For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సోనమ్ కపూర్ డైట్ ప్లాన్ ఇంకా ఆమె చేసే బరువు తగ్గే వ్యాయామాలు

|

ఫ్యాషన్ దివా సోనమ్ కపూర్ ఎంతోకాలం నుంచి తన బాయ్ ఫ్రెండ్ అయిన ఆనంద్ అహుజాను మే 8,2018 న పెళ్ళిచేసుకోబోతోంది. బాలీవుడ్ ఫ్యాషన్ రాణి అయిన సోనమ్ కపూర్ తన ధైర్యవంతమైన ఫ్యాషన్ సెన్స్ తో అందరిని ఆశ్చర్యపరుస్తుంది. కానీ ఈ అందమైన నటి ఒకప్పుడు 86 కిలోల బరువు ఉండేదని మీకు తెలుసా?

టీనేజర్ గా ఉన్నప్పుడు సోనమ్ చాలా బరువు పెరిగింది; ఆమెకి టైప్ 1 డయాబెటిస్ ను 17ఏళ్ళ వయస్సులో గుర్తించారు,పిసిఓడితో పాటు బరువుకి సంబంధించిన అన్నిరకాల సమస్యలు తనకి వచ్చాయి. కానీ కఠినమైన డైట్, వ్యాయామ రొటీన్ తో ఆమె ఆ బరువంతా వదిలించుకోగలిగారు. ఆ సమయంలోనే సంజయ్ లీలా భన్సాలీ సినిమా 'సావరియా’తో తెరంగ్రేటం చేసారు.

Sonam Kapoor s Diet Plan And Weight Loss Exercises

క్రమశిక్షణతో కూడిన ఈ జీవనశైలి మార్పుకి అంతా కారణం తన తల్లేనంటారు సోనమ్, దానివలనే అధిక బరువు తగ్గి,సన్నని,టోన్ అయిన స్లిమ్ శరీరాన్ని మెయింటేన్ చేయగలుగుతున్నారు.

సోనమ్ కపూర్ బరువు తగ్గే డైట్ ఇంకా వ్యాయామాల లిస్టు ఇప్పుడు మనం కూడా తెలుసుకుందాం.

ఫిట్ నెస్ కోసం ఆరోగ్యం కోసం కఠినమైన డైట్ పాటించటం వలనే సోనమ్ అందమైన శరీరం ఫలితంగా వచ్చింది. ఈ నటికి ఆహారం చాలా ఇష్టం,డైటింగ్ అస్సలు నచ్చదు. ఆమె హై ప్రొటీన్,తక్కువ కార్బో డైట్ ను ఎంచుకుంటారు,రోజుకి ఐదుసార్లు తింటారు. ఫాస్ట్ ఫుడ్స్ జోలికి వెళ్ళరు కానీ చాక్లెట్లు తినటం చాలా ఇష్టం. రిఫైన్ చేసిన చక్కెర కన్నా సహజమైన చక్కెరలనే ఎంచుకుంటారు. ఎక్కువసేపు ఆకలితో ఉండరు. ఆకలేస్తే నట్లు,డ్రై ఫ్రూట్లను స్నాక్స్ లాగా తింటుంటారు. హైడ్రేటడ్ గా ఉండటానికి ఎక్కువ నీళ్ళు తాగుతూ ఉంటారు.

ఆమె బరువు తగ్గే డైట్ ఛార్ట్ ఇదిగో ;

ఆమె బరువు తగ్గే డైట్ ఛార్ట్ ఇదిగో ;

బ్రేక్ ఫాస్ట్ - ఓట్ మీల్ ఇంకా ఆరోగ్యకరమైన పూర్తి పళ్ళ బౌల్

వ్యాయామం చేసాక స్నాక్/ మిడ్ మార్నింగ్ స్నాక్ - బ్రౌన్ బ్రెడ్ , గుడ్డు తెల్లసొనలు, ప్రొటీన్ షేక్ ఇంకా జ్యూస్.

