For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్వీట్ పొటాటో వర్సెస్ వైట్ పొటాటో : వీటిలో ఏది గొప్పదో తెలుసా?

స్వీట్ పొటాటో వర్సెస్ వైట్ పొటాటో : వీటిలో ఏది గొప్పదో తెలుసా?

|

బంగాళాదుంపలు ప్రపంచంలో ఎక్కడైనా మీరు కనుగొనగలిగే అత్యంత సాధారణమైన కూరగాయలలో ఒకటి. ఇవి ఫైబర్ మరియు పోషకాలలో ప్రభావవంతమైన వనరులుగా ఉన్నాయి.

సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకునే సాధారణ బంగాళాదుంపలు మరియు స్వీట్ పొటాటో(చిలగడ దుంపలు లేదా గెనిసిగడ్డలుగా కూడా కొన్ని చోట్ల పిలుస్తారు) మార్కెట్లో విరివిగా లభిస్తూ ఉంటాయి., ఈ రెండూ ఆహారప్రణాళికలో భాగంగా జోడించడం ద్వారా శరీరానికి అత్యధిక మేలు కలిగించవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

Sweet Potatoes Vs White Potatoes: Which Is Better?

పొటాటో మరియు స్వీట్ పొటాటో, ఈ రెండింటి ప్రధాన మూలాలు దక్షిణ అమెరికాలో ఉన్నవి. అక్కడ నుండి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయి. కొన్ని ప్రాంతాలలో రోజూవారీ ఆహారపదార్ధాలలో భాగంగా ఇవి పూర్తిస్థాయిలో ఉన్నాయి అంటే ఆశ్చర్యం కలిగించకమానదు. ఉదాహరణకి మెక్సికోలో మొక్కజొన్న వలె.

పొటాటో మరియు స్వీట్ పొటాటోలు ఒకదానితో ఒకటి బొత్తిగా సంబంధం లేనివిగా పరిగణిస్తారు. ఈ బంగాళా దుంపలను సోలనమ్ టుబెరోసం అని కూడా పిలుస్తారు. జీవశాస్త్ర పరంగా టొమాటోలు, మిరియాలు మరియు వంకాయలతో సంబంధం కలిగి ఉన్న సొలానేసియే కుటుంబానికి చెందినవిగా పరిగణిస్తారు.

కానీ ఈ కుటుంబానికి చెందిన మొక్కలు సోలానిన్ అని పిలిచే ఒక విష రసాయనాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ సమూహం యొక్క ఆకులు మరియు ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలను కూడా తినకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

కానీ మామూలు పొటాటోలా కాకుండా, మీరు స్వీట్ పొటాటో చెట్టు ఆకులను కూడా తినవచ్చు మరియు ఇవి చాలా ఆరోగ్యకరమైన పోషకాలతో కూడి ఉంటుంది కూడా.

పొటాటో మరియు స్వీట్ పొటాటో., వీటిలో ఏది మంచిది? ఇప్పుడు తెలుసుకుందాం.

పొటాటో, స్వీట్ పొటాటోల మధ్య పోషక ఆధారిత చర్చ

పొటాటో, స్వీట్ పొటాటోల మధ్య పోషక ఆధారిత చర్చ

పొటాటో, స్వీట్ పొటాటోల మధ్య పోషక ఆధారిత చర్చ ఎల్లప్పుడూ ఉంటుంది. ఈరెండింటిలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్నాయని మీరేమైనా భావిస్తున్నారా?

ఇది దీర్ఘకాలికoగా పాతకాలం నుండి ప్రజలలో పాతుకుపోయిన నమ్మకం, కానీ అది నిజం కాదు. అనేక అధ్యయనాల ప్రకారం ఈ పొటాటో మరియు స్వీట్ పొటాటో రెండూ సమానంగా ఆరోగ్యానికి ఉత్తమమైనవిగా చెప్పబడినవి.

 ఆరోగ్యానికి పోషక విలువగల బంగాళాదుంప

ఆరోగ్యానికి పోషక విలువగల బంగాళాదుంప

ఈ క్రింది విషయాలను చదవడం ద్వారా, మీ శరీర ఆరోగ్యానికి పోషక విలువగల బంగాళాదుంప ఎంతగా సహాయం చేస్తుందో తెలుసుకోండి. తద్వారా సరైన నిర్ణయాన్ని తీసుకోండి.

పొటాటో మరియు స్వీట్ పొటాటోలోని కార్బోహైడ్రేట్లు, సాధారణంగా పిండి పదార్ధాలు మరియు ఫైబర్ రూపంలో ఉంటాయి, ఇవి మిమ్ములను సన్నగా మరియు ఆరోగ్యంగా ఉంచుటలో సహాయం చేస్తాయి.

