For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెయిట్ లాస్ కై త్రిఫలను ఎలా ఉపయోగించాలి?

వెయిట్ లాస్ కై త్రిఫలను ఎలా ఉపయోగించాలి?

|

ఆయుర్వేదంలో త్రిఫలకు విశిష్టత కలదు. త్రిఫలలో వాత, పిత్త మరియు కఫ దోషాలను తగ్గించే సామర్థ్యం కలదు. ఉసిరి, తానికాయ మరియు కరక్కాయ మిశ్రమమిది. ఆయుర్వేద వైద్యంలో వివిధ రోగాలను నయంచేసేందుకు త్రిఫలా చూర్ణాన్ని వాడతారు. పొట్ట, చిన్న ప్రేగు మరియు పెద్ద ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. టాక్సిన్స్ ను ఫ్లష్ చేస్తుంది. అంతేకాక, వెయిట్ లాస్ కి తోడ్పడుతుంది. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. మెటాబాలిజాన్ని మెరుగుపరచడంతో పాటు అనేకరకాల మైక్రోబయాల్ ఇన్ఫెక్షన్స్ ను అరికడుతుంది. ఈ ఆర్టికల్ లో త్రిఫల ద్వారా వెయిట్ ను ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం.

త్రిఫల అనేది పురాతన హెర్బ్ ఫార్ములా. భారత్ లోనే ఈ ఫార్ములా మూలాలను గమనించవచ్చు. ఇందులో త్రిఫల అనే మూడు ఫలాలను గమనించవచ్చు. ఉసిరి వాటిలో ఒకటి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా కలవు. శరీరంలోని టాక్సిన్స్ ను తొలగిస్తుంది. ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. ప్యాంక్రియాస్ హెల్త్ ను రెగ్యులేట్ చేస్తుంది. కొలెస్ట్రాల్ ని మేనేజ్ చేస్తుంది. బోన్ డెన్సిటీ ను పెంపొందిస్తుంది.తానికాయ బ్లడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను నియంత్రిస్తుంది. మజిల్స్ ను అలాగే బోన్స్ ను హెల్దీగా ఉంచుతుంది.

కరక్కాయ శరీరంలో నుంచి టాక్సిన్స్ ను తొలగిస్తుంది. వెయిట్ గెయిన్ కు తోడ్పడుతుంది.

How To Use Triphala For Weight Loss

వెయిట్ లాస్ కై త్రిఫలా ఏ విధంగా తోడ్పడుతుంది

పౌడర్ అలాగే టాబ్లెట్స్ రూపంలో త్రిఫలా లభిస్తుంది. త్రిఫలా అనేది మూడు ఫలాల కలయికలో తయారవుతుంది. అందువలన, దీని ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

ఉసిరికాయలో విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరం లోంచి టాక్సిన్స్ ను తొలగిస్తాయి. ఉసిరిలో ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది. ఇది శరీరంలోంచి వేస్ట్ ను తొలగిస్తుంది. ఉసిరిలో అనవసరపు ఆకలిని నిరోధించే ప్రోటీన్స్ కలవు. అలాగే, ఇది లంగ్స్ కి మంచిది. అనీమియాను అరికడుతుంది. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది.

కరక్కాయ అనేది సురక్షితమైన లాక్సేటివ్ గా పనిచేస్తుంది. తద్వారా, కాన్స్టిపేషన్ ను నిరోధిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది. తద్వారా, శరీరంలో నుంచి టాక్సిన్స్ ను ఎలిమినేట్ చేస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరచడం ద్వారా ఇది ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. తద్వారా, వెయిట్ లాస్ కు తోడ్పడుతుంది. అలాగే డిమెన్షియా మరియు డయాబెటిస్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది.

తానికాయలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబయాల్, యాంటీ డయాబెటిక్, అనాల్జేసిక్, యాంటీ స్పాస్మోడిక్, యాంటీ హైప్ర్టన్సివ్ వంటి కొన్ని లక్షణాలు కలవు. ఇవి ఆర్టెరీస్ లోని ప్లేక్ ఫర్మేషన్ ను అరికడతాయి. అలాగే, కొవ్వు పేరుకోవడాన్ని తగ్గిస్తుంది. గేలిక్ యాసిడ్ వలన శరీరంలోని వాటర్ వెయిట్ ను అరికడుతుంది. ఇందులో లభించే ఒక కాంపౌండ్ యాంటీ ఒబెసిటీ లక్షణాలు కలిగినది.

త్రిఫల అనేది కొలోన్ టిష్యూస్ ను టోన్ చేస్తుంది. తద్వారా, వెయిట్ ను కంట్రోల్ చేస్తుంది. ఇది కొలెస్ట్రాల్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుతుంది. బాడ్ కొలెస్ట్రాల్ , ట్రైగ్లైసెరైడ్స్, మరియు లో డెన్సిటీ లైపోప్రోటీన్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ఇది బాడీ ఫ్యాట్ ను తగ్గిస్తుంది. కేలరీ ఇంటేక్ ను తగ్గించడం ద్వారా ఆరోగ్యకరమైన బరువును మెయింటెయిన్ చేసే సామర్థ్యాన్ని అందిస్తుంది.

