For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

International yoga day 2022-ప్రాణాయామం రోజూ చేస్తూ ఉంటే మరికొన్ని రోజులు ఎక్కువగా హ్యాపీగా బతకొచ్చు

By Arjun Reddy
|

యోగాలో ప్రాణాయామం అతి ముఖ్యమైన ప్రక్రియ. ఊపిరి తీసుకోవడం, వదలడంలో ఒక క్రమపద్ధతిని అనుసరించే ప్రాణాయామం ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందరికీ తెలుసు
ప్రాణాయామం అంటే ప్రాణ + ఆయామ (నియంత్రించుట) లేదా ప్రాణ + యమ (ఎరుక). లోపలికి వెళ్లి బయటకు వచ్చే ప్రాణ వాయువును పూర్తిగా మనసు పెట్టి నియంత్రించడం అని అర్థం చేసుకోవాలి. ప్రాణయామాల వల్ల సప్తధాతువులైన రస, రక్త, మాంస, మేధ, అస్తి, మజ్జ, శుక్రములోని లక్ష కోట్ల కణజాలానికి ఆక్సిజన్ పూర్తిగా అందుతుంది.

దీంతో శరీరభాగాలన్నీ ఆరోగ్యవంతం అవుతాయి. యోగాసనాల సాధన క్రమంలో శరీరంలో ఉత్పత్తి అయి పేరుకుపోయే లాక్టిక్ ఆమ్లం కండరాల నొప్పులకు, కీళ్ల నొప్పులకు ముఖ్య కారణం. దీనిని తీసివేసి దేహానికి ఉపశమనం కలిగించాలి. అలా చేయాలంటే ప్రాణాయామం చక్కని మార్గం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రాణాయామం గురించి ప్రత్యేక కథనం.

ప్రాథమిక ఆసనాలు

ప్రాథమిక ఆసనాలు

ప్రాణాయామ ఆసనాలు చాలా రకాలు ఉన్నాయి. అయితే వీటిలో ప్రధానంగా ఐదు ఉన్నాయి. సుఖ ప్రాణాయామం, నాడీ శోధన ప్రాణాయామం, సూర్య, చంద్రభేద ప్రాణాయామం, శీతలి ప్రాణాయామం, శిత్కారి ప్రాణాయామం.

సుఖ ప్రాణాయామం

సుఖ ప్రాణాయామం

ఇది శరీరాన్ని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా సుఖవంతంగా చేసే ప్రాణాయామం. దీనినే అనులోమ, వినులోమ ప్రాణాయామం అనికూడా అంటారు. ముక్కు కుడి నాసిక రంధ్రాన్ని బొటనవేలుతో మూసి ఎడమ నాసిక రంధ్రంతో గాలి పీల్చాలి. అలాగే ఎడమ పక్కన నాసిక రంధ్రం గుండా చేయాలి. ప్రాణాయామం చేయడం వల్ల ఆస్తమా, శ్వాస సంబంధిత సమస్యలు తీరడంతో పాటు మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఈ ప్రాణాయామం వల్ల గుండెకు కూడా మంచిది.

నాడీశోధన

నాడీశోధన

ఈ ప్రాణాయామం 1:2 నిష్పత్తిలో చేయాల్సి ఉంటుంది. అంటే సుఖ ప్రాణాయామం మాదిరిగానే గాలిని పీల్చి ఒక నాసికా రంధ్రంతో వదలాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ పీల్చే గాలి సమయానికి వదిలే గాలి సమయానికి తేడా ఉంటుంది. 10సెకెన్ల పాటు గాలిని పీల్చితే ఆ గాలిని 20సెకన్ల పాటు బయటకు వదలాల్సి ఉంటుంది. ఈ ప్రాణాయామం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

Most Read: నా పెళ్లాం నగ్నంగా పడుకుంటుందిగానీ సెక్స్ చేయవనివ్వదు, ఫోర్ ప్లే, మందు సర్వ్ చేయాలి #mystory241

సూర్య, చంద్రభేద

సూర్య, చంద్రభేద

ఈ ప్రాణాయామంలో కుడి నాసికా రంధ్రం నుంచి గాలి పీల్చి అదే రంధ్రం నుంచి గాలి వదలాల్సి ఉంటుంది. తర్వాత ఎడమ నాసికా రంధ్రం నుంచి పీల్చి అదే రంధ్రం నుంచి వదలాలి. ఈ పద్ధతి వల్ల శరీరంలోని ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు తగ్గి సమతుల్యత ఏర్పడుతుంది. దీనివల్ల శరీరంలో ఉష్ణతాపం తగ్గి శరీరం చల్లబడుతుంది.

