For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గాలని భావించేవారు, అల్పాహారం తీసుకోవడంలో చేయకూడని తప్పులు :

|

బరువు తగ్గాలని, అల్పాహారాన్ని స్కిప్ చేయడమనేది మీ శరీర జీవక్రియల దృష్ట్యా చేయకూడని పాపం. అలాగని తీపిపదార్ధాలు, నిల్వ ఉంచిన పాకేజ్డ్ పండ్లరసాలు తీసుకోమని కాదు. ఏదిఏమైనా బరువు తగ్గాలని అనుకునేవారు, నిద్రలేచిన వెంటనే గోరువెచ్చని నీటిని తీసుకోవడం ఎంత ముఖ్యమో, అల్పాహారం కూడా అంతే ముఖ్యం.

రోజులో తీసుకోవలసిన అత్యంత ముఖ్యమైన భోజనంలో అల్పాహారం ప్రధమంగా ఉంటుంది. అటువంటి ఆహారాన్ని స్కిప్ చేయడం కారణంగా పూర్తి ఆరోగ్యం మీద ప్రభావం చూపడంతో పాటు రోజులో దైనందికచర్యల మీద కూడా ప్రభావం పడుతుంది.

బరువు తగ్గించడం గురించి మాత్రమే ఆలోచనలు చేయడం వేరు, బరువు తగ్గించడంతో పాటు శరీర జీవక్రియలను కూడా ఆరోగ్యవంతంగా నిర్వహించడం వేరు. మీ చాయిస్ ఏమిటో మీరే నిర్ణయించుకోండి. రోజులో తీరికలేని సమయాలలో శరీరం క్రియాశీలంగా వ్యవహరించడానికి, తగినంత శక్తి అవసరం అని మరవకండి. కావున, మీ శరీరానికి నూతనోత్సాహంతో కూడిన అడుగుని ఇచ్చేందుకు, మీ అల్పాహార భోజనంలో పోషకతత్వాలతో కూడిన ఆహారం ఉండేలా ప్రణాళిక సిద్దం చేసుకోండి.

అయితే, ఈ విషయాల గురించి అనేకమందికి స్పష్టమైన అవగాహన లేదన్నది వాస్తవం. క్రమంగా అల్పాహారాన్ని దాటవేయడం కారణంగా, వారి వెయిట్ లాస్ ఆలోచనలో భాగంగా, తగ్గడానికి బదులు తెలీకుండానే బరువును పెంచుకుంటూ ఉంటారు. అలాగని కేవలం అల్పాహారం తీసుకోవడమే ప్రధానమని కాదు, అల్పాహారం పోషకాలతో కూడుకుని మీ శరీరానికి శక్తిని అందివ్వగలిగేలా ఉండాలి. ఎక్కువగా ఉదయంవేళల్లోనే అధికమైన పనిఒత్తిడి ఉంటుంది, కావున సరైన అల్పాహారం తీసుకోవడం మూలంగా శరీరానికి తోడ్పాటుని అందిచ్చినవారవుతారు. కానీ అల్పాహారం విషయంలో, అధిక తీపిపదార్ధాలు, కెఫీన్ కలిగిన పానీయాలు, డీప్-ఫ్రైడ్ ఆహార పదార్ధాలను తీసుకున్న ఎడల, మీ వెయిట్-లాస్ కార్యాచరణకు ప్రతిబంధకంగా తయారవుతుంది. కావున, అల్పాహారం తప్పకుండా తీసుకోవడమే కాదు, తీసుకునే అల్పాహారంలో కూడా జాగ్రత్తవహించవలసి ఉంటుంది.

