For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వంటచేయడంలో ఈ 8 అనారోగ్యకర తప్పిదాలు, మీ అనారోగ్యానికి హేతువులు

వంటచేయడంలో ఈ 8 అనారోగ్యకర తప్పిదాలు, మీ అనారోగ్యానికి హేతువులు

|
8 Cooking Mistakes That Are Making Your Food Unhealthy

మనం ఎంతో రుచికరంగా ఆహారాన్ని వండుకుని తింటుంటాం, అన్నీ ఆరోగ్యకరమైన పదార్దాలే ఉండవచ్చు, అన్నీ రుచికరంగా కూడా ఉండవచ్చు. కానీ, వండిన తర్వాత, అవి మీ శరీరానికి సరిపడనివిగా కూడా మారవచ్చు. మనం వండే మాంసం, అదనంగా జోడించే దినుసులు, ఫ్రై చేయడానికి వినియోగించే నూనె ప్రతిదీ మన శరీరం మీద నేరుగా ప్రభావాలను చూపగలవు. మనం ఎంత గొప్పగా వండుతున్నప్పటికీ, ఎంత వంటలో చేయితిరిగిన వారిమి అయినప్పటికీ, మనం చేసే చిన్నచిన్న తప్పిదాలు వంటలోనే కాకుండా మన శరీరంపైన కూడా ప్రభావాలను చూపగలవని మరచిపోకూడదు.

ఉదాహరణకు వండినప్పుడు లేదా ఉడికించినప్పుడు కూరగాయలు వాటిలోని పోషకాలను కోల్పోతుంటాయి. కాబట్టి, వాటిని వండే క్రమంలో కూడా కొన్ని పరిమితులు పాటించవలసి ఉంటుంది. భవిష్యత్తులో అటువంటి తప్పులు దొర్లకుండా ఉండేందుకు ఒక అవగాహనా నిమిత్తం ఈవ్యాసం మీకు సహాయపడగలదు.

1.మసాలా దినుసులు మరియు డ్రెస్సింగ్ అధిక వినియోగం :

1.మసాలా దినుసులు మరియు డ్రెస్సింగ్ అధిక వినియోగం :

వంటలలో లేదా సలాడ్స్లో డ్రెస్సింగ్ అనేది అదనపు ఆకర్షణను జోడించడానికి సహాయపడుతుంది. క్రమంగా సోయాసాస్, మయోనైస్ సాస్ వాడకం కూడా విరివిగా వినియోగించడానికి ఎక్కువ మక్కువ చూపుతుంటారు. కానీ మీరెప్పుడైనా ఆలోచించారా, వాటి అధిక వినియోగం అనారోగ్యకరమైనదని? ఈ డ్రెస్సింగ్లు పెద్ద మొత్తంలో సోడియం నిక్షేపాలను కలిగి ఉంటాయి, ఇవి క్రమంగా శరీరంలో నీటి ప్రవాహాన్ని అడ్డుకుని నిలుపుదలకి దారితీస్తాయి.

క్రమంగా వీటి అధిక వినియోగం, మీ అనారోగ్యకర జీవితానికి నాంది పలుకుతాయి అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు.

2. అధిక ఉష్ణోగ్రతలలో తేనెని వేడిచేయడం

2. అధిక ఉష్ణోగ్రతలలో తేనెని వేడిచేయడం

అనేక ఔషధ లక్షణాలను కలిగిన దీర్ఘకాల కీర్తిని కలిగి ఉన్న తేనె, చక్కెర మరియు కృత్రిమ స్వీటెనర్లకు అద్భుతమైన ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. తేనె ఒక సహజ సిద్దమైన స్వీటెనర్ మరియు ముడి రూపంలో వినియోగించడం మూలంగా ఉత్తమ ఫలితాలను పొందగలరు కూడా. అధిక ఉష్ణోగ్రతలకి గురిచేయడం వలన, దాని ఔషధ లక్షణాల తొలగింపునకు దారి తీస్తుంది. మరియు తేనెలోని నాణ్యతను దెబ్బతీస్తుంది. క్రమంగా ఎంజైములు మరియు పోషకాలను కోల్పోయి విషపూరితంగా మారుతుంది.