బంగాళా దుంపలలో

బంగాళా దుంపలలో

బంగాళా దుంపలలో ఉపయోగకరమైన నిరోధకతత్వాలు కలిగిన పిండిపదార్ధాలను (రెసిస్టెంట్ స్టార్చ్) కలిగి ఉంటాయి. ఇది ఫైబర్ వలె కాకుండా కొంచం తేలికగానే జీర్ణమవుతుంది. రెసిస్టెంట్ స్టార్చ్ షార్ట్-చైన్ ఫాటీ యాసిడ్స్ ఉత్పత్తి చేస్తుంది, ఇది మానవ శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

కానీ స్వీట్ పొటాటో ఎల్లప్పుడూ చర్చలో ముందు ఉంటుంది, ఎందుకంటే అవి సాధారణ బంగాళా దుంపలతో పోల్చినప్పుడు మానవ శరీరానికి అత్యంత అవసరమైన పోషకాలను కలిగి ఉండడమే. స్వీట్ పొటాటోలు విటమిన్-ఎ యొక్క గొప్ప మూలంగా ఉంది.

అంతేకాకుండా అత్యధిక మోతాదులో విటమిన్-సి, ఫైబర్ నిక్షేపాలను కలిగి ఉండడమే కాకుండా తక్కువ కేలరీలతో నిండి ఉంటాయి. మరియు సాధారణ బంగాళా దుంపల కంటే తక్కువ పిండి పదార్థాలు కలిగి ఉంటాయి.

స్వీట్ పొటాటోలు చక్కెరను కలిగి ఉంటాయి.

స్వీట్ పొటాటోలు చక్కెరను కలిగి ఉంటాయి.

స్వీట్ పొటాటోలు చక్కెరను కలిగి ఉంటాయి. ఇవి సాధారణ బంగాళా దుంపల కన్నా ఎక్కువ మోతాదులో చక్కెర పదార్థాన్ని కలిగి ఉంటాయి. కానీ, సాధారణ బంగాళాదుంపలను చల్లని ప్రదేశాలలో(కోల్డ్ స్టోరేజ్) నిల్వ ఉంచిన ఎడల, కాలక్రమేణా వాటిలోని పిండి పదార్ధాలు నెమ్మదిగా గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ గా మారుతుంది.

దుంప జాతి కాయగూరలు అధిక మోతాదులో నిరోధకతత్వాలు కలిగిన పిండి పదార్ధాలను కలిగి ఉంటాయి. స్వీట్ పొటాటోలతో పోలిస్తే, సాధారణ బంగాళాదుంపలు అధిక స్థాయిలో ఈ రెసిస్టన్స్ స్టార్చ్ కలిగి ఉంటాయి. రెసిస్టెంట్ స్టార్చ్ , షార్ట్-చైన్ ఫాటీ యాసిడ్లను ఉత్పత్తి చేస్తుంది, ఇది క్రింది ప్రయోజనాలను కలిగి ఉంటుంది :

పోషకాహార నిపుణుల ప్రకారం

పోషకాహార నిపుణుల ప్రకారం

1.షార్ట్ - చైన్ ఫాటీ యాసిడ్స్ ఆరోగ్యకరమైన బాక్టీరియాకు ఇంధనం వలె పనిచేస్తాయి.

2.ఇవి రక్త ప్రసరణను ప్రోత్సహిస్తాయి.

3.పోషకాల ప్రసరణ మరియు ఖనిజ శోషణను పెంచుతాయి.

4.విషాన్ని శోషణను నిరోధిస్తుంది.

5.పెద్దప్రేగు కాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

6.మీరు బలమైన మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడంలో సహాయం చేస్తుంది.

పోషకాహార నిపుణులు

పోషకాహార నిపుణులు

పోషకాహార నిపుణులు జి.ఐ మరియు జి.ఎల్ సూచికల ప్రకారం పొటాటో మరియు స్వీట్ పొటాటోల నందు భయాలను వ్యక్తపరుస్తుoటారు. జి.ఐ (గ్లైసెమిక్ ఇండెక్స్) అనేది ఆహారాన్ని గ్లూకోజ్ గా మార్చిన సమయం కొలతగా నిర్ధారించబడినది. మరియు జి.ఎల్(గ్లైసెమిక్ లోడ్) గ్లూకోజ్ గా మార్చబడే ఆహార పరిమాణం యొక్క కొలతగా నిర్ధారించబడింది. అందువలన, తినేవాళ్ళు అధిక జి.ఐ లేదా జి.ఎల్ తో కూడిన ఆహారాలను నివారించాల్సిన అవసరముందని పోషకాహార నిపుణులు హేచ్చరిస్తుంటారు.

చాలా మంది ప్రజలు సాధారణ బంగాళాదుంపల కన్నా స్వీట్ పొటాటోలను ఎక్కువగా ఎంపిక చేసుకుంటూ ఉంటారు. దీనికి కారణం సాధారణ బంగాళాదుంపలు వారి రక్తంలో చక్కెరస్థాయిని పెంచుతాయని భయపడడమే.

ఆసక్తికరంగా, కయాపో అని పిలువబడే నిక్షేపాలు స్వీట్ పొటాటోలో ఉంటాయి. ఇది టైప్-2 మధుమేహం చికిత్సలో మరియు అనేక జీవక్రియ సంబంధిత వ్యాధులను నివారించడంలో ఎంతగానో దోహదం చేస్తుంది.

