For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోటానికి ఈ 5 బోన్ సూప్ లను మీ ఆహారంలో చేర్చుకోండి

|

ఈ మధ్యకాలంలో పోషకాలు నిండివున్నాయని పాపులర్ అయిన బోన్ బ్రోత్ లేదా బోన్ సూప్ గురించి మీరు వినేవుంటారు. రుచికరంగా ఉండటమే కాదు, బోన్ సూప్ ద్వారా ఆరోగ్యానికి చాలా మేలు కూడా ఉంటుందని ప్రసిద్ధి.

ఈ బోన్ సూప్ లేదా రసం అలవాటు మనుషులకి శతాబ్దాల పూర్వం నుంచే ఉంది. ప్రాచీనకాలం నుండి దీన్ని వివిధ జబ్బులకి మందులాగా వాడేవారు. శాస్త్రీయ ఆధారం అంతగా లేకపోయినా, బోన్ బ్రోత్ ను ఆహారంలో భాగంగా, ఆరోగ్యం మెరుగుపర్చుకోటానికి తీసుకోవడం చాలామంది మానలేదు.

Include These 5 Bone Broths To Boost Your Health

సాంస్కృతిక ఆధారాల బలంతో, ప్రజలు బోన్ సూప్ లను తరతరాలుగా దాని వివిధ లాభాలకోసం తీసుకోవటం కొనసాగిస్తున్నారు.

బోన్ సూప్ లలో ఉండే వివిధ పోషకాల కారణంగా కీళ్ళనొప్పులు, బరువు తగ్గటం, నిద్రలేమి సమస్యలు, శరీరంలో వాపులు, అనారోగ్యకరమైన జీర్ణవ్యవస్థ మొదలైనవాటిల్లో ఉపశమనం ఉంటుంది. బోన్ సూప్ లు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలైన గొంతులో దురద వంటి వాటికి కూడా చక్కగా పనిచేసి నయం చేస్తుంది. బోన్ సూప్ లో ఉండే ఉప్పు గొంతులో మంటను తగ్గిస్తుంది.

మీ ఆరోగ్యం మెరుగుపడటంలో బోన్ సూప్/బ్రోత్ ఎందుకు లాభం చేస్తుంది?

ఎముకలు, కనెక్టివ్ కణజాలం, ఎముక మజ్జలను ఉడికించినప్పుడు ముఖ్యమైన విటమిన్లు మెగ్నీషియం, కాల్షియం, సిలికాన్ ,ఫాస్పరస్ వంటివి విడుదల అవుతాయి. ఇంతేకాక, ఎముకలలో ఉండే కొల్లాజెన్, గ్లైసిన్,గ్లూటమిన్ పదార్థాలు విడుదల అవుతాయి.

Include These 5 Bone Broths To Boost Your Health

కొల్లాజెన్ ఎముకలు,కీళ్ళ వ్యాధులను నయం చేయటంలో సాయపడుతుంది. గ్లైసిన్ నిద్రమత్తును,అలసటను దూరం చేస్తుంది.ఆహారనాళంలో బ్యాక్టీరియాను గ్లూటమిన్ క్రమబద్ధీకరిస్తుంది. బోన్ సూప్ ను ఎప్పుడు తాగితే మంచిదన్నదానిపై ఏ నియమం లేదు, మీకు ఎలా సౌకర్యంగా, వీలుగా ఉంటే అప్పుడే తీసుకోవచ్చు.

ఇంకా, ఎముకల సూప్ ను సరిగా తయారుచేయటంలో కూడా ఏ వంటనియమం లేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్కృతుల్లో తరతరాలుగా వంట ఆచారంలా వస్తోంది.

మీరు ఈ ఎముకల సూప్ ఎలా తీసుకోవాలన్నదానికి శాస్త్రీయ ఆధారం లేదు. కానీ కొంతమంది సూప్ రుచి పెంచటానికి అల్లం, పసుపు, వెల్లుల్లి వేసుకుంటారు. చేప,చికెన్ లేదా బీఫ్ సూప్ లను పొద్దున్నే మొదట లేదా రాత్రి డిన్నర్ తర్వాత తీసుకోవాలి. నిజానికి ఎముకల సూప్ తీసుకోటానికి ఎటువంటి ప్రత్యేక సమయం లేదు.

తినటానికి సరిగ్గా ఉండటానికి మంచి నాణ్యత కలిగిన బోన్ బ్రోత్ ను కొనటం తప్పనిసరి. కొన్ని అధ్యయనాల్లో తేలింది ఏంటంటే కార్టిలేజ్,చర్మం నుండి తయారయిన చికెన్ సూప్ లో లెడ్ కూడా కన్పించింది.