మధ్యాహ్న భోజనం -పప్పు,కూర,ఒక రాగి రోటి,ఒక ముక్క గ్రిల్ చేసిన చికెన్ లేదా చేప ఇంకా సలాడ్లు

సాయంత్రం స్నాక్ - హై ఫైబర్ బిస్కెట్లు అలాగే చికెన్ కోల్డ్ కట్ లేదా గుడ్డు తెల్లసొనలు.

డిన్నర్ - ఒక ముక్క చికెన్ లేదా చేప, సూపులు ఇంకా సలాడ్లు

ఈ డైట్ ప్లానేకాక, ఆమె తనతో ఎప్పుడూ ఒక ఆపిల్, ఇంట్లో చేసిన శాండ్ విచ్ లేదా నట్లు ఇంకా డ్రై ఫ్రూట్లను ఉంచుకుని ప్రయాణంలో ఉన్నప్పుడు ఎక్కువ క్యాలరీలను వేసేయకుండా ఆకలిని తీర్చుకుంటారు.

సోనమ్ కపూర్ వెయిట్ లాస్ డైట్ ఛార్ట్ ఆమెకి ఎలా పనిచేస్తుంది?

సోనమ్ కపూర్ వెయిట్ లాస్ డైట్ ఛార్ట్ ఆమెకి ఎలా పనిచేస్తుంది?

సోనమ్ తన రోజుని ఒక గ్లాసు గోరువెచ్చని నీరు, నిమ్మరసం, తేనెతో మొదలుపెడతారు. ఈ మిశ్రమం ప్రేగుల కదలికను ప్రేరేపిస్తుంది, విషపదార్థాలను బయటకి తోసేసి, మెటబాలిజాన్ని పెంచుతుంది. ఎక్కువ ఫైబర్ ఉన్న ఓట్ మీల్, ఆరోగ్యకరమైన పండ్లు బ్రేక్ ఫాస్ట్ కి తినటం వలన శరీరానికి కావాల్సిన పోషకాలు అంది చర్మం, జుట్టు మంచిగా ఉంటాయి. పప్పు,కూర,చికెన్/చేప మధ్యాహ్న భోజనానికి తినటం వలన ప్రొటీన్ సరిగ్గా వెళ్ళి సన్నని కండరాలు తయారవటంలో సాయపడతాయి.

డిన్నర్ కి సూప్ లు,సలాడ్లు చికెన్/చేప ఇంకా గ్రిల్ చేసిన కూరలు తినటం వలన విటమిన్లు,ఖనిజలవణాలు,ఆహారపీచు సరైన మొత్తాలలో అందుతాయి. ఇది శక్తినిచ్చి, కణాలు సరిగ్గా పనిచేసేలా చేసి, మెటబాలిజం,జీర్ణక్రియను సపోర్ట్ చేస్తాయి.

సోనమ్ కపూర్ బరువు తగ్గే డ్రింక్స్ లో కొబ్బరినీళ్ళు, తాజా పండ్ల రసం, దోసకాయ రసం ఉంటాయి.

సోనమ్ కపూర్ బరువు తగ్గటానికి చేసే వ్యాయామాలు

సోనమ్ కపూర్ బరువు తగ్గటానికి చేసే వ్యాయామాలు

డాజిలింగ్ దివా సోనమ్ ట్రయినర్లు,డైటీషియన్ల సాయంతో బరువు తగ్గి,ఫిట్ గా మారారు. ఆమె ఫిట్ గా, స్లిమ్ గా ఉండటానికి ప్రతిరోజూ కనీసం ఒక గంట సేపయినా వ్యాయామం చేస్తారు.

