For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పుచ్చకాయ (వాటర్-మిలన్) తో - శరీర బరువును తగ్గించుకోండి !

పుచ్చకాయ (వాటర్-మిలన్) తో - శరీర బరువును తగ్గించుకోండి !

|

మీరు పుచ్చకాయలను తినడం ద్వారా బరువు కోల్పోతారని ఎప్పుడైనా ఆలోచించారా? అవును, పుచ్చకాయలు శరీర బరువును తగ్గేలా చేస్తాయి. ఈ ఆర్టికల్లో, మన శరీర బరువును తగ్గించే ఆహారంగా పుచ్చకాయ గురించి మరిన్ని విషయాలను తెలుసుకోబోతున్నాము.

శరీర బరువును కోల్పోవడానికి ఉన్న అద్భుతమైన ఆహార మార్గం "పుచ్చకాయ", ఇది మీ శరీరాన్ని ఆకలితో వదిలేయకుండా ఉండటంతో పాటు, శరీరంలో ఉన్న వ్యర్థాలను బయటకు పంపిస్తోంది. శరీర బరువు కోల్పోయేందుకు ఆరోగ్యకరమైన ఆహారంగా పుచ్చకాయ ఒకటని చెబుతారు ఎందుకంటే, ఇది సానుకూలమైన ఫలితాలను చూపించడంతో పాటు మీ శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది.

 The Watermelon Diet For Weight Loss

నీటిశాతం అధికంగా ఉంటూ, కేలరీలను తక్కువగా కలిగి ఉన్న ఒక గొప్ప పోషక పదార్ధము ఈ పుచ్చకాయ. అందువల్లే ఇది బరువును తగ్గించే ఒక గొప్ప ఆహారంగా ఉండటానికి గల ప్రధాన కారణము. ఈ పుచ్చకాయ మనకు అధిక మొత్తంలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తుంది.

మన రోజువారీ ఆహారంలో పుచ్చకాయలను భాగంగా చేసుకోవడం వల్ల ఊబకాయం, గుండె జబ్బులు, మధుమేహం వంటి ప్రమాద స్థాయిని తగ్గిస్తాయి.

పుచ్చకాయతో మీ శరీర బరువును తగ్గించే మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి ఈ వ్యాసాన్ని పూర్తిగా చదవండి.


* శరీర బరువును తగ్గించడంలో పుచ్చకాయ ఏ విధంగా తన పాత్రను పోషిస్తుంది ?

సమతుల్యమైన, ఆరోగ్యకరమైన జీవనశైలిని కావాలనుకునేవారికి - పుచ్చకాయ చాలా మంచి ఆహారం. దానితోపాటు, బరువు కోల్పోవడంలో సహాయపడే పండ్లలో ఇది ఒకటి.

 The Watermelon Diet For Weight Loss

"వాటర్ మిలన్ డైట్" అనగా ప్రతిరోజూ ఉదయం & సాయంత్రం వేళల్లో మీరు తీసుకునే భోజనంలో పుచ్చకాయను ఆహారంగా చేర్చుకోవడం.

ఈ రకమైన ఆహార పద్ధతిని, బరువును వేగంగా తగ్గాలని ప్రయత్నం చేస్తున్న వ్యక్తికి సాధారణంగా సూచించబడుతుంది.

శరీరంలో అదనంగా ఉన్న వ్యర్థాలను, చెత్తను, ఉప్పుతో కూడిన ఇతర మలినాలను వదిలించుకోవాలని కోరుకునే వ్యక్తులకు కూడా ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

మీరు కేవలం ఒక వారం కోసం ఈ పుచ్చకాయలను వినియోగిస్తుండగా, మీరు దానిని ఏ నిష్పత్తిలో వినియోగించాలి అన్నదానిపై కూడా జాగ్రత్తలను తీసుకోవాలి.

* ఒక రోజులో మనం ఎంత మోతాదులో పుచ్చకాయలను ఉపయోగించాలి ?

మీరు "వాటర్ మిలన్ డైట్"లో ఉండగా, మీరు తీసుకునే పండ్ల పరిమాణం - మొత్తం సూచించిన పరిమితిని మించకూడదని మీరు ప్రాథమికంగా నిర్ధారించుకోవాలి. మీరు కలిగి ఉండాల్సిన సగటు పరిమాణం 1:10, అంటే మీరు 60 కిలోల బరువును కలిగి ఉంటే అందుకు మీరు 6 కిలోల పుచ్చకాయను ఆహారంగా తీసుకోవాలి. మీరు ఎంత బరువును కోల్పోతారో అనే దానిమీద ఆధారపడి ఉంటుంది.

మీరు ఇలా తీసుకునే డైట్లో, మీ రోజువారీ అవసరాలకు అవసరమయ్యే 150 కేలరీలను మీకు అందిస్తుంది, అలానే ఈ పుచ్చకాయను మీరు ఒక రోజులో 8 సార్లు తినవలసి ఉంటుంది.