వాస్తవానికి,

వాస్తవానికి,

వాస్తవానికి, జపనీయులు ఆహారప్రణాళికలో భాగంగా, సాధారణ బంగాళా దుంపల ముడి రూపాన్ని రక్తహీనత, రక్తపోటు, మరియు డయాబెటిస్ చికిత్స కోసం తీసుకుంటారు. తరచుగా సాధారణ బంగాళాదుంపలు, స్వీట్ పొటాటో కన్నా గ్లైసెమిక్ ఇండెక్స్ స్థాయిలలో మరియు గ్లైసెమిక్ లోడ్ స్థాయిల్లో అధికంగా ఉంటాయి. కానీ వారి వాతావరణ పరిస్థితులు, ఖచ్చితత్వంతో కూడిన ఆహార ప్రణాళికలలో భాగంగా పెద్ద ప్రభావాన్ని చూపవని వారి అభిప్రాయమై ఉండవచ్చు.

తీపి మరియు సాధారణ బంగాళాదుంపలు

తీపి మరియు సాధారణ బంగాళాదుంపలు

తీపి మరియు సాధారణ బంగాళాదుంపలు అందించే విటమిన్లు మరియు ఖనిజ నిక్షేపాలు దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి. ఆరెంజ్ స్వీట్ పొటాటో విటమిన్-ఎ ఒక్క సూపర్ స్టార్ గా ఉంది. ఆకుపచ్చ ఆకుకూరలు, ఇతర రంగుల పండ్లు మరియు కూరగాయలతో సహా ఆరెంజ్ స్వీట్ పొటాటో అధిక స్థాయిలో విటమిన్-ఎ ను కెరోటినాయిడ్ రూపంలో కలిగి ఉంటుంది.

పొటాటో చిప్స్ రూపంలో తీసుకునే కన్నా

పొటాటో చిప్స్ రూపంలో తీసుకునే కన్నా

పొటాటో చిప్స్ రూపంలో తీసుకునే కన్నా సలాడ్లలో భాగంగా తీసుకోవడం అన్నిటికన్నా ఉత్తమం. బంగాళదుంపలు మరియు స్వీట్ పొటాటో రెండూ కూడా విటమిన్లు మరియు ఖనిజాలు, అనామ్లజనకాలు మరియు ఫైటోన్యూట్రియoట్స్ కలిగి ఉంటాయి.

సాధారణ బంగాళాదుంపలు మరియు స్వీట్ పొటాటో తినడం వల్ల ప్రయోజనాలు:

సాధారణ బంగాళాదుంపలు మరియు స్వీట్ పొటాటో తినడం వల్ల ప్రయోజనాలు:

1) మీ శరీరానికి అధిక మోతాదులో ఖనిజ మరియు పోషక సరఫరా అందిస్తాయి.

2) మంచి పిండి పదార్థాలు మీ శరీరంలోకి ప్రవేశిoచడానికి దోహదం చేస్తుంది.

3) రోజంతా ఉత్తేజంగా ఉంచడంలో సహాయం చేస్తుంది.

4) విటమిన్-ఎ లోపం రాకుండా కాపాడుతుంది. శరీరానికి అత్యంత అవసరమైన ఖనిజం ఈ విటమిన్-ఏ

5) మిమ్ములను ఆరోగ్యకరంగా ఉంచడంలో సహాయం చేస్తుంది.

ఈ వ్యాసం ద్వారా

ఈ వ్యాసం ద్వారా

ఈ వ్యాసం ద్వారా బంగాళా దుంపల గురించిన పూర్తి వివరాలను తెల్సుకున్నారని, తద్వారా మీ ఆహారంలో భాగంగా తీసుకోడానికి సుముఖంగా ఉన్నారని, అపోహలు ఏమైనా ఉంటే తొలగిపోయాయని మేము భావిస్తున్నాము.

స్వీట్ పొటాటో మరియు బంగాళాదుంపలు రెండూ

స్వీట్ పొటాటో మరియు బంగాళాదుంపలు రెండూ

స్వీట్ పొటాటో మరియు బంగాళాదుంపలు రెండూ ఆహార ప్రణాళికలో భాగంగా తీసుకోవడం ఆహ్వానించదగ్గ విషయం. ఎంచుకోవడం మాత్రం మీ నిర్ణయం. వీటిలో మీరు ఎంచుకునే ఆహారం ఏంటి? దిగువ వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి.

English summary

Sweet Potatoes Vs White Potatoes: Which Is Better?

Both white and sweet potatoes are a good source of nutrients and fibre. These are healthy to consume. They contain starch and fibre, which help you stay lean, healthy and fit. They are also good sources of carbohydrates, Vitamin A, minerals, etc. They help in keeping various diseases away & aid in maintaining good health.
Story first published:Monday, May 28, 2018, 14:25 [IST]
Desktop Bottom Promotion