For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గడానికి గ్రీన్ టీ ఆహార ప్రణాళికను పాటించడం ఎలా ?

|

ప్రపంచంలోని అత్యుత్తమ పానీయాలలో తేనీరు(టీ) కూడా ఒకటి. ఈ టీలోని రకాలలో బరువు తగ్గడానికి సూచించిన వాటిలో గ్రీన్-టీకూడా ఒకటి. ఎక్కువ శాతం ప్రజలు బరువు తగ్గడానికి గ్రీన్-టీను అత్యుత్తమ మార్గంగా చెప్తుంటారు. కానీ కొన్ని తప్పుడు పద్దతులలో గ్రీన్-టీతీసుకోవడం వలన బరువు తగ్గడంలో ఏమాత్రం ప్రభావం చూపలేదని నిపుణులు సూచిస్తుంటారు. ఇక్కడ గ్రీన్-టీఆహార ప్రణాళికను గూర్చిన పూర్తి వివరాలను పొందుపరచడం జరిగినది.

How To Go On A Green Tea Diet Plan To Lose Weight Fast

గ్రీన్-టీలో కాటెచిన్స్ అనే అనామ్లజనక సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరానికి రోగ నిరోధక వ్యవస్థ పెంచడంలో సహాయం చేస్తాయి. ఈ కాటెచిన్స్ లో ముఖ్యమైన ఎపిగల్లో కాటెచిన్స్ అనే సమ్మేళనం శరీర జీవక్రియలను పెంచడంలో అధికంగా సహాయం చేస్తాయి. తద్వారా ఊబకాయం తగ్గించడంలో దోహదపడుతాయి. ఈ కాటెచిన్స్ కొన్ని ఎంజైములను విడుదల చేయడం ద్వారా శరీరంలోని క్రొవ్వు పదార్ధాలను తునాతునకలు చేసే నోరెపినేఫ్రైన్ అనే హార్మోన్ గా మారడంలో సహాయం చేస్తాయి. తద్వారా నోరెపినేఫ్రైన్, క్రొవ్వు పదార్ధాలను విచ్చినo చేస్తుంది. గ్రీన్-టీలో పరిమిత మోతాదులో ఉన్న కెఫీన్ కూడా క్రొవ్వును తగ్గించడంలో సహాయం చేస్తుంది.

బరువుతగ్గడంలో గ్రీన్-టీపాత్ర :

బరువుతగ్గడంలో గ్రీన్-టీపాత్ర :

గ్రీన్ టీ, ఎక్కువ మోతాదులో పాలిఫెనోల్స్ ను కలిగి ఉంటుంది. ఇక్కడ ఈ పాలీఫెనోల్స్ కెటాచిన్స్ మరో రూపం. బరువు తగ్గడానికి పయోగపడే ముఖ్యమైన సమ్మేళనం ఇదే. ఈ కెటాచిన్స్ శరీర ఉష్ణోగ్రతను పెంచడంద్వారా కాలరీలను తగ్గించే ప్రయత్నం చేస్తుంది.

గ్రీన్-టీ లో పరిమిత మోతాదులో కెఫీన్ నిల్వలు కూడా ఉంటాయి. ఈ కెఫీన్ కాలరీలను, క్రొవ్వును హరించుటలో సహాయపడుతాయి. ప్రతి 100గ్రాముల కెఫీన్ పానీయం ద్వారా 9 అధిక కాలరీలను కరింగించవచ్చు.

గ్రీన్–టీ ఆహార ప్రణాళికను పాటించడమెలా:

గ్రీన్–టీ ఆహార ప్రణాళికను పాటించడమెలా:

మేరీ లాండ్ మెడికల్ సెంటర్ యూనివర్సిటీ వారి నివేదిక ప్రకారం, రోజుకు కనీసం 2 నుండి 3 కప్పుల గ్రీన్ టీని సేవించాల్సివస్తుంది. ప్రతి కప్పు గ్రీన్-టీలో 120 నుండి 320 మిల్లీగ్రాముల కెటాచిన్స్ మరియు 10 నుండి 60 మిల్లీగ్రాముల కెఫీన్ నిక్షేపాలు కూడా ఉంటాయి. ఈ నిల్వలు గ్రీన్-టీ మరగబెట్టే విధానం ఆధారితంగా మారుతుంటాయి.

సోమవారం:

సోమవారం:

ఉదయం: ఒక కప్పు గ్రీన్-టీ, ఒక టేబుల్ స్పూన్ నిమ్మ రసం

మద్యాహ్నం భోజనానికి ముందు: 11 గంటల సమయంలో ఒక కప్పు గ్రీన్-టీ

సాయంత్రం: 5 గంటల సమయంలో ఒక కప్పు గ్రీన్-టీ మరియు ఒక మల్టీ గ్రైన్ (ధాన్యాలతో కూడిన) బిస్కెట్లు.

ఎలా పని చేస్తుంది?

