For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక రోజు మొత్తంలో మీ శరీరంలో ఉన్న క్యాలరీలను తగ్గించగల 8 అత్యుత్తమమైన మార్గాలు !

|

ఆరోగ్యవంతమైన శరీరమును ఎల్లప్పుడూ కలిగి ఉండటానికి - మీ శరీరంలో ఉన్న క్యాలరీలను రోజంతా తగ్గించుకోవడమే ప్రధాన లక్ష్యంగా చేసుకొని ఉంటుంది. చాలామంది తమ శరీరంలో ఉన్న కేలరీలను తగ్గించుకునే విషయంలో చాలా రకాలుగా కష్టపడతారు. కానీ అలా చేసే ప్రతీ పని సమర్థవంతమైనవిగా పని చెయ్యలేవు (లేదా) క్యాలరీలను తొలగించే వ్యాయామాలు సరిగ్గా పనిచేయకపోవచ్చు.

అలాంటి కేలరీలను తగ్గించుకోవటం అనేది మనకు ఒక సవాలుగా మారవచ్చు. అయినప్పటికీ ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామాలు, జీవనశైలిలో కలిగే మార్పులు వంటివి అన్నీ కూడా, ఇంటి చిట్కాలతో బాగా కలిసి ఉండటం వల్ల రోజంతా మీరు శరీరంలో దాగి ఉన్న క్యాలరీలను కోల్పోయేలా చేయగలవు.

ఇక్కడ ఉన్న కొన్ని ఆచరణీయమైన మార్గాలు, వ్యాయామాలకు వెళ్లి కష్టపడకుండానే, మీ శరీరంలో ఉన్న అదనపు క్యాలరీలను తగ్గించడీలను తగ్గించడంలో బాగా సహాయపడతాయి. అవి,

1. మొదలు పెట్టినరోజు :

1. మొదలు పెట్టినరోజు :

మీ రోజువారీ కార్యాచరణలో భారీ వ్యాయామాలను చేర్చకపోతే, మీ శరీరాన్ని వేడెక్కించే వ్యాయామాలతో మీ రోజును ప్రారంభించవచ్చు. మీ శరీరానికి 10 నిమిషాలపాటు చెమట పట్టడం వల్ల జరిగే అద్భుతాలను మీరు చూడవచ్చు. కొన్ని తేలికైన యోగాసనాలు మొదలు పెట్టిన రోజునే స్వాగతించేలా ఉండటమే కాకుండా, మీ శరీరంలో ఉన్న కేలరీలు త్వరగా కరిగిపోయేలా సహాయపడవచ్చు. వాటికితోడుగా మీరు కొన్ని నిమిషాలపాటు వాకింగ్ను (లేదా) తోటపనిని చెయ్యవచ్చు.

2. బ్రేక్-పాస్ట్ నియమాలు :

2. బ్రేక్-పాస్ట్ నియమాలు :

ఆరోగ్యకరమైన అల్పాహారం అనేది మీ ఆహార ప్రణాళికలో చాలా కీలకమైనది. కానీ మొదటి నియమం ఏమిటంటే, అల్పాహారమును అస్సలు మిస్ కావద్దు. అల్పాహారమనేది జీవక్రియను పెంచుతుందని చెప్పబడింది. అంతేకాక, ఆరోగ్యకరమైన అల్పాహారమును తీసుకోవడం వల్ల, మీరు తినే స్నాక్స్ను అదనంగా కోరుకోదు - ఒకవేళ మీరు అల్పాహారాన్ని తీసుకోకపోతే, స్నాక్స్ను తీసుకోవాలన్న కోరిక అమితంగా పెరుగుతుంది. అలా మీ శరీరంలో అదనపు క్యాలరీలు పెరుగుతాయి.

3. మీరు మాట్లాడుతూ నడవండి :

3. మీరు మాట్లాడుతూ నడవండి :

ఫోన్లో మాట్లాడేందుకు మనం చాలా సమయాన్ని వృధా చేస్తున్నాం, నిజము కాదా మరి ? మీ ప్రియమైనవారితో మాట్లాడుతున్నప్పుడు మీ శరీర బరువును ఎలా తగ్గించుకోవాలి? మీ ఫోన్ మోగినప్పుడు, మాట్లాడుతూ నడిచే ఒక అలవాటును నేడే ప్రారంభించండి. ఫోన్లో మాట్లాడేటప్పుడు మీ ఇంటి చుట్టూ (లేదా) మీ ఆఫీసు చుట్టూ నడవండి.

