For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాసిల్ (లేదా) తులసి మీ బరువును తగ్గించడానికి సహాయపడుతుందా ?

బాసిల్ (లేదా) తులసి మీ బరువును తగ్గించడానికి సహాయపడుతుందా ?

|

ప్రపంచంలో అత్యధిక శాతం మంది సేవించే పానీయము "టీ". గ్రీన్-టీ, హెర్బల్-టీ, బ్లాక్-టీ, అల్లం-టీ వంటివి ఇంకెన్నో రకాలు చాలా ప్రాచుర్యాన్ని పొందినవి. కానీ ఆశ్చర్యకరంగా, బాసిల్ (లేదా) తులసి ఆకులు మీ బరువును తగ్గించేందుకు ప్రోత్సహించేవిగా ప్రసిద్ధి చెందాయి. కాబట్టి, మీ శరీర బరువును తగ్గించడంలో బాసిల్ (లేదా) తులసి ఆకులు మీకు సహాయం చేస్తుందా ?

ఈ విషయాన్ని ఇప్పుడు మనము చదివి తెలుసుకుందాం.

పురాతన కాలం నుంచి ఆయుర్వేదంలో ఉపయోగించే అతిముఖ్యమైన హెర్బ్ "బాసిల్". అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న ఈ హెర్బ్ను భారతదేశంలో "తులసి" గా పిలుస్తారు. ఒత్తిడికి సంబంధించిన కార్టిసాల్ స్థాయిలను తగ్గించే సామర్థ్యాన్ని ఈ హెర్బ్ కలిగి ఉన్నందున, పాశ్చ్యాత్య దేశాలలో బాసిల్ మంచి ప్రజాదరణను పొందింది.

Does Basil Or Tulsi Help You Lose Weight

"ప్లాంట్ ఫుడ్స్ ఫర్ హ్యూమన్ న్యూట్రిషన్" అని ప్రచురించినబడిన పత్రికా కథనం ప్రకారం, బాసిల్ అనే హెర్బ్ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను, కొలెస్ట్రాల్ స్థాయిలను, కొవ్వు స్థాయిలను తగ్గించి వచ్చని సూచించింది.

భారత్లో చేపట్టిన అధ్యయనం ప్రకారం, బాసిల్ను మీ ఆహారంలో తప్పకుండా తీసుకోవడం వల్ల మీలో ఉన్న ఒత్తిడిని తగ్గించడానికి ఇది అత్యంత సురక్షితమైన, ప్రభావంతమైన మార్గంగా చూపించబడింది. అంతేకాకుండా, జ్వరాన్ని తగ్గించడంలోనూ, జీర్ణశక్తిని పెంపొందించడంలోనూ, మీ నరాలను ఉద్రిక్తతను శాంత పరచుటలోనూ సహాయపడే యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ-పరాసియాటిక్ లక్షణాలను ఇది కలిగి ఉంది.

1. కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది :

1. కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది :

ఇది మీ జీవక్రియ ఒత్తిడిని పెంచే కారకాలను లక్ష్యంగా చేసుకుని, శరీర బరువును & కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ హెర్బ్ చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.

2. మీ ఉదరాన్ని రక్షిస్తుంది :

2. మీ ఉదరాన్ని రక్షిస్తుంది :

ఈ హెర్బ్, స్టమక్ అల్సర్కు కారణం అయిన ఆమ్లాల ప్రభావమును తగ్గించి, శ్లేష్మ సంబంధమైన స్రావాలను పెంచి, శ్లేష్మ కణాల పెరుగుదలను & వాటి జీవిత కాలాన్ని పొడిగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

3. రక్తంలో చెక్కర స్థాయిలను తగ్గిస్తుంది :

3. రక్తంలో చెక్కర స్థాయిలను తగ్గిస్తుంది :

మీరు టైప్ 2 డయాబెటిస్ను కలిగి ఉంటే, మీ రక్తంలో ఉన్న చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఈ హెర్బ్ చక్కగా పనిచేస్తుంది. బరువు పెరగటం, రక్తంలో ఇన్సులిన్ స్థాయిలు పెరగటం, అధిక కొలెస్ట్రాల్ను, రక్తపోటు, ఇన్సులిన్ను నిరోధించడం వంటి మధుమేహ లక్షణాలను నిరోధించడంలో బాగా సహాయపడుతుంది.

4. ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది :

4. ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది :

ఈ హెర్బ్లో ఉన్న యాంటీ-బ్యాక్టీరియల్, యాంటీ-వైరల్, యాంటీ-ఫంగల్, అనాల్జేసిక్ & యాంటీ-ఇన్ఫ్లమేటరీ అనే వైద్య గుణాల కారణంగా నోటి అల్సర్, మొటిమలు, పెరిగిన మచ్చల వంటి అంటువ్యాధులకు సులువుగా చికిత్సను చేయవచ్చు.

శరీర బరువును తగ్గించి, ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే తులసి/బాసిల్ టీ :-

శరీర బరువును తగ్గించి, ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే తులసి/బాసిల్ టీ :-

ఈ బాసిల్-టీ మీ శరీర బరువును తగ్గిస్తుందా ? అవును, అది తగ్గించగలదు ! బాసిల్ ఆకులు (లేదా) విత్తనాలు మీ శరీర బరువును తగ్గించడంలో సహాయపడతాయి. ఈ క్రింద తెలిపిన మార్గాల ద్వారా బాసిల్ మీ శరీర బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.

