For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ సులభమైన వ్యాయామాలతో ఉత్సాహవంతమైన భావన పొందండి

ఈ సులభమైన వ్యాయామాలతో ఉత్సాహవంతమైన భావన పొందండి

|

అబ్బా! అప్పుడే తెల్లారిందా? అనిపించేటట్టు

మీకు ఎప్పుడైనా పొద్దుట లేస్తూనే అలిసిపోయిన భావన కలిగిందా? రోజు చివర్లో పని చేసి చేసి అలసిపోవడం సర్వసామాన్యమే! ఏదేమైనప్పటికి, మనం అలసటకు లోనైనప్పుడు, మన మూడును బట్టి, శుభ్రంగా స్నానం చేయడమో లేదా నిద్రకు ఉపక్రమించడమో చేస్తాం.

అయితే, మనకు తెలియని విషయం ఇంకొకటి ఉంది. మీకు అలసటగా అనిపించినప్పుడు, విశ్రాంతి తీసుకోవదానికి బదులు, వివిధ రకాల వ్యాయామాలు చేస్తే మీకు శక్తి లభించినట్లు అనిపిస్తుందని తెలుసా? అంతేకాదు, క్రమం తప్పకుండా ఇలా చేస్తూపోతే, దీనివల్ల మీకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ వ్యాసం ద్వారా మీలో ఉత్సాహాన్ని నింపడానికి, మీరు శారీరకంగా మరియు మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి, మీ దైనందిన జీవితంలో ఎటువంటి వ్యాయామాలను భాగంగా చేసుకోవచ్చో తెలుసుకుందాం.

Feel Energised With These Simple Workouts

ఎక్కువ ప్రయత్నం లేదా పరికరాలు అవసరం లేని వ్యాయామాలు:

• నడక: ఇది ఏ వయసువారైన అతి సులభంగా చేయగలిగిన వ్యాయామం. దీనికి కావలసినదల్లా ఒక జత షూలు మాత్రమే. ఇది రోజులో ఎప్పుడైనా, ఒంటా బయటా కూడా చేయవచ్చు.

అయినప్పటికీ, పొద్దుటిపూట ఆరుబయట నడిస్తే, సూర్యరశ్మి మరియు తాజాగా కాలుష్యం లేని గాలి మనకు లభిస్తుంది.

సగటున 20-30 నిమిషాలు నడిస్తే, మీ ఆరోగ్యంలో ఎన్నో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యవంతమైన బరువు, కండరాలకు, ఎముకలకు బలం చేకూరడమే కాక, పొత్తికడుపు, తొడలు మరియు నడుము వద్ద కొవ్వు కరుగుతుంది. నెమ్మదిగా నడిచినా లేదా పరుగుపరుగున నడిచినా లాభమే కానీ స్థిరమైన వేగాన్ని పాటించాలి.

మానసిక శాస్త్ర ప్రకారం విశ్లేషిస్తే, నడక మానసిక ఒత్తిడిని తగ్గించి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. క్రమం తప్పకుండా నడిస్తే, మంచి నిద్ర లభించడమే కాక, రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటాయి. మన శరీర వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నందున, సహజంగానే మన శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి.• జంపింగ్ జాక్స్: పిల్లలుగా ఉన్నప్పుడు మనం గెంతుతూ, తుళ్ళుతూ, పడుతూ, లేస్తూ ఉండేవాళ్ళం. మనం అలా ఉండటాన్ని బహుశా ఇష్టపడేవాళ్ళం కూడా!పెద్దయ్యాక కూడా అటువంటివి చేస్తే తప్పేముంది. జంపింగ్ జాక్స్ హృదయానికి మేలుచేసే ఒక సులువైన వ్యాయామం. అంతేకాక, మీ డెల్టాయిడ్ కండరాలు మరియు పిక్కల వద్ద కండరాలను టోన్ చేయబడతాయి. ఈ వ్యాయామం వలన మీ గుండె కొట్టుకునే వేగం పెరిగి మీలో ఉత్సాహం నిండుతుంది.

• స్క్వాట్స్: ఈ తరహా వ్యాయామం చేయడానికి అధిక శక్తి అవసరం. ఈ వ్యాయామం చేయడానికి శరీరంలో ఉన్న కండరాలన్నిటిని ఉపయోగించాలి కనుక మొత్తం శరీరం యొక్క శక్తిని మెరుగుపరుస్తుంది. మీరు కనుక స్క్వాట్స్ కొత్తగా చేయడం మొదలుపెట్టినట్లైతే, ఆ భంగిమను ఎక్కువసేపు నిలిపి ఉంచడం కొంచం కష్టమనిపిస్తుంది.