ఈ పండులో 97 శాతం నీటిని కలిగి ఉంది, అందుచేత మీరు నీళ్ళు ఎక్కువగా తాగటాన్ని నివారించవచ్చు.

 The Watermelon Diet For Weight Loss

* నిపుణులు ఏమి చెబుతారు?

పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ రకమైన ఆహారాల గూర్చి ప్రజలకు విజ్ఞప్తి చెయ్యాలి, ఎందుకంటే వారి జీవన విధానాలలో ప్రత్యేకమైన నిర్మాణాన్ని కలిగి ఉంటారు, అయితే వారికి కేవలం ఒక చిన్న కమిట్మెంట్ మాత్రమే అవసరమవుతుంది. ఈ డైట్ను ఆచరించడం ద్వారా, పరిమితమైన సమయంలోనే వాస్తవికతను కలిగి ఉంది, మీరనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి మరింత చేరువ చేస్తుంది.

పుచ్చకాయలో ఎక్కువగా నీటిని, తక్కువ కేలరీలను కలిగి ఉన్నందున మీ ఈ డైట్ను పాటించడం వల్ల, మీ శరీరాన్ని పరిశుభ్రం గా ఉంచడంలో సహాయపడుతుంది. దానిలో ఉన్న హైడ్రేటింగ్ & రిఫ్రెష్ లక్షణాలు మిమ్మల్ని వేసవితాపం నుంచి సంపూర్ణంగా రక్షిస్తుంది.

* "వాటర్ మిలన్ డైట్" వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు !

• శరీరంలో అమైనో ఆమ్లములో ఒక రకమైన "అర్చినిన్"ను అధికమొత్తంలో పెంచడానికి పుచ్చకాయలు సహాయపడతాయి.

• రక్త నాళాలను సడలించడం కోసం అవసరమైన నైట్రస్-ఆక్సైడ్ను ఉత్పత్తి చేయడంలో ఈ పండ్లు చాలా మంచిది. గుండెపోటు, స్ట్రోక్ వంటి హృద్రోగాలను నివారించడంలో ఇవి బాగా సహాయపడుతుంది.

• ఈ డైట్ను పాటించడంవల్ల, స్పెర్మ్ కౌంట్ని పెంచి పురుషులలో సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుతుంది.

• పుచ్చకాయలు రక్తంలో ఉన్న మలినాలను గ్రహించి మూత్రవిసర్జన ద్వారా ఆ వ్యర్థాలను శరీరం నుంచి బయటకు పంపిస్తాయి.

• 100 గ్రాముల పుచ్చకాయలో - 7 గ్రాముల చక్కెరను & 32 కేలరీలు కలిగి ఉంటాయి.

• మంచి జీర్ణక్రియను నిర్వహించడానికి, వీటిలో ఉండే ఫైబర్ గొప్ప వనరుగా లభ్యమవుతుంది. అలాగే కార్బోహైడ్రేట్లు & చక్కెరలు తక్కువగా ఉన్నందున - మధుమేహంతో బాధపడేవారికి ఈ పండ్లు ఉత్తమమైన ఆహార పదార్థంగా ఉంటాయి.

 The Watermelon Diet For Weight Loss

* ఈ "వాటర్ మిలన్ డైట్" ను ఎలా పాటించాలి ?

ఇప్పటివరకు మీరు శరీర బరువును త్వరగా తగ్గించడంలో పుచ్చకాయ పాత్రను గూర్చి ఎక్కువగా తెలుసుకున్నారు. అలాగే ఇది ప్రతికూల ఆరోగ్య ప్రభావాలకు దారితీస్తుంది కాబట్టి, ఈ డైట్ను మీరు కేవలం ఒక వారం (లేదా) 5 రోజులు మాత్రమే పాటించవచ్చని తెలుసుకోవడం చాలా ముఖ్యం.

గమనిక: గర్భిణీ స్త్రీలు & పిల్లలు ఈ రకమైన డైట్ను పాటించవద్దు. అలాగే మీరు ఈ డైట్ను పాటించే రోజుల్లో, మీరు నిజంగా కష్టతరమైన పనులకు దూరంగా ఉండటం మంచిది.

కాలేయం (లేదా) మూత్రపిండాల సమస్యలను కలిగి ఉన్న వ్యక్తికి ఈ రకమైన డైట్ చాలా మంచిది. మీరు కొన్ని అవిసె గింజలను (లేదా) చియా గింజలను "వాటర్-మిలన్ సలాడ్" తో పాటు కలిపి తీసుకోవచ్చు. లేదంటే, మీరు ఒక గ్లాసు వాటర్-మిలన్ జ్యూస్ను కూడా తీసుకోవచ్చు.

English summary

The Watermelon Diet For Weight Loss

The Watermelon Diet For Weight Loss,The watermelon diet is known as one of the healthiest weight loss diets. Read here to know about the watermelon diet for weight loss.
Story first published:Tuesday, April 3, 2018, 17:11 [IST]
Desktop Bottom Promotion