Just In
- 44 min ago
Shani Jayanti 2022:శని దేవుని అనుగ్రహం కోసం ఈ పరిహారాలు పాటించండి...
- 2 hrs ago
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఐతే ఈ 5 పండ్లను మీకు తెలియకుండా తినకండి...!
- 4 hrs ago
చుండ్రును వదిలించుకోవడానికి మీ జుట్టు కుదుళ్లు పొడవుగా పెరగడానికి ఈ 2 ఇంటి నివారణలు చాలు
- 9 hrs ago
Today Rasi Phalalu :ఓ రాశి ప్రభుత్వ ఉద్యోగులకు ఒత్తిడి ఉంటుంది..!
Don't Miss
- News
కుతుబ్ మినార్ వివాదం : ఢిల్లీ కోర్టు ఆసక్తిక వ్యాఖ్యలు-800 ఏళ్లు పూజించలేదుగా.. ఇఫ్పుడూ
- Movies
KGF Chapter 2 Day 40 Collections: వసూళ్ళలో భారీ డ్రాప్.. 40వ రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే?
- Sports
IPL : చరిత్రలోనే చెండాలమైన రికార్డును నమోదు చేసిన కేన్ మామ, నయా పైసాకు పనికిరాని బ్యాటింగ్
- Technology
IPL 2022 మొదటి Playoff మ్యాచ్ ఈరోజే ! లైవ్ ఛానళ్ళు మరియు App ల లిస్ట్ చూడండి.
- Finance
జొమాటో అదరగొడుతుంది, షేర్ టార్గెట్ ధర రూ.100
- Automobiles
ఇదుగిదిగో.. ఇదే సరికొత్త 2022 మారుతి విటారా బ్రెజ్జా, చిన్నసైజు రేంజ్ రోవర్‌లా ఉంది కదూ..!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మన ఆరోగ్యానికి ఎగ్ తో ఎన్నో ప్రయోజనాలు.. ఎగ్-డైట్ ప్రణాళికలు, వాటి ప్రయోజనాలు !
ఈ మధ్య అనేక డైట్ ప్లాన్లు విరివిగా వచ్చాయి, అలా ప్రాచుర్యం పొందిన వాటిలో ఎగ్- డైట్ ప్లాన్ కూడా ఒకటి. సరికొత్త బరువు తగ్గించే డైట్ ప్లాన్ అయిన ఎగ్ డైట్ ప్లాన్, అనతికాలంలోనే అందరి నోటా తిరుగుతుంది. మీరు ఇది వరకే ప్రారంభించి ఉంటే, పూర్తి అవగాహన కోసం ఈ ప్లాన్ చూడండి. రోజులో మీ ఫేవరేట్ మీల్ బ్రేక్ ఫాస్ట్(అల్పాహారం) అయితే, ఈ ఎగ్-డైట్ ప్లాన్ మీకు మరింత ఆసక్తికరంగా ఉంటుంది అనడంలో ఆశ్చర్యమే లేదు. బరువు నష్టానికి నిర్దేశించబడిన ఈ ఎగ్-డైట్, రోజులో ఒక సంప్రదాయకరమైన అల్పాహారం తీసుకోడానికి అనుమతిని ఇస్తుంది. మరియు అల్పాహారాన్ని ప్రధానంగా మారుస్తుంది.
ఏదేమైనా, ఈ ఎగ్-డైట్లో పలురకాలు ఉన్నాయి మరియు వాటిలో అన్నీ ఆరోగ్యకరమైనవి అని చెప్పలేము. వీటిలో కొన్ని పనిచేయవచ్చు, పనిచేయపోవచ్చు కూడా. కావున, ఈ వ్యాసం ద్వారా, మీరు ఎగ్-డైట్ ఏవిధంగా అనుసరించవలసి ఉంటుందో, మేము మీకు మార్గనిర్దేశం చేస్తాము మరియు ఇవి ఏవిధంగా పని చేస్తాయో కూడా వివరించబడినది.