త్రిఫల ద్వారా కలిగే ఇతర ప్రయోజనాలు:

త్రిఫల ద్వారా కలిగే ఇతర ప్రయోజనాలు:

1. యాంటీ ఇంఫ్లేమేటరీ ప్రాపర్టీస్ :

త్రిఫలాలో ఫ్లెవనాయిడ్స్, టానిన్స్, పోలీఫెనాల్స్ మరియు సపోనిన్స్, విటమిన్ సి వంటి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా కలవు. అలాగే, వీటితో పాటు ఇతర పోటెంట్ ప్లాంట్ కాంపౌండ్స్ కూడా ఇందులో కలవు. ఫ్రీ రాడికల్స్ వలన ఎదురయ్యే ఆక్సిడేటివ్ స్ట్రెస్ తో పోరాడే సామర్థ్యం ఈ కాంపౌండ్స్ కి కలవు. అందువలన దీర్థకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదం తగ్గుతుంది.

ఆర్తరైటిస్, హార్ట్ డిసీస్, ప్రీమెచ్యూర్ ఏజింగ్ వంటి సమస్యల బారిన పడే ఇబ్బందిని తగ్గిస్తుంది.

2. మలబద్దకాన్ని తగ్గిస్తుంది:

2. మలబద్దకాన్ని తగ్గిస్తుంది:

మలబద్దకం నివారణకు త్రిఫలను వాడతారు. ఇది లాక్సేటివ్ గా పనిచేస్తుంది. బౌల్ ను శుభ్రపరుస్తుంది. అంతేకాక, లోవర్ అబ్డోమినల్ పెయిన్ ను అలాగే అపానవాయువును తగ్గిస్తుంది.

3. క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది:

3. క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది:

త్రిఫలాలో పోలీఫెనాల్స్ మరియు గేలిక్ యాసిడ్ వంటి శక్తివంతమైన యాంటీ అక్షడెంట్స్ కలవు. ఇవి క్యాన్సర్ కి వ్యతిరేకంగా పోరాటం జరుపుతాయి.

4. దంతవ్యాధుల నుంచి రక్షణ:

4. దంతవ్యాధుల నుంచి రక్షణ:

త్రిఫల అనేది ప్లేక్ ఫర్మేషన్ ను అరికడుతుంది. ప్లేక్ ఫార్మేషన్ వలెనే చిగుళ్ల వాపుతో పాటు కేవిటీస్ సమస్య ఎదురవుతుంది. ఇది నోట్లోని బాక్టీరియా గ్రోత్ ను తగ్గిస్తుంది. ఇందులో లభ్యమయ్యే యాంటీ మైక్రోబయాల్ మరియు యాంటీ ఇంఫ్లేమేటరీ ప్రాపర్టీస్ ఇందుకు తోడ్పడతాయి.

వెయిట్ లాస్ కై త్రిఫలాను వాడటమెలా?

వెయిట్ లాస్ కై త్రిఫలాను వాడటమెలా?

ఈ క్రింద వివరించబడిన విధానాలలో త్రిఫలాను వాడితే వెయిట్ లాస్ ను గమనించవచ్చు.

1. త్రిఫల పౌడర్ మరియు వార్మ్ వాటర్:

ఒక టేబుల్ స్పూన్ త్రిఫల పౌడర్ ను ఒక గ్లాసుడు నీళ్లలో రాత్రంతా నానబెట్టండి. మరుసటి రోజు ఆ నీరు సగమయ్యేవరకు మరగబెట్టండి. ఆ నీటిని చల్లార్చి తాగండి.

2. త్రిఫల టీ:

2. త్రిఫల టీ:

ఒక కప్పుడు నీటిని మరిగించి అందులో ఒక టేబుల్ స్పూన్ త్రిఫల పొడిని జోడించండి.

30 సెకండ్ల పాటు బెయిల్ చేయండి. చల్లార్చండి.

తాగేముందు కొంత నిమ్మరసాన్ని జోడించండి.

3. త్రిఫల పొడి మరియు చల్లటి నీరు

3. త్రిఫల పొడి మరియు చల్లటి నీరు

రెండు టీస్పూన్ల త్రిఫల పౌడర్ ను ఒక గ్లాసుడు నార్మల్ వాటర్ లో జోడించండి.

రాత్రంతా నానబెట్టండి. ఉదయాన్నే పరగడుపున ఈ సొల్యూషన్ ను తాగండి.

4. త్రిఫల పౌడర్, దాల్చిన మరియు తేనే:

4. త్రిఫల పౌడర్, దాల్చిన మరియు తేనే:

ఒక టేబుల్ స్పూన్ త్రిఫల పొడిని అలాగే ఒక చిన్న దాల్చినను గాల్సుడు నీళ్లలో జోడించండి.

దీన్ని రాత్రంతా నానబెట్టండి. మరుసటి ఉదయాన్నే ఒక టేబుల్ స్పూన్ తేనెను దీనికి జోడించి తాగండి.

English summary

How To Use Triphala For Weight Loss

Triphala is an ancient herb formula that contains three fruits - Amalaki (Indian gooseberry), Bibhitaki (bedda nut), and Haritaki (black myrobalan). It aids in keeping the stomach, small intestine and large intestine healthy by flushing out the toxins. This, in turn, benefits weight loss, improves immunity, boosts metabolism and prevent microbial infections.
Story first published:Tuesday, August 7, 2018, 16:01 [IST]
Desktop Bottom Promotion