తేనె ఒక సహజ సిద్దమైన స్వీటెనర్ మరియు ముడి రూపంలో వినియోగించడమే ఉత్తమం.

3. ఆరోగ్యకరమైన నూనెలను వేడిచేయడం

3. ఆరోగ్యకరమైన నూనెలను వేడిచేయడం

కొన్ని కూరగాయల నూనెలను ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వరకు వేడి చేయవచ్చు. కానీ ఆలివ్ నూనె వంటి కొన్ని ఆరోగ్యకర నూనెలను తీవ్ర స్థాయిలో ఎన్నటికీ వేడికి గురిచేయకూడదు. ఈ నూనెలు పోషక సమ్మేళనాలను కలిగి ఉంటాయి, వాటిని వాటి స్మోక్ స్టాండర్డ్ పాయింట్ల పైన ఎన్నటికీ వేడి చేయరాదు. ఉదాహరణకు, పొద్దుతిరుగుడు నూనె ఎల్లప్పుడూ మితంగానే వేడి చేయాలి, ఫ్రై అయినా రోస్ట్ అయినా. అయితే, తయారు చేసిన ఆహారపదార్ధాల మీద వర్జిన్ ఆయిల్ లేదా ఫ్లాక్స్ సీడ్ నూనెను ఫ్లేవర్గా జోడించడం ఉత్తమంగా ఉంటుంది.

ఈ నూనెలు పోషక సమ్మేళనాలను కలిగి ఉంటాయి, మరియు అవి వాటి స్మోక్ స్టాండర్డ్ పాయింట్లు మీద వేడి చేసినపుడు, ఆ పోషకాలను కోల్పోతుంటాయి. కావున జాగ్రత్తవహించవలసి ఉంటుంది.

4. ఆహారాన్ని వేయించడం

4. ఆహారాన్ని వేయించడం

వేయించిన ఆహారాలు అత్యంత రుచిగా ఉంటాయి అనడంలో ఆశ్చర్యమే లేదు; ఏదేమైనా, అవి అనారోగ్యకరమైనవి మరియు ట్రాన్స్-ఫాట్- లాడెన్ ట్రీట్స్. వేయించే చర్య కూరగాయలు మరియు లీన్ మాంసాల వంటి ఆరోగ్యకరమైన ఆహారాలనుసైతం అనారోగ్యకర రుచికరమైన పదార్ధాలుగా మారుస్తాయి. అంతేకాకుండా, ఈ ఆహారాలు డయాబెటిస్, హార్మోనుల అసమతౌల్యం, జీర్ణ వ్యవస్థ దెబ్బతినడం, మరియు గుండె సంబంధిత అనారోగ్యకర పరిస్థితుల వంటి సమస్యలకు దారితీసే అవకాశాలు లేకపోలేదు.

వేయించిన ఆహారాలు రుచికరంగానే ఉంటాయి; ఏదేమైనా, అవి అనారోగ్యకరమైనవని మరచిపోరాదు.

5. తప్పుడు వంటసామాన్ల వినియోగం

5. తప్పుడు వంటసామాన్ల వినియోగం

వంటలు చేయడంలో ముఖ్యమైన భాగం, వాటిని వండే పాత్రలను ఎంచుకోవడం. కొన్ని అసంబద్దమైన తక్కువ రకం, లేదా నాసిరకం పాత్రలు అనారోగ్య హేతువులుగా పరిణమిస్తుంటాయి. ఈ పాత్రల ఎంపికలో ఖరీదు ఆలోచనలు చేస్తే, అనారోగ్యాల బారిన పడి ఆసుపత్రులకు ఎక్కువ ఖర్చు చేసుకోవలసిన పరిస్థితులు దాపురిస్తాయి. కావున వంటసామానుల వివరాలను, వాటిని తయారుచేసే లోహాల వివరాలను పూర్తిస్థాయిలో తెలుసుకోవడం ఉత్తమం. నాన్ స్టిక్ వంటసామాన్లు టెఫ్లాన్ కలిగి ఉంటుంది, ఇది పర్ఫ్లురోఆక్టానోయిక్ యాసిడ్ అని పిలువబడే మానవ నిర్మిత రసాయనంతో చేయబడి ఉంటుంది. ఇది మొత్తం ఆరోగ్యం మీద, ముఖ్యంగా కాలేయంలో సమస్యలను కలిగిస్తుందని చెప్పబడింది. ప్రాథమికాలుగా, కాస్ట్ ఐరన్, గాజు, సిరామిక్ లేదా స్టెయిన్లెస్ స్టీల్ వంటి వాటితో తయారుచేసిన వంటసామాల్లో ఉడికించడం ఉత్తమం.