1. జీవక్రియను సరళతరం చేస్తుంది :

1. జీవక్రియను సరళతరం చేస్తుంది :

తులసి ఆకులను తినడం వల్ల మీ జీవక్రియను సరళతరం చేయడంలో సహాయపడుతుంది. ఇది మీరు తీసుకునే ఆహారాన్ని శక్తిగా మార్చి, మీ శరీరానికి తక్షణ పోషణను అందిస్తుంది.

2. కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది :

2. కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది :

శరీరంలో నిల్వవున్న అవాంచితమైన విషవ్యర్ధాలను తొలగించడమే కాలేయం యొక్క ప్రధాన విధి. అలాంటి అవాంచిత విషపదార్ధాలలో ఊబకాయానికి దారి తీసే కొవ్వులను కూడా కలిగి ఉండవచ్చు.

3. ఆరోగ్యకరమైన జీర్ణక్రియను నిర్వహించడం :

3. ఆరోగ్యకరమైన జీర్ణక్రియను నిర్వహించడం :

ప్రతిరోజూ తులసి-టీని తీసుకోవడం వల్ల ప్రేగులలో ఉండే మంచి బ్యాక్టీరియా మెరుగైన పనితీరును కలిగి ఉండడంతో పాటు, సరియైన రీతిలో ప్రేగులను కదిలించడం ద్వారా ఆరోగ్యకరమైన జీర్ణక్రియను నిర్వహించటంలో మీకు సహాయపడుతుంది.

4. మీలో సహనాన్ని పెంచుతుంది :

4. మీలో సహనాన్ని పెంచుతుంది :

తులసి-టీ లో కేలరీలు లేకపోవటం వల్ల మీలో సహనాన్ని & శారీరక బలాన్ని పెంచుతుంది. మీరు వ్యాయామం చేసే ముందు ఒక కప్పు తులసి-టీని తాగడం వల్ల ఇది మీలో సహనాన్ని పెంచుతుంది.

5. హైపోథైరాయిడిజంను నియంత్రిస్తుంది :

5. హైపోథైరాయిడిజంను నియంత్రిస్తుంది :

థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేసే హార్మోన్లలో ఏర్పడిన లోపం కారణంగా హైపోథైరాయిడిజం సంభవిస్తుంది. ఇది మీరు తీసుకునే ఆహారాన్ని సరిగ్గా నిర్వహించకపోవడం వల్ల శరీర బరువును పెంచుటకు దారితీస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు తులసి-టీని తాగడం వల్ల థైరాయిడ్ హార్మోన్లను సమతుల్యం చేయటంలో సహాయపడుతుంది.

బరువు తగ్గడం కోసం తులసి ఆకులను ఏవిధంగా ఉపయోగించాలి ?

బరువు తగ్గడం కోసం తులసి ఆకులను ఏవిధంగా ఉపయోగించాలి ?

తులసి ఆకుల సారాన్ని టీ రూపంలో తీసుకోవడం వల్ల మీ శరీరానికి విటమిన్ - A,C,K లతో పాటు, మాంగనీస్, కాపర్, ఐరన్, క్యాల్షియం, ఒమెగా-3, మెగ్నీషియం వంటి విటమిన్లను & మినరల్స్ను అందిస్తుంది.

తులసి ఆకులను ఉపయోగించే పద్ధతులు :-

* తులసి ఆకులను నమలవచ్చు.

* అరలీటరు నీటిలో కొన్ని తులసి ఆకులను వేసి, టీ రూపంలో రోజువారీగా తాగాలి.

బరువు తగ్గడం కోసం తులసి గింజలను ఏవిధంగా ఉపయోగించాలి ?

బరువు తగ్గడం కోసం తులసి గింజలను ఏవిధంగా ఉపయోగించాలి ?

కావలసిన పదార్ధాలు :

2 టేబుల్ స్పూన్ల తులసి గింజలు

2 గ్లాసుల చల్లని నీరు

6 టేబుల్ స్పూన్ల రోజ్ (లేదా) స్ట్రాబెరీ సిరప్

2 స్పూన్ల నిమ్మరసం

5-6 పుదీనా ఆకులు

తయారీ విధానం :-

* మీరు సేకరించిన తులసి గింజలను మంచినీటితో శుభ్రం చేయండి.

* మంచి నీటి గ్లాసులో సుమారు రెండు గంటలపాటు నానబెట్టండి.

* అలా నానబెట్టిన గింజలను మాత్రమే నీటి నుండి వేరు చేయాలి.

* ఒక గ్లాసులో మీకు నచ్చిన సిరప్ను 3 టేబుల్ స్పూన్ల మోతాదులో తీసుకోండి.

* అందులోకి చల్లని తాగునీరును పోసి బాగా కలపాలి.

* ఈ మిశ్రమంలోకి నానబెట్టిన తులసి గింజలను చేర్చాలి.

* అదనంగా నిమ్మరసాన్ని పుదీనా ఆకులను కూడా చేర్చి సర్వ్ చేసుకోవాలి.

మంచి ఫలితాలను పొందడానికి ఇలా తయారుచేసుకున్న తులసి గింజల పానీయాన్ని తరచుగా తీసుకోండి.

English summary

Does Basil Or Tulsi Help You Lose Weight

Research published in the journal 'Plant Foods For Human Nutrition' suggests that holy basil may help reduce blood glucose levels, lipid, and cholesterol levels. Having tulsi leaves in the form of brewed tea provides vitamins and minerals like vitamin A, vitamin K, vitamin C, manganese, copper, folate, iron, calcium, omega 3, and magnesium.
Story first published:Friday, July 13, 2018, 13:27 [IST]
Desktop Bottom Promotion