For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శ‌రీర బ‌రువును పెంచే 10 ఉత్త‌మ‌మైన ఉత్ప‌త్తులు

By Sujeeth Kumar
|

ప్ర‌స్తుత ప్ర‌పంచంలో బ‌రువు త‌గ్గించుకోవ‌డం ఎంత క‌ష్ట‌మో, బ‌రువు పెరిగేందుకు ప్ర‌య‌త్నించ‌డ‌మూ అంతే క‌ష్టంతో కూడుకున్న ప‌ని. బ‌రువు పెర‌గ‌డానికి ఎన్నో మార్గాలున్నాయి. అయితే ఆరోగ్య‌క‌ర‌మైన ప‌ద్ధ‌తులను అవ‌లంబిస్తూ శ‌రీర బ‌రువు పెంచుకోవ‌టం మంచి ప‌ద్ధ‌తి. అనేక ర‌కాల వ్యాయామాలు చేయడం ద్వారానూ బరువు పెంచుకోవ‌చ్చు.

అయితే వాటికి తోడుగా కండ బ‌లాన్ని పెంచుకునేందుకు బ‌రువు పెంచే ఉత్పత్తుల‌ను వాడ‌టమూ మంచి ప‌ద్ధ‌తే. ఈ ఉత్ప‌త్తుల‌ను వాడ‌టం వ‌ల్ల బరువు పెర‌గ‌డానికి అవ‌స‌ర‌మైన కేల‌రీలు, పోష‌కాలు మీ శ‌రీరానికి అందించ‌బ‌డ‌తాయి. వీటి వ‌ల్ల భ‌విష్య‌త్‌లో ఎలాంటి దుష్ప్ర‌భావాలూ తలెత్త‌వు.

బ‌రువు పెరిగేందుకు మ‌న దేశంలో దొరికే ఉత్త‌మ‌మైన ఉత్ప‌త్తులు

ఈ 10 ఉత్ప‌త్తులు మీ శ‌రీర బరువు పెరిగేలా తోడ్ప‌డ‌తాయి

top-10-weight-gain-products-available-in-india

1. ముసాషీ బ‌ల్క్ మాస్ గెయిన్ ప్రోటీన్ బ్లెండ్

ముసాషీ బ‌ల్క్ మాస్ గెయిన్ ప్రోటీన్ బ్లెండ్‌లో స‌రైన పాళ్లలో మిన‌ర‌ల్స్‌, విట‌మిన్లు ఉంటాయి. దీనిలో 26 గ్రాముల ప్రోటీన్లు, 22 గ్రాములు కార్బోహైడేట్ల‌ను క‌లిగి ఉండి మీ కండ‌రాల ద్ర‌వ్య‌రాశిని పెంచుతాయి. దీంతోపాటు నాణ్య‌త గ‌ల కేల‌రీలు క‌లిగిన దీని వ‌ల్ల‌ మీ కండ‌రాలు దృఢంగా మారుతాయి. ఇందులోని విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ శ‌రీరం న్యూట్రియెంట్స్‌ని శోషించుకునేలా చేసి ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది నెస్లే ఆస్ట్రేలియా వారి ఉత్ప‌త్తి. సామాన్యుల‌కే గాకుండా అథ్లెట్లు, ఒలింపియ‌న్లు, ఫుట్‌బాల్ ఆట‌గాళ్లు, క్రికెట‌ర్లు, ర‌గ్బీ ఆట‌గాళ్ల‌కు కూడా ఇది స‌రిగ్గా స‌రిపోతుంది. ముసాషీ బ‌ల్క్ మాస్ గెయిన‌ర్ క‌ణాలు వేగంగా పెరిగేలా చేసి,కండ‌రాలు వృద్ధి చెందేలా చూస్తాయి.

రోజుకి ఎంత మోతాదులో వాడాలి

500 మి.లీ పాల‌లో 60 గ్రాముల పౌడ‌ర్ చొప్పున రోజుకి రెండు సార్లు వాడాల్సి ఉంటుంది.

