For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు రెండింతలు బరువు తగ్గడానికి గుడ్డుతో పాటు వీటిని కూడా జతచేయండి !

మీరు రెండింతలు బరువు తగ్గడానికి గుడ్డుతో పాటు వీటిని కూడా జతచేయండి !

|

గుడ్లు బలవర్ధకమైన ఆహార పదార్థమని మనందరికీ బాగా తెలుసు. వీటికి కొవ్వును కరిగించే ఇతర ఆహార పదార్థాలను జతచేయడం వల్ల మీరు చాలా త్వరగా శరీర బరువును తగ్గించుకోవచ్చని మీకు తెలుసా ?

గుడ్లలో విటమిన్లు, యాంటీ-ఆక్సిడెంట్లు & ఆరోగ్యకరమైన కొవ్వు పదార్ధాలు పుష్కలంగా వుంటాయి, అవన్నీ కూడా మీ శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. వీటికి మరికొన్ని గొప్ప పోషకాలను కలిగి ఉన్న ఆహారాలను కలిపి తీసుకోవడం వల్ల మీ శరీరంలోని జీవక్రియ పనితీరు మరింతగా మెరుగుపడుతుంది.

Foods You Can Pair With Eggs For Weight Loss

ఈ వ్యాసంలో మేం తెలియజేసిన విషయాలను చదివి దాని ప్రకారం నడుచుకోవడం వల్ల మీ జీవితంలో ఎలాంటి ఆందోళనలు కలగవని మీకు మేము హామీని ఇస్తున్నాం !

గుడ్లు ముఖ్యంగా లుటీన్, జియాక్యాన్తిన్ & ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు అంటే పోషకాలతో నిన్ను ఉంటాయి. ఒక గుడ్డలో 70 కేలరీలను & 6 గ్రాముల ప్రొటీన్లు మాత్రమే కలిగి ఉంటుంది. కాబట్టి గుడ్డును మీ డైట్లో భాగం చేయడం వల్ల అది మీ ఆరోగ్యానికి మంచి చేయగలదు.

గుడ్లలో ప్రొటీన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల, ఇది మీ ఆకలిని తగ్గించి, పొట్టనిండిన అనుభూతిని మీలో పెంచుతుంది. భోజనం చేయాలన్న కోరికను "గుడ్లు" తగ్గిస్తుంది అలానే, మీరు రోజంతా తక్కువగా తినేలా కూడా చేస్తుంది.

మీ శరీర బరువును తగ్గించడంలో గుడ్లు సంతృప్తికరమైన ఫలితాలను కలిగి ఉంది. కాబట్టి ఈ గుడ్లకు మరికొన్ని ఆహారపదార్థాలను జత చేయడం వల్ల మీ శరీర బరువు రెట్టింపు స్థాయిలో తగ్గిస్తుంది.

ఈ వ్యాసంలో, మీ జీవక్రియను పెంచడానికి గుడ్లతో జతచేయవలసిన ఆహార పదార్ధాల జాబితాను మేము సిద్ధం చేశాము. బరువు తగ్గాలనుకునేవారు మేము సూచించిన ఈ మార్గాలను ఆచరించడంవల్ల మీరు త్వరగా బరువును కోల్పోతారు.

గుడ్లు - కారపు పొడి :-

గుడ్లు - కారపు పొడి :-

మీరు ప్రతిరోజు కొంత మోతాదులో కారపు పొడిని తీసుకోవడం వల్ల అందులో ఉండే క్యాప్సైసిన్ మీరు తీసుకునే ఆహారాన్ని శక్తిగా మారుస్తుంది అంతేకాకుండా, మీ శరీర బరువును తగ్గించడానికి ప్రోత్సాహకారిగా కూడా ఉంటుంది. మీ రోజువారీ డైట్లో తీసుకొని గుడ్డుకు కాస్త కారపు పొడిని జోడించడం వల్ల మీరు మంచి ఫలితాలను పొందడంలో సహాయపడుతుంది. గుడ్ల తో కలిపి తీసుకునే ఉత్తమ ఆహార పదార్థాలలో ఇది ఒకటి.

గుడ్లు- కొబ్బరినూనె :-

గుడ్లు- కొబ్బరినూనె :-

మీ పాన్కు, వెన్నను రాయడానికి బదులుగా కొబ్బరి నూనెను ఉపయోగించండి. కోడిగుడ్లతో కొబ్బరినూనె కలిసినప్పుడు మీ శరీరంలో ఉన్న శక్తిని 5 శాతం ఎక్కువగా ఖర్చు చేస్తాయి.

గుడ్లు - నూచ్ (న్యూట్రీషనల్ ఈస్ట్) :-

గుడ్లు - నూచ్ (న్యూట్రీషనల్ ఈస్ట్) :-

జున్నుకి ప్రత్యామ్నాయంగా నూచ్ (లేదా) న్యూట్రీషనల్ ఈస్ట్ను పరిగణించవచ్చు. కేవలం రెండు స్పూన్ల నూచ్లో 9 గ్రాముల మాంసకృత్తులను & 4 గ్రాముల ఫైబర్ను కలిగి ఉంటుంది. ఈ నూచ్ను కొద్దిగా గుడ్లపై జల్లి తినడం వల్ల రోజు వారికి మీకు కావల్సిన పూర్తి పోషకాలను సమకూరుస్తుంది. శరీర బరువును కోల్పోవటానికి గుడ్లతో కలిపి తీసుకోవలసిన ఆహారాలలో ఇది ఒకటి.