Include These 5 Bone Broths To Boost Your Health

మీ ఆరోగ్యాన్ని మెరుగుపర్చే బోన్ సూప్ లు;

1.చేప ఎముకల బ్రోత్

థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నవారు తప్పక చేప ఎముకలను తమ ఆహారంలో చేర్చుకోవాలి. చేప ఎముకల నుంచి తయారయిన స్టాకులో అయోడిన్ ఎక్కువ మొత్తాల్లో ఉండి, థైరాయిడ్ గ్రంథి సాధారణంగా పనిచేసేలా చేస్తుంది.ఇది పల్చగా ఉండే సూప్ లా తయారవుతుంది, ఆసియాలో వండే కూరలు, సూప్ లలో కూడా దీన్ని బేస్ గా వాడుకోవచ్చు. నూనె లేని చేపల ఎముకలను ఎంచుకుని ఈ సూప్ తయారుచేయండి. ప్రెజర్ కుక్కర్ లో వండవద్దు. స్టవ్ మీద చేప ఎముకలను ఉడికించి తయారుచేయండి.

2.పంది ఎముకల సూప్

మీ బోన్ బ్రోత్ పై ఎక్కువ ఖర్చు, సమయం పెట్టకూడదు అనుకుంటే పంది ఎముకల సూప్ మీకు సరిపోతుంది. బీఫ్ లేదా చికెన్ బోన్ బ్రోత్ లతో పోలిస్తే, పంది ఎముకల సూప్ చాలా చవకైనది. అలాగే ఇతర రకాలతో పోలిస్తే, ఈ రకం ఎముకల సూప్ తయారుచేయటం సులభం, సింపుల్ కూడా.

Include These 5 Bone Broths To Boost Your Health

3.చికెన్ పాదాలు, మిరియాల స్టాక్

మీరు పోషకవిలువలు ఎక్కువ వుండే బోన్ బ్రోత్ కోసం చూస్తున్నట్లయితే, ఇది సరైనది. ఇది పైన చూడటానికి అంత నచ్చకపోయిమా, కొల్లాజెన్, కాల్షియం, గ్లూకోజమైన్ లతో నిండివుండే ఫర్ఫెక్ట్ స్టాకు.కానీ సరుకుల దుకాణంలో చికెన్ పాదాలు దొరకటం కష్టం కావచ్చు. మీరు స్థానిక రైతుల మార్కెట్లకి వెళ్ళి చికెన్ పాదాలను బ్రోత్ కోసం తెచ్చుకోండి.

4.బీఫ్ ఎముకల సూప్

నెమ్మదిగా ఉడికిన బీఫ్ బోన్ బ్రోత్, సింపుల్ ఇంకా పోషకాలుండే బీఫ్ స్టాకుకి సమానంగా అలానే ఫర్ఫెక్ట్ గా ఉంటుంది.దీన్ని మాంసం, కూరలు వండేటప్పుడు కూడా వాడుకోవచ్చు. నెమ్మదిగా ఉడికిన బీఫ్ బోన్ బ్రోత్ ను పులుసులు, సూప్ ల తయారీలో బేస్ గా వాడతారు.

5.అప్పటికప్పుడు తయారయ్యే బోన్ బ్రోత్

ఎముకల సూప్ ను త్వరగా అప్పటికప్పుడు తయారుచేయాలంటే, సరిపోయే కుండ లేదా ప్రెజర్ కుక్కర్ ను వాడవచ్చు. అందుకని మీరు బిజీగా ఉండి, సమయం లేకపోతే మీ కుటుంబం మొత్తానికి సరిపోయే విధంగా పెద్దమొత్తాలలో బ్యాచ్ స్టాక్ ను ఈ పద్ధతిలో తయారుచేసి పెట్టుకోవచ్చు. ఇందులో చికెన్ ఎముకలను వాడి తయారుచేస్తారు. అప్పటికప్పుడు చేసే ఎముకల సూప్ లో బీఫ్, పంది లేదా గొర్రెల ఎముకలు వాడాలనుకుంటే, ముందుగా ఓవెన్ లో వాటిని వేయించటం మర్చిపోకండి. దానివల్ల వాటిలో రుచి చక్కగా బయటకి వస్తుంది. ఈ బోన్ సూప్ ను మీ చికెన్ సూప్, కొబ్బరి కూర లైమ్ సూప్ లేదా ఎగ్ డ్రాప్ సూప్ లకి బేస్ గా వాడుకోవచ్చు.

English summary

Include These 5 Bone Broths To Boost Your Health

Bone broths benefit your health in many ways! Filled with nutrients in abundance, bone broths help in enhancing your health and keeping numerous health issues away like joint pain, inflammation, digestion-related problems, sleeping disorders. Apart from keeping you filled and providing you with nutrients, bone broths also induce weight loss.
Desktop Bottom Promotion