శీతలి

శీతలి

వేసవిలో అత్యంత ఉపయుక్తమైన ప్రాణాయామం ఇది. ఈ పద్ధతి వల్ల వడదెబ్బ, రక్తపోటు, కళ్లమంట తగ్గుతుంది. ఇందులో నాలుక బయటకు చాచి మడతపెట్టి, సీ శబ్ధంతో నోటిద్వారా గాలిని పీల్చాలి. అనంతరం నోటిని మూసి రెండు నాసికా రంధ్రాల ద్వారా గాలిని బయటకు వదలాలి. ఇలా చేయడం వల్ల శరీరంలోని ఉష్ణతాపం తగ్గి, వడదెబ్బ నుంచి ఉపశమనం కలుగుతుంది.

శిత్కారీ

శిత్కారీ

నాలుక బయటకు చాచి, మడత పెట్టలేని వారి కోసమే ఈ శిత్కారీ ప్రాణాయామం. ఇందులో నోరు తెరిచి, దంతాలు గట్టిగా బిగుసుపట్టి దంతాల మధ్య నుంచి గాలిని సీ శబ్ధంతో పీల్చాలి. అనంతరం నోటిని మూసి రెండు నాసికా రంధ్రాల ద్వారా గాలిని బయటకు వదలాలి. వీటితో పాటు పలు రకాలు ప్రాణాయామాలతో తమ ఆరోగ్యాన్ని సంరక్షించుకోచ్చు.

Most Read:నా భర్త నా పిన్ని, చెల్లెలు, స్నేహితురాలితో ఒక్క రోజే గడిపాడు, రాత్రి మళ్లీ నాతో సెక్స్

రెండు రకాలు ప్రాణయామాలున్నాయి

రెండు రకాలు ప్రాణయామాలున్నాయి

ఇక ప్రాణాయామాలు రెండు రకాలు ప్రాణయామాలున్నాయి. బహిరంగ, అంతరంగ అని రెండు విధాలుగా వీటిని విభజించవచ్చు. కణజాలం బాహ్యపొర వరకూ ప్రాణవాయువును తీసుకెళ్లేవి బహిరంగ ప్రాణయామాలు, కణజాలం లోపలి వరకూ ప్రాణవాయువును పంపేవి అంతరంగ ప్రాణయామాలు. కొత్తగా సాధన చేసేవాళ్లు బహిరంగ ప్రాణయామాల మీద పట్టు సాధించిన తర్వాతనే అంతరంగ ప్రాణయామ సాధన ప్రారంభించాలి. అందుకని తొలుత బహిరంగ ప్రాణాయామాల గురించి వివరిస్తున్నాం.

బహిరంగ ప్రాణయామాల్లో సూర్యభేది ఒకటి

బహిరంగ ప్రాణయామాల్లో సూర్యభేది ఒకటి

సూర్యభేది బహిరంగ ప్రాణయామాల్లో సూర్యభేది ఒకటి. దీనిని సాధన చేయాలంటే మొదట నాసికాగ్ర ముద్ర వేయాలి. అంటే కుడి చూపుడువేలు, మధ్యవేలు కలిపి రెండు కనుబొమ్మల మధ్యలో ఉంచాలి. ఉంగరపు వేలును ఎడమ ముక్కు ఎముక (సెప్టమ్ బోన్) మీద ఉంచి బొటన, చిటికెనవేళ్లను కుడి, ఎడమ నాసికలను మూయడానికీ తెరవడానికీ ఉపయోగించాలి. ఎడమ చేతిని ఎడమ మోకాలి మీద ధ్యానముద్రలో ఉంచాలి. అంటే చూపుడు వేలు కొనను బొటనవేలు కొనకు తాకించి మిగిలిన మూడు వేళ్లను బయటకు ఉంచి ఎడమ చేతిని ఆకాశం వైపు చూపిస్తూ ఉంచాలి.

