For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషులలో పొట్ట చుట్టూ చేరిన క్రొవ్వును తగ్గించే ఉత్తమ మార్గాలు.. !

పురుషులలో పొట్ట చుట్టూ చేరిన క్రొవ్వును తగ్గించే ఉత్తమ మార్గాలు.. !

|

ఒక టేప్ తీసుకుని మీ పొట్ట చుట్టుకొలతను కొలవండి. 94సెంటీమీటర్లు(37అంగుళాలు) కన్నా ఎక్కువ కొలతను చూపిస్తుందా? అయితే తక్షణ చర్యలు తీసుకోవడం మంచిది.

బెల్లీ కొవ్వు మీ శరీరంలోని పొట్ట ప్రాంతంలో చేరుతూ, మీ శరీర బరువును అసాధారణ రీతిలో పెంచే దిశగా ప్రభావాలను చూపిస్తుంది. మీ శరీర మద్యభాగం చుట్టూటా కొవ్వు పేరుకుని పోతూ, మీరు మిగిలిన భాగాలలో నాజూగ్గా ఉన్నాకూడా, ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తుంది. నెమ్మదిగా మానసిక సమస్యలకు కూడా ప్రధానకారకంగా పరిణమిస్తుంది.


బెల్లీ కొవ్వు అనేక ఆరోగ్య మరియు మానసిక సమస్యలకు కేంద్రబిందువుగా ఉంది. ముఖ్యంగా గుండెపోటు, స్ట్రోక్, రక్తపోటు, మధుమేహం, హార్మోనుల అసమతుల్యత, కిడ్నీ సమస్యలు మొదలైన అనేక అనారోగ్యాలకు పొట్ట చుట్టూ చేరి ఉన్న కొవ్వు కారణంగా మారగలదు. ఇలా 39రకాల ఆరోగ్య సమస్యలకు ప్రధాన కారణంగా ఉన్న ఈ బెల్లీ కొవ్వు, కాన్సర్ సమస్యను కూడా కలిగి ఉంటుంది.


ఈ సమస్యల నుండి బయటపడాలన్న ఆలోచన ఉన్నవారు ఆహారప్రణాళిక, వ్యాయామం మరియు జీవనశైలిలో సరైన మార్పులను చేసుకోవడం ద్వారా, ఉత్తమ ఫలితాలను పొందగలరు. వీటికి సంబంధించిన చిట్కాలను ఈవ్యాసంలో తెలుపడమైనది.

నాజూకైన నడుము కోసం సరైన ఆహార ప్రణాళిక:

రెండు రకాల ఆహారపు అలవాట్లు ప్రధానంగా ఆరోగ్యకర శరీరాన్ని అతలాకుతలం చేస్తుంటాయి. ఒకటి ఆహారాన్ని పూర్తిగా నిరోధించడం అయితే, రెండవది ఆహారాన్ని అవసరానికి మించి స్వీకరించడం.

సమస్యలు ప్రారంభదశలో ఉన్నప్పుడే వాటిని దూరం చేసే మార్గం మీద దృష్టి సారించాలి. మొక్కై వంగనిది మానై వంగునా అన్న చందాన, సరైన సమయంలోనే బెల్లీని పూర్తిగా తగ్గించే చర్యలను చేపట్టాల్సి ఉంటుంది. లేనిచో పరిస్థితులు చేయిదాటే ప్రమాదం ఉంది. దీనికి ప్రధానంగా మీ పాత చెడు అలవాట్లను త్యజించాల్సి ఉంటుంది.

అవాంఛిత బెల్లీ కొవ్వు వదిలించుకొనే క్రమంలో భాగంగా, తక్షణమే చక్కెర మరియు నిల్వ ఉంచిన ఆహార పదార్ధాలను పూర్తిగా తగ్గించాల్సి ఉంటుంది. మరియు మీ పూర్తి ఆహారప్రణాళికలో భాగంగా అధిక ఫైబర్ కలిగిన ఆహారాలు తీసుకోవలసి ఉంటుంది. మరియు పిండిపదార్ధాల క్రమబద్దీకరణ అవసరం.

Men, Here’s How You Can Lose Belly Fat

పిండి పదార్ధాలను తగ్గించడం ద్వారా రోజువారీ శరీరానికి అందే కాలరీలలో 40 శాతం తగ్గుదల కనిపించింది కూడా.

తినడం ద్వారా కూడా బెల్లీ ఫాట్ తగ్గుతుందా?

ఆహారప్రణాళికలో భాగంగా ఎక్కువ శాతం పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు మరియు బీన్స్ జోడించడం ముఖ్యం– ముఖ్యంగా వీటిలో ఉండే ఫైబర్ తరచూ ఆకలి వేయకుండా చేసి, ఆహారం మీదకు దృష్టి మరల్చకుండా చేయగలదు

ఆరోగ్యకర అమైనో ఆమ్లాలను కలిగి ఉన్న, అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్ సంబంధిత ఆహారాన్ని తీసుకోవడం మంచిది. పౌల్ట్రీ, చేపలు, గుడ్లు, టోఫు మొదలైన వాటిలో ఎక్కువగా ఇటువంటి మంచి ప్రోటీన్ చూడవచ్చు.

మీ బెల్లీ ఫాట్ తగ్గించే క్రమంలో చెడు కొవ్వును స్వీకరించక పోవడం మంచిదే, కానీ ఆరోగ్యకరమైన కొవ్వులను విస్మరించవద్దు. కూరగాయల నూనెలు, గింజలు, తృణధాన్యాలు, మరియు అవకాడోలు మొదలైన వాటి నుండి ఆరోగ్యకర క్రొవ్వులు లభిస్తాయి.