గ్రీన్-టీ లో నిమ్మరసం చేర్చడం ద్వారా, దాని రుచి పెరుగుతుంది. ఈ మిశ్రమం శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుటలో సహాయం చేస్తుంది. మద్యాహ్న భోజనానికి మరియు రాత్రి భోజనానికి ముందు తీసుకునే గ్రీన్-టీ మీ ఆకలిని హరించి వేయడమే కాకుండా ఎక్కువగా భోజనం చేయకుండా అడ్డుపడుతుంది. తద్వారా బరువు తగ్గడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అదేవిధంగా భోజనానికి తర్వాత పెరుగు లేదా మజ్జిగ తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ కూడా మెరుగ్గా జరుగుతుంది, మీ మధ్యాహ్న రాత్రి భోజనాలలో పోషకాలు ఉండేలా చూసుకోవాలి కానీ మితంగా.

మంగళవారం:

మంగళవారం:

ఉదయo: 7:30 గంటల సమయంలో అర స్పూన్ దాల్చిన చెక్క పొడి కలిపిన ఒక కప్పు గ్రీన్-టీ

మధ్యాహ్న భోజనానికి ముందు: 11 గంటల సమయంలో ఒక గ్రీన్-టీ

రాత్రి భోజనం ముందు: సాయంత్రం 5 గంటల సమయంలో ఒక కప్పు గ్రీన్-టీ మరియు ఒక క్రాకర్ బిస్కెట్

ఎలా పని చేస్తుంది?

గ్రీన్-టీ లో దాల్చిన చెక్కపొడి ఎందుకు:

దాల్చినచెక్క పొడి శరీరంలోని అధిక బరువును తొలగించుటలో సహాయం చేస్తుంది. గ్రీన్-టీ కి సరికొత్త తీపైన రుచిని కూడా ఇస్తుంది. ఒక కప్పు పండ్లు భోజనానికి ముందుగా తీసుకోవడం ద్వారా, అనారోగ్యకర చిరుతిండ్ల జోలికి పోకుండా మనసును మళ్లించగలదు. ఒక వేళ మీకు దాల్చిన చెక్క రుచి నచ్చని పక్షంలో మీరు నల్ల మిరియాలను ప్రత్యామ్నాయంగా వినియోగించవచ్చు.

బుధవారం:

బుధవారం:

ఉదయం: తేనె కలిపిన ఒక కప్పు గ్రీన్-టీ

మధ్యాహ్న భోజనానికి ముందు : ఒక కప్పు గ్రీన్-టీ

రాత్రి భోజనానికి ముందు : సాయంత్రం 5 గంటల సమయంలో ఒక కప్పు గ్రీన్-టీ మరియు పావు కప్పు నిమ్మరసంతో కూడిన , ఉడకబెట్టిన మొక్కజొన్న (స్వీట్ కార్న్)

ఎలా పని చేస్తుంది?

తేనెలో సహజసిద్దమైన క్రిమిసంహారక తత్వాలు మరియు రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు ఉంటాయి. తద్వారా ఇది శరీరాన్ని ఆరోగ్యంగా మరియు దృఢంగా ఉంచడంలో పాటుపడుతుంది. ఉదయాన్నే కప్పు గ్రీన్-టీ ను తేనెతో కలిపి సేవించడం ద్వారా రోజును మొదలుపెట్టడం మంచిది. చక్కెరలకు ప్రత్యామ్నాయంగా తేనెను తీసుకోవడం వలన 63 శాతం కాలరీలను తగ్గించగలదని నిపుణులు సూచిస్తున్నారు. శరీరంలో వ్యర్ధమైన ఆహార పదార్ధాలను విచ్ఛిన్నం చేసి జీర్ణం చేయుటలో, ఎంతగానో సహాయం చేస్తాయి. ముఖ్యంగా ఉదయాన్నే గ్రీన్-టీ తీసుకోవడం ద్వారా, దీని ప్రయోజనాలను అధికంగా పొందవచ్చు. శరీరంలోని అవసరంలేని విషతుల్య రసాయనాలను హరించి జీవక్రియలను మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

గురువారం:

గురువారం:

ఉదయం: ఒక కప్పు గ్రీన్-టీ

మద్యాహ్నం భోజనానికి ముందు: ఒక కప్పు గ్రీన్-టీ

రాత్రి భోజనానికి ముందు : ఒక కప్పు గ్రీన్-టీ

ఎలా పనిచేస్తుంది?

రోజునుగ్రీన్-టీ తో ప్రారంభించడం ద్వారా, జీవక్రియలు చక్కగా పనిచేయడంలో సహాయo చేస్తుంది. మద్యాహ్న భోజనానికి ముందు గ్రీన్-టీ తీసుకోవడం వలన, ఆకలి హరించి వేసి మిత భోజనానికి మొగ్గు చూపేలా చేస్తుంది. కానీ పోషకాలు ఉండేలా మద్యాహ్నం మరియు రాత్రి వేళల భోజనాలు తీసుకోవడం వలన గ్రీన్-టీ ఆహార ప్రణాళిక నందు విసుగు లేకుండా చూస్తుంది.