ఎడమనాసికను చిటికెనవేలుతో మూసి

ఎడమనాసికను చిటికెనవేలుతో మూసి

కుడినాసికతో శ్వాస సుఖ పూర్వకంగా లోపలికి తీసుకుని బొటనవేలితో కుడినాసికను మూసి, ఎడమ నాసిక గుండా శ్వాసను సుఖపూర్వకంగా బయటకు వదలాలి. ఎడమనాసికను చిటికెనవేలుతో మూసి కుడి నాసిక నుంచి మళ్లీ శ్వాస తీసుకోవాలి. ఇలా 5 నంచి 10 సార్లు చేయవచ్చు. తీసుకునే శ్వాసకన్నా వదిలే శ్వాసకు ఎక్కువ సమయం తీసుకోవడం మంచిది. మధ్యలో శ్వాసను ఆపి ఉంచవలసిన అవసరం లేదు.

Most Read: ధనవంతులు కావాలంటే.. ఇంట్లో ఈ వస్తువులను ఎట్టిపరిస్థితుల్లో పెట్టుకోకూడదు..!!

ఉపయోగాలు

ఉపయోగాలు

ఇది సింపథెటిక్ నెర్వస్ సిస్టమ్ను ఉత్తేజ పరచి జీవక్రియను చైతన్యవంతం చేస్తుంది. శరీరానికి శక్తిని ఇస్తుంది. బద్ధకాన్ని దూరం చేస్తుంది. పొట్ట కండరాల్లో కొవ్వు కరగడానికి ఉపకరిస్తుంది. ‘ఉజ్జయి' చేయడం వలన కేలరీలు ఎక్కువ ఖర్చవుతాయి.

విభాగ

విభాగ

ఇది రెండవ బహిరంగ ప్రాణయామం. ఊపిరితిత్తులలోని విభిన్న భాగాలకు ఆరోగ్యాన్ని అందిస్తుంది కాబట్టి దీన్ని విభాగ ప్రాణయామం అంటారు.

ఉపయోగాలు: ఊపిరి తిత్తుల్లోని పైభాగాలకు, మధ్య భాగాలకు, క్రింది భాగాలకు ఆక్సిజన్ను విడివిడిగా సరఫరా చేసేందుకు ఉపకరిస్తుంది. దీని వలన ఊపిరితిత్తుల్లో అత్యంత కింద భాగంలో ఎప్పుడూ పనిచేయని ఊపిరితిత్తులు కూడా పనిచేయడం మొదలుపెడతాయి. ఊపిరితిత్తుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. ఆస్త్మా సమస్య ఉన్నవారు, ఊపిరితిత్తులు బలహీనంగా ఉన్నవారు దీనిని మరింత ఎక్కువ సాధన చేయాలి. ఇక దీనిని 3 రకాలుగా సాధన చేయవచ్చు.

ఊర్ధ్వ

ఊర్ధ్వ

సుఖాసనంలో గాని, అర్ధ పద్మాసనంలో గాని, పద్మాసనంలోగాని కూర్చోవాలి. అలా నేల మీద కూర్చోలేనివారు కుర్చీలో కూర్చుని చేయవచ్చు. దీనిలో వెన్నెముకను నిటారుగా ఉంచి శ్వాస తీసుకుంటూ చేతులు రెండూ పైకి తీసుకెళ్లి అరచేతుల్ని ఆకాశంవైపు చూపుతూ ఇంటర్లాక్ చేయాలి. తలని కాస్త పైకి లేపి 3 నుంచి 5 సాధారణ శ్వాసలు తీసుకుని శ్వాస వదులుతూ చేతులు రెండూ భూమి వైపునకు చూపిస్తూ పక్క నుంచి నెమ్మదిగా కిందకు తీసుకు రావాలి. మెడను, భుజాలను పైకి కిందకు కదిలిస్తూ రిలాక్స్ అవ్వాలి. ఇది మెదడు, థైరాయిడ్ సమస్యలకు ఉపయుక్తం.

