For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రెగ్నెన్సీ తర్వాత కరీనా పాటించిన వెయిట్ లాస్ పద్దతులు

ప్రెగ్నెన్సీ తర్వాత కరీనా పాటించిన వెయిట్ లాస్ పద్దతులు

|

గర్భధారణ తర్వాత తిరిగి ఆరోగ్యకరమైన శరీరాన్ని ఎలా సాధించాలి? ప్రెగ్నెన్సీ తర్వాత తల్లుల మనసులో మెదిలే మొదటి ప్రశ్నగా ఉంటుంది. ఒకరకంగా పెద్ద సవాలుగా ఉంటుంది కూడా. కావున, ఈరోజు మీముందుకు ఈ సమస్యకు పరిష్కారాన్ని తీసుకుని రాబోతున్నాం:

బ్రిటిష్ యువరాణి పాటించిన డైట్ చిట్కాలు, అంటే సగం ఆహారపదార్ధాలు మనకు దొరకనివిగానే ఉంటాయి. అయితే కరీనాకపూర్ అనుసరించిన చిట్కాలు అంటే భారతీయులకు అందుబాటులో ఉన్నట్లే కదా. కానీ ప్రతి ఒక్కరి శరీరతత్వం ఒకేలా ఉండదు. నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణుల పర్యవేక్షణ కూడా ముఖ్యం. డైటీషియన్ రుజితా దివేకర్ సహాయంతో ప్రెగ్నెన్సీ తర్వాత బరువుని తగ్గించుకున్న కరీనా పాటించిన చిట్కాల గురించిన వివరాలు మీకోసం.

How Kareena Kapoor Lost Her Weight After Pregnancy?

కరీనా కపూర్ తన గర్భధారణ సమయంలో 18 కిలోల బరువు పెరిగింది మరియు ప్రెగ్నెన్సీ తగ్గ పద్దతులను పాటిస్తూ ఎటువంటి సమస్యలు రాకుండా చూస్కోగలిగింది. కానీ కొడుకు తైమూర్ జన్మించిన తరువాత, తిరిగి తన శరీరాన్ని కొన్ని నెలల వ్యవధిలోనే మామూలు రూపానికి తీసుకుని రావడంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుంది.

ఆరోగ్యకరమైన ఆహారం మరియు స్థిరమైన ఫిట్నెస్ పై దృష్టి పెట్టే క్రమంలో కరీనా కపూర్ రుజితా దివేకర్ సహాయం తీసుకుంది. క్రాష్ డైట్స్ వైపు మొగ్గు చూపకుండా, న్యూట్రిషియన్ సహాయం తీసుకుని ఒక క్రమ బద్దమైన పద్దతిలో బరువు తగ్గేలా చర్యలు తీసుకుంది.

కరీనాకపూర్ ప్రెగ్నెన్సీ తర్వాత పాటించిన వెయిట్ లాస్ చిట్కాలు, రుజితాదివేకర్ ద్వారా భాగస్వామ్యం చేయబడిన అంశాలు ఇక్కడ మీకోసం.

క్రింద తెలుపబడిన బరువు నష్టం చిట్కాలు, ప్రెగ్నెన్సీ తర్వాతి రోజుల్లో తిరిగి బరువును ఆరోగ్యకర రీతిలో మార్చుకొనుటకు సహాయపడగలదు.

1. కాల్షియం తగ్గడం

1. కాల్షియం తగ్గడం

గర్భం కారణంగా, మీ శరీరంలో కనీసం ఐదు సంవత్సరాల కాల్షియం నష్టానికి గురవుతుంది. ఈ విషయం ముఖ్యంగా అందరూ తెలుసుకోవాలి. కావున తిరిగి ఆరోగ్యకరమైన ఆకారాన్ని తిరిగి పొందే క్రమంలో కాల్షియం మీద ఎక్కువ దృష్టి సారించవలసి ఉంటుంది. దీనికోసం కరీనా తన డైట్ ప్లాన్ గ్లాసుడు పాలతో ప్రారంభించింది.

జున్ను, పాలు, పెరుగు మొదలైన పాడి ఉత్పత్తులు మీ శరీరంలోని చెడు కొవ్వును దహించడానికి సహాయపడే సంయోజిత లినోలెమిక్ ఆమ్లాన్ని(సి.ఎల్.ఏ)ను కలిగి ఉంటాయి. అలాగే, ఈ కొవ్వు ఆమ్లాలు కడుపు వంటి కొవ్వు చేరే ప్రాంతాల నుండి మొండి చెడుకొవ్వును తొలగించటానికి కూడా సహాయపడగలవు.

