For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొవ్వును కరిగించి మెటబాలిజాన్ని పెంపొందించే 8 బెస్ట్ స్పైసెస్

కొవ్వును కరిగించి మెటబాలిజాన్ని పెంపొందించే 8 బెస్ట్ స్పైసెస్

|

అదనపు బరువును తగ్గించుకునేందుకు ఎటువంటి షార్ట్ కట్స్ లేవు. షార్ట్ కట్స్ ఉన్నాయని మీరనుకుంటే అవన్నీ అనారోగ్యకరమైనవే. వాటితో పాటు సైడ్ ఎఫెక్ట్స్ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అయితే, కొన్ని సులభమైన చిట్కాలను పాటించడం ద్వారా మెటబాలిజాన్ని పెంపొందించుకోవచ్చు. బరువును తగ్గించుకునే వేగం అనేది మెటబాలిజం పనితీరుపై ఆధారపడి ఉంటుంది. అందువలన మెటబాలిజాన్ని పెంపొందించుకునే చిట్కాలపై దృష్టి పెట్టాలి. ఆరోగ్యకరమైన ఆహారం, సరైన వర్కవుట్ తో పాటు సరైన స్లీపింగ్ షెడ్యూల్స్ ను పాటించడం ద్వారా మెటబాలిజం పనితీరును మెరుగుపరచుకోవచ్చు. అయితే, డైట్ లో చాలా మంది కొన్ని ముఖ్య అంశాలను మరచిపోతారు. హెర్బ్స్ తో పాటు స్పైసెస్ ను ఇగ్నోర్ చేస్తారు!

అవునండి, వెయిట్ లాస్ గోల్స్ ను అఛీవ్ చేసేందుకు హెర్బ్స్ తో పాటు స్పైసెస్ ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఫ్లేవర్ తో పాటు హెల్త్ బెనిఫిట్స్ ను డైట్ లో జోడించేందుకు స్పైసెస్ ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అందువలనే, వీటిని డైట్ లో జోడించడం ద్వారా మీరు వెయిట్ లాస్ గోల్స్ ను ఎంతో సులభంగా పొందవచ్చు. స్పైసెస్ ను తగిన విధంగా డైట్ లో జోడించడం ద్వారా వెయిట్ లాస్ ను ఆరోగ్యకరంగా అఛీవ్ చేయవచ్చు. కాబట్టి, వీటి గురించి ముఖ్యమైన విషయాలను తెలుసుకోవడం ఎంతో ముఖ్యం.

Eight Best Herbs That Can Burn Fat And Spike Up Your Metabolism,

ఇక్కడ వివరించబడిన స్పైసెస్ మెటబాలిజంను పెంపొందించి వెయిట్ లాస్ ప్రాసెస్ ను వేగవంతం చేసేందుకు తోడ్పడతాయి.

1.పసుపు:

1.పసుపు:

ఈ పసుపు పచ్చటి స్పైస్ మెటబాలిజాన్ని పెంపొందించి వెయిట్ లాస్ ప్రాసెస్ ను వేగవంతం చేస్తుంది. పసుపు శరీరంలోని వేడిని పెంచుతుంది. ఆ విధంగా మెటబాలిజాన్ని బూస్ట్ చేస్తుంది. తద్వారా, వెయిట్ లాస్ ప్రాసెస్ కు తోడ్పడుతుంది. అంతేకాక, మీ హార్మోన్స్ ని సమతుల్యంగా ఉంచేందుకు తోడ్పడుతుంది. కాస్తంత పసుపును సూప్ లేదా తాజా వెయిటబుల్స్ అలాగే నట్స్ పై చల్లుకుని తీసుకుంటే ఆశించిన ఫలితం లభిస్తుంది.

2. దాల్చిన చెక్క:

2. దాల్చిన చెక్క:

ఫ్లేవర్ కలిగిన ఈ స్పైస్ ద్వారా వెయిట్ లాస్ బెనిఫిట్స్ ను అనేకం పొందవచ్చు. స్వీట్ క్రేవింగ్స్ ను తగ్గిస్తుంది, మీకు ఎక్కువ సేపు ఆకలి కలగకుండా ఆపుతుంది, అలాగే కేలరీ ఇంటేక్ ను కూడా తగ్గిస్తుంది. కొంత దాల్చిన చెక్క పొడిని ఓట్ మీల్, పాలు, పెరుగు, టీ లేదా కాటేజ్ టీ పై చల్లుకుని తీసుకుంటే వెయిట్ లాస్ కి ఉపయోగపడుతుంది.

