For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఊబకాయాన్ని తగ్గించుటలో, స్వీట్ పోటాటోఎంతగా సహాయo చేస్తుందంటే ?

ఊబకాయాన్ని తగ్గించుటలో, స్వీట్ పోటాటోఎంతగా సహాయo చేస్తుందంటే ?

|

స్వీట్ పొటాటో దుంప జాతికి చెందిన కూరగాయలలో ఒక రకం. దీనిని చిలగడ దుంప అని కూడా వ్యవహరిస్తారు. అనేక అధ్యయనాల ప్రకారం స్వీట్ పొటాటో వినియోగం మధుమేహం, ఊబకాయం, గుండె సంబంధిత సమస్యలను తగ్గించడంలో ఎంతో దోహదం చేస్తుంది. తద్వారా మరణాల రేటును కూడా తగ్గిoచగలదని నివేదికలు సూచించాయి.

కానీ, స్వీట్ పొటాటో బరువు తగ్గడానికి కూడా సహాయపడగలదని మీకు తెలుసా ? మీరు విన్నది అక్షరాలా నిజం! స్వీట్ పొటాటో శరీరంలోని అదనపు క్రొవ్వులను తొలగించటానికి మరియు పొట్ట చుట్టూ పేరుకుపోయిన చెడు కొవ్వును తొలగించడానికి కూడా సహాయం చేస్తుంది.

How Do Sweet Potatoes Help In Weight Loss?

స్వీట్ పొటాటోలో మన శరీరానికి అవసరమైన అనేక పోషకాలు ఉంటాయి. ఇది మీ రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది, ఉబ్బసం మరియు మధుమేహం నియంత్రించడంలో సరైన క్రియలను నిర్వహిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, క్యాన్సర్ నిరోధిస్తుంది మరియు స్థిరమైన రక్తపోటు స్థాయిలను నిర్వహిస్తుంది.

స్వీట్ పొటాటోలో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది మలబద్ధకాన్ని నివారించడానికి మరియు ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. స్వీట్ పొటాటో, బీటా కెరోటిన్ యొక్క అద్భుతమైన మూలం, ఇది ఒక శక్తివంతమైన ప్రతిక్షకారిని కలిగి ఉంటుంది, తద్వారా ఒక శక్తివంతమైన రంగును కూడా కలిగి ఉంటుంది. శరీరంలో సరైన జీవక్రియలు నిర్వహించడానికి స్వీట్ పొటాటో ఒక అద్భుతమైన ఆహార పదార్ధంగా కూడా చెప్పబడినది.

స్వీట్ పొటాటో మీ రాత్రి భోజనానికి జోడించడం ఉత్తమంగా చెప్పబడినది. ఆరోగ్యకరమైన ఆహారంగా మరియు సంతృప్తికరమైన రుచి కోసం వాటిని ఉడకబెట్టడం లేదా గ్రిల్ చేయడం చేయవచ్చు. వాటిలో ఉన్న అధిక ఫైబర్ మీ కడుపుని ఎక్కువ సేపు నిండునట్లు ఉంచడం ద్వారా, మిమ్మల్ని అతిగా తినకుండా నిరోధిoచగలదు కూడా.

1. తక్కువ కేలరీల ఆహారం :

1. తక్కువ కేలరీల ఆహారం :

బరువును కోల్పోవటానికి సిద్దపడినప్పుడు, స్వీట్ పొటాటో వంటి తక్కువ కాలరీలు కలిగిన ఆహారాలు తీసుకోవాలి. వీటిలో తక్కువ కాలరీలు ఉన్న కారణంగా, ఆకలిగా ఉన్న కడుపుకు చిరు తిండిలా సహాయం చేస్తుంది. స్వీట్ పొటాటోలను ఫ్రై గా తీసుకునే కన్నా, రోస్ట్ చేయడం, గ్రిల్ చేయడం ద్వారా రుచికరమైన ఆరోగ్యకరమైన ఆహారంగా స్వీకరించవచ్చు.

2. ఫైబర్లో అధికం :

2. ఫైబర్లో అధికం :

స్వీట్ పొటాటోలు ఫైబర్ యొక్క అద్భుతమైన మూలంగా ఉంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది మరియు మధుమేహం నియంత్రించడంలో కూడా సహాయం చేస్తుంది. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (యు.ఎస్.డి.ఏ) ప్రకారం ప్రతి 100 గ్రాముల స్వీట్ పొటాటోలలో 3 గ్రాముల ఫైబర్ కలిగి ఉంటుంది. శరీరం లోపలికి ప్రయాణించేటప్పుడు ఫైబర్ విచ్ఛిన్నం కాదు, అందువలన ఇది కేలరీలను దహించడంలో సహాయపడుతుంది. మరియు కడుపు నిండిన అనుభూతికి లోనుచేయడం ద్వారా త్వరగా ఆకలి కాకుండా చూస్తుంది.