4. చూయింగ్-గమ్ :

4. చూయింగ్-గమ్ :

చూయింగ్-గమ్ అనేది మన శరీరంలో ఉన్న కేలరీలను వదిలించుకునే ఒక సరదా అయిన మార్గం. ఒక గమ్ను నమలడం వల్ల మీ నోటి కండరాలకు వ్యాయామం చేకూరడమే కాకుండా, కేలరీలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. చూయింగ్-గమ్ను నమలడం వల్ల, మీరు తీసుకునే ఆహారంలో - 10% తక్కువ ఆహారాన్ని తీసుకునేలా దారి తీస్తుంది. ఈ చూయింగ్-గమ్ మీ శరీరంలో అదనపు ఫ్లాబ్ను జోడించడం వల్ల, మీరు తీసుకునే స్నాక్స్ను దాటవేయడం ద్వారా తక్కువ కేలరీలు తినేలా చేస్తుంది.

5. మంచినీళ్లను ఎక్కువగా త్రాగండి :

5. మంచినీళ్లను ఎక్కువగా త్రాగండి :

అవును, తాగునీరు వల్ల మీ శరీరానికి జోడించబడే అదనపు క్యాలరీలను అడ్డుకుంటాయి. చక్కరను కలిగి ఉన్న పానీయాల కన్నా మంచి నీటిని త్రాగటానికి ఇష్టపడండి. మీరు జాబ్ చేసే చోట, ఒక చిన్న బాటిల్ నిండా నీటిని కలిగి ఉండాలని సూచించబడినది. మీరిప్పుడు ప్రతిసారీ బాటిల్ను నీటితో నింపడానికి, కుర్చీలో అంటుకుపోయిన మిమ్మల్ని పదేపదే లేపి నడిచేలా చేస్తుంది. ఇలా మీరు నీటిని త్రాగటం వల్ల మీకు తెలియకుండానే మీ శరీరంలో ఉన్న అదనపు క్యాలరీలు సులభంగా తగ్గుతాయి. కాబట్టి ఈ ఆలోచనను తక్షణమే ఆచరించడానికి ప్రయత్నించండి.

6. నేలపైన కూర్చోండి :

6. నేలపైన కూర్చోండి :

అవును, నేలపై కూర్చోవడం వల్ల మీ శరీరంలో ఉన్న అదనపు కేలరీలను కోల్పోవటానికి ఒక ప్రభావవంతమైన మార్గము. టీవీ చూసే సమయంలో "నో" అని చెప్పకుండా మీరు నేలపైన కోరుకోవడం (లేదా) పడుకోవడం వంటివి చెయ్యాలి. ఈ విధంగా నేలపై కూర్చుని లేవడం వల్ల మీ శరీరానికి కొద్దిగా వ్యాయామం అవుతుంది. మీరు తరచుగా ఇలా నేలపై కూర్చుని ఉండటం వల్ల శరీరంలోని క్యాలరీలను సులభంగా కోల్పోతారు.

7. రాత్రిపూట నడవడం :

7. రాత్రిపూట నడవడం :

రాత్రి భోజనం తర్వాత, మీరు మీ భాగస్వామితో (లేదా) పెంపుడు జంతువుతో 30 నిమిషాల చిన్న నడకన ప్రారంభించడం వల్ల, క్యాలరీలను తగ్గించుకోవడంతో ఇది చాలా ప్రభావవంతమైనదిగా పనిచేస్తుంది. మీరు నడిచే సమయంలో మీ సహచరులతో కొంత సమయాన్ని గడుపుతూ ఉండటం వల్ల మీ ఆహారాన్ని జీర్ణం చేయడమే కాకుండా, మీకు మంచి నిద్ర పట్టడానికి కూడా చాలా సహాయపడుతుంది.

8. రాత్రిళ్లు త్వరగా నిద్రపోండి :

8. రాత్రిళ్లు త్వరగా నిద్రపోండి :

మీరు రాత్రిళ్లు త్వరగా నిద్ర పోవడం వల్ల అనారోగ్యానికి దారితీసే ఆకలి కోరికలను మరియు అర్ధరాత్రిళ్లు మీరు తినే స్నాక్స్ నుండి మిమ్మల్ని దూరంగా ఉంచడం వల్ల మీ శరీరంలో అదనపు క్యాలరీలు చేరవు. మీరు రాత్రిళ్ళు ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల స్థిరమైన శరీర బరువును కలిగి ఉండటమే కాకుండా, మీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని నిరూపించబడిన వాస్తవము. కాబట్టి మీరు రాత్రిలో త్వరగా నిద్రపోవటం వల్ల, ఆరోగ్యపరంగా మీరు చాలా ఫిట్నెస్ని కలిగి ఉంటారు.

English summary

8 Easy Ways To Burn Calories Throughout The Day

Burning calories might not be an easy task for most of the people. We generally think of the gym when we want to shed the extra flab. We can consciously lose calories throughout the day by following a few easy ways like eating breakfast on time, drinking a good amount of water, sleeping early and taking the stairs most often.
Story first published:Monday, February 26, 2018, 15:09 [IST]
Desktop Bottom Promotion