1. నూనె/ఆయిల్తో కూడిన ఆహారాలు తినడం:

1. నూనె/ఆయిల్తో కూడిన ఆహారాలు తినడం:

మన సాంప్రదాయక అల్పాహారాలు అత్యధికంగా నూనెలు/జిడ్డుతో కూడుకుని ఉంటాయి. ఈ అల్పాహారాలు రుచికరంగా మరియు కడుపు నింపేవిగా ఉన్నాకూడా, మీరోజును ప్రారంభించడానికి సూచించదగిన ఆలోచన మాత్రం ఎన్నటికీ కాదు. జిడ్డుతో కూడిన ఆహారపదార్ధాలు జీర్ణసమస్యలకు కారణమవుతాయి, క్రమంగా మీ పని లేదా ప్రణాళికల మీద ప్రతికూల ప్రభావాలను చూపే అవకాశాలు లేకపోలేదు. మరియు ఈ ఆహారాలు పోషకాలలో తక్కువగా, చెడుకొవ్వులలో ఎక్కువగా ఉన్న కారణాన, ఎట్టిపరిస్థితుల్లో సూచించదగినవి కాదు.

2. అధిక చక్కెరలు గల పానీయాలు లేదా ఆహారాలు తినడం:

2. అధిక చక్కెరలు గల పానీయాలు లేదా ఆహారాలు తినడం:

తీరికలేని కార్యాచరణల కారణంగా, ప్రజలు నిల్వ ఉంచిన పాక్డ్ ఆహారపదార్ధాలు, పానీయాల మీద ఆధారపడుతున్నారు. ఇవి అధికచక్కెరలను కలిగి ఉంటాయి. పోషకాలలో తక్కువ, మరియు కేలరీలలో ఎక్కువగా ఉన్న ఈ ఆహారపదార్ధాలు తీసుకోవడం కారణంగా ఇతరత్రా ఆరోగ్య సమస్యలకు కారకాలుగా పరిణమిస్తున్నాయి. కృత్రిమ చక్కెరలతో కూడిన శక్తిపానీయాలు/ఫిజ్జీ-డ్రింక్స్, అధిక కాలరీలను కలిగి ఉంటాయి. ఇవి ఊబకాయం తగ్గించేందుకు సహాయం చేయకపోగా, హార్మోనుల ప్రభావం, మధుమేహం వంటి ఇతరత్రా సమస్యలకు దారితీస్తుంది.

3. పండ్లు/కూరగాయల రసాలు:

3. పండ్లు/కూరగాయల రసాలు:

పండ్లు మరియు కూరగాయలలో ఫైబర్ మరియు సహజ సిద్దమైన చక్కెరలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి ఉత్తమమైనవే అయినా కూడా, వీటి రసాలను ఉదయం అల్పాహారం సమయంలో తీసుకోవడం చేయరాదు. రసాలుగా కన్నా, పండును నేరుగా తీసుకోవడం ద్వారానే ప్రయోజనాన్ని పొందగలరు.

వాస్తవానికి నేరుగా జ్యూస్ రూపంలో తీసుకోవడం మూలంగా, శరీరంలో వడకట్టబడాల్సిన చక్కెరలు సైతం శోషించబడుతాయి. క్రమంగా టైప్-2 మధుమేహానికి దారితీసే అవకాశాలు కూడా ఉంటాయి. కావున వీలైనంత వరకు పండ్లను నేరుగానే తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు.

Most Read:ఈ దీపావళికి మీకు నచ్చిన వారికి బహుమతిగా ఇవ్వదగిన ఉత్తమమైన స్మార్ట్ ఫోన్Most Read:ఈ దీపావళికి మీకు నచ్చిన వారికి బహుమతిగా ఇవ్వదగిన ఉత్తమమైన స్మార్ట్ ఫోన్

4. కెఫీన్ అధికంగా తీసుకుంటున్నారా:

4. కెఫీన్ అధికంగా తీసుకుంటున్నారా:

ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ప్రజలకు ఉన్న అలవాటు, అల్పాహారంతో పాటుగా కాఫీ తీసుకోవడం. కానీ నిజానికి ఇది ఆరోగ్యకరమైన అలవాటు కాదు. వీలయితే ఈ అలవాటుకు స్వస్తిచెప్పండి. ముఖ్యంగా బరువు తగ్గాలని ఆలోచనలు చేస్తున్న వారు, డైరీ-ఉత్పత్తులకు, కెఫీన్ పదార్ధాలకు దూరంగా ఉండడమే మేలు.