కేక్స్, కుకీలు, మిఠాయిలు, మరియు సోడా వంటి వినియోగాన్ని పరిమితం చేయాలి. ఫాస్ట్ ఫుడ్, హాట్-డాగ్, బేకన్ మరియు చిప్స్ వంటి అధిక-కొవ్వు కలిగిన చిరుతిండ్లు కూడా అనారోగ్యకరమైనవి ఎందుకంటే అవి కొవ్వు మరియు క్యాలరీలలో అధికంగా ఉంటాయి, మరియు తక్కువ పోషక విలువలను కలిగి ఉంటాయి. వీటి వలన నష్టమే కానీ లాభం ఏమాత్రం లేదు.

మంచి ఆహారప్రణాళిక దృష్ట్యా మార్పులు అవసరం:

అల్పాహారం కోసం:

తృణధాన్యాలు, ఓట్మీల్ (కనీసం 1¼ కప్పు), కొవ్వు రహిత పాలు(2కప్పులు), బాదం లేదా ఇతర గింజలు (4టేబుల్-స్పూన్లు), రైసిన్లు(2టేబుల్-స్పూన్లు). ఈ అల్పాహారం 591కేలరీలు, 29గ్రాముల ప్రోటీన్, 78గ్రాముల కార్బోహైడ్రేట్లు, 18గ్రాముల క్రొవ్వును కలిగి ఉంటుంది.

మధ్యాహ్న భోజనం కొరకు:

తృణధాన్యాలతో చేసిన సాండ్విచ్ బ్రెడ్ (2స్లైస్లు), మాంసం లేదా ట్యూనా-ఫిష్ (5ఔన్సులు), తక్కువ కొవ్వు కలిగిన చీజ్(1ముక్క), టమోటా (2ముక్కలు), మయోన్నైస్ (1 టేబుల్-స్పూన్), క్యారట్(1), మరియు నారింజ రసం(1కప్). దీనిలో మొత్తం 666 కేలరీలు, 41గ్రాముల ప్రోటీన్, 71గ్రాముల పిండిపదార్ధాలు, మరియు 25గ్రాముల కొవ్వు ఉంటుంది.

రాత్రి భోజనానికి :

పోర్క్, చికెన్ లేదా సీ-ఫుడ్(5ఔన్సులు), సలాడ్(1కప్), బ్రెడ్, బంగాళాదుంపలు లేదా పాస్తా (1స్లైస్ లేదా 1కప్), మరియు ఏదైనా పండు (3/4 కప్), ఆకుపచ్చని ఆకు కూరలు(1 కప్). ఇందులో మీరు 379-953 కేలరీలు, 23-53గ్రాముల ప్రోటీన్, 33-109 గ్రాముల కార్బోహైడ్రేట్లు, మరియు 12-43 గ్రాముల కొవ్వును పొందగలుగుతారు.

స్నాక్స్ కోసం (రెండు విధాలుగా):

ధాన్యపు రొట్టె (2 ముక్కలు), వేరుశెనగ వెన్న (2 టేబుల్ స్పూన్లు), కొవ్వు రహిత పాలు (2 కప్పులు) మరియు ఆపిల్ (1 మీడియం సైజ్). ఇందులో 629 కేలరీలు, 31 గ్రాముల ప్రోటీన్, 83 గ్రాముల కార్బోహైడ్రేట్లు మరియు 20 గ్రాముల కొవ్వు నిక్షిప్తమై ఉంటుంది.

సరైన వ్యాయామం అవసరం:

బెల్లీ ఫాట్ తగ్గించడంలో మీకు కేవలం ఆహార ప్రణాళికలలో మార్పులు మాత్రమే సరిపోదు. కార్డియో సంబంధిత వ్యాయామాలు కూడా అవసరం. ముఖ్యంగా పురుషులు, కొవ్వును తగ్గించుకోవడంలో ఉత్తమ ఫలితాలను పొందడానికి, వారంలో కనీసం ఐదు రోజులు, కార్డియో వ్యాయామాలను రోజువారీ ప్రణాళికలో భాగంగా 30 నుండి 60 నిమిషాలు నిర్వహించవలసి ఉంటుంది. చురుకైన నడక, డబుల్స్ టెన్నిస్ కూడా వ్యాయామం క్రింద పరిగణించబడుతుంది. అంతేకాకుండా, తరచుగా మెట్లు ఎక్కి దిగడం, పని వేళల్లో కనీసం గంటలో ఒకసారి శరీరానికి సడలింపునివ్వడం వంటివికూడా ఉపయోగపడుతాయి. స్కిప్పింగ్, స్విమ్మింగ్, ఎరోబిక్స్ వంటివి కూడా కార్డియో వ్యాయామాలుగా బెల్లీ తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతాయి.

మరియు కండరాల నిర్మాణ కార్యకలాపాలకు సంబంధించినంత వరకు, సిటప్స్ వరకే పరిమితం చేయకండి. పుష్-అప్స్, పుల్-అప్స్ మరియు స్క్వాట్స్ కూడా మీ వ్యాయామంలో భాగంగా చేయండి.

శరీరంలో కొవ్వుతో కూడిన సమస్యలు అనేక అనారోగ్యాలకు దారితీస్తుంటాయి. కావున వీటి పట్ల నిర్లక్యంతో తగదని వైద్యులు సూచిస్తుంటారు. ఈ వ్యాసం పై మీ సలహాలను, వ్యాఖ్యలను క్రింది వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి.

English summary

Men, Here’s How You Can Lose Belly Fat

Grab a tape right away, wrap it around yourself just below your belly button, and check if the measurement reads 94 cm (37 in) or more. If it does, it's high time you take action.
Desktop Bottom Promotion