3. కారం:

3. కారం:

కారం అనేది వార్మ్ స్పైస్. ఇది శరీరంలోని మెటబాలిజాన్ని బూస్ట్ చేస్తుంది. శరీర ఉష్ణోగ్రతను పెంచడం ద్వారా ఇది మెటాబాలిజాన్ని బూస్ట్చేసేందుకు తోడ్పడుతుంది. ఈ స్పైస్ ను ఆహారంలో జోడించి తీసుకుంటే ప్రతి మీల్ లో కనీసం 100 కేలరీలదాకా కరుగుతాయి. అయితే, దీనిని అతిగా తీసుకోవడం మంచిది కాదు. కాబట్టి, మీరు స్పైసీ ఫుడ్ ను ఇష్టపడితే ఈ స్పైస్ తో మరింత లభ్ది పొందవచ్చు.

4. జీలకర్ర:

4. జీలకర్ర:

జీలకర్ర వెయిట్ లాస్ కి తోడ్పడే అత్యద్భుతమైన స్పైస్. ఒక టీస్పూన్ జీలకర్రని ఆహారంలో జోడించి తీసుకుంటే శరీరంలోని కొవ్వు మూడు రెట్లు అధికంగా కరగబడుతుంది. అంతేకాక, జీలకర్ర నీళ్లు వెయిట్ లాస్ కి తోడ్పడే పవర్ ఫుల్ డ్రింక్. ఆహారానికి వైవిధ్యమైన రుచిని జోడించడానికి అలాగే శరీరంలోంచి కొన్ని అదనపు పౌండ్స్ ను కరిగించడానికి ఈ స్పైస్ అమితంగా తోడ్పడుతుంది. దీనిని వంటకాలలో నేరుగా వాడవచ్చు లేదా జీలకర్రను వేయించి పొడిచేసి ఆ పొడిని వంటకాలలో చల్లుకోవచ్చు.

5. అల్లం:

5. అల్లం:

అల్లంలో పసుపు అలాగే కారంలోలాగానే మెటబాలిజాన్ని బూస్ట్ చేసే ప్రాపర్టీలు అధికం. షుగరీ అలాగే హై కార్బ్ మీల్ ని తీసుకున్న తరువాత బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా అరికట్టేందుకు అల్లం తోడ్పడుతుంది. కొంత అల్లాన్ని గ్రేట్ చేసుకుని దానిని ఆహారంలో జోడిస్తే వైవిధ్యమైన ఫ్లేవర్ వంటకానికి అందుతుంది. తద్వారా, మీ మెటబాలిజం కూడా బూస్ట్ అవుతుంది.

6. బ్లాక్ పెప్పర్:

6. బ్లాక్ పెప్పర్:

బ్లాక్ పెప్పర్ లో వెయిట్ లాస్ ప్రాపర్టీలు పుష్కలంగా లభిస్తాయి. ఈ స్పైస్ కొత్తగా కొవ్వు ఫార్మ్ అవడాన్ని అరికడుతుంది. ఆ విధంగా, శరీరంలోని కొవ్వును పేరుకుపోనివ్వదు. మీరు తినే ప్రతి డిష్ లో ఈ స్పైస్ ను జోడించవచ్చు. తీపి పదార్థాలలో కూడా ఈ స్పైస్ ను వాడవచ్చు.

7. యాలకులు:

7. యాలకులు:

శరీర ఉష్ణోగ్రతను బూస్ట్ చేసి మెటబాలిజాన్ని పెంపొందించేందుకు ఇది థెర్మోజెనిక్ గా పనిచేస్తుంది. భారతీయ వంటకాలలో యాలకుల పాత్ర ప్రత్యేకమైనది. బిర్యానీల దగ్గర నుంచి ఖీర్ వరకు యాలకులను వివిధ వంటకాలలో విరివిగా వాడతారు. ఇది ఆహారానికి స్పెషల్ ఫ్లేవర్ ని అందించి వెయిట్ లాస్ ప్రాపర్టీస్ ను జోడిస్తుంది.

8. ఫెనుగ్రీక్:

8. ఫెనుగ్రీక్:

శరీరానికి అత్యంత అవసరమైన స్పైస్ ఫెనుగ్రీక్. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు అనేక రకాల బెనిఫిట్స్ ను అందిస్తుంది. డైజెస్టివ్ ట్రాక్ట్ ను ఫ్రీ రాడికల్ డేమేజ్ నుంచి రక్షిస్తుంది. ఆ విధంగా మెటబాలిజాన్ని బూస్ట్ చేస్తుంది. ఇందుకోసం, మీరు కొన్ని మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మరునాడు, ఈ నీటిని వడగట్టి ఖాళీ కడుపుతో ఈ నీటిని తీసుకోవాలి. ఈ ప్రాసెస్ వెయిట్ లాస్ ను బూస్ట్ చేసేందుకు తోడ్పడుతుంది.

English summary

Eight Best Herbs That Can Burn Fat And Spike Up Your Metabolism

Yes, herbs and spices also play an important role when it comes to your weight loss goals. These spices add flavor and calories to your diet which is exactly why they're critical to your goals. Now, this does not mean that you need to cut down on all spices. There are some spices which give your metabolism an additional boost. So you simply can't miss to include them in your diet.
Story first published:Monday, May 7, 2018, 17:51 [IST]
Desktop Bottom Promotion