5. తగినంత ఆహారం తీసుకోవడం లేదా:

5. తగినంత ఆహారం తీసుకోవడం లేదా:

పనిఒత్తిడి కారణంగా, లేదా మరే ఇతర కారణాల చేతనైనా కానీ, సరైన మోతాదులో ఆహారాన్ని శరీరానికి అందివ్వకుండా, నామమాత్రంగా ముగించాము అన్నట్లుగా అల్పాహారం తీసుకుంటూ ఉంటారు కొందరు. ఈ అలవాటు కారణంగా, తరచుగా ఆకలి వేయడం, స్నాక్స్, డీప్ ఫ్రైడ్ వంటి నూనె ఆధారిత ఆహార పదార్ధాల మీదకు మనసు వెళ్ళడం జరుగుతుంటుంది. ఇది బరువు తగ్గడానికి ఏమాత్రం సహకరించదు..

6. అల్పాహారానికి ప్రణాళిక చేసుకుంటున్నారా:

6. అల్పాహారానికి ప్రణాళిక చేసుకుంటున్నారా:

తరచుగా భోజనం, డిన్నర్ వంటి వాటికి చేసే ప్రణాళిక, అల్పాహారంలో చేయరు అనేకులు. అల్పాహారానికి అంత ప్రాధాన్యతను ఇవ్వకపోవడమే దీనికి కారణం. ఈ అలవాటు ఎన్నటికీ మంచిదికాదు. ముఖ్యంగా బరువు తగ్గాలని ఆలోచనచేసే వారు, ఏ ఒక్కపూట కూడా ఆహారాన్ని స్కిప్ చేయడం చేయరాదు. సరైన జీవనశైలి పాటిస్తూ, వ్యసనాలకు దూరంగా ఉంటూ, వ్యాయామాలు చేస్తూ, మూడుపూటలా సమపాళ్ళలో శరీరానికి సరైన పోషకాలు అందేలా ఆహారాన్ని స్వీకరించడం చేస్తుండాలి. కొంతమంది ఆహారం తీసుకోవడం మానివేస్తే, బరువు తగ్గుతాము అని భావిస్తారు, అది ఖచ్చితంగా అపోహే. కావున ఉదయం అల్పాహారం సమయంలో, వోట్స్, పాలు, గోధుమరొట్టె మరియు గుడ్లు వంటి ఆరోగ్యకర పోషకతత్వాలు ఉండేలా ప్రణాళిక సిద్దంచేసుకోండి.

Most Read: అతని రూమ్ కు వెళ్లి అందాలన్నీ చూపించేదాన్ని, తను చాలా చిన్నోడు, తనంటే చెప్పలేనంత మోజు #mystory291 Most Read: అతని రూమ్ కు వెళ్లి అందాలన్నీ చూపించేదాన్ని, తను చాలా చిన్నోడు, తనంటే చెప్పలేనంత మోజు #mystory291

7. ఫాస్ట్-ఫుడ్ సెంటర్లకు అలవాటు పడుతున్నారా:

7. ఫాస్ట్-ఫుడ్ సెంటర్లకు అలవాటు పడుతున్నారా:

ఈరోజుల్లో రెస్టారెంట్లకు, ఫాస్ట్-ఫుడ్ సెంటర్లకు వస్తున్న ఆదరణ చూస్తుంటే ఆశ్చర్యం కలుగకమానదు. అంతగా జనాల జీవనశైలిలో భాగంగా/అలవాటుగా మారిపోయాయి. క్రమంగా పనిఒత్తిళ్ళ కారణంగా, ఎక్కువమంది వీటి మీదనే ఆధారపడుతున్నారు. క్రమంగా శరీరానికి ఎన్ని కాలరీలు అధికంగా అందుతున్నాయో కూడా తెలుసుకోలేని స్థితికి లోనవుతున్నారు. అంతేకాకుండా, అల్పాహారంతో పాటు కాఫీ/టీ తీసుకునే అలవాటు కలిగి ఉంటారు. ఇంట్లో చేసే ఆహార పదార్ధాలు, కాఫీ/టీ లలో వేసే మోతాదులు, పదార్ధాల గురించి మీకు పూర్తి అవగాహన ఉంటుంది., కానీ ఫాస్ట్-ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్ల విషయాల్లో అలా ఉండదు కదా. కావున, మీకు సమయంలేని పక్షంలో టిఫిన్ బాక్స్, హోం-మేడ్ కాఫీ మీ వెంట తీసుకుని వెళ్ళండి.