శుక్రవారం :

శుక్రవారం :

ఉదయo: అర స్పూన్ దాల్చిన చెక్క పొడితో గ్రీన్-టీ

మద్యాహ్న భోజనానికి ముందు: ఒక కప్పు గ్రీన్-టీ

రాత్రి భోజనానికి ముందు: ఒక కప్పు గ్రీన్-టీ మరియు ఉప్పు కలపని పాప్ కార్న్ అర కప్పు

ఎలా పని చేస్తుంది?

దాల్చిన చెక్కపొడితో గ్రీన్-టీ మంచి రుచిని కలిగి ఉంటుంది. శరీరంలోని క్రొవ్వు కరకడంలో తద్వారా ఊబకాయం తగ్గడంలో సహాయం చేస్తుంది. ఉప్పు కలపని పాప్ కార్న్ గ్రీన్-టీ తో తీసుకోవడం వలన ఆకలి సన్నగిల్లుతుంది. శరీరానికి పోషకాలు కూడా అందుతాయి. తద్వారా బరువు తగ్గడంలో సహాయం చేయగలదు. ఈరోజు ప్రోటీన్ ఉండేలా ఆహారం తీసుకోవలసి ఉంటుంది. కానీ నిద్రకు ఉపక్రమించే 3 , 4 గంటల మునుపే ఆహారాన్ని తీసుకొనవలసి ఉంటుంది.

శనివారం:

శనివారం:

ఉదయం: నిమ్మరసంతో కూడిన ఒక కప్పు గ్రీన్-టీ

మద్యాహ్న భోజనానికి ముందు: ఒక కప్పు గ్రీన్-టీ

రాత్రి భోజనానికి ముందు: ఒక కప్పు గ్రీన్-టీ.

ఎలా పని చేస్తుంది?

రోజును గ్రీన్-టీ తో మొదలుపెట్టడం మరియు రుచికరమైన అల్పాహారం ద్వారా శరీరoలో జీవక్రియలు చక్కగా పనిచేయడానికి దోహదం చేస్తాయి. గ్రీన్-టీ శరీరంలో పేరుకుపోయిన అదనపు క్రొవ్వును తగ్గించడంలో సహాయం చేస్తుంది. మద్యాహ్న భోజనానికి ముందు 11 గంటల సమయంలో ఒక గ్రీన్-టీ మాత్రమే తీసుకునేలా ఉండాలి. మరియు రాత్రి భోజనం ముందు కూడా గ్రీన్-టీ తప్పనిసరి. తద్వారా శరీర జీవక్రియలు చక్కగా పనిచేయడంలో దోహదం చేస్తాయి. నిమ్మ రసానికి ప్రత్యామ్నాయంగా ఆపిల్ సిడార్ లేదా వెనిగర్ ను ఉపయోగించవచ్చు.

ఆదివారం:

ఆదివారం:

ఉదయo: అర స్పూన్ దాల్చిన చెక్క పొడి మరియు తేనె కలిపిన గ్రీన్-టీ

మద్యాహ్న భోజనానికి ముందు: ఒక కప్పు గ్రీన్-టీ

రాత్రి భోజనానికి ముందు: ఒక కప్పు గ్రీన్-టీ మరియు ఒక మల్టీ గ్రెయిన్ క్రాకర్ బిస్కెట్

ఎలా పని చేస్తుంది?

గ్రీన్-టీ లో దాల్చిన చెక్క పొడి మరియు తేనె కలిపి తీసుకోవడం వలన జీవక్రియలు మెరుగ్గా పనిచేస్తాయి. బరువు తగ్గడంలో కాలరీలను కరిగించడమే కీలకపాత్ర. సాధారణ గ్రీన్-టీ లో 2 కాలరీలు మాత్రమే ఉంటాయి. గ్రీన్-టీ లో దాల్చిన చెక్క పొడి, మరియు తేనె కలపడం ద్వారా శరీరంలోని కాలరీలు అధికంగా తగ్గించే ప్రయత్నం చేయవచ్చు.

గ్రీన్-టీ ప్రతికూల లక్షణాలు:

గ్రీన్-టీ ప్రతికూల లక్షణాలు:

గ్రీన్-టీ లో కూడా కొన్ని ప్రతికూల లక్షణాలు ఉన్నాయి. ఒక్కోసారి చిన్నవాటి నుండి తీవ్రమైన పరిస్థితుల దాకా ఉంటాయి. తలనొప్పి, నరాల బలహీనత, నిద్రలేమి, వాంతులు, వికారం, గుండె కొట్టుకోవడంలో అసాధారణ మార్పులు, గుండెల్లో మంట, మైకం, చెవుల్లో ద్వని, మూర్ఛ మరియు మానసిక గందరగోళం వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అనుమానం వస్తే వెంటనే ఆపివేయడం మంచిది. కావున మితంగా ఉండేలాగే గ్రీన్-టీ ను సేవించవలసి ఉంటుంది.

English summary

How To Go On A Green Tea Diet Plan To Lose Weight Fast

Green tea has higher concentrations of polyphenols, also called catechins. This is actively linked to weight loss. According to the University of Maryland Medical Center, you need to drink 2 to 3 cups of green tea a day. Green tea is also a source of caffeine. Caffeine helps the body to burn both calories and fats.
Story first published:Saturday, April 14, 2018, 16:38 [IST]
Desktop Bottom Promotion