For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పైనాపిల్ ద్వారా ఈజీగా బరువు తగ్గొచ్చు

కొన్ని పరిశోధనల్లో పైనాపిల్ శరీర కొవ్వును తగ్గించటంలో కూడా సాయపడుతుందని తేలింది. అందులో ఉండే అనేక విటమిన్లు, ఖనిజలవణాలు ఇంకా ఎంజైములు ఆరోగ్యకరంగా బరువు తగ్గించటంలో సాయపడతాయి.

|

మీరు ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండాలనుకుంటున్నారా? మీ బరువు తగ్గే ప్రయత్నాలన్నిటికీ ఫలితాలు చూడాలనుకుంటున్నారా? అదృష్టవశాత్తూ, బరువు తగ్గించే పదార్థాలుగా చాలావాటికి మంచి పేరుంది.

కానీ మీరు బరువు తగ్గాలనుకుంటున్నప్పుడు సరైన ఆహారం తీసుకోవడం ముఖ్యం. వాటిల్లో ఒకటి పైనాపిల్స్. పైనాపిల్స్ మీ బరువు తగ్గటంలో సాయపడతాయి. మీరు అనుకుంటుండవచ్చు పైనాపిల్స్ ఎలా బరువు తగ్గిస్తాయని? పైనాపిల్ లో ఎక్కువగా పీచు ఉండి, తక్కువ క్యాలరీలుంటాయి. అందువల్ల మీరు బరువు తగ్గుతారు.

కొన్ని పరిశోధనల్లో పైనాపిల్ శరీర కొవ్వును తగ్గించటంలో కూడా సాయపడుతుందని తేలింది. అందులో ఉండే అనేక విటమిన్లు, ఖనిజలవణాలు ఇంకా ఎంజైములు ఆరోగ్యకరంగా బరువు తగ్గించటంలో సాయపడతాయి.

1. పైనాపిల్ లో బ్రోమెలైన్ ఉంటుంది

1. పైనాపిల్ లో బ్రోమెలైన్ ఉంటుంది

బ్రోమెలైన్ అనేది ఒక ప్రోటియోలైటిక్ ఎంజైమ్, ఇది ప్రొటీన్లను విఛ్చిన్నం చేయటంలో సాయపడుతుంది. ఇది సాధారణంగా పైనాపిల్ కాండంలో, రసంలో ఉంటుంది. బ్రోమెలైన్ జీర్ణక్రియకి చాలా మంచిది. సరైన జీర్ణవ్యవస్థ మీ ఆరోగ్యాన్ని ఎన్నోరకాలుగా మెరుగుపరుస్తుంది.

2. పైనాపిల్ లో విటమిన్ సి ఉంటుంది

2. పైనాపిల్ లో విటమిన్ సి ఉంటుంది

కొన్ని పరిశోధనల్లో కొవ్వు మెటబాలిజానికి విటమిన్ సి కి మధ్య సంబంధం తెలియజేయటం జరిగింది. విటమిన్ సి కార్నిటైన్ ఉత్పత్తిలో పెద్ద పాత్ర పోషిస్తుంది. కార్నిటైన్ అనేది ఒక ఎమినో ఆసిడ్, ఇది ఫ్యాటీయాసిడ్ల రవాణాకి బాధ్యత వహిస్తుంది.

3. క్యాలరీల కథ

3. క్యాలరీల కథ

పైనాపిల్ పండులో ఫైబర్, విటమిన్లు, ఖనిజలవణాలు ఉంటాయి. ఒక కప్పు పైనాపిల్ లో 83 క్యాలరీలు ఉంటాయి. ఒక కప్పు పాకెట్లో వచ్చే పైనాపిల్ లో 79 క్యాలరీలు ఉంటాయి. కానీ పాకెట్లో అమ్మే పైనాపిల్ తో భారీగా సిరప్ కూడా పోస్తారు కాబట్టి, అది కొనవద్దు. దానివలన అదనంగా క్యాలరీలు చేరవచ్చు.

4. పైనాపిల్స్ లో ఉండే శక్తి సాంద్రత తక్కువ

4. పైనాపిల్స్ లో ఉండే శక్తి సాంద్రత తక్కువ

తక్కువ శక్తి సాంద్రత ఉండే ఆహారపదార్థాల వలన బరువు సులభంగా తగ్గుతుంది. పైనాపిల్ లో శక్తి సాంద్రత తక్కువగా, పీచు ఎక్కువగా ఉంటుంది. ఇవి కడుపు నిండుగా ఎక్కువసేపు ఉంచుతాయి. తక్కువ కొవ్వు ఉన్న పెరుగుతో కలిపి పైనాపిల్ ను స్నాక్ లాగా లేదా డిన్నర్ కోసం పైనాపిల్ సల్సాను తయారుచేసుకోండి.

5. పైనాపిల్స్ లాభాలు

5. పైనాపిల్స్ లాభాలు

పైనాపిల్ లో ఉండే పీచుపదార్థం ముఖ్యంగా కడుపుకి మంచిది. ఇవి రక్తంలో చక్కెరస్థాయిని సాధారణంగా ఉంచుతూ,ఆకలిని తగ్గించి, అలా బరువును కూడా తగ్గిస్తుందని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధనల్లో తేలింది.

6. పైనాపిల్ రసం వదిలేయండి

6. పైనాపిల్ రసం వదిలేయండి

పైనాపిల్ రసంలో రెండురకాల సింపుల్ చక్కెరలు ఉంటాయి, గ్లూకోజ్ ఇంకా ఫ్రక్టోస్ లు. ఫ్రక్టోస్ వలన బరువు పెరుగుతుంది. అందుకని, ఎక్కువగా పైనాపిల్ రసం తాగటం వలన దాహం, సంతృప్తి కలగదు.

ఫ్రక్టోస్ ప్రభావం వల్ల ఎక్కువ క్యాలరీలు కూడా మీ శరీరంలో చేరతాయి. పైనాపిల్ రసం కన్నా మీరు మొత్తం పైనాపిల్ పండునే తినటం మంచిది. దీని వల్ల ఫైబర్ కూడా అందుతుంది.

English summary

Does Eating Pineapple Make You Lose Weight

Some studies show that pineapple may aid in reducing body fat. It is because they contain multiple vitamins and minerals and enzymes that contribute to a healthy weight loss process.
Desktop Bottom Promotion