అసలు ఎగ్ డైట్ ఏమిటి?
ఎగ్ డైట్ తక్కువ కార్బోహైడ్రేట్, తక్కువ కేలరీలతో కూడిన డైట్ ప్లాన్. కానీ ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ప్రోటీన్ త్యాగం లేకుండా, బరువు నష్టానికి సూచించదగిన విధంగా, కండరాల నష్టం కలుగకుండా ఈ ప్లాన్ రూపొందించబడి ఉంటుంది. ఎగ్-డైట్ పేరు సూచిస్తున్నట్లుగా, ఆహారంలో ప్రోటీన్ యొక్క ప్రధాన వనరుగా ఉన్న గుడ్డు వినియోగం ఎంత అవసరమో ప్రస్పుటంగా కనిపిస్తుంది.
ఎగ్ డైట్ ప్రణాళికలో బహుళ సంస్కరణలు ఉన్నాయి, కానీ ఈ అన్ని ప్రణాళికలలో, మీరు నీరు లేదా సున్నా-క్యాలరీల పానీయాలను విరివిగా తీసుకోవచ్చు. పిండిపదార్ధాలు మరియు సహజ చక్కెరలలో కూడిన అధిక ఆహారం మాత్రం ఈ డైట్ నుండి మినహాయించబడుతుంది, మరియు డైట్ సాధారణంగా 14 రోజులు ఉంటుంది. ఈ డైట్ అల్పాహారం, భోజనం మరియు విందు మూడింటిమీదా దృష్టి కేంద్రీకరిస్తుంది. నీళ్ళు లేదా ఇతర సున్నా-క్యాలరీ పానీయాలు తీసుకుంటారు కానీ, స్నాక్స్ ఉండవు.

ఎగ్ డైట్ బరువు నష్టంలో నిజంగానే సహాయం చేయగలదా?
ఎగ్ -డైట్ యొక్క అన్ని సంస్కరణలు, మొత్తంమీద తక్కువ కేలరీలను తీసుకోవడం ద్వారా, క్రమంగా బరువు తగ్గడానికి సమర్థవంతంగా పనిచేస్తాయి. కానీ డైట్లో ప్రోటీన్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. మరియు బరువు తగ్గడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
క్లినికల్ న్యూట్రిషన్ అమెరికన్ జర్నల్‌లో సూచించిన ఒక అధ్యయనంలోని నివేదిక ప్రకారం, అధిక ప్రోటీన్ డైట్ తీసుకునే వారు, ఆహారాన్ని పూర్తిగా తీసుకున్నామన్న సంపూర్ణతకు లోనవ్వడం, మరియు క్రమంగా బరువు కోల్పోవడంలో సహాయపడగలదని సూచించింది.
గుడ్లు ప్రోటీన్ నిక్షేపాలకు మంచి మూలంగా ఉంటుంది, మరియు ముఖ్యమైన ఖనిజాలు, విటమిన్ బి12, ఇనుము మరియు విటమిన్-డి కలిగి ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి అవసరమైన పోషకాలను కలిగి ఉంటాయి.

ఎగ్-డైట్ ఆహార ప్రణాళిక :
మీరు ఎన్నుకునే అవకాశమున్న ఎగ్-డైట్ భోజన ప్రణాళికల వివిధ రూపాలు:
14- రోజుల ఎగ్-డైట్ :
ఈ ఆహార ప్రణాళిక యొక్క సంస్కరణలో రోజువారీ మూడు భోజనాలను కలిగి ఉంటుంది, ఎటువంటి కేలరీలు కలిగిన పానీయాలు మరియు మధ్యలో స్నాక్స్ వంటి వాటికి ఆస్కారమే లేదు. రోజులో ఒక భోజనం గుడ్లను కలిగి ఉంటుంది, మరియు ఇతర భోజనాలు చేప లేదా చికెన్ సహా లీన్ ప్రోటీన్ యొక్క మూలాలతో ప్రణాళికలు చేసుకోవచ్చు. మీ ఆహారంలో సరైన మోతాదులో ప్రోటీన్ అందించేందుకు, మీరు పాలకూర లేదా బ్రోకోలీ వంటి తక్కువ కార్బోహైడ్రేట్లు కలిగిన కూరగాయలను, ఆకుకూరలను జోడించవచ్చు. అవసరాన్ని బట్టి సిట్రస్ పండ్లు కూడా తీసుకోవచ్చు.