6. ఆహారం మీద ముడి ఉప్పును జోడించడం

6. ఆహారం మీద ముడి ఉప్పును జోడించడం

మనలో కొందరు బ్లాండ్-డిష్ యొక్క రుచిని మార్చడానికి ఆహారంమీద ఉప్పును చిలకరించే అలవాటును కలిగిఉంటారు. అయితే, వండని రూపంలో ముడి ఉప్పును తీసుకోవడం వలన గుండెవ్యాధులు మరియు మూత్రపిండాల సమస్యలను పెంచే అవకాశాలు అధికంగా ఉంటాయి.

కావున ఆహారపదార్ధాల మీద ఉప్పును చిలకరించే అలవాటు ఉంటే ఖచ్చితంగా మనుకోవలసినదిగా సిఫార్సు చేయబడినది.

7. ఎక్కువసేపు కూరగాయలను ఉడికించడం

7. ఎక్కువసేపు కూరగాయలను ఉడికించడం

కూరగాయలను ఎక్కువసేపు ఉడికించడం లేదా ఫ్రై చేయడం ద్వారా వాటిలో ఉండే అవసరమైన పోషకాలను కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. క్రమంగా వాటి ప్రయోజనాలను పూర్తిస్థాయిలో పొందలేము. పోషకాలను పూర్తి స్థాయిలో పొందాలనుకుంటే, ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ వేగకుండా, లేదా ఉడికించకుండా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. పోషకాలను సంరక్షించడానికి ఉత్తమమైన మార్గాలలో ఒకటి కదిలిస్తూ వేయించడం. ప్రత్యామ్నాయంగా, మీరు సూప్లో పూర్తి స్థాయిలో పోషకాలను పొందాలి అనుకుంటే, వాటిని వేడి నీటిలో కత్తిరించడం మంచిది. మీరు వంటకు ఉపయోగించే కూరగాయలు క్రిస్పీగా, తాజాగా, దృడంగా ఉన్నాయని నిర్ధారించుకోండి.

కావున కూరగాయలను ఎక్కువసేపు ఉడికించే అలవాట్లు ఉంటే, ఆ అలవాటును మానుకోవలసినదిగా సూచించడమైనది.

8. కూరగాయల తొక్కను పూర్తిగా తొలగించడం(పీల్-ఆఫ్)

8. కూరగాయల తొక్కను పూర్తిగా తొలగించడం(పీల్-ఆఫ్)

మీకు తెలుసా, కొన్ని కూరగాయలలో తోక్కలోనే అధిక పోషకాలు దాగున్నాయని? బంగాళాదుంపలు, క్యారట్లు, గుమ్మడికాయలు, దోసకాయలు మరియు ఆపిల్ మొదలైన వాటి తొక్కలో, మీకు అదనపు ఖనిజాలు మరియు విటమిన్లు అందించే అనేక పోషకాల నిక్షేపాలు ఉన్నాయి. అంతేకాకుండా మీ జీర్ణవ్యవస్థను సరిగ్గా నడుపగల ఫైబర్ నిక్షేపాలను కూడా కలిగిఉంటాయి.

English summary

8 Cooking Mistakes That Are Making Your Food Unhealthy

Many of you like to eat vegetables and cook them in a proper way to enhance the taste. You want it to be a delicious dish by retaining all the maximum amount of flavour and nutrients. However, sometimes, an innocent error can lead to cooking the veggies in the wrong way by sucking out all the nutrients.
Story first published:Tuesday, August 28, 2018, 10:53 [IST]
Desktop Bottom Promotion