3. నీటి శాతం కూడా ఎక్కువే :

3. నీటి శాతం కూడా ఎక్కువే :

స్వీట్ పొటాటోలు ఎక్కువగా నీటి శాతాన్ని కలిగి ఉంటాయి. ఇది మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయం చేయడమే కాకుండా, మీ కడుపును ఎక్కువ కాలం పాటు నిండుగా ఉండేలా చేస్తుంది. 100 గ్రాముల స్వీట్ పొటాటోలో యు.ఎస్.డి.ఏ నివేదిక ప్రకారం 77 శాతం నీటిని కలిగి ఉంటుంది. రోజువారీ ఆహార ప్రణాళికలో భాగంగా స్వీట్ పొటాటో తీసుకుంటే అధిక లాభాలను పొందవచ్చు.

4. గ్లైసెమిక్ సూచికలో తక్కువ :

4. గ్లైసెమిక్ సూచికలో తక్కువ :

అధిక గ్లైసెమిక్ సూచిక ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయి పెరుగుదలకు కారణంగా ఉంటాయి. ఊబకాయం, గుండె సమస్యలు మరియు మధుమేహం వంటి ప్రధాన సమస్యలకు అధిక గ్లైసెమిక్ సూచిక ఆహారాలు ప్రధాన కారణం. ముఖ్యంగా టైప్ 2 మధుమేహానికి కారణమవుతాయి. కానీ, స్వీట్ పొటాటో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. మధుమేహం ఉన్న రోగులకు మరియు అధిక బరువుతో భాధపడే వారికి ఇది సురక్షితంగా ఉంటుంది.

5. సహజ చక్కెరలను కలిగి ఉంటుంది :

5. సహజ చక్కెరలను కలిగి ఉంటుంది :

స్వీట్ పొటాటో సహజ చక్కెరలను కలిగి ఉంటాయి. మరియు ఇవి మాంగనీస్ నిక్షేపాలను అధికంగా కలిగి ఉంటాయి. ఒరెగాన్ స్టేట్ యునివర్సిటీలోని ఒక పరిశోధనా అధ్యయనం ప్రకారం, ఎంజైమ్లను క్రియాశీల పరచుటకు మాంగనీస్ అత్యంత అవసరమైన ఖనిజంగా చెప్పబడినది. ఇది పిండి పదార్ధాలు మరియు కొవ్వుల నియంత్రణలో సహాయపడి, జీవక్రియ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది . కావున, మీ రోజువారీ ఆహార ప్రణాళికలో భాగంగా స్వీట్ పొటాటో కలిగి ఉండడం ఉత్తమంగా చెప్పబడినది.

6. పిండి పదార్ధాలు :

6. పిండి పదార్ధాలు :

100 గ్రాముల స్వీట్ పొటాటోలో 12 శాతం పిండి పదార్ధాలు ఉంటాయి. ఇది మీ శరీరానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మిగిలిన పిండి పదార్ధం (రెసిస్టేoట్ స్టార్చ్) ఒక ఫైబర్ వలె పని చేస్తుంది. మరియు జీర్ణక్రియ సమయంలో విచ్ఛిన్నం కాదు. ఇది జీర్ణం కావడానికి సమయం ఎక్కువ తీసుకుంటున్న కారణాన, ఇది మీ శరీరంలో ఎక్కువ సేపు ఉండే విధంగా ఉంటుంది. తద్వారా ఆ ఆకలి బాధలు లేకుండా చూస్తుంది.

ఆహారంలో స్వీట్ పొటాటోలు ఎలా తీసుకోవాలి ?

ఆహారంలో స్వీట్ పొటాటోలు ఎలా తీసుకోవాలి ?

ఉడికించడం, గ్రిల్ చేయడం లేదా వాటిని కాల్చడం ద్వారా వీటిని తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ పద్దతిలో, వాటిలో నెమ్మదిగా విడుదలయ్యే కార్బోహైడ్రేట్ మరియు అవసరమైన పోషక పదార్థాలను పూర్తిగా బయటకి వెళ్ళిపోకుండా చూడగలుగుతుంది. మీరు మీ సలాడ్లలో ఉడికించిన స్వీట్ పొటాటో జోడించవచ్చు మరియు దానిని తక్కువ కాలరీల ఆహారంగా చేయవచ్చు. లేదా మీరు మీ స్మూతీస్ లో కూడా స్వీట్ పొటాటో జోడించవచ్చు.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే, మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేకములైన ఆరోగ్య సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను క్రింది వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

How Do Sweet Potatoes Help In Weight Loss?

How Do Sweet Potatoes Help In Weight Loss?,Do you know the benefits of sweet potatoes for weight loss? Read this article to find out the sweet potato nutrition and how to use sweet potatoes in a meal.
Story first published:Friday, May 25, 2018, 17:59 [IST]
Desktop Bottom Promotion