ఎక్కువ శక్తిని వినియోగించుకుంటుంది కనుక, మీ మోకాళ్ళు, పిక్కలు మరియు పాదాలపై ఒత్తిడి పడుతుంది. పోనుపోను మీరు దీని తీవ్రతను, నిలిపి ఉంచే సమయం పెంచుకుంటూ పోతే, స్క్వాట్స్ మూలంగా ఎంత శక్తివంతంగా తయారవగలుగుతారో మీకు అర్ధమవుతుంది.

• పిలేట్స్: మీలో శక్తి స్థాయి తగ్గిందన్న ఆలోచన కలిగిన మరు నిమిషమే, మీరు ఎటువంటి సంకోచం లేకుండా ప్రారంభించదగిన వ్యాయామం పిలేట్స్. పిలేట్స్ మిమ్మల్ని అత్యద్భుతంగా ఉత్సాహపరుస్తాయి.

పిలేట్స్ లో శ్వాసక్రమం, మీ శరీరానికి కావలసిన ప్రాణవాయువును అందిస్తాయి. మీ ఛాతీ భాగానికి శక్తి ప్రసరించి, అధికంగా శ్వాస అంది, మీ మెడ ముందు భాగం సాగుతుంది. దీనివలన థైరాయిడ్ ఉత్పత్తి మెరుగవుతుంది. హిప్స్ కు సంబంధించిన వ్యాయామంతో ఒత్తిడి విడుదల అవుతుంది.

• యోగా: ఏకాగ్రత మరియు మరియు లోతైన శ్వాస ప్రశ్వాసలతో కూడిన విశ్రాంతి పద్ధతులు కలిగి ఉండటం చేత యోగా, శరీరం మరియు మనసుకు ప్రయోజనం కలుగజేస్తుంది. అంతేకాకుండా, శరీరంలో నియంత్రిత రక్తప్రసరణ మూలంగా అలసట తొలగిపోతుంది. మీరు కనుక అచేతన జీవనశైలిని కలిగి శారీరకంగా ఎక్కువగా కదలికలు లేకపోవడం చేత అలసటకు లోనైనట్లైతే, మీకు యోగా బాగా ఉపయోగపడుతుంది.మనం ఎల్లప్పుడూ కూర్చుని ఉంటే, మన శరీరంలో శక్తి స్థాయిలు ఎక్కడికక్కడే నిలిచిపోయి, వెన్నులో దాగి ఉండిపోతాయి. దీని వలన అలసట, నడుము నొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి.

యోగాలోని వివిధ భంగిమలు, మన నాడీవ్యవస్థను ఉత్తేజితం చేసి, ఈ సమస్యలను పారద్రోలుతాయి. యోగా వలన వెన్ను సాగి, అందులో నిలిచి ఉండిపోయిన శక్తిని మొత్తం శరీరమంతటికి విడుదల చేయడం జరుగుతుంది.సూర్యనామస్కారాలలో ప్రాణామాసనం, ఆర్కాసనం, పాదహస్తాసనం, అశ్వాసంచాలనాసనం, దండాసనం, పర్వతాసనం, భుజంగాసనం మరియు అష్టాంగ నమస్కారం కలిసి ఉంటాయి. ఇవి మన శరీరంలో ప్రతి భాగాన్ని ఉత్తేజితం చేస్తాయి.సూర్యనామస్కారాల వలన మీ మొత్తం శరీరానికి వ్యాయామం లభిస్తుంది. దీనివలన మీ.శరీరానికి తక్షణ ఆరామం మరియు శక్తి లభిస్తుంది. మొదలుపెట్టేటప్పుడు రెండు జతలు చేయండి. ఒక్కోరోజు మీ శరీరం అనుమతించే దానిబట్టి సంఖ్య పెంచుకుంటూ వెళ్ళండి.

పరికరాలు లేదా తాదనుగుణమైన వాతావరణం అవసరమైన వ్యాయామాలు:• ఈత: ఈత ద్వారా శక్తి స్థాయి సునాయాసంగా పెరుగుతుంది. ఈడేటప్పుడు కలిగే నీటి స్పర్శ మీలో అద్భుతమైన శక్తిని స్థాపిస్తుంది.