 2. డార్క్ సర్కిల్స్ తొలగించడం

2. డార్క్ సర్కిల్స్ తొలగించడం

మహిళలకు డార్క్ సర్కిల్స్ అనేవి ప్రసవానంతరం సర్వ సాధారణం. అందువల్ల, విటమిన్ బి12 మరియు ఐరన్ వంటివి శరీరానికి అందేలా చూసుకుంది. క్రమంగా అవి పుష్కలంగా ఉండే చాచ్, ఊరగాయ మరియు పెరుగు, సీడ్స్ వంటి ఆహార పదార్ధాలను తీసుకుంది

అదేవిధంగా కొబ్బరి- బెల్లం మిశ్రమం, నెయ్యితో చేసిన బాజ్రా రోటీ, నువ్వులు మొదలైనవి విటమిన్ బి12 మరియు ఇనుముతో పుష్కలంగా నిండి ఉంటాయి.మహిళలకు డార్క్ సర్కిల్స్ అనేవి ప్రసవానంతరం సర్వ సాధారణం. అందువల్ల, విటమిన్ బి12 మరియు ఐరన్ వంటివి శరీరానికి అందేలా చూసుకుంది. క్రమంగా అవి పుష్కలంగా ఉండే చాచ్, ఊరగాయ మరియు పెరుగు, సీడ్స్ వంటి ఆహార పదార్ధాలను తీసుకుంది

అదేవిధంగా కొబ్బరి- బెల్లం మిశ్రమం, నెయ్యితో చేసిన బాజ్రా రోటీ, నువ్వులు మొదలైనవి విటమిన్ బి12 మరియు ఇనుముతో పుష్కలంగా నిండి ఉంటాయి.

3. రైస్ తీసుకోవాలి

3. రైస్ తీసుకోవాలి

అనేకమంది మహిళలు అధిక బరువును తగ్గించే క్రమంలో రైస్ తీసుకోవడం తగ్గిస్తుంటారు. కానీ, కరీనా రోజుకు రెండుసార్లు రైస్ తీసుకోవాల్సిందిగా సూచించింది డైటీషియన్ రుజితా దివేకర్. ప్రెగ్నెన్సీ కారకంగా శరీరం నుండి తొలగిపోయిన మంచి బాక్టీరియాను తిరిగి పొందే క్రమంలో రైస్ సహాయపడుతుంది.

4. క్రాష్ డైట్ల కోసం ఎంపిక చేయవద్దు

4. క్రాష్ డైట్ల కోసం ఎంపిక చేయవద్దు

బరువు తగ్గే క్రమంలో అనేకమంది ఇప్పుడు క్రాష్ డైట్ల మీదకు మొగ్గు చూపడం పరిపాటిగా ఉంటుంది. కానీ ఈ పద్దతి, అందరికీ అన్నివేళలా సరిపడదు. ఈ ఆహార పదార్ధాలు జీవనశైలిని అస్తవ్యస్తం చేయడంతో పాటు శరీరానికి అందివ్వవలసిన పోషకాల అస్తవ్యస్త పోకడలకు దారితీస్తుంది. ముఖ్యంగా థైరాయిడ్ వంటి సమస్యలు పెరిగేందుకు కారకాలుగా ఉంటాయి.

మీ శరీరంలోని జీవక్రియలను తగ్గించడం మీద క్రమంగా దృష్టి సారించే ఈ క్రాష్ డైట్లు, శరీరానికి అవసరం కన్నా తక్కువ మొత్తంలో కాలరీలను పోషకాలను అందించడం కారణంగా కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయి.

ఇక్కడ కేవలం బరువు కోల్పోవడమే లక్ష్యం కాదు, మీ ఎముక మరియు కండరాల సాంద్రతను పునర్నిర్మించడం కూడా అవసరం. ఎప్పుడైతే వాటి సాంద్రత తక్కువగా ఉంటుందో బలహీనత, క్రమంగా కొన్ని ఆరోగ్య సంబంధ సమస్యలు మొదలవడం జరుగుతుంది.

5. వాకింగ్ తప్పనిసరి

5. వాకింగ్ తప్పనిసరి

ప్రెగ్నెన్సీ తర్వాత తిరిగి వ్యాయామం చేయడానికి కొంత సమయం తీసుకుంటుంది. కానీ ఈలోపు నడక అనేది ఉత్తమ వ్యాయామంగా ఉంటుంది. ఒక ట్రెడ్మిల్ మీద నడక అంటే ఈ సమయంలో కష్టం కావొచ్చు. కావున ట్రెడ్మిల్ దూరంగా ఉంచి, సాధారణ నడకకు రోజులో కనీసం 20 నుండి 30 నిమిషాల సమయం కేటాయించవలసినదిగా సూచించడమైనది.

