయిల్ లో భాగం చేసుకోవాలి. కొన్ని కొన్ని మార్పులతో మీ ఆరోగ్యానికి సూట్ అయ్యే విధంగా డైట్ ను ప్లాన్ చేసుకోవాలి. వైద్య సలహాలు తీసుకోవడం మంచిదే.

7. అతిగా తిని వర్క్ అవుట్ చేసినా లాభం లేదు:

7. అతిగా తిని వర్క్ అవుట్ చేసినా లాభం లేదు:

వెయిట్ ను తగ్గాలనుకునే వారు డైట్ ను అలాగే ఎక్సర్సైజ్ రొటీన్ ను పాటించాలి. నిజానికి, డైట్ తో పాటు వ్యాయామం వంటివి వెయిట్ లాస్ కి తోడ్పడతాయి.

అయితే, మీరు విపరీతమైన వర్కవుట్స్ చేసినంత మాత్రాన ఏది పడితే అది తినవచ్చని భావించవద్దు. స్ట్రిక్ట్ డైట్ ను పాటించండి. రెగ్యులర్ బేసిస్ లో వ్యాయామం చేయండి. అప్పుడే వెయిట్ లాస్ ప్రక్రియ ముందుకెళుతోంది.

English summary

7 Important Things Doctors Want You To Know About Losing Weight

Being obese or overweight can cause numerous health issues. So, it's very important to make an effort to maintain a healthy weight. Some of the tips given by doctors to lose weight are: healthy foods can also cause weight gain, eat on time, pay attention to your medications, check for hormonal diseases, working out does not justify overeating, etc.
Desktop Bottom Promotion