ఎగ్ అండ్ గ్రేప్‌ఫ్రూట్ డైట్:
ఇది 14-రోజుల ఎగ్ –డైట్ ప్రణాళిక, ఇదికూడా పైన చెప్పిన మొత్తంలోనే ఉంటుంది. ఈ ఆహార ప్రణాళికలో, ప్రతి భోజనంలోనూ, గుడ్డు లేదా లీన్ ప్రోటీన్‌తో కలిపి ద్రాక్షపండ్లను తీసుకోవచ్చు. ఏ ఇతర పండ్లకు ఈ డైట్లో అనుమతి ఉండదు.

ఉడికించిన గుడ్డు ఆహారం :
ఈ ఎగ్ –డైట్లో ఎక్కువగా ఉడికించిన గుడ్లనే తీసుకోవలసి ఉంటుంది, ఇతర రూపాల కన్నా ఉడికించిన గుడ్డు ద్వారానే సరైన పోషకాలను పొందగలరు.

ఎగ్ –ఓన్లీ డైట్ :
ఈ బరువు తగ్గే ప్రణాళికను మోనో-డైట్ అని కూడా పిలుస్తారు మరియు ఈ ప్రణాళికలో రెండు వారాల పాటు ఎక్కువగా ఉడికించిన గుడ్లను మాత్రమే తీసుకోవలసి ఉంటుంది. దీనితో కలిపి నీటిని అధికంగా తీసుకోవలసి ఉంటుంది. అయినప్పటికీ, ఇది ఒక కఠినమైన మరియు అనారోగ్యకర ప్రణాళికగా చెప్పబడినది. మీరు రెండు వారాలపాటు ఒకే ఆహారపదార్ధాన్ని తీసుకోవడం, ఏ వైద్యుడూ ద్రువీకరించనిదిగా ఉంటుంది. ఈ ప్రణాళికలో వ్యాయామం కూడా ఉండదు, ఎందుకంటే మోనో-డైట్ సమయంలో మీరు అధికమైన అలసటను అనుభవిస్తారు.

కీటో ఎగ్ డైట్:
ఇది కీటోజెనిక్ డైట్లను కలిగి ఉంటుంది, ఇది మీ కీటోసిస్ స్థితిలో మీ శరీరాన్ని ఉంచే క్రమంలో తగినంతగా కొవ్వును తీసుకోవడానికి అవసరమయ్యే ఆహారాలను సూచించేదిగా ఈ ప్రణాళిక ఉంటుంది. ఈ ఎగ్ -డైట్ ప్రణాళికలో, మీ శరీరంలో కీటోన్లను ఉత్పత్తి చేయడానికి వెన్న మరియు చీజ్ తో కలిపి గుడ్లను తీసుకోవలసి ఉంటుంది. ఒక నిష్పత్తి ప్రకారం అనుకుంటే, ఒక గుడ్డుకి ఒక స్పూన్ చీజ్ లేదా బట్టర్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఎగ్ - డైట్ ప్రణాళికలో ఇటువంటి రూపాలు అనేకం ఉన్నాయి, కానీ వాటి లక్ష్యం మాత్రం ఒక్కటే. ప్రతిరోజూ ఎగ్ డైట్ లో కొద్ది మొత్తంలో లీన్ చికెన్ కూడా అన్ని భోజనాలలో కలిపి తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందగలరు.
మీరు చేర్చదగిన లీన్ ప్రోటీన్, చికెన్, గుడ్లు, చేప మరియు టర్కీగా ఉంటుంది.
బ్రొకోలీ, ద్రాక్షపండు, గుమ్మడి, బచ్చలికూర, పుట్టగొడుగులు, ఆస్పరాగస్ మరియు గ్రేప్‌ఫ్రూట్ వంటివాటినికూడా ఆహారప్రణాళికలో జతచేయవచ్చు.
ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైనవారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆరోగ్య సంబంధిత అంశాలకై బోల్డ్‌స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈవ్యాసంపై మీ అభిప్రాయాలను క్రింది వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.