సహజంగా బరువు తగ్గించుకోవాలనుకుంటున్నారా? రుజితాదివేకర్ సూచించిన వెయిట్-లాస్ డైట్ మీకోసం :

ఈ సెలబ్రిటీ డైటీషియన్, బరువు తగ్గేక్రమంలో పాటించవలసిన ఇతర ఆరోగ్యకర చిట్కాలను కూడా పంచుకుంది. అల్పాహారం, భోజనం మరియు డిన్నర్ మొదలైన విషయాలలో బరువు తగ్గే క్రమంలో, శరీరాన్ని ఆరోగ్యకరంగా ఉంచుటలో దోహదపడే చిట్కాలను ఇందులో పొందుపరచింది.

మీల్ 1: రోజులో మొదటగా తీసుకోవలసిన ఆహారాలు

మీల్ 1: రోజులో మొదటగా తీసుకోవలసిన ఆహారాలు

సీజనల్ పండ్లు లేదా డ్రైఫ్రూట్స్ లేదా నానబెట్టిన గింజలు, నిద్ర లేచిన 15 నిమిషాల్లోనే తీసుకోవాలి.

మీల్ 2: అల్పాహారం కోసం

మీల్ 2: అల్పాహారం కోసం

పైన తీసుకున్న ఆహారానికి 60-90 నిమిషాల వ్యవధిలోనే, నెయ్యితోకలిపి, అల్పాహారాన్ని తీసుకోవలసి ఉంటుంది.

మీల్ 3: లంచ్ ముందుగా

మీల్ 3: లంచ్ ముందుగా

అల్పాహారం తర్వాత 2-3 గంటల్లో సీడ్స్ లేదా కొబ్బరి నీరు తాగండి.

మీల్ 4: లంచ్ కోసం

మీల్ 4: లంచ్ కోసం

మీల్3 తర్వాత 2 నుండి 3 గంటలలో, రైస్ లేదా రోటీ, కూరగాయలు లేదా మాంసం లేదా పప్పు-ఊరగాయ వంటివి ఉండేలా లంచ్ తీసుకోవాలి.

మీల్ 5: మద్యాహ్న భోజనం తర్వాత

మీల్ 5: మద్యాహ్న భోజనం తర్వాత

మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 2 నుండి 3 గంటల తర్వాత గ్లాస్ మజ్జిగ తీసుకోవలసి ఉంటుంది.

మీల్ 6: సాయంత్రం స్నాక్స్ కోసం

మీల్ 6: సాయంత్రం స్నాక్స్ కోసం

సాయంత్రం 4 నుండి 6 గంటల మధ్య, మీ భోజనం లేదా అల్పాహారం సారూప్యమైన మీల్ భాగస్వామ్యం ఉంటుంది.

మీల్ 7: డిన్నర్ కోసం

మీల్ 7: డిన్నర్ కోసం

నిద్రపోవడానికి 2-3 గంటల ముందు, నెయ్యితో కూడిన రైస్ లేదా మిల్లెట్లను ఆహారంగా తీసుకోవాలి.

మీల్ 8: నిద్రకు ఉపక్రమించే ముందు (ఆకలితో ఉంటే)

మీల్ 8: నిద్రకు ఉపక్రమించే ముందు (ఆకలితో ఉంటే)

జీడిపప్పుతో కూడిన పాలు లేదా “చ్యావన్ప్ర్రాష్”తో కూడిన పాలు.

ఏరిలా సిల్క్ యోగా పద్దతి :

ఏరిలా సిల్క్ యోగా పద్దతి :

కరీనా కపూర్ ఆమె కండరాలను పటిష్టంగా ఉంచే క్రమంలో భాగంగా ఏరిలా సిల్క్ యోగా పద్దతిని అనుసరించింది. ఆమె 'ఫ్లయింగ్ ఫిట్' పద్దతులను కూడా ఏరిలా సిల్క్ పద్దతులలో భాగంగా అభ్యసించారు. క్రమంగా శరీరం నాజూగ్గా తయారవడంలో కీలకపాత్ర పోషించింది.

English summary

How Kareena Kapoor Lost Her Weight After Pregnancy?

Kareena Kapoor lost weight after pregnancy with the help of her dietitian Rujuta Diwekar. She urged Kareena to focus on a healthy diet and sustainable fitness which means the key to sustainable weight loss is to do it in a healthy manner without going on any crash diets. Kareena drank a glass of milk daily and ate vitamin B12- and iron-rich foods.
Desktop Bottom Promotion