2. బ్రిటీష్ న్యూట్రీషీయ‌న్స్ ఎక్స్‌ట్రా మాస్

బ్రిటీష్ న్యూట్రీషియ‌స్ ఎక్స్‌ట్రా మాస్-బ‌నానా ఒక రుచిక‌రమైన బ‌ల‌వ‌ర్థక‌మైన పానీయం. శ‌రీర బ‌రువు పెరిగేలా తోడ్ప‌డుతుంది. దీనిలో 73 శాతం కార్బోహైడ్రేట్లు, 20 శాతం అధిక నాణ్య‌త గ‌ల వే ప్రోటీన్లున్నాయి. ఇంకా గ్లుటామైన్‌తో పాటు ప్రోటీన్ సంశ్లేష‌ణ‌కు అవ‌స‌ర‌మైన క్రియాటిన్ కూడా ఉన్నాయి. దీంతోపాటు మిన‌ర‌ల్స్‌, విట‌మిన్లు కూడా ఉన్నాయి. ఇందులోని అధిక నాణ్య‌త గ‌ల వే ప్రోటీన్లు మీ శ‌రీర బ‌రువును త్వ‌ర‌గా పెంచ‌డ‌మే గాక‌, కొవ్వు లేకుండా కండ‌రాలు దృఢంగా మారేలా స‌హాయ‌ప‌డ‌తాయి. కండ‌ర శ‌క్తిని పెంచ‌డంతోపాటు, ఆరోగ్యాన్నిస్తుంది. దీనిని వాడ‌డం వ‌ల్ల కేవ‌లం 2 నెల‌ల్లోనే మీరు దాదాపు 16 కేజీల వ‌ర‌కు బ‌రువు పెర‌గ‌గ‌లుగుతారు.

ఎంత మోతాదులో తీసుకోవాలి

ఒక క‌ప్పు పాల‌లో 2-3 స్పూన్ల పౌడ‌ర్‌ని క‌లిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి.

top-10-weight-gain-products-available-in-india

3. ఎస్ఎన్‌టీ ఎక్స్‌ట్రీమ్ గెయిన‌ర్‌

రుచిక‌ర‌మైన చాక్లెట్ ఫ్లేవ‌ర్‌లో ల‌భించే ఈ పానీయం కండ‌రాల‌ ద్ర‌వ్య‌రాశిని పెంచ‌డంలో తోడ్ప‌డుతుంది. కండ‌రాల శ‌క్తిని పెంచ‌డంతో పాటు, వ్యాయామాలు చేసేట‌ప్పుడు అవ‌స‌ర‌మైన శ‌క్తినిస్తుంది. సురక్షితంగా బ‌రువు పెర‌గ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. అల‌స‌ట, విసుగు ద‌రి చేర‌కుండా పున‌రుత్తేజితం అయ్యేలా చూస్తుంది.

రోజుకి ఎంత మోతాదులో తీసుకోవాలి

ఒక క‌ప్పు నీళ్ల‌లో 2 స్కూప్ స్పూన్ల పౌడ‌ర్‌ని క‌లిపి రోజుకి రెండు సార్లు తీసుకోవాలి.


4. మాట్రిక్స్ న్యూట్రీషియ‌న్ మెగా మాస్ 4600

మాట్రిక్స్ న్యూట్రీషియ‌న్ మెగా మాస్ 4600 ప్ర‌త్యేకించి శ‌రీర ద్ర‌వ్య‌రాశిని పెరిగేలా స‌హాయ‌ప‌డుతుంది. వెనిల్లా, చాకోలేట్ మ‌రియు స్ట్రాబెర్రీ ఫ్లేవ‌ర్ల‌లో ఇది ల‌భిస్తుంది. ఇందులో ప్రోటీన్లు, కార్బ్‌హైడ్రేట్లు, మినర‌ల్స్‌, విట‌మిన్లతో పాటు, గ్లుటామైన్‌, క్రియాటిన్ మ‌రియు టారైన్‌లు క‌ల‌గ‌ల‌సి ఉంటాయి. 100 గ్రాముల ఈ ఉత్ప‌త్తిలో 21 గ్రాముల ప్రోటీన్లుంటాయి. బ‌రువు పెరిగేందుకు వ్యాయామాలు చేసేట‌ప్పుడు అవ‌స‌న‌మైన త‌క్ష‌ణ శ‌క్తిని ఇది అందిస్తుంది.

top-10-weight-gain-products-available-in-india

రోజుకి ఎంత మోతాదులో తీసుకోవాలి

ఒక క‌ప్పు నీళ్ల‌లో 2 స్కూప్ స్పూన్ల పౌడ‌ర్‌ని క‌లిపి రోజుకి రెండు సార్లు తీసుకోవాలి.


5. ఎండ్యురా డ‌బుల్ గెయిన్

బ‌రువు పెరిగేందుకు మార్కెట్ల‌లో దొరికే నాణ్య‌త గ‌ల ఉత్ప‌త్తుల్లో ఎండ్యురా డ‌బుల్ గెయిన్ ఒక‌టి. దీనిలోని వే, క్యాసేనేట్‌, సోయా ప్రోటీన్లు శ‌రీరం శ‌క్తిని శోషించుకుని నెమ్మ‌దిగా విడుద‌ల చేసేలా తోడ్ప‌డుతాయి. దీనిలో ఇంకా ప్రోటీన్ మ‌రియు మాల్టోడెక్స్ట్రిన్, బీసీఏఏ క‌లగ‌ల‌సి ఉంటాయి. అల‌స‌ట లేకుండా శ‌క్తిని, శ‌రీర బ‌రువును పెంచుకునేందుకు ఇది ఒక అత్యుత్త‌మ ఉత్ప‌త్తి.

