For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు చేపలు ఎక్కువగా ఎందుకు తినాలో చెప్పే 7 ముఖ్య కారణాలు !

|

మీరు సీ-ఫుడ్‌ను ఎక్కువగా ఇష్టపడతారు, అందులో ముఖ్యంగా చేపలను ? అవును అన్నట్లయితే, మీకొక శుభవార్త ! ఇప్పటి వరకూ మీరు మంచి టేస్ట్ కోసం మాత్రమే చేపలను తింటూ ఆనందించారు, వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గూర్చి గానీ మీరు తెలుసుకుంటే తప్పక చేపలను మరింత ఎక్కువగా తింటారు మీరు !

ఒకవేళ మీరు చేపలను ప్రత్యేకంగా ఇష్టపడని వారైతే, మీ ఆహారంలో తప్పక చేపలను జోడించాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే, విజ్ఞానశాస్త్రం తెలియజేసిన దాని ప్రకారం, చేపలను ఆహారంగా తీసుకోవడం వల్ల మీకు ఊహించని అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని రుజువైంది, ఏంటి ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతున్నారా !

మన పురాతన సాంప్రదాయాల ప్రకారం, భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక మారుమూల ప్రాంతాల్లో ఉండే తీర ప్రాంత ప్రజలు చాలా తెలివైనవారిగా ఉంటూ, మంచి ఆరోగ్యమును & మంచి చర్మ టోన్‌ను కలిగి ఉంటారు, ఎందుకంటే చేపలే వారి ప్రధాన ఆహారం కాబట్టి !

7 Reasons Why You Should Eat More Fish

ఈ నమ్మకం ఒట్టి అపోహ మాత్రమే కాదు, అనేక శాస్త్రీయ పరిశోధన అధ్యయనాలు కూడా చేపలు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని కనుగొన్నారు.

మీరు తరచుగా చేపలను తినడం వల్ల - మీకు కలిగే ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి. అవి

1. అల్జీమర్స్ వ్యాధిని నిరోధిస్తుంది :-

1. అల్జీమర్స్ వ్యాధిని నిరోధిస్తుంది :-

అల్జీమర్స్ అనేది 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రజలను సాధారణంగా ప్రభావితం చేసే ఒక ప్రమాదకరమైన మెదడు సంబంధిత వ్యాధి. ఈ వ్యాధి కారణంగా మెదడు కణాలు చాలా త్వరగా క్షీణించడానికి దారితీస్తుంది & ఆలోచనాశక్తి కోల్పోవడం, సమన్వయం కోల్పోవడం - శరీరం సమతుల్యతను కోల్పోవడం, నిరాశ, గందరగోళం, ఆందోళన, డిప్రెషన్ మొదలైన వాటికి అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ అల్జీమర్స్ వ్యాధి నయమయ్యేది మాత్రం కాదు. 2016 లో ది జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, క్రమం తప్పకుండా చేపలను ఆహారంగా తీసుకోవడం వల్ల మీ మెదడు కణాల వేగవంతమైన క్షీణతను & వృద్ధాప్యంలో మెదడు పనితీరు క్షీణతను నిరోధించి, మానవ మెదడు పై ఉండే బూడిద రంగు పదార్థాన్ని మెరుగుపరుస్తుంది, దీని వలన అల్జీమర్స్ వ్యాధిని నివారించబడతుంది.

2. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది :-

2. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది :-

గుండె అనేది మానవ శరీరంలో అతి ముఖ్యమైన అవయవం & దాని ఆరోగ్యకరమైన పనితీరు మన జీవన శ్రేయస్సుకు చాలా అవసరం. మీ హృదయాన్ని ప్రభావితం చేసే ఒక చిన్న వ్యాధి కూడా ప్రమాదకరమైన పరిణామాలకు దారి తీయవచ్చు. అమెరికన్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీలో ప్రచురించబడిన ఒక పరిశోధనా అధ్యయనం ప్రకారం, రోజూ చేపలను తినడం వల్ల హృదయ వ్యాధుల ప్రమాదాన్ని గణనీయమైన స్థాయికి తగ్గించవచ్చు, ఎందుకంటే చేపలలో కనిపించే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ట్రిగ్లిసెరైడ్స్ తగ్గించి, రక్తం గడ్డకట్టడం & రక్తపోటు సంభవించడం వంటి పరిస్థితులను తగ్గిస్తుంది.

