For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వ్యాయామం చేయ‌కుండానే బెల్లీ ఫ్యాట్ త‌గ్గించేసుకోండిలా...

వ్యాయామం చేయ‌కుండానే బెల్లీ ఫ్యాట్ త‌గ్గించేసుకోండిలా...

By Sujeeth Kumar
|

పొట్ట క‌నిపించ‌కుండా ఉండేందుకు వ‌దులైన దుస్తులు కొనడం మొద‌లుపెట్టి విసిగిపోయారా? పొత్తి క‌డుపు పెర‌గ‌డం వ‌ల్ల నిల్చున్న‌ప్పుడు మీ కాళ్ల‌ను మీరే చూసుకోవ‌డానికి ఇబ్బంది ప‌డిపోతున్నారా? ఇదే నిజ‌మైతే బాన పొట్ట‌ను త‌గ్గించుకోవాల్సిన స‌మ‌యం వ‌చ్చిన‌ట్టే! ఇది చాలా మందికి ఉండే స‌మ‌స్య‌. అయితే దీని గురించి అంత‌గా గాబ‌రా ప‌డ‌న‌క్క‌ర్లేదు. కొన్ని మంచి ఆరోగ్య సూత్రాల‌తో పొట్ట‌ను సులువుగా త‌గ్గించుకోవ‌చ్చు.

శ‌రీరంలో కొవ్వు ముఖ్యంగా పొట్ట చుట్టు ఉండే కొవ్వు వ‌ల‌న ర‌క‌ర‌కాల ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌న్న‌ది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. పొట్ట చుట్టు కొవ్వు వ‌ల్ల మోకాలి నొప్పి, క‌డుపులో గ్యాస్‌, మంట‌, హై బీపీ, హై కొల‌స్ట్రాల్‌, గుండె సమ‌స్య‌లు, లివ‌ర్ వ్యాధులు, కిడ్నీలో రాళ్లు, డ‌యాబెటిస్‌, కొన్ని రకాల క్యాన్స‌ర్లు వ‌చ్చే ప్ర‌మాద‌ముంది.

7 Simple Tricks To Reduce Belly Fat Without Exercise!

అధిక బ‌రువు, పొట్ట వ‌ల్ల ఆరోగ్య శారీర‌క స‌మ‌స్య‌లే కాదు, ఆత్మ‌న్యూన‌త భావం కూడా పెరుగుతుంది. మాన‌సికంగా కుంగిపోతారు. ఇత‌రుల‌తో పోల్చుకొని తాము బాగా లేమ‌ని మ‌ధ‌న‌ప‌డేవారు ఎంద‌రో. ఇక బ‌రువు త‌గ్గాలంటే త‌గిన వ్యాయామంతో పాటు మంచి డైట్ ఫాలో కావాలన్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. అయితే వ్యాయామంతోనే అస‌లు చిక్కంతా. కొంద‌రికి అది చేయాలంటే స‌మ‌యం ఉండ‌దు. ఇలాంటి వారు క‌ఠిన‌మైన డైట్ నియ‌మాలు పాటించి తాము అనుకున్న‌ది సాధించుకోవ‌చ్చు.

అవేమిటో మ‌రి చూద్దాం ప‌దండి....

1. ఇవి ఆహారంలో భాగం చేసుకోండి...

1. ఇవి ఆహారంలో భాగం చేసుకోండి...

తొంద‌ర‌గా బాన పొట్ట‌ను త‌గ్గించుకోవాలంటే అదీ ఎలాంటి వ్యాయామం లేకుండా చేయాలంటే ముందు ఆరోగ్యానికి ప్రాధాన్య‌త ఇవ్వాలి. లో ఫ్యాట్ డైట్ ను ఆహారంలో భాగం చేసుకోవాలి. గ్రీక్ యోగ‌ర్ట్ ను తీసుకుంటే క‌డుపులో ఆరోగ్య‌క‌ర బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. త‌ద్వారా పొట్ట కొంచెం కొంచెంగా త‌గ్గుతుంది.

కొవ్వు క‌ణాలు వేగంగా కాలిపోయి కడుపు ఫ్లాట్ గా మారిపోవ‌డాన్ని మీరే గ‌మ‌నించ‌వ‌చ్చు.

2. ఉప్పు త‌గ్గించండి...

2. ఉప్పు త‌గ్గించండి...

కూర‌ల్లో చిటికెడు ఉప్పు వేస్తే ఆ రుచే వేరు. ఆ ఉప్పు లేక‌పోతే ఎన్ని దినుసులు వేసినా వంట‌కానికి రుచే రాదు. ఐతే పొట్ట త‌గ్గించుకోవాలంటే కాస్త ఉప్పు చూసి వేసుకోవాలి సుమా! వీలైనంత త‌క్కువ ఉప్పు తీసుకునేలా జాగ్ర‌త్త ప‌డండి. ఉప్పు నీటిని ప‌ట్టి ఉంచుతుంది కాబ‌ట్టి పొట్ట ద‌గ్గ‌ర కొవ్వు అలాగే నిల్వ ఉండిపోతుంది.