8. కొవ్వుల గురించిన ఆలోచన చేస్తున్నారా:

8. కొవ్వుల గురించిన ఆలోచన చేస్తున్నారా:

అధికంగా కొవ్వులు శరీరంలోకి చేరుతాయి అన్న భయంతోనే, సగం ఆహారానికి దూరంగా ఉంటారు కొందరు. క్రమంగా శరీరానికి అవసరమైన పోషకాలు సరైన నిష్పత్తిలో అందని కారణాన కొత్త సమస్యలు మొదలవుతాయి. శరీరానికి సరైన మోతాదులో మోనోసాచురేటెడ్ కొవ్వులు అవసరం అవుతాయి. ఇవి జీవక్రియలను సక్రియం చేయడంతో పాటు, మీ చర్మసౌందర్యాన్ని కూడా పెంచుతాయి. కొందరు గుడ్డులో పచ్చసొన పారవేసి, కేవలం తెల్లగుడ్డును తినే అలవాటును కలిగి ఉంటారు. ఇది సరైన పద్దతి కాదని న్యూట్రిషనిస్టులు చెప్తున్నారు. మరియు మీ టోస్ట్ నందు పీనట్ బట్టర్ వంటివి కూడా జోడించండి.

9. అల్పాహారం కోసం మిగిలిపోయిన ఆహారాలను తీసుకుంటున్నారా:

9. అల్పాహారం కోసం మిగిలిపోయిన ఆహారాలను తీసుకుంటున్నారా:

ఇదొక చెత్త అలవాటు. కొందరికి రాత్రిపూట మిగిలిపోయిన పిజ్జాలు, బర్గర్లు, ఫ్రైడ్-రైస్, బిర్యానీ వంటివి ఉదయం అల్పాహారంగా తీసుకునే అలవాటు కలిగి ఉంటారు. కానీ మిగిలిపోయిన లేదా తిరిగి వేడిచేసిన ఆహారాలు తక్కువ పోషకవిలువలను కలిగివుంటాయి మరియు అవి అనారోగ్యకరమైనవిగా ఉంటాయి. ఇవి మీ జీర్ణవ్యవస్థను ఇబ్బందులకు గురిచేయవచ్చు. మరియు మీ వెయిట్-లాస్ ప్రణాళికకు అడ్డుగా ఉంటుంది.

10. మంచంమీదనే అల్పాహారం అలవాట్లు:

10. మంచంమీదనే అల్పాహారం అలవాట్లు:

నిద్రలేచిన తర్వాత, గ్లాసుడు వేడి నీళ్ళు తీసుకున్న తర్వాతనే అల్పాహారం తీసుకోవడం మంచిది. ఈ అలవాటు మీకు మంచి ఆరోగ్య ప్రయోజనాలను అందివ్వగలదు. మరియు నిద్రలేచిన తర్వాత, అల్పాహారానికి మద్య కనీసం అరగంట సమయం ఉండేలా కార్యాచరణ చేసుకోండి.

Most Read:చనిపోయిన తర్వాత మనిషిని కొన్ని ప్రదేశాల్లో ఏం చేస్తారో తెలుసా..? Most Read:చనిపోయిన తర్వాత మనిషిని కొన్ని ప్రదేశాల్లో ఏం చేస్తారో తెలుసా..?

English summary

Weight Loss: Top 10 Breakfast Mistakes You Need To Stop Making Today!

It's very important to get your breakfast meals just right. There are some common mistakes that all of us have made or are possibly still continue to make, which are extremely destructive when it comes to weight loss.