. డిప్రెషన్‌ను నివారిస్తుంది :-

. డిప్రెషన్‌ను నివారిస్తుంది :-

డిప్రెషన్ అనేది అందరికీ త్వరగా వ్యాపిస్తున్న ఒక తీవ్రమైన మానసిక రుగ్మత. మెదడులో కలిగే రసాయనిక మార్పులు & హార్మోన్ల మార్పుల కారణంగా తీవ్రమైన విచారమును కలిగి ఉండటం, ఎల్లప్పుడూ నిస్తేజంగా ఉండటం, అలసటను కలిగి ఉండటమే కాక, ఆత్మహత్య ధోరణుల వంటి ఆలోచనలను కూడా కలిగి ఉంటారు. "ది జర్నల్ ఆఫ్ సైకియాట్రీ అండ్ న్యూరోసైన్స్" లో ప్రచురించిన ఒక అధ్యయనం గూర్చి మాట్లాడుతూ, చేపల్లో ఉండే నూనెలు మెదడులోని సెరోటోనిన్ హార్మోన్ స్థాయిలను మెరుగుపర్చడానికి సహాయపడతాయి, ఇది డిప్రెషన్ లక్షణాలను చికిత్స చేసి, తగ్గించగలదు.

4 ఎముకల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది :-

4 ఎముకల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది :-

మనం ఆరోగ్యంగా ఉంటూ, అనారోగ్యకరమైన సమస్యలను నివారించడానికి మనము తప్పక సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలని మనందరికీ బాగా తెలుసు. సమతుల్య ఆహారమంటే ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు మొదలైన అన్ని పోషకాలను తప్పక వినియోగించడమని అర్థం. అలాగే "విటమిన్-డి" కూడా మన ఆరోగ్యానికి అవసరమైనది, ముఖ్యంగా ఎముకలు ఆరోగ్యంగా ఉంచడంలోనూ & మీ మెదడు పనితీరును మెరుగుపరుచుకోవడంలో అవసరమైన ఒక ముఖ్యమైన పోషకాహారం ఇది. విటమిన్ D కి గొప్ప మూలం చేపలు, వీటిని మీరు రోజూ తినడం వల్ల మీ ఎముకల ఆరోగ్యాన్ని బాగా పెంపొందిస్తాయి.

5. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది :-

5. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది :-

నేటి కాలంలో, మనలో చాలామంది ఆఫీస్ వర్క్స్ కోసం కంప్యూటర్ల పైన, ఖాళీ సమయాల్లో మొబైల్స్ పైన ఎక్కువగా పని చేస్తూ ఉండటం వల్ల మీ కళ్ళు సహజంగానే పొడిగా మారటం, కళ్లు ఎరుపెక్కడం, చూపుకు మందగించడం, కంటి దురదలు - వాపులు, ఆస్టిగమాటిజం వంటి కంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. చేపలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కంటి కండరాలకు & నరాలకు తగిన పోషణను అందించడం వల్ల మీ కళ్ళు పూర్తి ఆరోగ్యంగా ఉండగలవని, హెల్త్‌కేర్ రీసెర్చ్ అండ్ క్వాలిటీ ఏజెన్సీ నిర్వహించిన ఒక అధ్యయనం బయటపెట్టింది.

6. ఆర్థరైటిస్‌కు చికిత్సను అందిస్తుంది :-

6. ఆర్థరైటిస్‌కు చికిత్సను అందిస్తుంది :-

రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది స్వయంనిరోధక వ్యాధి, ఇది సాధారణంగా 55 ఏళ్ల వయస్సులో ఉన్న వారిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది, ఇందులో మీ కీళ్ళు & కండరాలు ఎర్రబడి, నొప్పిని కలిగించడమే కాక, కాలి కండరాలు దృఢంగా మారి మీ శరీరంలో కీళ్ల కదలికను నిరోధించేలా చేస్తుంది. "అమెరికన్ కాలేజ్ ఆఫ్ రుమాటాలజీ" ప్రచురించిన మరో అధ్యయనంలో, తరచుగా చేపలను తినడం వల్ల విటమిన్-ఎ & ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మీ ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గించి, చికిత్సను అందిస్తుంది.

7. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది :-

7. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది :-

క్లినికల్ న్యూట్రిషన్ అమెరికన్ జర్నల్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, రోజువారీ ఆహారంలో చేపలను తినడం వల్ల పెద్దప్రేగు కాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వంటి అనేక రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చేపలలో ఉండే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఈ క్యాన్సర్ కణాల అసాధారణ గుణాన్ని సమర్థవంతంగా నిరోధించగలవు.

English summary

7 Reasons Why You Should Eat More Fish

Fish is known to have many nutrients that improve one's overall health. Here are 7 surprising reasons why you should add fish to your regular diet: it prevents Alzheimer's, lowers the risk of heart diseases, treats depression, provides vitamin D, improves eye health, treats arthritis, and lowers cancer risk.
Story first published: Wednesday, August 1, 2018, 15:30 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more