ఇదే ఆమె వర్కవుట్ క్రమం;

ఇదే ఆమె వర్కవుట్ క్రమం;

తల వంచటం - 1సెట్ 10 సార్లు

నెక్ రొటేషన్స్ -1 సెట్ 10 సార్లు

చేతుల సర్కిల్స్ - 1 సెట్ 10 సార్లు

భుజాల రొటేషన్స్ - 1 సెట్ 10 సార్లు

అప్పర్ బాడీ ట్విస్టులు -1 సెట్ 20 సార్లు

సైడ్ క్రంచెస్ - 2సెట్లు 10సార్లు

జాగింగ్

బర్పీస్ - 1 సెట్ 10 సార్లు

జంపింగ్ జాక్స్ - 2సెట్లు 30 సార్లు

ఫార్వర్డ్ లంజెస్ - 1సెట్ 10 సార్లు

కార్డియో -60 నిమిషాలు

వెయిట్ ట్రయినింగ్ -30 నిమిషాలు

పిలాటేస్ -30-45 నిమిషాలు

పవర్ యోగా -60 నిమిషాలు

ఆటలు -60 నిమిషాలు

స్విమ్మింగ్ -30-45 నిమిషాలు

ధ్యానం -30 నిమిషాలు

డ్యాన్స్ - 60నిమిషాలు

సోనమ్ కపూర్ కి డ్యాన్సంటే చాలా ఇష్టం,వారానికి రెండుసార్లు కథక్ చేస్తారు. ఆమె క్యాలరీలు ఖర్చవటానికి,శరీరం టోన్ అవటానికి స్విమ్మింగ్, కార్డియో, స్ట్రెంత్ ట్రయినింగ్ వ్యాయామాలు చేస్తారు. బోరు కొట్టకుండా, పవర్ యోగా, ఏరియల్ యోగా కూడా చేస్తారు.

సోనమ్ కపూర్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ మీకెలా సాయపడుతుంది?

సోనమ్ కపూర్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ మీకెలా సాయపడుతుంది?

సోనమ్ కపూర్ వెగాన్ గా మారినా, ఆమె పోషక విలువలున్న మంచి సంతులన డైట్ నే పాటిస్తారు, ఇది చాలామంది ఆడవాళ్లకి పనిచేస్తుంది. మీరు ఈ డైట్ ను మీ రొటీన్, ఎత్తు,బరువు,శరీర రకం మొ.వాటి ప్రకారం మార్చుకోవచ్చు. ఆమె బరువు తగ్గే ఈ ఛార్ట్ చాలా ప్రభావవంతంగా ఉండి ఫలితాలు స్పష్టంగా త్వరగా కన్పిస్తాయి.

బరువు తగ్గటానికి సోనమ్ కపూర్ చిట్కాలు

బరువు తగ్గటానికి సోనమ్ కపూర్ చిట్కాలు

1.తక్కువ కేలరీలున్న పోషక పదార్థాలు తినండి.

2.ఎప్పుడూ హైడ్రేటడ్ గా ఉండాలి.

3.ఎక్కువ చక్కెర,ఉప్పు తినవద్దు.

4.ప్యాక్ చేయబడ్డ పండ్లరసాలు తాగవద్దు.

5.క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

6.వారానికోసారి నచ్చినవి తినవచ్చు.

7.మీకు స్వీట్లంటే ఇష్టమైతే, డార్క్ చాక్లెట్ పీస్ ఒకటి తినండి.

8.తాజా కూరలు,పండ్లు, చేప,మష్రూమ్స్,గుడ్లు,టోఫు వంటివి కొనండి.

9.8గంటలు నిద్రపోండి.

10.అర్థరాత్రి జంక్ ఫుడ్స్ తినవద్దు.

English summary

Sonam Kapoor 's Diet Plan And Weight Loss Exercises

Sonam Kapoor was diagnosed with type 1 diabetes at the age of 17, had PCOD and every weight issue she could have had. She prefers a high protein and low-carb diet and eats 5 meals a day. She always carries an apple, or nuts and dry fruits to satisfy her hunger pangs.Sonam Kapoor's Diet Plan And Weight Loss Exercises
Story first published:Tuesday, May 8, 2018, 14:20 [IST]
Desktop Bottom Promotion