• క్రీడలు: మీకు నచ్చిన ఏ క్రీడనైన ఎంచుకుని ఆడుతూ ఉంటే అది మీలో శక్తిని మరియు ఆనందాన్ని పెంచుతుంది. మీ శరీరానికి అవసరమైన వ్యాయామం, ఆనందంతో పాటుగా అదనంగా చేకూరుతుంది. ఈ పనిని మీరు ఇష్టపడటం వలన, విసుగు చెందడమో లేక వ్యాయామం మనేద్దామనే ఆలోచన చేయడమో చేయరు. మీ శరీరం మరియు మనసు తదనుగుణంగా స్పందిస్తాయి.

• సైక్లింగ్: క్రమం తప్పకుండా సైక్లింగ్ చేస్తే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఒత్తిడి మరియు క్రుంగబాటు తగ్గించడానికి, జ్ఞాపకశక్తి పెంచేందుకు, మంచినిద్రకు, సరైన భంగిమ సాధించాడానికి , ఎముకలు బలోపేతం కావడానికి, కీళ్ల కదలికలు మెరుగుదలకు, హృదయారోగ్య పెంపునకు మొదలైన వాటికి సైక్లింగ్ బాగా ఉపయోగపడుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, ఈ లాభాలన్ని, ఒక వ్యక్తిని అన్నిరకాలుగా ఆనందంగా , ఉత్సాహవంతంగా మార్చడానికి దోహదపడతాయి. శరీరంలో ఒక నూతన శక్తి పెల్లుబుకుతుంది.

• జిమ్: జిమ్ లోని పరికరాలు మీ హృదయారోగ్యాన్ని మెరుగుపరిచి, కండరాల నిర్మాణాన్ని ప్రోత్సహించి, మీ దేహానికి ఆరోగ్యకరమైన తీరును ఇచ్చి, ఒత్తిడిని తగ్గించి తద్వారా శక్తి స్థాయిని పెంచుతుంది.

ఆనందం = శక్తి = ఆనందం

పైన చెప్పిన విధంగా, ఈ వ్యాయామాలు యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, ఇవి మన సంపూర్ణ ఆరోగ్యానికి అనుకూల ప్రయోజనాలు కలిగిస్తాయి- మానసికంగా మరియు శారీరకంగా కూడా!

మీరు ఏ విధమైన వ్యాయామాన్ని ఎంచుకున్నప్పటికి, అవి మీ శరీరంలో ఒత్తిడిని కలుగజేసే కార్టిసోల్ వంటి హార్మోన్లను తగ్గించి, మెదడులో ఎండార్ఫిన్ల వంటి రసాయనాల ఉత్పత్తి పెంచి, సహజమైన నొప్పి నివారిణిగా పనిచేసి, మనకు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి.

మీరెంత ఆనందంగా ఉంటే, అంత శక్తివంతంగా ఉంటారు. మీరు బాధతో కృంగిపోతే, అలసట మరియు నిస్సత్తువ కమ్ముకుంటాయి.

మీ వ్యాయామాన్ని మీరు ఆనందించడానికి కొన్ని చిట్కాలు:

• మీకు బాగా ఇష్టపడే వ్యాయామాన్ని ఎంచుకోండి: మీరు మెచ్చని లేదా మీకు నచ్చని వ్యాయామాన్ని ఎంచుకుంటే, దానిని మీరు ఒక బరువుగా భావించి, ఇంకా అలసిపోతారు. దానికన్నా, మీకు నచ్చింది చేయడమే ఉత్తమం.• మీ మీద మీరు దృష్టిని కేంద్రీకృతం చేయండి: ధ్యాస కుదరనప్పుడు, మీరు ఆసక్తిని కోల్పోవటం వలన, మీ శరీరానికి విసుగు మరియు అలసట కలుగుతాయి. కనుక మంచి ఫలితాల కొరకు మీపై మీరు దృష్టిని కేంద్రీకరించండి..

• మిమ్మల్ని మీరు ఉత్సాహపరుచుకోండి: మీరు వ్యాయామం చేసే క్రమంలో చేరుకున్న ప్రతి కొత్త మైలురాయి వద్ద మిమ్మల్ని మీరు ఉత్సాహపరచుకుంటూ, ప్రోత్సహించుకుంటూ, ముందుకు సాగండి. మన మనస్సు ఆనందంగా ఉంటే, మన శరీరం కూడా ఎన్నో కొత్త సవాళ్లను స్వీకరించి, ఆనందంగా ఉంటుంది.

Read more about: diet and fitness
English summary

Feel Energised With These Simple Workouts

Has it ever happened with you, that you feel tired after waking up? Although, it is quite common and obvious to feel tired by the end of a long exhausting day. Whatever be the case, if tired, most of us crave for a good and relaxing bath or sleep depending on our mood and situation.
Story first published:Thursday, June 21, 2018, 7:48 [IST]
Desktop Bottom Promotion