3. చూయింగ్ గ‌మ్ న‌ములుతున్నారా...

3. చూయింగ్ గ‌మ్ న‌ములుతున్నారా...

ఒక్కోసారి చిన్న చిన్న ప‌నులు కూడా పెద్ద ప్ర‌భావాన్ని చూపిస్తాయి. చూయింగ్ గ‌మ్ న‌మ‌ల‌డం లాంటివి ఇలాంటి కోవ‌లోకి వ‌స్తాయి. చూయింగ్ గ‌మ్ లో ఉండే చ‌క్కెర వ‌ల్ల లేదా అందులో ఉప‌యోగించే కృత్రిమ చ‌క్కెర వ‌ల్ల తొంద‌ర‌గా ఆరోగ్యం పాడ‌వుతుంది. అదీకా క బాన పొట్ట అలాగే మిగిలిపోతుంది. చూయింగ్ గ‌మ్ తినాల‌నుకున్న‌ప్పుడు ఈ సారి ఏ న‌ట్స్ లేదా ల‌వంగ‌మో, ఇలాచీనో నోట్లో వేసుకోండి.

4. మ‌ద్యం వ‌ద్దు

4. మ‌ద్యం వ‌ద్దు

బీర్ బెల్లీ .. ఆ పేరు రావ‌డానికి ఒక కార‌ణం ఉంది. బీర్ తాగితే పొట్ట అంటే బెల్లీ పెరుగుతుంద‌ని అర్థం. అందుకే మ‌ద్యం సేవించ‌డాన్ని మొత్తానికి మానేస్తే పొట్ట త‌గ్గుద‌ల‌లో గ‌ణ‌నీయ‌మైన మార్పును గ‌మ‌నించ‌వ‌చ్చు. అదీ కాకుండా మ‌ద్యం మానేస్తే ఆరోగ్యాన్ని కాపాడుకున్న‌వాళ్ల మ‌వుతాం.

5. హార్మోన్ల ప్ర‌భావం

5. హార్మోన్ల ప్ర‌భావం

ఒక్కోసారి కొంద‌రు ఎన్ని ఆరోగ్య సూత్రాలు పాటించినా, మంచి డైట్ ఫాలో అయినా ఎంత‌కీ బెల్లీ ఫ్యాట్ త‌గ్గ‌దు స‌రిక‌దా పెరుగుతూ ఉంటుంది. ఇక ఇలాంటివారు ఏం చేయాలంటే త‌మ హార్మోన్ల‌ను టెస్ట్ చేయించుకోవాలి. డాక్ట‌ర్ చెప్పిన స‌ల‌హా పాటించి ట్రీట్‌మెంట్ తీసుకుంటే పొట్ట త‌గ్గే అవ‌కాశాలు పెరుగుతాయి.

6. ఈ కూర‌గాయలు వ‌ద్దు

6. ఈ కూర‌గాయలు వ‌ద్దు

కొన్ని ప‌రిశోధ‌న‌ల్లో తేలిందేమిటంటే క్యాబేజీ, కాలిఫ్ల‌వ‌ర్‌, బ్ర‌కోలి లాంటి కూర‌గాయ‌లు న‌డుము చుట్టు కొవ్వును పెంపొందిస్తాయ‌ని తెలిసింది. ఇందులో ర‌ఫినోస్ అనే ప‌దార్థం మూలంగా కొవ్వు పెరుగుతుంద‌ని అంటారు. ఇదే క‌డుపులో గ్యాస్‌, మంట‌కు కూడా దారితీయ‌వ‌చ్చు. అందుకే వీటి వినియోగాన్ని సాధ్య‌మైనంత మేర‌కు త‌గ్గించాలి.

7. మ‌ల‌బ‌ద్ద‌క‌మా..?

7. మ‌ల‌బ‌ద్ద‌క‌మా..?

త‌ర‌చు బాత్‌రూమ్‌కు వెళ్లేవాళ్ల‌లో మీరు ఒక‌రా.. మా ఉద్దేశం మ‌ల‌బ‌ద్ధ‌కం ఉన్న‌వారు మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాలి. వీరు వీలైనంత తొంద‌ర‌గా మ‌ల‌బ‌ద్ధ‌కాన్ని వ‌దిలించుకోవాలి. లేదా పొట్ట‌చుట్టు కొవ్వు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి స‌రైన స‌మ‌యంలో వైద్యుడి చికిత్స తీసుకోవాలి.

English summary

7 Simple Tricks To Reduce Belly Fat Without Exercise!

It's important to make an effort to lose belly fat by sticking to a healthy lifestyle routine. You can lose belly fat without exercise by consuming probiotics, lowering salt & alcohol consumption, getting your hormonal levels checked, avoiding cruciferous veggies & chewing gums and eliminating constipation by including more water and fibre in your diet.
Desktop Bottom Promotion