గుడ్డు - బ్లాక్ బీన్స్ :-

గుడ్డు - బ్లాక్ బీన్స్ :-

బ్లాక్ బీన్స్ ప్రోటీన్లు మరియు ఫైబర్తో పూర్తిగా నిండి ఉంటాయి. మీ కడుపుని పూర్తిగా నింపిన అనుభూతిని కలుగచేస్తూ, మిమ్మల్ని మరింత సన్నగా మారుస్తుంది. ఫైబర్ను కలిగి ఉండే ఈ పదార్థాన్ని 5 సంవత్సరాలపాటు నిర్విరామంగా తినడంవల్ల మీ పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును 3.7% వరకూ తగ్గిస్తుంది.

గుడ్డు - టర్కీ మాంసం :-

గుడ్డు - టర్కీ మాంసం :-

టర్కీ మాంసం 1/2 ఔన్స్ భాగంలో 83 క్యాలరీలను, 11 గ్రాముల ప్రోటీన్తో పాటు అతి తక్కువ కొవ్వును కలిగి ఉంటుంది. ఇది DHA ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలకు గొప్ప మూలంగా ఉండటం వల్ల కొవ్వును వ్యాపింపచేసే కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది. ఇటువంటి ప్రయోజనాలు కలుగజేసే గొప్ప పదార్ధాన్ని గుడ్లతో కలిపి మీరు తినవచ్చు.

గుడ్లు- ఓట్మీల్ :-

గుడ్లు- ఓట్మీల్ :-

గుడ్లను ఓట్మిల్తో కలిపి తీసుకోవడం వల్ల మీ నడుము భాగానికి బాగా సహాయకారిగా ఉంటుంది. ఈ పిండి పదార్థం చాలా నెమ్మదిగా జీర్ణమవుతుంది. ఇది ఆకలిని అణచివేసి, మీ శరీరంలో ఉన్న అదనపు కేలరీలను కరిగించడానికి సహకరించే జీర్ణ ఆమ్లాలను విడుదల చేస్తుంది. ఈ విషయాలన్నీ కూడా " ఎఫెక్ట్స్ ఆఫ్ ఎ లో-గ్లైసిమిక్ లోడ్ డైట్ ఆన్ ప్రెస్సింగ్ ఎనర్జీ ఎక్స్పెండిచర్ అండ్ హార్ట్ డిసీజ్ రిస్క్ ఫాక్టర్స్ డ్యూరింగ్ వెయిట్ లాస్" అనే అధ్యయనంలో నిర్ధారించబడ్డాయి.

గుడ్లు - క్యాప్సికం :-

గుడ్లు - క్యాప్సికం :-

మీరు వేగంగా బరువు తగ్గాలనుకుంటే ఈ ట్రిక్ చాలా గొప్పగా పనిచేస్తుంది. క్యాప్సికం పూర్తిగా విటమిన్-సి తో నిండి ఉండటం వల్ల మీ శరీరంలో నిల్వ ఉన్న కొవ్వును పూర్తిగా కరిగించడం ద్వారా మీకు రోజంతటికీ కావాల్సిన పూర్తి శక్తిని అందించడంలో సహాయపడుతుంది.

గుడ్లు- పాలకూర :-

గుడ్లు- పాలకూర :-

ఓక కప్పు పాలకూరలో 7 కేలరీలను కలిగి ఉంటుంది. దీనిని గుడ్లతో కలిపి వినియోగించినప్పుడు శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుంది. ఈ పాలకూరలో ఉండే ధైలకాయిడ్స్ సమ్మేళనాలు మీ ఆకలిని అణిచివేస్తాయి తద్వారా మీరు త్వరగా శరీర బరువును కోల్పోతారు.

గుడ్లు-గ్రేప్ ఫ్రూట్

గుడ్లు-గ్రేప్ ఫ్రూట్

ద్రాక్ష, మీ పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది వీటిని గుడ్లతో కలిపి వినియోగించడం వల్ల మీ ఆకలిని నియంత్రించటంలో బాగా సహకరిస్తుంది. మీ జీవక్రియను పెంపొందించడంలో ద్రాక్షపండు బాగా సహాయపడుతుంది. వీటిని గుడ్లతో కలిపి వినియోగించడం వల్ల మీరు త్వరగా బరువును కోల్పోతారు.

English summary

Foods You Can Pair With Eggs For Weight Loss

Eggs are filled with nutrients like lutein and zeaxanthin as well as omega-3 fatty acids. It contains just 70 calories and 6 grams of protein per egg. Hence, adding it to your diet is the best thing that you can do for your body.Eggs are incredibly high in their protein content. Hence, this helps in reducing the appetite and also increases fullness. Egg meals are known to reduce your cravings and makes you eat lesser throughout the day.Eggs rank high on the satiety index scale and coupling them along with certain food combinations will double your weight loss scale.In this article, we have listed some of the best foods you can pair with eggs to boost metabolism. So, continue reading to find out about the best ways to eat eggs for weight loss.
Desktop Bottom Promotion