రోజుకి ఎంత మోతాదులో తీసుకోవాలి

ఒక క‌ప్పు పాల‌లో 2 నుంచి 3స్కూప్ స్పూన్ల పౌడ‌ర్‌ని క‌లిపి రోజుకి రెండు సార్లు తీసుకోవాలి.

6. ప్లానెట్ ఆయుర్వేద వెయిట్ గెయిన్ ఫార్ములా

ప్లానెట్ ఆయుర్వేద వెయిట్ గెయిన్ ఫార్ములా అనేది 100 శాతం స‌హ‌జ‌సిద్ధంగా త‌యారైన ఉత్ప‌త్తి. ఆరోగ్య‌క‌ర‌మైన ప‌ద్ధ‌తుల్లో బ‌రువు పెరిగేందుకు తోడ్ప‌డుతుంది. అశ్వ‌గంధ, ఇత‌ర ఆయుర్వేద ఉత్ప‌త్తుల‌ మిశ్ర‌మ‌మైన ఇది పూర్తిగా గెలాటిన్ ర‌హితంగా ఉంటుంది. అలాగే దీని త‌యారీలో ఎలాంటి కృత్రిమ రంగులు, ప్రిజ‌ర్వేటివ్స్‌, స్టెరాయిడ్ల‌ను వాడ‌లేదు. రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంతో పాటు ప్ర‌త్యేకంగా మ‌గ‌వారి బ‌రువు పెంచేందుకు ఇది స‌రిగ్గా స‌రిపోతుంది.

రోజుకి ఎంత మోతాదులో వాడాలి

ఒక క‌ప్పు నీళ్లు లేదా పాలు లేదా ఏదైనా పండ్ల ర‌సాల్లో 1 నుంచి రెండు మూత‌ల పౌడ‌ర్‌ని క‌లిపి రోజుకి రెండు సార్లు తీసుకోవాలి.

7. వెంకీస్ మాస్ గెయిన‌ర్‌

త్వ‌ర‌గా బ‌రువు పెరిగేందుకు వెంకీస్ మాస్ గెయిన‌ర్ దోహ‌ద‌ప‌డుతుంది. ఇందులో 1:3 నిష్ప‌త్తిలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు క‌ల‌గ‌ల‌సి ఉండి కండ‌రాలు, శ‌క్తి పెరిగేందుకు తోడ్ప‌డుతాయి. పూర్తిగా శాక‌హార ఫార్ములాతో, పాల ప్రోటీన్లు, న్యూట్రీయేంట్లు క‌లిసి ఉన్న ఈ ఉత్ప‌త్తి అన్ని వ‌య‌సుల వారికి స‌రిగ్గా స‌రిపోతుంది. ఇది 5 వేరియంట్ల‌లో ల‌భిస్తుంది. వ‌ర్క‌వుట్లు చేసేందుకు అవ‌స‌ర‌మైన త‌క్ష‌ణ శ‌క్తినిచ్చేందుకు ఇందులో సుక్రోస్ ఉంది. శ‌క్తిని పెంచ‌డంతో పాటు, వ్యాయామం చేసేట‌ప్పుడు అల‌స‌ట రాకుండా వెంకీస్ మాస్ గెయిన‌ర్ స‌హాయ‌ప‌డుతుంది.

రోజుకి ఎంత మోతాదులో వాడాలి

ఒక క‌ప్పు చ‌ల్ల‌ని పాల‌లో 1 స్కూప్ స్పూన్‌ పౌడ‌ర్‌ని క‌లిపి రోజుకి రెండు సార్లు తీసుకోవాలి.

top-10-weight-gain-products-available-in-india


8. లాబ్రాడా ప్రో వీ60

లాబ్రాడా ప్రో వీ60 బ‌హుళ ప్రోటీన్లు గ‌ల ఉత్ప‌త్తి. ఇది రుచిక‌రంగా ఉండ‌ట‌మే గాక సుల‌భంగా ఉప‌యోగించ‌గ‌లిగే వీలుండి మీ రోజువారీ ప్రోటీన్ అవ‌స‌రాల‌ను తీరుస్తుంది. అధిక ప్రోటీన్లు క‌లిగి ఉన్న దీనిని భోజ‌నంతోపాటు ఒక్క‌సారీ తీసుకుంటే 30 గ్రాముల ప్రోటీన్లు అందుతాయి. త‌క్కువ కార్బోహైడ్రేట్లు క‌లిగి ఉన్నందున శ‌రీర బ‌రువు త్వ‌ర‌గా, ప్ర‌భావ‌వంతంగా పెరిగేలా ఇది స‌హాయ‌ప‌డుతుంది.