Most Read: చురకైన మెదడుకు మేత ఈ టాప్ 30 ఆహారాలే...

మధ్య

మధ్య

చేతులు రెండూ ఇంటర్లాక్ చేసి శ్వాస తీసుకుంటూ ముందుకు నేలకి సమాంతరంగా స్ట్రెచ్ చేయాలి. వీలుకొద్దీ 3 నుంచి 5 సాధారణ శ్వాసలు తీసుకుని తర్వాత శ్వాస వదులుతూ చేతులు ముందు నుంచి పక్కకు కిందకు తీసుకురావాలి. భుజాలు, మెడ కండరాలు పట్టుకుంటే రిలాక్స్ చేయాలి. గుండెలో బ్లాక్స్ ఉన్నవారికి హైబీపీ ఉన్నవారికి మంచిది.

అధో

అధో

చేతులు రెండూ వెనుకకు కిందకు తీసుకెళ్లి ఇంటర్లాక్ చేసి కలిపి ఉంచిన అరచేతులు రెండింటినీ భూమి వైపునకు చూపిస్తూ సాగదీస్తూ ఛాతీని ముందుకు ప్రొజెక్ట్ చేసి 3 లేదా 5 సాధారణ శ్వాసలు తీసుకుని తర్వాత శ్వాస వదులుతూ చేతులు కిందకు తీసుకురావాలి. మెడ, భుజాలు రిలాక్స్ చేయాలి. జీర్ణసమస్య ఉన్నవారికి మేలు చేస్తుంది. లివర్, పాంక్రియాస్, జీర్ణవ్యవస్థలకు చాలా మంచిది.

జాగ్రత్తలు: కొన్ని రకాల ప్రాణయామాలను హైబీపీ ఉన్నవాళ్లు, హైపర్ యాక్టివ్గా ఉన్న పిల్లలు చేయకపోవడం మంచిది. ఏ ప్రాణయామమైనా ఊపిరితిత్తుల సామర్థ్యానికి మించి చేయరాదు. మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ కొనసాగించవ చ్చు.

హార్మోన్‌ ఉత్పత్తి

హార్మోన్‌ ఉత్పత్తి

ప్రాణాయామం వల్ల ఊపిరి తీసుకుని, వదిలేసే క్రమంలో శరీరంలోని కార్బన్‌డయాక్సైడ్‌ మోతాదుల్లో మార్పులు వస్తాయి. ఈ మార్పులకు స్పందిస్తూ లోకస్‌ కొయిరులియస్‌ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తూంటుంది. గాలి లోపలికి పీల్చుకున్నప్పుడు ఎక్కువగా, వదిలేసినప్పుడు తక్కువగా పనిచేసి మన ఉద్వేగాలను, ఏకాగ్రతను కూడా ప్రభావితం చేస్తుంది.

Most Read:పెద్దపేగును పూర్తిగా శుభ్రపరిచే 10 గృహ చిట్కాలు

ప్రాణాయామంతో శరీరంలోకలిగే మార్పులు

ప్రాణాయామంతో శరీరంలోకలిగే మార్పులు

ప్రాణాయామం అంటే శ్వాసక్రియ ద్వారా ప్రాణవాయువు(ఆక్సిజన్)ను పీల్చడం అన్నమాట. శ్వాస క్రియద్వారా మనం పీల్చే గాలి పరిమాణం పెరిగితే జీవకణాలకు ఆక్సిజన్ ఎక్కువగా అందుతుంది. ఫలితంగా జీవకణాలు శక్తివంతమవుతాయి. ప్రాణాయామం ద్వారా కేవలం గాలిపరిమాణం, ఆక్సిజన్ పెరగడమే కాకుండా కండరాలు పటిష్టమవుతాయి. ప్రాణాయామానికి తోడు శరీరంలోని భాగాలను పైకి, కిందకు కదిలించడం వల్ల అవికూడా శక్తివంతమవుతాయి. ప్రాణాయామం రోజూ చేస్తూ ఉంటే మరికొన్ని రోజులు ఎక్కువగా హ్యాపీగా బతకొచ్చు.

English summary

International yoga day 2022: 10 Types of Pranayama for Beginners

10 Types of Pranayama for Beginners
Desktop Bottom Promotion