రోజుకి ఎంత మోతాదులో తీసుకోవాలి

ఒక క‌ప్పు పాల‌లో 3 స్కూప్ స్పూన్ల పౌడ‌ర్‌ని క‌లిపి రోజుకి రెండు సార్లు తీసుకోవాలి.


9. యూనివ‌ర్స‌ల్ అల్ట్రా మాస్ 4500

ఇది పరిచ‌యం అక్క‌ర్లేని ఉత్ప‌త్తి, మంచి పోష‌కాహ‌ర విలువ‌లు క‌లిగి ఉండి కండ‌ర ద్ర‌వ్య‌రాశిని పెంచుతుంది. మీకు తీరైన‌, దృఢ‌మైన శ‌రీరాన్ని పొందేలా స‌హాయ‌ప‌డుతుంది. ఇందులోని కేల‌రీలు కండ‌ర శ‌క్తిని పెంచ‌డంతో పాటు, వ్యాయామ‌లు చేసేట‌ప్పుడు మీకు తోడ్ప‌డుతుంది. ఇందులోని నాణ్య‌త గ‌ల కేల‌రీలు, పీచు ప‌దార్థాలు, కార్బోహైడ్రేట్లు వ్యాయ‌మం చేసే స‌మ‌యంలో మీకు త‌క్ష‌ణ శ‌క్తినిస్తాయి. ఒక మోతాదులో మీకు 22 గ్రాముల ప్రోటీన్లు, ఇత‌ర పోష‌కాలు అందుతాయి. ఇది అన‌వ‌స‌ర కొవ్వును త‌గ్గించి, కండ‌రాల‌ను పెంచుతుంది. దీనిలో త‌క్కువ కొవ్వునందించే ప‌దార్థాలున్న‌ప్ప‌టికీ, శ‌రీర సామ‌ర్థ్యాన్ని పెంచేలా స‌హ‌య‌ప‌డుతుంది.

రోజుకి ఎంత మోతాదులో తీసుకోవాలి

ఒక క‌ప్పు పాల‌లో 3 స్కూప్ స్పూన్ల పౌడ‌ర్‌ని క‌లిపి రోజుకి రెండు సార్లు తీసుకోవాలి.

10. సై-ఎమ్ఎక్స్ మాస్ సిస్ట‌మ్‌

కండ‌రాల‌ను పెంచేందుకు దోహ‌ద‌ప‌డే దీనిని మిల్క్ షేక్ రూపంలో తీసుకోవ‌చ్చు. కండ‌ర సైజు, బ‌రువు, వృద్ధి చెందేలా దోహ‌ద‌పడుతుంది. ఇందులోని బీసీఏఏలు, గ్లూటామైన్ జిమ్‌లో చెమ‌టోడ్చే వారికి, అథ్లెట్ల‌కు, క్రీడాకారులరు త‌క్ష‌ణ శ‌క్తినందిస్తుంది. ఇంకా ఇందులో ప్రోటీన్లు, అమినోజెన్‌, వాక్సీ మేజ్‌(మొక్క జొన్న‌) క‌లిగి రెండు ర‌కాల వేరియంట్ల‌లో ల‌భ్య‌మ‌వుతుంది.

రోజుకి ఎంత మోతాదులో తీసుకోవాలి

ఒక క‌ప్పు పాల‌లో 2 స్కూప్ స్పూన్ల పౌడ‌ర్‌ని క‌లిపి రోజుకి రెండు సార్లు తీసుకోవాలి.


పైన తెలిపిన ఈ 10 ర‌కాల ఉత్ప‌త్తులు మీ కండ‌రాల ద్ర‌వ్య‌రాశి పెరిగేలా స‌హాయ‌ప‌డుతాయి. దీంతోపాటు ప్ర‌తిరోజూ వ్యాయామం చేయ‌డం, ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాన్ని తీసుకోవ‌డం మ‌ర్చిపోవ‌ద్దు. అలాగే వీటిని వాడే ముందు వైద్యుడిని సంప్ర‌దించండి. గుడ్‌ల‌క్!

English summary

top-10-weight-gain-products-available-in-india

Just as losing weight is not easy, gaining weight is not easy either. If you are very thin and think of gaining weight by eating junk food, then you are doing it wrong. You need to choose healthy foods that will be good for your overall health and cheap on your budget too.
Story first published:Monday, April 16, 2018, 18:37 [IST]
Desktop Bottom Promotion